2, సెప్టెంబర్ 2023, శనివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 12*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*త్వదీయం సౌందర్యం తుహినగరికన్యే తులయితుం*

*కవీంద్రాః కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభుతయః |*

*యదాలోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా*

*తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్ ||*



ఈ శ్లోకం నుండి అమ్మవారి సౌందర్యాన్ని స్మరోస్తున్నారు శంకరులు.


అమ్మా హిమగిరితనయా  నీ సౌందర్యాన్ని వర్ణించటానికి 


యదాలోకౌత్సుక్యా = లోకంలో ఉండే సామాన్య ఉత్సుకతతో నీ అందాన్ని చూడాలనిపించి చూడలేక


కవీంద్రాః కథమపి = కవీంద్రులైనవారు కష్టపడి


తులయితుం కల్పన్తే = ఉపమానాలు కల్పిస్తున్నారు. ఎవరు ఆ కవీంద్రులు?


విరించి ప్రభృతయః = బ్రహ్మ మొదలైనవారు


అమర లలనా = దేవతా స్త్రీలు


తపోభిః దుష్ప్రాపామపి = తపస్సులతో కూడా పొందలేనిదైన అమ్మవారి సౌందర్య దర్శనాన్ని పొందలేక,


మనసా గిరిశ సాయుజ్య పదవీమ్ = భావన చేత ఈశ్వర సాయుజ్యం పొందారుట.


అంటే అమ్మవారి సౌందర్యం ఈశ్వరుడొక్కడికే తెలుసు.ఈశ్వర సాయుజ్యం వల్లనే ఆమె సౌందర్యాన్ని  వీక్షించగలుగుతారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: