🎻🌹🙏బసవ పురాణం—31 వ భాగము....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸అరెరె! భవిని లోపలికి ఎలా రానిచ్చారు?’ అని ద్వారపాలకులను తిట్టాడు. వాళ్ళకూ ఈతడు ఎలా వచ్చాడో తెలియదు. సరేనని గణపాలుడు తన మామూలు పద్ధతిలో అతణ్ని శైవునిగా మార్చేందుకు ప్రయత్నించాడు.
🌿కాని శివుడు వినలేదు. గణపాలుడు అన్ని విధాలా ప్రయత్నించి ఇక లాభం లేక చివరకు శివుణ్ణి చంపడానికి కత్తినెత్తాడు. శివుడు సంతోషించి నిజరూపంతో ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు.
🌸అయితే గణపాలుడు శివా! ఈ వేషాలన్నీ నా దగ్గర సాగవు. ముందు లింగం కట్టించుకొని లింగధారివి కావాలి. తరువాతే నీతో మాట్లాడడం అన్నాడు కోపంతో.
🌿గణపాలునికి భయపడి శివుడు లింగం కట్టించుకున్నాడు. తర్వాత గణపాలునికి భక్తికి సంతోషించి శివుడతనికి ముక్తినిచ్చాడు.
🌷కుమ్మర గుండయ్య కథ
🌸పూర్వం కుమ్మరి గుండయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన తిగునీలకంఠదేవర గుడికి పోయి రాత్రిపూట తిరిగి వస్తుండగా ఒక స్ర్తి మేడమీద నుండి ఎంగిలినీళ్ళు క్రిందికి పోసింది.
🌿అవి నెత్తిని పడగానే గుండయ్య హరహరా! శివ శివా!’’ అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఏదో అపచారం జరిగిందని కిందికి వచ్చి చూసేసరికి గుండయ్య కనబడ్డాడు.
🌸ఆమె గుండయ్యను లోనికి ఆహ్వానించింది. తలంటిపోసి పరిశుధ్ధుణ్ణి చేసింది. గుండయ్యను మోహించి పెళ్లాడుతానన్నది. గుండయ్య మాత్రం ‘నేను శివదీక్షలో ఉన్నాను.
🌿నన్ను ముట్టక’ అని ఆనపెట్టాడు. ఆ వారాంగన గుండయ్యమాటనుగౌరవించి అలాగే గుండయ్య అంగీకారాన్ని పొందేందుకై కాచుకొనివుంది.అలా ఎనభై ఏండ్ల కాలం గడిచింది.
🌸పరమేశ్వరుడు వారిద్దరి దీక్షనూ చూచి సంతోషపడివారినిపరీక్షించాలను కున్నాడు. ఒకనాడు ఒక పేద భక్తుని రూపంలో వచ్చి ‘అమ్మా! నా వద్ద ఈ బంగారు గినె్న వుంది. పేదవాణ్ణి.
🌿ఇదే నా సర్వస్వం. దాచుకోలేను, దాచిపెట్టు తల్లీ’ అన్నాడు. సరేనని ఆమె గినె్నను దాచింది.శివుడుదాన్ని మాయం చేసి మళ్లీ వచ్చి ‘ఊరు వదలి పోతున్నాను. నా గినె్న నాకియ్యి’ అని అడిగాడు.
🌸ఆమె లోపలికి వెళ్లి వెతికి గినె్న కనపడకపోయేసరికల్లా దిగులు పడిపోయింది. భక్తుడు అందరినీ పిలిచి ‘వీళ్లు నా గినె్న కాజేశారు మొర్రో’ అని గోల పెట్టాడు. ఆమె గినె్న తీసుకున్నట్లు అంగీకరించింది కూడా.
🌿కాబట్టి పేద భక్తుడు దొంగలైన గుండయ్యనూ వారాంగననూ శిక్షించవచ్చునని అంతా తీర్మానించారు.భక్తుడు వారిని పెద్ద జల గుండంలో పడిపొమ్మని కోరాడు.
🌸ఇదే శివాజ్ఞ అని ఇద్దరూ మాట్లాడకుండా జలగుండంలో దూకారు. కాని ఆశ్చర్యం, మరుక్షణమే వాళ్ల మసలి శరీరాలలు పోయి నవ యవ్వన దేహాలతో పైకి వచ్చారు.
🌿శివుడు సాక్షాత్కరించి వారిరువురినీ ఆశీర్వదించాడు. గుండయ్యా, వారాంగనను మరొక ఎనభై సంవత్సరాలు భార్యాభర్తలై సుఖణగా జీవించారు.
🌷పూసల నయనారు కథ
🌸పూర్వం విక్రమ చోడుడు అనే రాజు శివభక్తితో పెద్ద బంగారు దేవాలయం కట్టించాడు. అందులో లింగ ప్రతిష్ఠను చేయించాడు. అది పూసల నయనారు అనే పేద భక్తుడు చూచాడు.
🌿నేను గుడి కట్టించలేకపోతినే! అని విచారపడ్డాడు. ఇలా కాదని ధ్యానంలో కూర్చున్నాడు. మానసికంగా తనలో తానే స్వామికి రత్న విమాన సహితంగా ఒక గుడి కట్టినట్లు ఊహించుకున్నాడు.
🌸అందులో తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు భావించాడు. అలాగే పూసల నయనారు ధ్యానం చేస్తూ వున్నాడు. ఫలితంగా విక్రమ చోడుడికి రాలేదు కాని పూసల నయనారుకు కైలాస ప్రాప్తి కలిగింది.
🌷ముసిడి చౌడయ్య కథ
🌿ముసిడి చౌడయ్య అనే మహాత్ముడు ఉండేవాడు. అతడు మహిమాన్విత సంపన్నుడు. ఒకనాడు భక్తగణంతోడు రాగా కల్యాణార్థమై పోతున్నాడు.
🌸దోవలో గోపాలురు ఆడుకుంటూ బసవని మర్రి’ అని ఒక మర్రి చెట్టుకు చూపి ఏదో అనుకుంటున్నారు. చౌడయ్య దీనికి బసవని మర్రి అని ఎలా పేరు వచ్చిందినాయనాఅనిప్రశ్నించాడు.
🌿అపుడు గొల్లలు ‘‘అయ్యా! పూర్వం రెండు ఎద్దులు కొట్లాడుకొంటూ వుంటే అందులో ఒక బసవడుచచ్చిపోయాడు. దానిని మర్రిమొదట్లోపాతారు.అందుకని దీనిని బసవని మర్రి అంటారు’అని చెప్పారు.
ఇంకా ఉంది...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి