రామాయణమ్ 289
...
హనుమా ! నీ పరాక్రమము శ్లాఘింపదగినది అవలీలగా శతయోజనవిస్తీర్ణముగల సంద్రమును లంఘించినావు .అది పెనుమొసళ్ళకు ,భయంకరజలచరాలకు ఆలవాలము .
.
నీ ముఖములో తొట్రుపాటుగానీ ,జంకుగానీ రావణుడు ఆతని బలము ,బలగము పట్ల భయము గానీ నాకు కనపడుట లేదు.
నీవు సామాన్యుడవు కావు సుమా!
.
నాకు తెలుసు రాముడు నిన్ను పరీక్షించకుండా నీ సామర్ధ్యమేదో తెలవకుండా నిన్ను పంపడుగాకపంపడు అందునా తన అంగుళీయకము ఇచ్చి మరీ పంపినాడు.
.
రామలక్ష్మణులు ఇరువురూ క్షేమమే కదా ! రాముడు క్షేమముగా ఉన్నచో సముద్రమువరకు వ్యాపించిన ఈ ధరాతలమును కాల్చివేయలేదేమి ?
.
శత్రువులమీద విజయము సాధించుటకు కావలసిన ప్రయత్నములన్నీ శ్రీరాముడు చేయుచున్నాడు కదా ! మంచి మిత్రులను సంపాదించుకున్నాడా ?
.
హనుమా ! రామునికి నా మీద ప్రేమ ఏమీ తగ్గలేదు కదా ? రామునకు స్నేహము విషయమున తల్లిగానీ,తండ్రిగానీ ,మరి ఏ ఇతర వ్యక్తిగానీ నాతో సమానులు గానీ అధికులు గానీ లేరు నా ప్రాణనాధుని గురించిన వార్తలు వినునంతవరకే జీవించవలెనని కోరుకొనుచున్నాను....అని పలికి సీతమ్మ హనుమంతుని సమాధానము కొరకై ఎదురు చూచెను.
.
NB
..
( కొత్తచోటికి అందునా బలవంతుడైన శత్రువుయొక్క స్థావరంలో ప్రవేశించినప్పుడు మామూలు వారికి,ఎంత గొప్పగూఢచారి అయినా సరే సహజంగా తొట్రుపాటు ,భయము ఉంటాయి.అంతెందుకు శత్రుస్థావరమే కానక్కరలేదు పూర్తిగా కొత్తప్రదేశము ఎవరూ తెలియని చోటుకు వెళితే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి!...అదీ హనుమస్వామి అంటే !)
.
జానకిరామారావు వూటుకూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి