9, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


కామక్రోధాదులూ అహంకారమూ మహాబలీయమైనవి. వాటిని జయించినవాడు ఈ సృష్టిలోనే

లేడు. సత్వరజస్తమోగుణాలే జీవుడికి శరీరధారణ కారణాలు. మరొక విడ్డూరం చెబుతాను విను 

ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్యవినోదాలతో కాలక్షేపం

చేస్తూ చటుక్కున నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని

ప్రసవించాను. ఈ మాయాబలవిమోహం విన్నావా ఎప్పుడన్నా?

జనమేజయా! ఈ ప్రశ్నకు నేను నిజంగా నివ్వెరపోయాను. ఇదేమిటీ వింత? పురుషుడవు

రాజపత్నివి కావడమేమిటి, మగబిడ్డలను కవడం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయాతత్త్వాన్ని

సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్పాడు.

(అధ్యాయం- 27, శ్లోకాలు-50

సాత్యవతేయా! నీకేమిటి, నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాదిస్తంభపర్యంతం ఈ జగత్తు

అంతా మాయామోహితమనడానికి ఇదొక దృష్టాంతం వివరిస్తున్నాను చెవులు ఇటు పడెయ్.

నారదుడు స్త్రీగా మారిపోవడం

అతిమనోహరమైన శ్వేతద్వీపంలో ఉంటున్న నారాయణుడిని దర్శించడానికని ఒకప్పుడు నేను 

వెళ్ళాను. సప్తస్వరాన్వితంగా సామవేదం గానంచేస్తూ మహతి మ్రోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడూ

శంఖచక్రగదాన్వితుడూ కౌస్తుభోద్భాసితోరస్కుడూ పీతాంబరపరీధానుడూ ముకుటాంగదవిరాజితుడు

శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి

అంతర్హితురాలయ్యింది. సర్వలక్షణసంపన్న, సర్వభూషణవిరాజిత, రూపయౌవన విలాసగర్విత,

వరచామీకరప్రభ (బంగారు వన్నె) అయిన ఆ నారీతిలకం నన్ను చూసి చటుక్కున ఇంటిలోకి

వెళ్ళిపోయింది. కారణం ఏమిటి చెప్మా అనిపించి వాసుదేవుణ్ణి అడిగేశాను.

పద్మనాభా! నన్నుచూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏమిటి కారణం? నేను

విటుణ్ణి కాను. ధూర్తుణ్ణి అంతకన్నా కాదు. కేవలం తపస్విని. జితేంద్రియుణ్ణి. జితక్రోధుణ్ణి,

జితమాయాగుణుడిని, ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవలసిన పని ఏమివచ్చింది?

విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి- నారదా! ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరింక ఏ మగవాడైనా

పత్నికి పరాయివాడే. పరపురుషుడి ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి.

నారదైవం విధా నీతి ర్న స్థాతవ్యం కదాచన!

పతిం వినాన్యసాన్నిధ్యే కస్య చిద్యోషయా క్వచిత్ (28-13)

కామెంట్‌లు లేవు: