9, అక్టోబర్ 2023, సోమవారం

ఒకటి వదిలితే చాలు

 

 ఒకటి వదిలితే చాలు 

ఒకసారి రామారావుకు  కాళ్ళు, చేతులు తిమ్మిరులు ఎక్కటం, అప్పుడప్పుడు కళ్ళుతిరగటం అవుతుంటే ఎందుకైనా మంచిదని ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్లి చూపెట్టుకుందాం అనుకోని సమీపంలో ఉన్న ఒక డాక్టారు వద్దకు వెళ్ళాడుడాక్టరు పరీక్షించిన తర్వాత నాకు అనుమానంగా వున్నదండి మీ లక్షణాలు చూస్తుంటే మీకు షుగర్ ఉన్నట్లు అనిపిస్తున్నది.  ఒకసారి రక్త పరీక్ష చేయించుకోండి అని సలహా ఇచ్చాడువెంటనే ఆయన రక్త పరీక్ష చేయించుకున్నాడు. అతని ధీమా ఏమిటంటే నాకు షుగర్ ఎందుకు వస్తుందినేనేమయినా రోజు స్వీట్లు తింటావా ఏమన్ననా  నేను ఎప్పుడో కానీ స్వీట్ తినను. స్వీట్ తినే వాళ్లకు వస్తుంది కానీ నాకెందుకు షుగరు వ్యాధి వస్తుంది అని అనుకున్నాడు. రక్త  పరీక్ష రిపోర్ట్ ఇవ్వగానే అనుమాన నివృత్తి చేసుకోవడానికి అక్కడి టెక్నీషియన్ని అడిగాడునాకు షుగర్ ఉన్నదా  అని. దానికి అతను మీరు వెళ్లి మీ డాక్టరుకు చూపించండి ఆయన చెప్పారు అని అన్నాడు. . మనసులో ఏదో తెలియని గుబులునిజంగా నాకు షుగరు వ్యాధి వచ్చిందా రాలేదా రాకుంటే అతను అలా ఎందుకు చెప్పారు అని ఇంటికి వెళ్ళాడురేపు ఉదయం డాక్టరు వద్దకు వెళ్ళాలిరాత్రంతా నిద్ర రాలేదు. ఏదో తెలియని గుబులుఉదయం లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని గడియారం వైపే చూస్తున్నాడు. అతని ప్రవర్తన చిత్రంగా తోచిన ఆయన శ్రీమతి రేణుక  ఏమైందండీ మీకు ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. అప్పుడు గత దినం డాక్టరు వద్దకు వెళ్లిన దగ్గరినుండి ల్యాబ్ టెక్నీషియన్ చెప్పిన మాట దాకా పూసగుచ్చినట్లు చెప్పాడు.రామారావు.   రేణుక  మంచి సమయస్పూర్తి, సద్బుద్ధి కల ఇల్లాలు . ఆమెకు వెంటనే తన భర్త మానసిక స్థితి అర్థం అయ్యింది. అందుకు ఆమె ఆయనను అనునయిస్తూ మీకేమైనా చాదస్తమా ఏమిటి మీకు షుగర్ రావడం ఏమిటి మన ఇంట వంట అటువంటి దరిద్రపు జబ్బు లేదుమీరు నిశ్చింతగా వుండండి. టిఫిను చేసి డాక్టరు వద్దకు వెళ్ళండిఆయనకూడా మీకు షుగరు లేదని అంటాడు అని భర్తకు ధైర్యం చెప్పింది. నిజానికి భర్త యెంత పిరికివాడు అయినా కూడా భార్య మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ మన రామారావుకు పూర్తిగా ధైర్యం వచ్చింది. తృప్తిగా ఇడ్లీలు తిని బట్టలు కట్టుకొని మోటారు సైకిలు మీద డాక్టారు దగ్గరకు వెళ్ళాడు. డాక్టరు దగ్గరకు వెళ్తున్న కూడా మనసులో ఏవో తెలియని సందేహాలుడాక్టరు ఏమి చెపుతాడో ఏమో అనే గుబులు ఇంకా వేధిస్తూ వున్నది. ఒకవైపు భార్య ఇచ్చిన భరోసా వున్నా కూడా తనను తానూ నిభాయించు కోలేక పోతున్నాడు. చిన్నగా డాక్టరు వద్దకు కాంపౌండరు పిలవగానే చేతులు కాళ్లు వణుకుతూ లోపలి వెళ్ళాడు

రండి రామారావు గారు ఎలావున్నారు అని మంచి ఉత్సాహంగా పలకరించాడు  డాక్టరు. తనకు తెలుసు డాక్టర్ల మాటలకే రోగుల సగం రోగాలు  తగ్గుతాయని ఇంకొక గంటలో చనిపోతాడన్న పేషంటుని కూడా నొప్పించకుండా మీకేమి భయంలేదు ఇంకొక గంట దాకా అని ప్రోత్సాహకరంగా భయం లేదు అనే మాటను పెద్దగా ఇంకొక గంట దాకా అనే మాటలు చిన్నగా చెప్పటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యఏమిటి నాకు రోజు అనేక విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంటే రామారావు గారు అనే డాక్టర్ పిలుపుతో లోకానికి వచ్చాడుఏమండీ ఇంతకు  ముందు కూడా ఇట్లా మీరు బాధపడే వారలేదండి అన్నాడుసరే ఎన్నాళ్ళ నుండి మీకు ప్రాబ్లమ్ వుంది అని మరలా  ప్రశ్నించాడు. ఇటీవలే బహుశా రెండు మూడు నెలల నుంచి అని జవాబు చెప్పాడు రామారావుఅదేమిటి డాక్టారు నాకు షుగరు ఉందా లేదా అని చెప్పకుండా అనవసరపు ప్రశ్నలు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనసులో అనుకోనిఇక ఆలస్యం చేస్తే తట్టుకునేటట్లు లేదని తానే ధైర్యం చేసి డాక్టరుగారు ఇంతకూ నాకు షుగరు ఉన్నట్లా లేనట్లా అని ఓపెనుగా అడిగేశాడు. రామారావు అవస్ధచూసి డాక్టరు చావు వార్త చల్లగా చెప్పాడుచూడండి  మీకు షుగరు చాలా వుంది మీరు ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేశారుఇంకా నయం ఇట్లానే మీరు మందులు వాడకుండా ఉంటే చాలా ప్రమాదం లోకి వెళ్లేవారు అని అన్నాడు. మాటలు వింటుంటే ఒక్కసారి తన క్రింద వున్న భూమి మొత్తం మాయమైనట్లు తోచింది తాను ఆధారం లేకుండా గాలిలో ఉన్నానా అని అనిపించిందిభగవంతుడా నాకే ఎందుకు ఇల్లాంటి పరీక్షలు  పెడతావు. అవును పొద్దున నా భార్య నాకు యెంత ధైర్యం చెప్పింది మీకు షుగరు ఎందుకు వస్తుంది అని అన్నదే డాక్టరు ఏమైనా డబ్బులు గుంజడానికి అబద్ధం చెపుతున్నాడా అని మనసులో అనుకున్నాడుఅప్పుడు రామారావు మోహంలో కత్తివేటుకు రక్తపు చుక్క లేదు

రామారావు గారు మీకు కొన్ని మందులు వ్రాస్తున్నాను. వాటిని నిర్లక్ష్యం చేయకుండా రోజు ఉదయం రాత్రి భోజంనం చేసిన తరువాత వేసుకోండిఒక వారం చూద్దాంఅప్పుడు మరల రక్త పరీక్ష చేయిద్దాము రిజల్ట్ పట్టి మందులు  నిర్ణయిద్దాం. మీరేమి భయపడనవసరం లేదు రోజుల్లో షుగరు వ్యాధి చాలా కామన్ అని ధైర్యం చెప్పాడుడాక్టరు గారు మందులు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగాడు  అమాయకంగా. . షుగరు వ్యాధి రావటమే కానీ పోవటం అనేది ఉండదుమందులు కేవలం దానిని  నియంత్రించటమే. ఇంకా మీరు అదృష్టవంతులు ఇంకా  ఆలస్యం చేస్తే ఇన్సులిన్ ఇంజక్షన్ మొదలు పెట్టాల్సి వచ్చేది అని అన్నాడు. నా అదృష్టం అడుక్కొని తిన్నట్లే ఉందిలే అని గోనుకుంటూ మందులు కొనుక్కొని ఇంటి దారి పట్టాడు

అప్పటినుండి రామారావు కనపడ్డ ప్రతి మనిషికి  షుగరు ఎలా తగ్గించుకోవాలి అని  అడిగేవాడు. గూగుల్ సెర్చ్ చేసి చిట్కాలు, వెతకటం మొదలు పెట్టాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రోగం వచ్చిన నెలరోజులకు సగం అయ్యాడు  రామారావు. ఇప్పుడు రామారావు మదిలో ఎప్పుడు ఒకటే ఆలోచన షుగరు ఎలా తగ్గించుకోవాలి. అసలు భగవంతుడు షుగరు ఎందుకు మనుషులకు పెట్టాడు అది నా లాంటి మంచివాళ్లకుదేవుడా ఎందుకయ్యా నా మీద ఇంత  కోపం. నేనేమైనా తప్పు చేస్తే క్షమించు స్వామి షుగరు కనక పూర్తిగా తగ్గితే వచ్చే శనివారం నీకు కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నాడుఇందులో లాజిక్ ఏమిటంటే చెప్పకుండానే దేవుడికి తనకు షుగరు వచ్చే శనివారం లోగా తగ్గాలని కోరుకున్నాడన్న మాటకానీ దేముడు ఇలాంటి రామారావులని ఎంతమందిని చూసాడునాయనా అది నీ ప్రలబ్దమ్ అనుభవించక తప్పదు అని దేముడు నవ్వుకున్నాడు

రామారావు డాక్టరు వద్దకు వెళ్లిన అది తినకు ఇది తినకు అని తినే వాటి లిస్టు తినని వాటి లిస్టు చెప్పేవారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే తినని వాటి లిస్టు చాంతాడంట తినే వాటి లిస్టు చిటికెన వేలంత ఉండేదిఇక డాక్టర్ల మాటలు వినాలంటే చిరాకు వేసిందిఆలా అలా తిరుగుతుంటే ఎవరో చెప్పారు మిత్రమా కుక్కుటేశ్వరరావు అనే డాక్టరు  షుగరుకు మంచి డాక్టరు ఆయన తినని పదార్ధాల లిస్టు పెద్దగా చెప్పడు కేవలం "ఒక్కటి తినకుండా ఉంటే చాలు" అంటాడట అని ఒక ఆశాకిరణాన్ని  వదిలాడు. బతుకు జీవుడా అని ఆఘమేఘాల మీద వెతుక్కుంటూ డాక్టరు కుక్కుటేశ్వర రావు గారి వద్దకు వెళ్ళాడు

రామారావుని చూడంగానే కుక్కుటేశ్వరరావు చిన్నగా  నవ్వాడు. నవ్వుకు అర్ధం ఏమిటి ఒరే అమాయకుడా నా దగ్గరకు వచ్చావు ఇక నీ సంగతి చూస్తా అనా లేక ఇంకేమన్నానా అని అనుకున్నాడురామాయణంలో లక్ష్మణుడి నవ్వులా తోచిందినమస్కారం డాక్టారు గారు నాకు షుగరు వుంది అన్నాడు సంగతి మీరు చెప్పక్కర్లేదు మీ మొహం చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు

అయ్యా ప్రతి డాక్టరు షుగరు పేషంట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని పెద్ద లిస్టు చెపుతారు, కానీ మీరు ఒక్కటి తినకుండా ఉంటే చాలు అంటారని ఎవరో చెపితే వచ్చాను అని రామారావు అన్నాడుదానికి డాక్టరు పెద్దగా ఒక వెకిలి నవ్వు నవ్వి అదేనండి అందరు  అంటుంటారు. నేను వెరీ సింపుల్ గా చెపుతాను. ఏమిటి సింపుల్ గా చెపుతావా ఇక్కడ ప్రాణాలు ఉగ్గబట్టుకుని నేను చస్తుంటే అని మనసులో అనుకున్నాడు మన హీరో రామారావుఏమీ లేదండి మీకు ఇష్టమైనవి తినటం మానండి చాలు అని అన్నాడు. ఇదేదో బాగుందే అవును తనకు ఇష్టమైనవి తినటం మానితే షుగరు తగ్గుతుందా డాక్టరుగారు అని అడిగాడు పసివానివలెఅవునండి అంతే మీరేమి కంగారు పడనవసరం లేదు అని యేవో మందులు వ్రాసి ఇచ్చాడు

మందు బిళ్ళలు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడుసంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి రాగిణి అడిగింది ఏంటండీ ఇంత సంతోషంగా ఉన్నారు ఏమైంది మీకు వేళ అని అడిగింది జరిగిందంతా చెప్పి ఇకనుంచి నేను అది తినకూడదు ఇది తినకూడదు అని నేను తిండి మానవలసిన పనిలేదు డాక్టరుగారు నాకు కేవలం నాకు ఇష్టమైనది మాత్రమే తిన నవసరం లేదు అని చెప్పాడు అని అన్నాడుబాగుంది మీ తెలివి తెల్లారినట్టే వుంది డాక్టరు మిమ్మల్ని పిచ్చివాడిని చేసాడండి అని అన్నది. . అదెలా అని అన్నాడుఇప్పుడు చెప్పండి మీకు చామగడ్డల వేపుడు ఇష్టమా కాదా ఇష్టం కదా అని అన్నదిఇష్టం కాకపోవటం ఏమిటి ఎప్పుడు నీకు కూడా మిగల్చకుండా నేనే తింటాను అని  అంటావుగా. అయితే చెప్పండి ఆలుచిప్స్, గుత్తి వంకాయ కూర, కంద కూర, ఆవకాయ పచ్చడి, నీళ్లవకాయ, మాగాయ, మిరపకాయ బజ్జిలు, ఆలు  బొండాలు,అరటికాయ బజ్జిలు, జిలేబీలు, మైసూరుపాకు లు, జహాంగీరీలు, కోవా, కిస్మిస్, జీడిపప్పు, ఇలా మన రామారావుకు ఇష్టమైన తినుబండారాల లిస్టు మొత్తం చెప్పిందిఅబ్బా అబ్బా ఇలా నన్ను ఊరించకే ఇవన్నీ రేపు పండగకు చేసే ప్రొపోజల్ ఏమైనా ఉన్నదా చెప్పు అని అన్నాడు. మాట అంటుంటే రామారావు మొహం వెయ్యి వాట్ల బలుపు వెలిగి నట్టు వున్నది. నా మొహం అవన్నీ నేనెందుకు చేస్తానండి మీకే మీ డాక్టరు అవన్నీ తినకూడదని చెప్పాడని ఇప్పుడే చెప్పారుగా అని అనే సరికి రామారావు ట్యూబులైటు మెదడు టుపుకు టుపుకు అని  వెలిగిందిఅదా సంగతి అని అనుకోని అప్పుడు కానీ రామారావుకు అది చెప్పినప్పుడు డాక్టరు పెద్దగా వెకిలి నవ్వు ఎందుకు నవ్వడో తెలియలేదు. . 

ఇది సాధారణంగా సమాజంలో సగటు మనిషి షుగరు వ్యాధి సోకినప్పుడు కలిగే ఆవేదన, మనలో చాలామందికి రామారావుకు కలిగినటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు  ఒక్కసారి వెనుకకు తిరిగి చూసి చెప్పండిఅయ్యా వెనుకకు అంటే మీ వెనుకకు కాదు మీ గతంలోకి తెలిసిందా

ఇక అసలు విషయానికి వద్దాం. రకంగా అయితే ఒక షుగరు వ్యాధి గ్రస్తుడు తనకు షుగరు వ్యాధి జీవితాంతం ఉంటుండదని తెలుసుకొని కూడా షుగరు తగ్గుతుందనే ఆశతో ఉంటాడో అదే విధంగా ప్రతి సాధకుడు కూడా భవ బంధాలు జీవితాంతం వుంటాయని తెలుసుకొని నిత్యం తన సాధనతో వాటిని తెంచుకోవాలని చూస్తాడు. ఒక గుర్రం రౌతు తానూ గుర్రం దిగిన తరువాత రోజు దానికి తాడు కట్టి ఒక గుంజకు కట్టి వేసేవాడట ఒకరోజు తాను రోజు కట్టే తాడు తెగి ముక్కలు అయ్యింది ఇప్పుడు యెట్లా గుర్రాన్ని కట్టివేయాలి అని  ఆలోచించాడు. అప్పటి కప్పుడు ఇంకొక తాడు తేవాలంటే అది జరిగే పని కాదు. అప్పడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుర్రం మేస్తున్న గడ్డి పరకలను కొన్నిటిని తీసుకొని దాని మెడ వద్ద తాడుతో కట్టినట్లు దానిమీద నిమిరాడు అంటే గుఱ్ఱం తన యజమాని తనను తాటితో కట్టాడని అనుకోని రోజులాగే అక్కడే  వుండినదటమరుసటి రోజు రౌతు గుర్రాన్ని తీసుకొని వెళ్ళటానికి అదిలిస్తే అది గుంజ చుట్టే తిరుగుతున్నది కానీ దానిని వదిలి రావటం లేదు అప్పుడు మరల రౌతు కొన్ని గడ్డి పరకాలలో దాని మెడను నిమిరితే అప్పుడు అది అక్కడినుండి కదిలినదటఅంటే నిజానికి దాని మేడలో పలుపు (తాడు) లేదు కానీ అది వున్నట్లుగా భావించి తనకు తాను బంధించినట్టు భావిస్తున్నది. సాదాకా నీవు కూడా గుర్రం వలెనె నిజానికి ఎటువంటి బంధనాలు లేకుండా  వున్నావు. కానీ సంసారం ఒక బంధనం అనుకోని దానికి నీవు కట్టివేయబడినట్లు నీ అంతట నీవే ఊహల్లో  ఉంటున్నావు. సత్యాన్ని తెలుసుకుంటే సంసార బంధనాలను వీడటం ఏమి సమస్య కాదు. గృహస్థ జీవనం చేస్తూ కూడా మోక్షాన్ని చేరుకోవచ్చు మనకు అనేకమంది సాధకులు ఉదాహరణగా వున్నారు

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మన మహర్షులు ఏమన్నారంటే "మనః ఏవ కారణాయ మనుష్యాణాం బంధః ఏవ మోక్ష" అందువలన మనస్సును సదా పరమేశ్వరుని మీద లగ్నాత చేసి మన దైనందిక కార్యక్రమాలను మన ధర్మంగా భావించి సాధకుడైతే నిరంతర సాధన చేస్తాడో తప్పకుండా అతడు మోక్షాన్ని పొందగలడు. అందులో ఇసుమంత కూడా అసత్యం లేదు. కేవలము దృఢ సంకల్పము, అకుంఠిత దీక్ష నిరంతర కృషి ఉండాలి. "సాధనేన సాధ్యతే సర్వం" ఇంకా ఎందుకు ఆలస్యం ఎందుకు  ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షపదాన్ని జన్మలోనే పొందు

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

కామెంట్‌లు లేవు: