తోకలేని పిట్ట కోసం
కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ...
పోస్ట్ ! అన్న కేక వినగానే ..
ఉరుకులు పరుగులతో అందుకొనే ఉత్తరాల్లో ..
స్నేహితుల కమ్మని కబుర్లు
ప్రేమికుల మధుర భావాలు
దంపతుల అన్యోన్య సరాగాలు
తోబుట్టువుల ఆప్యాయతానురాగాలు
పిల్లలకు పెద్దల మార్గదర్శకాలు
వెరసి ..
మనుషుల మధ్య చక్కని చిక్కని అనుబంధాలు
ఇలా ఎన్నో ఎన్నెన్నో సశేష విశేషాలు ..
ప్రబంధ యుగం నాటి హంస రాయబారాలు
రాజుల కాలం నాటి పావుర ద్యుతాలు
అలనాటి తాళపత్రాల లేఖల నుండి
ఈనాటి అత్యాధునిక ఎస్ఎంఎస్ , వాట్సాప్
ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఈమెయిల్ .. వరకు
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగింది
ఉత్తర ప్రస్థానం .. తపాలా చరితం ...
( నేడు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి