Hiii
*కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు.*
*మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు.* *మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.*
*అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు.*
*ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు.*
*మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు.* *మరొకాయన దానికి వంత పాడుతాడు.*
*నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు.* *అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా! మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు.* *విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.*
*నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు.*
*అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.*
*నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు* *చుట్టబెట్టేస్తుంటారు.*
*మొత్తంగా, నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు.*
*నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు.* *పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి.* *సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.*
*అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది.*
*ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే.* *నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.*
*ఇప్పుడు చెప్పండి !!*
*ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం?* *దేనికోసం తెగ హైరానా పడిపోయావు?* *నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?*
*జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా?*
*ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది కదూ!!!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి