3, డిసెంబర్ 2025, బుధవారం

తినడానికి జీవులనట

  *2311*

*కం*

తినడానికి జీవులనట

హననము చేసెడి నరులకు హాయిగనుండన్

తనుచేసిన హింస ఫలమె

తనవారల మరణమనెట తలవరు సుజనా.?

*భావం*:-- ఓ సుజనా! తినడం కోసం జీవులను చంపేవారికి హాయిగా ఉన్నప్పటికీ తను చేసిన హింసల ఫలితంగా తనవారుకూడా హింసాత్మక మృతి నొందుచున్నారని ఎందుకు భావించలేరు?

*సందేశం*:-- మనుషులు జంతువులను హింసాత్మక ముగా చంపి తినేటప్పుడు హాయిగా నే ఉంటుంది కానీ అదే విధంగా వారికి(పిల్లలకు) కూడా జరుగుతుంది అని మాత్రం భావించరు. మనం చేసిన కర్మలే మనలకు కూడా ఫలిస్తాయని గుర్తించరు. అందుకే ఇతరులకు మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: