2, డిసెంబర్ 2023, శనివారం

 శ్రీ దేవీ భాగవతం



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

బ్రహ్మమానససంభవా ! సర్వమంత్ర విశారదా! ప్రసన్నచిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించు.

స్వర్గలోక సుఖాలపట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే ఆ అమానుష భోగాలను అనుభవించాలని

నా ఆకాంక్ష, అప్సరసలతో సాంగత్యం, నందనోద్యాన విహారం, దేవగంధర్వ సంగీత శ్రవణం- చెయ్యాలని

నా అభిలాష, అటువంటి అవకాశాన్ని అందించే యజ్ఞమేదైనా ఉంటే దయచేసి నాతో చేయించు. నువ్వే

సమర్థుడవు. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు.

త్రిశంకూ ! మానవదేహంతో స్వర్గానికి వెళ్ళడం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసి మరణించాక

స్వర్గప్రాప్తి నిశ్చయం. అందుచేత జంకుగా ఉంది. నీ మనోరథం దుస్సాధ్యం. బ్రతికున్నవాడికి అప్సరసల

సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గసుఖాలు

అనుభవించు.

వసిష్ఠా ! నువ్వు చేయించకపోతే చేయించేవాణ్ణి వెతుక్కుంటాను. పురోహితుడుగా నియమించు

కుంటాను. యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెడతాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో! అంత

గర్వావేశం పనికిరాదుసుమా!

నత్వం యాజయసే బ్రహ్మన్ గర్వావేశాచ్చ మాం యది :

అన్యం పురోహితం కృత్వా యక్ష్యేఽహం కీల సాంప్రతమ్ (12 -28)

వసిష్ఠుడికి కోపం భగ్గుమంది. ఓరీ దుర్మతీ! చండాలుడివైపో, ఈ శరీరంతోనే స్వర్గానికి

వెళ్ళాలనుకున్నావు కదా అందుకని ఈ శరీరంతోనే శ్వపచుడివైపో స్వర్గకృంతనపాపిష్ఠా! గోహత్యా

మహాపాత ! బ్రాహ్మణవధూచోరకా! ధర్మమార్గవిదూషకా! చచ్చాకకూడా చచ్చినా నీకు స్వర్గం

లభించదుఅని దారుణంగా శపించాడు.

కామెంట్‌లు లేవు: