2, సెప్టెంబర్ 2023, శనివారం

ఇతరుల తో పోల్చి బ్రతుక

 *1868*

*కం*

ఇతరుల తో పోల్చి బ్రతుక

నతిగా కష్టములు కలుగు నవనీ తలమున్.

శ్రితమగు జీవితము తమకు

హితముగ బ్రతుకంగ సుఖము హెచ్చు ను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఇతరుల తో పోల్చుకొని బ్రతకాలనుకున్నప్పుడు ఈ లోకంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. లభించిన జీవితాన్ని తమకు నచ్చిన విధంగా బతకడం వలన సుఖములు పెరుగుతాయి.

*సందేశం*:--  ఈరోజుల్లో ఎంతో మంది ఇతరుల తో పోల్చుకుని తలకుమించిన భారంతో బతకడానికి ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతున్నారు.,ఉదాహరణకు ఇతరుల వలె పిల్లల ను కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివించి,అప్పులపాలై చివరకు ఆ పిల్లలు కార్పొరేట్ జీవితానికి అలవాటు పడి తల్లిదండ్రులను హీనంగా చూడటం వంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందువలన కర్మఫలంగా లభించిన నీ జీవితం లో పరిధులు దాటకుండా నచ్చిన విధంగా బతికితే సుఖపడగలవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: