🌸🫐
*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*
*సీతారామాంజనేయ సంవాదము.*
*ప్రథమాధ్యాయము*
*భాగము - 8*
వ. ఇట్లు శిష్యవాత్సల్యంబున సాక్షాత్కరించి,మదీయదీర్ఘ దండ నమస్కారంబులు చతుర్విధ పురుషార్థప్రద చతురక్షర సమన్విత
నారాయణస్మరణపూర్వకంబుగా నంగీకరించి కలకల నవ్వుచు శరీరక్రియ
విలక్షణావస్థాత్రయసాక్షి పంచకోశ వ్యతిరిక్త సచ్చిదానంద స్వరూప
ప్రత్యగాత్ముండమైన నీవ సత్యజ్ఞానానంద పరమాత్మ స్వరూపుఁడ నైన నేను, సచ్చిదానంద రూప ప్రత్యగాత్ముండ వైన నీ వని
సర్వోపనిషత్సార భూతంబైన పరమతత్త్వ రహస్యార్థం బుపదేశించి యీ యభేద విజ్ఞాన దృష్టిచేత నిరతంబు
న న్నవలోకించుచు జీవన్ముక్తి సుఖం బనుభవింపుము.
ప్రారబ్ధభోగావసాన సమయంబున ఘటాకాశంబు మహాకాశంబునం గలిపిన విధంబున నా యందు విదేహ కైవల్యంబు నొందదు. సందేహంబు లేదు;
అని యాజ్ఞాపించి యిప్పుడీవు బ్రహ్మాండ పురాణంబునం దధ్యాత్మ రామాయంణం బుమా మహేశ్వర నందరూపం బై యొప్పు, నందు శ్రీరామ హృదయం బను నితిహారంబు
సీతారామాంజనేయ సంవాదం బబనం బ్రవర్తిల్లు, నది సంక్షేప రూపంబు గావున నయ్యర్థంబు విస్తరించి యొక్క ప్రబంధంబుగా రచియించి నాపేర నంకితంబు సేయుము,
సర్వపాప వినిర్ముక్తుండ పై కృతార్థుండ నయ్యెద నని యానతిచ్చి తిరోహతుండయ్యె, నంతట మేల్కని పరమానంద భరితాంతఃకరణుండ నై.
తాత్పర్యము:
నా గురువులు నన్ను కరుణించారు. తమ దర్శనాన్ని ప్రసాదించారు. తమ ప్రియవచనములను "వత్సా! నీ ఆలోచన అభినందనీయం.
స్థూల సూక్ష్మ-కారణ దేహాలను మూడు అవస్థలు; అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ,
ఆనంద మయాదులైన అయిదు కోశములకు భిన్నమైనది "సత్తు చిత్తు" ఆనందములకు మూల స్వరూపము నీవేనని, "నేను" "నీవు" ఒకటేనని సత్యము తెలిసి,
ఆ విధంగా ముందుకు నడిచినట్లయితే, జీన్ముక్తుడవవుతావు, ధర్మమెరిగి తరిస్తావు" అని ఆశీర్వదించారు.
శా. శ్రీ విశ్వేశ్వరపార్వతీ ప్రియదము; శ్రీ జానకీరామనా క్యావిర్భూతముమారు తాత్మజనుబో: ధ్యంబైతగ శ్రీమహా దేవాచార్య వరాంకితంబుగనధా;
త్రి రాజయోగంబు నం భావిప రచియింపఁగల్గెనింక నా; భాగ్యంబుసామాన్యమే.
తాత్పర్యము.
ఇది ఆధ్యాత్మిక రామాయణమందలి పరమ రహస్యధర్మమని, దీనిని పరమేశ్వరుడు, పార్వతితో చెబుతూ "దేవీ! జీవితం వేరు, ధర్మం వేరు.
జన్మ-కర్మ వేరు, నేను నీకు చెబుతున్నట్లే. ఆధ్యాత్మిక రామాయణమందలి పరమ రహస్యతత్వాన్ని శ్రీరాముడు సీతను హనుమంతునికి చెప్పమన్నాడు.
ఆ తరువాత రాముడు హనుమకు చెప్పాడు. ఆ దివ్య ప్రబోధమే నేను నీకు తెలుపుతున్నాను. వినుమన్నదాని... శ్రీ గురుకరుణ పరమ పుణ్యంగా, ఈ లోకానికి అందించగల ధన్యుడనయ్యాను. ఇది నాకు దక్కిన మహద్భాగ్యం-అదృష్టం.
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి