25, అక్టోబర్ 2023, బుధవారం

మామ తో పద్యం

 Ch. Satyanarayana: మామ తో  పద్యం !

---------------------------- 

        

  ఉ:  మామను  సంహరించి , యొకమామను  గర్వమడంచి ,యన్నిశా


                 మామను  రాజుఁ  జేసి ,  యొకమామ తనూజున కాత్మ  బంధువై,


                మామకుఁ  గన్నులిచ్చి , సుతు మన్మధునింతికి   తానె  మామయై ,


                 మామకు  మామ యైన ,పరమాత్ముడు   మీకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్;


                       చాటువు--- అజ్ఙాత కర్తృకము;


                          పద్యమంతా  మామలతో  నిండిపోయింది. శ్రీమన్మహా  విష్ణువే  యిన్ని  మామలకు మూలము. అదెలాగో  తెలిసికొందాము.


                 కృష్ణావతారంలో  దుష్టుఁడైన కంసుని  సమహరించాడు.  అదీ మామను సంహరించటం. ఇఁక రామావతారంలో  రావణ సంహారంకోసం  లంకకు వెళ్ళేప్రయత్నంలో  అడ్డుగా ఉన్న సముద్రునిపై  బాణంయెక్కుపెట్టి  బెదిరించాడు. సముద్రుడు పిల్లనిచ్చిన  మామగదా , పాపం ఆవిధంగా అల్లునిచేత భంగపడినాడు. ఒకమామను గర్వమడంచటం అదీ. చంద్రుడు  నిశామామ రాత్రికి ప్రభువు.

 (బావమరది) అతనిని  రాజుగా చేశాడట! చంద్రునకు రాజు అనేపేరుకూడా ఉంది.  పాండురాజు కుంతికి భర్త ఆవిధంగా ఆయన మామ  పాండుకుమారుడైన  అర్జునునితో   విడదీయలేని స్నేహం కృష్ణావతారంలో " ఒకమామతనూజున కాత్మ బం

[25/10, 5:20 am] Ch. Satyanarayana: అదీ.


                      మామకుఁగన్నులిచ్చి. రాయబారియై  ద్రుతరాష్ట్రుని  సభకు వచ్చినపుడు  సంధిమాటలు వినకపోగా దుర్యోధనాదులు

కృష్ణుని బంధింపఁ జూచారు. ఆసమయంలో కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించాడు.ద్రుతరాష్ట్రుని ప్రార్ధనమేరకు  అతనికి  కన్నులిచ్చి విశ్వరూపాన్ని చూచే భాగ్యాన్ని ప్రసాదించాడు.  అదీ మామకు కన్నులీయటం. విష్ణువు కుమారుడు మన్మధుడు, మన్మధుని భార్యరతి  ఆమెకు మామయైనాడట. అంతేగాదు  చివరి విచిత్రాన్ని  వినండి. గంగ విష్ణువుయొక్క పాదంనుండి పుట్టింది. కాబట్టి యామె విష్ణువు కుమార్తె. ఆమెను సముద్రున కిచ్చాడట. (గంగాప్రవాహము చివరకు సముద్రమున కలుస్తోంది)  అదిగో  ఆవిధంగా తనకు పిల్లనిచ్చిన  సముద్రునకు తనకుమార్తె గంగ నొసగి  మామగారికి  మామయైనాడట!  అట్టిహరి మీకు ప్రసన్నుడగుగాక! యని కవిగారి దీవెన!


                  కవిత్వం మంటే  యేమిటి?  ఉక్తిచాతుర్యమే!  ఆఉక్తి చాతుర్యమే  చమత్కారం.!


                             మాటల మాటున యీచాటు పద్యంలో  కవి మామతో యెంత చమత్కారం చేశాడో  చూశారుగా!!!


                               

                                                                        స్వస్తి!

కామెంట్‌లు లేవు: