👉 విదేశీ యూనివర్సిటీలో తనదైన శైలిలో దేశభక్తి చాటిన భారతీయ విద్యార్ధి.
👉 ఇంటర్నెట్‌డెస్క్ న్యూస్: విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) చూపించిన దేశభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘దేశభక్తి అంటే ఇది కదా’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
👉 విద్యార్థులకు డిగ్రీ పట్టా ప్రదానోత్సవం జరుగుతోంది. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థిని స్టేజ్‌పైకి ఆహ్వానించి డిగ్రీని చేతికందిస్తున్నారు. అక్కడే చదువుకున్న భారతీయ విద్యార్థి వంతు వచ్చింది. అతడు ఫ్యాంటు, షర్టు కాకుండా.. సంప్రదాయ కుర్తా, పైజామా ధరించి వచ్చాడు. వస్తూ వస్తూనే అందులో ఇంకా డిగ్రీ పట్టా అందుకోక ముందే.. జేబులోంచి భారతదేశ మువ్వన్నెల జాతీయ పతాకం 🇮🇳 తీసి ప్రదర్శించాడు. దేశంపై అపారమైన గౌరవంతో మూడు రంగుల జెండా పట్టుకొని స్టేజ్ చుట్టూ తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోను మిని త్రిపాఠీ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
👉 నేడు విదేశీ మోజులో, మాయలో పడి మన దేశాన్ని అవమానపరుస్తున్న కొంతమంది యువత ఈ విద్యార్థిని చూసి నేర్చుకోవాలని కోరుతున్నాను. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి