14, సెప్టెంబర్ 2023, గురువారం

ఆలోచనాలోచనాలు

 ౪౪౪ ఆలోచనాలోచనాలు. ౪౪౪ గీర్వాణ భాషలో హితోక్తులు౪౪౪.             

  1* గ్రామోతి భవతి నగరం యత్ర విదగ్థో జన వసతి! ( పండితులున్నట్లయితే అది గ్రామమైనా నగరంతో సమానమే సుమా!)              

 2* ఘృతం మే చక్షురమృతం మ ఆసన్.-- ఋగ్వేదం. ( నా కళ్ళల్లో మైత్రీభావం, నా మాటల్లో మాధుర్యమూ ఉండుగాక!)                       

   3* చారిత్రేణ విహీన ఆఢ్యోపి చ దుర్గతో భవతి-- మృచ్ఛకటికం. ( సత్ప్రవర్తన లేని వ్యక్తి ధనికుడైనా, దరిద్రునితో సమానమే!)                        

  4* ఘుఋతాత్, స్వాధీయో, మధునశ్చవోచత -- ఋగ్వేదం. ( నేయి కంటే తియ్యగా, తేనె కంటే తియ్యగా మాట్లాడండి!)         

  5* చోరే గతే వా కిము సావధానమ్? (దొంగలు పడిన తరువాత జాగ్రత్త పడితే ఏమి లాభం?)          

   6* జీవిత్యర్థ దరిద్రోపి ధీ దరిద్రో న జీవతి-- కథాసరిత్సాగరం (ధనంలేని దరిద్రుడైన బ్రతుకగలుగుతాడేమోగాని, బుద్ధిలేని మొద్దు బ్రతకలేడు.)                         

 7* జ్ఞానం భారః క్రియావినా-- చాణక్య సూక్తి (ఆచరణలో లేని జ్ఞానం కేవలం తలమోసే ఒక బరువైన వస్తువే!)                 

 8* తే మూర్ఖతరా లోకే యేషాం ధనమస్తి నచ త్యాగః!--(ఎవరికైనా ధనసంపత్తి ఉండి కూడా త్యాగగుణం ఉండదో, అట్లాంటివారు మూర్ఖులతో సమానమే! )                        

 9* త్యజేదాచరణ శూన్యాన్ వ్యర్థ ప్రసంగాత్! -- ఆపస్తంభ ధర్మ సూత్రాలు.( తాను వాస్తవంగా ఆచరించని వ్యర్థపు మాటలు మాట్లాడరాదు.)                   

  10* దదతాఘ్నతా, జ్ఞానతా సం నమే మహి--ఋగ్వేదం (దానం చేసేవాళ్ళతో, అహింస పాటించేవాళ్ళతో, జ్ఞానులతో మనం సత్సంగాన్ని చేసెదము గాక!                                    

  11* పయోపి శాండికీ హస్తే మదిరాం మన్యతే జనాః! (కల్లు అమ్ముకొనే స్త్రీ చేతిలో పాలు వున్నా "కల్లు" అనే లోకం అనుకొంటూవుంటుంది.)       

 12* పర దుఃఖేనాపి దుఃఖితా విరళాః! ( పరుల దుఃఖం చూచి దుఃఖించేవాళ్ళు ఈ లోకంలో అరుదుగా ఉంటారు)                            

 తేది 14--9--2023, 

కామెంట్‌లు లేవు: