13, ఆగస్టు 2023, ఆదివారం

గణేషున్ని

 నిత్యాన్వేషణ:


గణపతి విగ్రహాల్లో తొండం కొన్నిటికి కుడివైపున, కొన్నిటికి ఎడమవైపున ఎందుకు ఉంటుంది? వాటి అర్థమేమిటి?


వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి' అంటారు. తొండము ఎడమలోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి' అని అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయరాదు.

వినాయశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీ దేవి వైపు అంటే.. ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి.

కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అనిపిలుస్తారు. ఇలాంటి విగ్రహాలను గుళ్లలో పెట్టుకోవాలి. ఎందుకంటే.. కుడివైపు తొండం తిరిగిన గణపతికి చాలా నిష్టగా, ప్రతిరోజూ పూజలు చేయాలి. కాబట్టి ఆలయాల్లో పెట్టుకోవడం మంచిది.

వినాయకుడి ముందురూపం సంపదలు, శ్రేయస్సు అందిస్తుంది. కానీ వినాయకుడి వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. మీ ఇంట్లో తూర్పుదిశలో కాని, పశ్చిమ దిశలోకాని గణేశుడి విగ్రహాన్ని ఉంచాలి. స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు.

గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి. గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి.

**ఎడమ వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే**

మన ఇండ్లలో, వీధుల్లో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలకు తొండం ఎడమ వైపుకు ఉంటుంది. అయితే ఇలా తొండం ఎడమ వైపుకు ఉన్న గణేషున్ని పూజిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుందట. ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్యం బాగుంటుందట. దీనికి తోడు గణేషుడి తల్లి అయిన పార్వతీ దేవి ఆశీస్సులు కూడా ఆ ఇంట్లోని వారందరికీ లభిస్తాయట. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందట.

**కుడి వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే**

దేవాలయాల్లో ప్రతిష్టించే గణేష్ విగ్రహాలకు తొండం ఇలా కుడివైపుకు ఉంటుందట. ఈ గణేషున్ని సిద్ధి వినాయకుడని పిలుస్తారట. ఇలాంటి గణేషున్ని పూజిస్తే మనం అనుకున్నది వెంటనే సిద్ధిస్తుందట. ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయంలో ఏది కోరినా వెంటనే జరిగిపోతుందనే ఓ నమ్మకం ఉంది. అందుకే అక్కడి వినాయకున్ని కోరిన కోర్కెలు తీర్చే వర సిద్ధి వినాయకుడని అందరూ పిలుస్తారు.

కామెంట్‌లు లేవు: