*1985*
*కం*
సుతగణముల చెంతనె(యెదుటనె) సతి
పతినట చులకనగజూడ పసిహృదయములౌ
సుతజనములు జనకునెటుల
మతిభక్తిన కొలువగలరు మహిలో సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తమ పిల్లల ముందే భార్య తనభర్తను చులకనగా చూస్తే పసిహృదయాలైన ఆ పిల్లలు తమ తండ్రి ని ఏవిధంగా మనఃపూతమైన భక్తి తో పూజించగలరు!!??.
*సందేశం*:-- మాతృదేవోభవ అని పిల్లలు ముందు గా తల్లి ని పూజిస్తారు, అప్పుడు ఆ తల్లి ఆ పిల్లల కు తమ తండ్రి పూజనీయము ను తెలుపవలెను,అలా పితృదేవోభవ అని పిల్లలు తెలుసుకొనగలరు,ఆ తదుపరి తల్లిదండ్రులు ఇరువురు నూ గురువు యొక్క గొప్పదనాన్ని తెలుపగా ఆచార్య దేవోభవ అని తెలుసుకొనగలరు. అంటే బాధ్యత గల తల్లి తన పిల్లల ముందు ఎన్నడూ పతిదూషణ చేయరాదు. ఇది ఈనాడు ప్రతీ కుటుంబమునకూ తెలియవలసినదని నా అభిప్రాయం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి