22, మార్చి 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భ్రమరాంబా పతియైన మల్లికార్జునుని భ్రమరాధిపతిగా నిరూపించి, ఆభ్రమరాధిపతిని, తన మానస కమలమునందు విహరించుమని శంకరులు ఈ శ్లోకంలో వేడు కుంటున్నారు.*


*శ్లోకం : 51*


*భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధవా*


*హ్లాదోనాదయుతోమహాసితవపుఃపంచేషుణాచాదృతః*


*సత్పక్షస్సుమనోవనేషుస పునస్సాక్షాన్మదీయే మనో*


*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః !!*


*గమనిక:~*


*ఈ శ్లోకంలోని విశేషణములు అన్నీ భ్రమరాంబాధిపతియైన శ్రీశైల మల్లికార్జునునికీ తుమ్మెదల అధిపతికీ అన్వయించేలా శ్లేషలో కూర్చబడ్డాయి.*


*భావము - వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు భ్రమరాధిపతి అనగా గండు తుమ్మెదను పోలిక చేసుకొని, భ్రమరాంబాధిపతియైన శ్రీ శైలవాసియైన ప్రభువు మల్లికార్జునుని వర్ణించారు.*


*భ్రమరాధిపతి(తుమ్మెద)  - ఆడుతుమ్మెద ఇచ్ఛననుసరించి సంచరిస్తుంది. శివుడు  _  భృంగి అనే ప్రమథగణములలోనివాడూ, శివద్వార పాలకుడూ అయిన నందికేశ్వరుని ఇచ్ఛననుసరించి నాట్యము చేస్తాడు.*


*భ్రమరపతి(తుమ్మెద) ఏనుగుల మదజలముగ్రహిస్తుంది. శివుడు గజాసురుని మదాన్ని అణచాడు.*


*తుమ్మెద వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు.*


*తుమ్మెద ఝంకారం చేస్తుంది. ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్న వాడు.*


*తుమ్మెద మిక్కిలి నల్లని ఆకృతి కలది. శివుడు తెల్లని ఆకారం గలవాడు*


*తుమ్మెద భ్రమరాధిపతి. శివుడు భ్రమరాంబకు అధిపతి.*


*తుమ్మెద మన్మథునిచే సహాయంగా స్వీకరింప బడుతుంది. శివుడు మన్మథునిచే బాణ లక్ష్యంగా చేసికోబడ్డాడు.*


*తుమ్మెద అనగా భ్రమరాధిపతి పూలతోటలయందాసక్తి గలవాడు.*


*శివుడు కూడా విష్ణువువలె రక్షణకర్తయే. శివుడు కూడా విష్ణువు వలె అనేకావతారములను ధరించాడు. శివుడు దక్షిణామూర్తిగా అవతరించి, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు, అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. విష్ణువు అర్చావతారములు ధరించి నట్లుగా శివుడనేక చోట్ల జ్యోతిర్లింగ మూర్తిగా వెలశాడని శాస్త్రములు చెబుతున్నాయి.*


*కాబట్టి అదృష్టవంతులూ, శ్రద్ధ గలవారూ శ్రీశైల మల్లికార్జునుని సేవించి ధన్యులౌతారు.*


*"సర్వః సద్బుద్ధిమ్ ఆప్నోతు " . ప్రతి వ్యక్తికీ శివుణ్ణి పూజించాలనే సద్బుద్ధి కలుగుగాక*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: