9, అక్టోబర్ 2023, సోమవారం

ఈ లోకంలో నీకు నిష్కృతి కలిగిస్తుంది!!?

 *1951*

*కం*

ఏ కష్ట మొనరె నీకని

మేకల కోడులను జంపి మేయుచునుండన్.

భీకర తవ పాపఫలము 

లే కరణిని నిష్కృతమగు

నిహమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీకు ఏ కష్టం కలిగించాయని కోళ్ళనూ మేకలనూ చంపి తింటున్నావు?? ఏ విధంగా భీకరమైన ఈ పాపఫలం ఈ లోకంలో నీకు నిష్కృతి కలిగిస్తుంది!!??

*సందేశం*:-- ఏ అపకారం చేయకపోయినా కోళ్ళను,మేకలనూ చంపి తినే వారి పాపఫలములు ఏదో ఒక రూపంలో అనుభవించవలసి వస్తుంది. ఒక తల్లి యొక్క పిల్లలను చంపితే మనకు అటువంటి పరిస్థితి ఎందుకు రాదనుకొనగలము!?? అప్పుడు అది కర్మ ఫలము కాదా!!??.ఒకరిని చంపేటప్పుడు బాధ కలగకపోయినా మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధకలుగుతుంది కదా!! అనే ఆలోచన మనుషుల కు ఎందుకు కలుగదు?

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: