22, మార్చి 2025, శనివారం

ఇతరులు స్పందించనపుడు

 *2046*

*కం*

ఇతరులు స్పందించనపుడు

నితరులకుపకారమొనరు నిష్ఠల యందున్

హితముల కన్నను నెక్కువ

వెతలుమిగిలి తుదకు సడలు విలువలు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఇతరులు స్పందించనపుడు ఇతరులకు ఉపకారం చేసే నిబద్ధత లలో మంచి కన్నా ఎక్కువగా కష్టాలు మిగిలి చివరకు విలువలు కూడా పోతాయి.

*భావం*:-- ఇష్టంగానీ,ప్రతి స్పందన గానీలేని వారికి ఉపకారం చేయడానికి ప్రయత్నాలు చేయడం వలన ఇబ్బందులే మిగులుతాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: