*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 15వ శ్లోకం*
*యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ l*
*సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే || 15*
*ప్రతిపదార్థం*
హి = ఏలనన ; పురుషర్షభ = ఓ పురుషశ్రేష్ఠా! ; సమదుఃఖ సుఖమ్ = సుఖ దుఃఖములను సమానముగా చూచు నటి ; యమ్, ధీరమ్ పురుషమ్ = ఏ ధీరుడైన పురుషుని ; ఏతే = ఇవి ( విషయేంద్రియ సంయోగములు ); న, వ్యథయంతి= వ్యాకులపరచవో; సః = అతడు; అమృతత్వాయ = మోక్షము కొరకు; కర్పితే = యోగ్యుడగును;
*తాత్పర్యము*
ఏలననా ఓ పురుషశ్రేష్ఠా! ధీరుడైన వాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టిపురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి