2, డిసెంబర్ 2023, శనివారం

 *శ్రీ లక్ష్మీనరసింహ కరావలమ్బమ్ స్తోత్రము* 

*అనువాద పద్యము -9*

*రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


*తే.గీ.విత్తనంబులు సంసార వృక్షమునకు*

*పాపములను మూలంబుగా పరిగణించు*

*కొమ్మలే సర్వ కర్మల  కారణములు*

*ఆకు పుష్పము లింద్రియమంగభవులు*

*నట్టి వృక్షంబు పైకెక్కి యలసిపోయి*

*క్రింద పడితిని బాధల నొందలేను*

*నారసింహుడా దయతోడ నన్ను చూసి*

*లక్ష్మి తో వచ్చి రక్షించు లక్షణముగ*

*శ్రీధరుణ్ణి చేయూతతో చేరదీయు*

🌹🌷💐🙏🏼🍋🍊

కామెంట్‌లు లేవు: