2, సెప్టెంబర్ 2023, శనివారం

పంచ క్లేశాలు అని వేటిని అంటారు

 *శుభోదయం*

💐🙏💐🙏💐


*పంచ క్లేశాలు అని వేటిని అంటారు?*


క్లేశము  అంటే బాధ కలిగించేది అని అర్థము... జీవికి  బాధను కలిగించే విషయాలను ఐదు భాగాలుగా విభజించారు.. వాటినే పంచ క్లేశాలు అంటున్నాము. మనకు కలిగే ఏ బాధ అయినా, కష్టం కలిగించే ఏ విషయమైనా ఈ ఐదు కేటగిరీ లలో ఏదో ఒక దానికి చెందుతుంది... ఆ ఐదు క్లేశాలు ఏంటంటే:


*1. అవిద్య 2.అస్మిత 3 రాగము 4. ద్వేషము 5. అభినివేశము*


*1. అవిద్య*: అంటే అజ్ఞానము... మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ, దేహమే తాను అనే భావనలో పూర్తిగా మునిగిపోయి,  సత్యాన్ని తెలుసుకోలేక పోవడమే అవిద్య లేదా అజ్ఞానము. 


*2. అస్మిత:* అంటే అహంకారము.. దేహమే నేను అనే అజ్ఞానంతో ఉన్న జీవుడికి అంతానేనే అనే భావన బలంగా ఉంటుంది.  దీనివల్ల చాలా నష్టాలు, కష్టాలు జీవుడు అనుభవించాల్సి ఉంటుంది. 


*3. రాగము:* మోహము (ఇష్టము)  అని కూడా అంటారు. ఇది బంధం అనే పాశంతో జీవుడిని కట్టిపడేస్తుంది.. దీనివల్ల కలిగే నష్టాలు అందరికీ అనుభవమే. అయినా జీవుడు దీని వెంటనే పడుతుంటాడు...

 

*4. ద్వేషము:* ఇది అయిష్టము... వ్యతిరేకతతో కూడిన భావన... జీవి యొక్క మానసిక తరంగాలు (ఆలోచనలు) పూర్తిగా ఈ రెండింటి (ఇష్టాయిష్టాలు) మధ్యనే తిరుగుతుంటాయి. ఇష్టమైతే రాగ/ప్రేమ భావన, ఇష్టం లేకపోతే ద్వేష భావన..


*5. అభినివేశము:* అంటే మృత్యు భయము.. ఇది ప్రతి ఒక్కరికీ ఉంటుంది... 


*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*


*మాలతీ లత*

*02092023*


..

కామెంట్‌లు లేవు: