14, సెప్టెంబర్ 2023, గురువారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 21*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం*

           *నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |*

           *మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా*

           *మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీమ్ ||*


ఈ శ్లోకం కుండలినీ ధ్యానం గురించి చెప్తున్నది. మూలాధారం నుండి సహస్రారం వరకు చైతన్య లత/ తేజోలత ప్రయాణిస్తున్న అనుభూతిని గురించి చెప్తున్నారు.


తటిల్లేఖా తన్వీం = తనువులో ఒక మెరుపు తీగ వలె


తపన శశి వైశ్వానరమయీం = సూర్య చంద్రాగ్నులమయమైన ఒక తేజస్సును 


మహాపద్మాటవ్యాం = అమ్మవారి స్థానమైన మహాపద్మాటవి  అనగా ఇక్కడ సహస్రార కమలంలో


నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ = ఆరు కమలాలు (షట్చక్రములు) దాటిన తరువాత వచ్చే మహా కమలం (సహస్రార పద్మం) లో నీ కళను (చంద్రకళ, షోడశి కళ)


మృదితమలమాయేన మనసా = స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు కల


మహాంతః పశ్యంతో = మహాత్ములైన యోగులు దర్శిస్తున్నారు 


పరమాహ్లాద లహరీమ్ = బ్రహ్మానంద లహరిని అనుభవిస్తున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: