22, మార్చి 2025, శనివారం

గరుడ పురాణం_*25వ

 *గరుడ పురాణం_*25వ భాగం*



_*శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం:*_


_ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి._


_*మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.*_


_*"గోపీజన వల్లభాయ స్వాహా "*_ 

_ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి._


_*గోపీ జన వల్లభ మంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.*_


_*త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :*_


_ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః ।_


_క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః |_


_ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః ।_


_ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।_


_*ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.*_


_మహర్షులారా! ఇపుడు శ్రీధర భగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి._


ఓం శ్రాం హృదయాయ నమః, 

ఓం శ్రీం శిరసే స్వాహా, 

ఓం శ్రూం శిఖాయై వషట్, 

ఓం శైం కవచాయ హుం, 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం శ్రః అస్త్రాయ ఫట్.


_*అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని  "ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత " అని ఆవాహనం చేయాలి.*_


_*ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి._


_*ఓం సమస్త "పరివారాయాచ్యుతా సనాయ నమః " అపై*_


_ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి._


ఓం గంగాయై నమః, 

ఓం యమునాయై నమః, 

ఓం ఆధార శక్ష్యై నమః, 

ఓం కూర్మాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం పృథివ్యై నమః, 

ఓం ధర్మాయ నమః, 

ఓం జ్ఞానాయ నమః, 

ఓం వైరాగ్యాయ నమః, 

ఓం ఐశ్వర్యాయ నమః, 

ఓం అధర్మాయ నమః, 

ఓం అజ్ఞానాయ నమః,

ఓం అవైరాగ్యాయ నమః, 

ఓం అనైశ్వర్యాయ నమః, 

ఓం కందాయ నమః, 

ఓం నాలాయ నమః, 

ఓం పద్మాయ నమః, 

ఓం విమలాయై నమః, 

ఓం ఉత్కర్షిణ్యై నమః, 

ఓం జ్ఞానాయై నమః, 

ఓం క్రియాయై నమః, 

ఓం యోగాయై నమః, 

ఓం ప్రహ్ వ్యై నమః, 

ఓం సత్యాయై నమః, 

ఓం ఈశానాయై నమః, 

ఓం అనుగ్రహాయై నమః.


మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.


_*ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ ।*_


_ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత_


_*ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.*_


ఓం శ్రాం హృదయాయ నమః,

ఓం శ్రీం శిరసే నమః,

ఓం శ్రూం శిఖాయై నమః,

ఓం శైం కవచాయ నమః,

ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,

ఓం శ్రః అస్త్రాయ నమః.


_అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము)నూ ఈ మంత్రాలతో అర్చించాలి._


ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః,

ఓం విష్వక్సేనాయ నమః !


_*ఈ దేవస్వరూపాలను షడంగన్యాస, అస్త్రపూజలతో తృప్తిపఱచిన పిమ్మట విష్ణుభగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి, మూలమంత్రాన్ని నూట యెనిమిదిమార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వేయాలి.*_


_ఒక ముహూర్తం పాటు కనులు మూసుకొని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమానకాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వన మాలాలంకృతుడునగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి._


శ్రీనివాసాయ దేవాయ నమః శ్రీపతయే నమఃl 

శ్రీధరాయ సశారంగాయ శ్రీప్రదాయ నమో నమః ॥ 

శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చనమో నమఃl 

శ్రీ పర్వత నివాసాయ నమః శ్రేయస్కరాయ చ ॥ 

శ్రేయసాం పతయే చైవ హ్యాశ్రయాయ నమో నమఃl శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః ll 

స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్ ll 


_*విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు (అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు)*_

కామెంట్‌లు లేవు: