☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
మొన్న మట్టి, నిన్న దేవుడు, నేటి చెత్తకుప్ప
ఈ శీర్షిక పై అనేక వందల, వేల మంది అవహేళనగా నా దేశ సంస్కృతి ని అవమానిస్తూ.. పోస్ట్ లు పెట్టారు. బహుశా రేపు రాబోయే దసరా నవరాత్రుల్లో కూడా పెడతారు తప్పకుండా.
ఇక్కడ ముందుగా ఓ విషయం తెలుసుకోవాలి.
1). సనాతన ధర్మం లో పంచభూతాలు భగవంతుడే. అందులో భూమి ఉంది కాబట్టి మట్టి భగవత్ స్వరూపం.
2). నీరు భగవత్ స్వరూపమే కాబట్టి నీటిలోని మట్టిని తీసి విగ్రహం తయారుచేసి, మరల అదే నీటిలో కలుస్తారు.
3). తెచ్చిన విగ్రహం ను మండపంలో ఏర్పరిచి, ఆవాహన చేసి , షోడశోపచార పూజ చేస్తారు.
4). 3/5/7/9/11/ 13/15/17/19/21 రోజులలో నిత్యం పూజలు చేసి, నైవేద్యం పెడతారు. మరల చివరి రోజున పూజానంతరం ఆ విగ్రహం లోని భగవత్ తత్వాన్ని ఈ పంచభూతాత్మకుడైన విశ్వేశ్వరుని లో మంత్ర సహితంగా ఉద్వాసన చెప్పి కలిపేస్తారు. ఆ పై ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇందులో అంతగా నవ్వవలసిన, హేళన చేయవలసిన విషయం ఏముందీ!?
5). ఓ జీవిత సత్య విషయం ను చూద్దాం. ఓ వ్యక్తి పుట్టాడు, పెరిగాడు. ఆపై ఆయుష్షు లేక శరీరం వదిలేశాడు. అప్పటిదాకా ఆతడు ఒకరికి బిడ్డ, ఒకరికి భర్త/ భార్య. తల్లి లేదా తండ్రి మరొకరికి. కానీ.. అదే బ్రతికి ఉన్నప్పటి అనుబంధంఉంటోందా.. ఆయనతో . లేదే.. ఆరోజో, మరునాడో.. లేక 3 రోజులలో ఎపుడో అపుడు ఎవరెవరి పద్ధతుల ప్రకారం వారు అంత్యక్రియలు అంటూ చేసేస్తున్నారు కదా..
6). ఉద్వాసన అంటే అర్థం ఆ విగ్రహం లోని భగవద్ ఆవాహనను ఉపసంహరణ చేయడం. అపుడు అది కేవలంమరల మట్టితో చేసిన ఆకృతి యే కదా.. అందుకే నిమజ్జనం చేస్తాము. చెత్తకుప్ప అంటూ వేరే ఏం లేదు.
7). ప్రాణం ఉన్నంత వరకూ అది శరీరం అనం. వ్యక్తి అంటాం కదా. ప్రాణం పోయాక అన్నీ ఉన్నా, ఏది లేకపోతే శవం గా మారిందో అదే భగవంతుని చిత్ శక్తి లేకపోవడం అంటే. శరీరం లో అన్ని అవయవాలు ఉన్నాయి ఆ వ్యక్తి కి. కానీ ప్రాణం లేదు. కాబట్టి శవం అంటూ తీసుకెళ్ళి పంచభూతములలో కలిపేస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే. శరీరం పడిపోయాక ఛెత్తకుప్ప అంటామా.. లేదు. ఫలానా వాళ్ళ పార్థివ దేహం అంటారు. మట్టిలో కలపవలసిన దేహం అని అర్థం కదా. మట్టితో పుట్టింది, మరల మట్టిలో కలుపుతున్నాం అని అర్థం..
8). విగ్రహం లో కూడా భగవత్ ప్రొణశక్తిని ఆవాహన చేయడం, ఉపసంహరించడం చేస్తాం. ముందు అది భగవత్ స్వరూపం అయిన నీటిలో ఉన్న మట్టే. మరల అదే మట్టితో చేసిన విగ్రహం ను నీటిలో కలుపుతున్నాం తప్ప ఛెత్త కుప్ప ఎలా అవుతుంది!?
9). ఇన్నాళ్లు పూజించినభగవత్ మూర్తిని సాగనంపేడపుడూ శ్రద్ధగా పూజలుచేస్తాం. మరల వచ్చే ఏడు రా స్వామి అంటూ ప్రేమగా, భక్తితో ప్రార్థిస్తూ. నీటిలో నిమజ్జనం చేస్తారు..
10). యదార్థం తెలియక పోతే తెలుసుకోవాలి. ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఇలాంటి పోస్ట్లు పెట్టడం కాదు.
11). ఒక పండుగ లక్షల, కోట్ల మందికి అన్నం పెడుతోంది.. అది మరువరాదు.
12). అందులో నిజానికి అన్య మతస్థులు ఉన్నారు. సెక్యులరిజం అంటే ఒకటే అక్కరలేని మాటలు, వంకర మాటలు మాట్లాడటం కాదు..
13). నిజం ను లోతుగా తెలుసుకోవాలి. ప్రతి మతంలోనూ గల ప్రతి ఆచారాన్ని గౌరవించాలి తప్ప హీనంగా చూస్తున్నారు అన్నది వాస్తవం. లోపం దృష్టి తో చూస్తున్నారు. యదార్థం తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది..
జై గణేశ 🙏🙏
ఈ క్రింది శ్లోకం దీనికి ఆధారం. కాబట్టి సమస్తానికీ ఆధారమైన వాడిని ఓ చిన్న విగ్రహాన్ని ఏర్పరుచుకొని, అందులోకి ఆవాహన చేసి, మరల ఆ విరాట్ స్వరూపము లోకి పంపడమే ముఖ్య ఉద్దేశ్యం. కరెంట్ ని మన ఇంటిలోకి తెచ్చుకుంటున్నట్లు. నీటిలోనుంచీ తీసినదే కదా.
*నభూమి నజలం చైవ నతేజో నచవాయవః!*
*నచబ్రహ్మా నచవిష్ణుం నచరుద్రశ్చ తారకాః!*
*న ఇంద్రశ్చ న ఆదిత్యో న ఆకాశో నచంద్రమా!*
*సర్వశూన్య నిరాలంబం స్వయంభూః పరమాత్మా!*
*
*భూమి, నీరు , తేజస్సు, వాయువు, బ్రహ్మ,విష్ణువు, రుద్రుడు, నక్షత్రాలు, ఇంద్రుడు, ఆదిత్యుడు, ఆకాశం, చంద్రుడు.. ఏవీ లేనప్పుడు.. అనగా సమస్తం శూన్యమై ఏ ఆధారమూ లేనప్పుడు.. స్వయంభువుగా సమస్తానికీ ఆధారమై నిలిచింది పరమాత్మయే.
కాబట్టి మట్టి యే భగవంతుడు. మట్టి నుండి తీసి, ఓ రూపం ఏర్పరచి, ఆవాహన చేసినపుడు భగవంతుడే.
మరల మట్టిలో ఉద్వాసన తరవాత కలిపేయడం శాస్త్ర సమ్మతమే.. అక్కడే నీటిలో కలిపేయడమూ..
రూపం పోతే బంధం ఎలా పోవడం లేదో.. నీటిలో కలిపేశాక కూడా భగవంతుడు మాత్రమే.. ఓ సైంటిఫిక్ పద్ధతే అది కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి