🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.
*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*
వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.
*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*
ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి