22, మార్చి 2025, శనివారం

శ్రీ రామదూత

 శ్రీ రామదూత...🕉️

*🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః* 


రేపు *అనగాష్టమి* కావున దత్త భక్తులు దయచేసి దత్త నామం జపిస్తూ ఉండండి. మరియు *సిద్ధ మంగళ సొత్రం* చదవండి.

 


#శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


#ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. #అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. #అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. #అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. #ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. #వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .


#అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. #వంశవృద్ధిని కలిగిస్తుంది. #సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. #ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. #దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.


*దత్తుని రూపంలో అంతరార్థం:*

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •


#1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.


#2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.


#3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


#4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


#5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


#6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


#7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.


#8. కమండలము: సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.


#దత్త తత్వం:

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


#దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. #దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. #దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. #తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.#శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. 


*శ్రీ సిద్దమంగళ స్తోత్రం* 


#1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. #మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర #సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. #దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. #మనసున తలచిన కోరికలు నెరవేరును. #మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.


#ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.


*ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః*


🙏🙏🙏


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

కామెంట్‌లు లేవు: