*గాడిచర్ల హరిసర్వోత్తమ రావు* (14-09-1883 / 29-02-1960) కర్నూలు పట్టణములో ఒక పేద *మాధ్వ బ్రాహ్మణ* కుటుంబంలో జన్మించారు.
కటిక పేదవాడైనప్పటకీ 1906లో ఎం.ఏ డిగ్రీ చదివినారు. 1907లో రాజమహేంద్రవరంలో విద్యార్థులంతా *వందేమాతరం చిహ్నాలు* ధరించి తరగతికి వెళ్ళారు. *వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును* కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
తరువాత ఆయన *స్వరాజ్యం* అనే పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908లో *శ్రీనెల్వేలిలో* పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు *క్రూరమైన విదేశీయ పులి* (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన వ్రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు *మూడేళ్ళ కారాగారం విధించింది.* ఆ విధంగా ఆయన ఆంధ్రులలో *ప్రప్రథమ రాజకీయ బంధితుడు* అయ్యాడు.
వెల్లూరు కారాగారములో ఆయనతో అమానుషంగా వ్యవహరించింది బ్రిటిషు ప్రభుత్వం. *సర్వోత్తమ రావు స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు.*
1930 నుండి *గ్రంథాలయోద్యమం* చేపట్టినాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగు, ఇంగ్లీషు, అరవం, మరాఠీ భాషలు కూడా ఆయనకు వచ్చేవి.
ఆయన వ్రాసిన *శ్రీరామ చరిత్ర* అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది. ఆయన రచించిన *పౌరవిద్య* అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది. సర్వోత్తమరావు *ఎన్నో క్రొత్త పదాలు* సృష్టించాడు. *సంపాదకుడు, భావకవిత్వం* వంటివి.
గాడిచర్ల గురించి ప్రముఖ కవి *కాళోజీ* నారాయణరావు చెప్పిన చిరు కవిత్వము:-
*_వందేమాతరమనగనే వచ్చితీరు ఎవనిపేరు?_*
*_వయోజన విద్య అనగనే వచ్చితీరు ఎవనిపేరు?_*
*_గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?_*
*_అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?_*
*_అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?_*
*_తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?_*
*_తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?_*
*_అందరికెవనితొ పొత్తు - అఖిలాంధ్రంబెవని సొత్తు?_*
*_ఏస్థాన కవినినేనో, ఆ స్థానాధీశుడెవడు?_*
*_వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది_*
*_హరిసర్వోత్తముడాతడు,_*
*_ఆంధ్రులపాలిటి దేవుడు._*
🪔 *_దేశసేవలో తరించిన శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి నేడు. ఆయొక్క మహనీయునకివే మన ఘన నివాళులు._* 🪔
అడ్మిన్ బ్రాహ్మణ సమాఖ్య
🚩 *హిందుస్సమస్తాః సుఖినోభవంతు* 🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి