27, ఏప్రిల్ 2022, బుధవారం

గాయత్రీ దేవి*

 *గాయత్రీ దేవి*

                   ➖➖


పూర్వం ఒకప్పుడు ‘అరుణుడు’ అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు.


దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. 


తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి.


దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు.  బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. 


ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.


అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళు గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. 


బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.


బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. 


ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. 


ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు.


బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు.


ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి

మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.


బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు.


మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. 


ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,  "మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు.  దేవతలు నాకు శత్రువులు.   నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి!’’  అని అడిగాడు. 


అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు!"   అని సమాధాన మిచ్చాడు. 


ఈ మాటలు విన్న అరుణుని లో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. 


వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.


గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. 


ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.


"వరాభయ కరా శాంత కరుణామృత సాగరా !

నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా||"

అయిన జగన్మాతను చూచి…

"నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి|

నమః కమల పత్రాక్షి సర్వాధారే నమో7స్తుతే||

భ్రమరై ర్వేష్టితా యస్మాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా|

తసైయ దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః||

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.


అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. 


కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి, భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి, వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి.


దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి.


ద్విపాద, చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.


తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ ‘భ్రామరీ దేవత’గా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.


ఈ కథ చెప్పి , వ్యాసమహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివిరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు.

గాయత్రీ పరాశక్తి స్వరూపము. ఆమెకు ఐదు ముఖాలు.

ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 

ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.

గాయత్రీ దేవతకే ‘సంధ్యాదేవి’ అని కూడా పేరు.


ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది.


గాయత్రీ మంత్రానికి నాలుగు పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ ఋగ్యజుస్సామ వేదాల నుండి, నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి.


 అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. 


మొదటి మూడు పాదాల్లో ఇరవైనాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. 


ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యాస్తమయం కంటె ముందుగాను అచరించాలని పెద్దలు చెప్పారు.


 సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈఉపాసనవల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. 


ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవృక్ష సమీపంలో, నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం.


"తస్మాత్‌ సర్వే ద్విజా శ్శాక్తాః న శైవా న చ వైష్ణవాః"

ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసే వారే కనుక, వారు వైష్ణవులైనా, శైవులైనా- ముందుగా అందరూ శాక్తేయులు.


గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలూ సృష్టిలోని ఇరవై నాలుగు తత్త్వాలకు సంకేతాలు, కర్మేంద్రియాలు ఐదు. (కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు) జ్ఞానేంద్రియాలు ఐదు, (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) , పంచప్రాణాలు(ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు), పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు(అంతఃకరణ చతుష్టయం) కలసి సృష్టిలోని ఇరవై నాలగు తత్త్వాలు.

జీవుడు ఇరవై అయిదవవాడు.


 ఇరవైనాలుగు అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై అయిదు అక్షరాలు అవుతాయి.


ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి. ఒక్కొక్క చంధస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 


ఇరవై నాలుగు, రంగులు, ఇరవై నాలుగు శక్తులు, ఇరవైనాలుగు ముద్రలూ గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి, కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి.


 ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.


ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి. 


గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి. గాయత్రియే చందస్సు. పరాశక్తియే దేవత.

గాయత్రీ దేవతకు ఐదు ముఖాలు. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు పదిచేతులు. 


కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను , మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ అంకుశ కళాది శక్తులనూ ధరించి ఉంటుంది. 


సాధకుడు ఇలా భావించి, సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి.


"ఓ జగన్మాతా! నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకూ దేవతవైన నీకు నమస్కారము.


 సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ; ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.


హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే.


 భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, గరిష్ఠా, వరారోహ, నీలగంగా, సంధ్యా, భోగమోక్షదా అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు.


మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది- నీవే.


 త్రిలోక వాసులనూ తరింప చేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే.


 భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు.


ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణ నాడులూ నీవే. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు నీ స్వరూపాలే. 


హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి

నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే" అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు.


ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి, గాయత్రీ సహస్ర నామాలను, దీక్షావిధానాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.


జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు.


వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి, శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే, సర్వశక్తులూ స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక.


గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి, దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింప చేశాడు.


"నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే|

వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి||

భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం|

తుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం|| "

అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి, ఆమె పరిపూర్ణనుగ్రహానికి పాత్రుడయ్యాడు.


గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులనూ, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యుడు.


కనుక, జనమేజయ మహారాజా! గాయత్రీ రూపాన్నీ మనసులో భావించినా, ఆమెను పూజించినా, ఆమె మంత్రాన్ని జపించినా, సర్వారిష్టాలు తొలగి, సకల సంపదలూ లభిస్తాయి.


గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరచి, లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు.


గాయత్రీ మంత్ర శక్తిని సద్వినియోగం చేసి, గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి, లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు.


కనుక మంత్ర శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని, స్వార్థంతో, అహంకారంతో, ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు.


ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తారంగా అందించాడు.

ఆవిర్భావ దినోత్సవం

 తెరాస@21.


ఓ స్వతంత్ర కాంక్షకు

ఆరు దశాబ్దాలు గడిచాయి.

ఓ భావోద్వేగానికి పదునాలుగు యేండ్లు,

ఓ స్వరాజ్య పాలనకు

ఏడు వసంతాలు.


ఎందరో బలిదానాలు

ఎన్నో తిరుగుబాట్లు 

ఎన్నెన్నో ఉద్యమాలు

తెలంగాణ పోరాటాలు.


ఎన్నో అవమానాలు

ఎన్నెన్నో ఈసడింపులు

మరెన్నో అసమానతల నడుమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన...


తెలంగాణా రాష్ట్ర సమితికి

ఇరవై ఒక్క సంవత్సరాలు.

స్వీయ పాలన కోసం పోరాటం..


స్వతంత్ర రాష్ట్రం కోసం 

శాంతియుత పోరాటం.

అలుపెరుగని తెరాస పోరాట ప్రస్థానం...


రాజకీయ చైతన్యంతో

మలివిడత 'కారు' పోరు..

మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అంటూ

కదిలే తెలంగాణ సమాజం.


తెరాస పోరాటంలో

రాష్ట్ర ఏర్పాటు కోసం

తెలంగాణ వచ్చుడో

కేంద్రం పని పట్టుడో అంటూ...


నినాదాలు రగిలించే

సకల జనుల సమ్మె

రహదారిన వంటావార్పు

జనంలో స్వతంత్ర ఆకాంక్ష..


నిప్పు కణికలై ఎగసే

ఆత్మ బలి దానం జరిగే

శ్రీకాంత్ చారీ ఆత్మార్పణ

కే.సి.ఆర్ నిరాహార దీక్ష..


తెరాస ఉద్యమించేను

ప్రజలు పోరు సల్పేను

కేంద్రం కళ్ళు తెరిచేను

తెలంగాణా ప్రకటించేను.

 

తెరాస పోరుబాటన

తెలంగాణా వచ్చేను

స్వతంత్ర రాష్ట్రమయ్యేను

ప్రజల కల నిజమయ్యేను.



తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం 

పురస్కరించుకుని యావత్ తెలంగాణా ప్రజానీకానికి శుభాకాంక్షలు..


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

మిఠాయి సత్యం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *🌷మిఠాయి సత్యం🌷*          


మా ఊర్లో సత్యంగారనే షావుకారు (కోమటి) ఉండేవారు.  ఉదయం పదిగంటల నుంచి జంతికలు, చెగోడీలు, బజ్జీలు, బెల్లం మిఠాయి

ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో‌ ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనే వారు.  దానాదీనా ఆయనకి "మిఠాయి సత్యం గారు" అనే‌పేరు స్థిరపడి పోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నింపే

ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.  తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు, హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ, అనేక రూపాల్లో ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథకులకు, స్వామీజీలకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


అయ్! అర్థమయింది.  ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:


*సెనగపిండి (మూలమనుకోండి)* 

1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.

2.లావుగొట్టంలో సుడితే జంతికలు

3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ, పుట్నాలు, అటుకులు, కర్వేపాకు యేపి

కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే మైసూరు పాక్ అవుతుంది.

6.అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కలిపి‌వేయిస్తే పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు, మనకి శివుడుగా, యిష్ణువుగా, ఆంజనేయుడుగా, గణపతిగా ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.


మనం ఎలా కొలిచినా, పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి.  ఆయ్! నాకరదమయినకాడికి

సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభా నిర్వాహకులు కప్పిన ‌శాలువ‌ సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు.


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువుగా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.

 *సభంతా చప్పట్ల మోత.* 

                 *** 

 *సేకరణ* :-  వాట్సాప్ పోస్ట్

ఫలితం

 *చిన్న ప్రయత్నం*

*పెద్ద ఫలితం*



మన ఇంట్లో పిల్లల చేత భగవద్గీత  గొప్పదనం గురించి చెప్పిస్తూ ఎవరికి వారు చిన్న వీడీయో తీసి మనకు తెలిసిన గ్రూప్ లలో పెడితే ,అదే వయసుగల పిల్లలు కనెక్ట్ అవుతారు.

పెద్ద వాళ్ళు చెప్తే చాదస్తం అనుకునే రోజులు.

తమ వయసు వాళ్ళు భగవద్గీత గొప్పదనం గురించి చెప్తుంటే, అందులో ఏముందో తెలుసుకుందాం అన్న ఆసక్తి వారిలో కలుగుతుంది.

అందువల్ల10 నుంచి 25 ఏళ్ల లోపు వారిచేత భగవద్గీత గొప్పదనం చెప్పించి ప్రచారం కల్పించే ఆలోచన చేయవచ్చు.

ముందుగా అది మన ఇంట్లో ఉండే పిల్లలు, ఇరుగుపొరుగు వారిచేత చెప్పించి రికార్డ్ చేసి ప్రచారం చేయచ్చు.

అది కేవలం 1 లేదా 2 నిమిషాలకు మించకూడదు.

ఆలోచించగలరు

🙏🙏

సంభవామి యుగే యుగే ॥"

 ॐ                సత్యసాయి ఆరాధన 


అవతారము - అవతార పురుషులు 


 "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ I 

 ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥" 


1. సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును, 

2. దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును, 

3. ధర్మమును తిరిగి స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుదును. 

                   భగవద్గీత 4- 8 


     కాబట్టి అవతరించి, పరిస్థితులు చక్కబరచడానికి ప్రాధాన్యతలలో, 

 

మొదటిది - మంచిని కాపాడుట, 

రెండవది - చెడు తొలగించుట, 

మూడవది - దరిదాపులలో చెడు తిరిగి పుట్టకుండా, మంచియే ఉండునట్లు ధర్మస్థాపన చేయుట. 


1. కృతయుగంలో దైవ - రాక్షస లోకాలు వేరువేరుగా ఉండేవి.

    హిరణ్యకశిపుడు దేవలోకాలు ఆక్రమించుకుంటే, 

    ప్రహ్లాదుని కాపాడుతూ, 

     హిరణ్యకశిపుని తొలగించాడు. 

2. త్రేతాయుగంలో దైవ - రాక్షస దేశాలు వేరువేరు. 

    విభీషణుని కాపాడి, 

    రావణుని తొలగించాడు. 

3. ద్వాపర యుగంలో దైవ - రాక్షస కుటుంబాలు వేరువేరు. 

      పాండవులను కాపాడుతూ,  

      కౌరవులను తొలగింపజేశాడు. 

4. కలియుగంలో ప్రతి మనిషిలోనూ దైవ - రాక్షస ప్రవృత్తులుంటాయి. 

      మనలోని మంచి మనచేత గుర్తింపజేసి, 

      మనలోని చెడు తలంపు మనమే తొలగించి సంస్కరింపజేసేందుకే భగవంతుడు సంకల్పించుకొని అవతరిస్తాడు. 

      కలి ప్రభావంతో మళ్ళీ మామూలు పరిస్థితులు మారి, అవతార ఆవశ్యకత పదేపదే కలుగుతుంది. 

      అందుకనే అవతార పురుషులు అవతరించి, అవతారంగానే పరిస్థితులు చక్కదిద్దతారు. 

      అందులో భాగంగానే మన అనుభవంలోనున్న స్వామి. 



భగవాన్ సత్యసాయి అవతార  లక్ష్యం: 


          అందఱినీ ప్రేమించు - అందఱినీ సేవించు 

          LOVE ALL - SERVE ALL 


    మనం మానవులం. అంటే మనసుతో జీవించేవాళ్ళం. 

    మనస్సు సంకల్ప-వికల్పాలు చేస్తూంటుంది. దానిలో భాగంగా పరిపరి విధాలపోతుంది. 

     ఇది ఒక కోతి వంటిదంటారు ఆది శంకరులు శివానందలహరిలో. దానిని భక్తి అనే త్రాటితో కట్టేయమని ఆయన పశుపతిని ప్రార్థిస్తారు. 


వాసుదేవుడు


సకల జీవరాశిలో అంతర్యామిగా ఉంటూ, అన్నిటినీ వాటివాటి రూపాలలో ఉంచుతూ, సాక్షీభూతంగా ఉండేవాడు అని "వాసుదేవుడు" అనే నామానికి అర్థం. 

  (వసతి - వాసయతి - ఆచ్ఛాదయతి - సర్వమ్మితి వాసుదేవః) 


     మాయలో ఉంటే "దేహమే నేను", 

     మాయతొలగితే "ఆ వాసుదేవుడే నేను". 


     మనలోనే ఉండి మనమెవరో ఎఱింగించి, ఇతరులలోనున్న తనను మనం గుర్తించేలాగు అనుగ్రహించడమే ప్రస్తుత అవతార ఆవశ్యకత. 


      దానికి సేవలనే మార్గంగా ఎంచుకున్నారు. 

      తాను - విద్యా, వైద్యాదులన్నిట ఆదర్శవంతమైన సేవలని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసి నిరంతరంగా నడిపించడం ఒక్క స్వామికే సాధ్యం. 


    "యద్యదాచరతి శ్రేష్ఠః ----" 

     - శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారనే గీతావాక్యం నిజంచేయడానికి అదే నిదర్శనం కదా! 


        మనకి భౌతికంగా దూరమై దశాబ్దకాలమైనా, అవతార పురుషుడుగా, తన లక్ష్యం నెరవేర్చడానికి స్వామి మనందరిని కార్యోన్ముఖులను గావించడం అత్యంత ముఖ్యంగా గమనించవలసినది. 


   వ్యక్తులుగా, 

   సమితులలో బృందాలుగా, 

   కేంద్ర సంఘం నియమించిన బాధ్యతలలోనూ 

     

     మనం - మనలోని దైవాన్ని గుర్తెరిగీ,

     ఇతరులలోనున్న దైవాన్ని గుర్తించీ, 

     సేవ చేయడమే మన జీవితధ్యేయం - అనేది నిరంతర ప్రక్రియ. 


       దానికి మనమంతా పరికరాలం మాత్రమే! నడిపించేది దైవమే అని గుర్తెరగాలి. 


                   ॐ శ్రీ సాయిరాం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

సంబంధాలలో పరివర్తన

 _*💫సంబంధాలలో పరివర్తన 🎊*_

➖➖➖➖➖➖➖✍️


*_ఉదయం నుంచి మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనిఉంది. మా అత్తగారి మొహంలో మెరుపుకు, వంటింట్లోంచి వస్తున్న వంటకాల సువాసనకు - రెంటికీ ఒకటే కారణం.!_*


*_ఆమె స్నేహితురాలు ఈరోజు భోజనానికి ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా అలంకరించబడుతోంది._*


*_నిన్న సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆమె తన స్నేహితురాలు ఈ రోజు వస్తున్నట్లు చెప్పారు. అందుకని ఆవిడకి బహుమతి కొనడానికి మేం మార్కెట్‌కి వెళ్ళాం, అత్తయ్యగారు, తన స్నేహితురాలికి ఒక మంచి, ఖరీదైన చీరను కొన్నారు._* 


*_ఈ రోజు ఆమె మరొక స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నారు !_* 


*_అత్తయ్యగారు ఉదయాన్నే ఉత్సాహంగా లేచి, నా కంటే ముందే వంటగదిలోకి ప్రవేశించి, చాలా ప్రేమగా, ప్రయాసతో తాను ముందే అనుకున్న వంటకాలను ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేయడం ప్రారంభించారు._*


*_ఆమె నిజంగా సంతోషంగా కనపడుతున్నారు, కానీ నేను.... నా ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో ఆమెకు సహాయం చేస్తున్నాను._*


*_ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. నా పెళ్లయ్యాక, మా అమ్మకి ఇది మొదటి పుట్టినరోజు. నేనేమో ఇక్కడ ఉన్నాను, నాన్నగారు ఆఫీస్ టూర్‌లో ఉన్నారు, మా సోదరుడు విదేశాలలో ఉన్నాడు. ఆమెతో ఎవరూ ఉండరు._*


*_నేను నా మనస్సును బలపరుచుకుని, ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్లాలని నిన్న నిర్ణయించుకున్నాను. అదే నేను మా అత్తగారితో మాట్లాడబోయాను, కానీ నేను ఏమీ అనకముందే ఆమె తన స్నేహితురాలి గురించి చెప్తూ - మధ్యాహ్నం భోజనం, సాయంత్రం, అందరం ఆమెతో కలిసి ఫన్ సిటీకి వెళ్తామని చెప్పారు._*


*_అప్పుడు ఇంక నేను ఏం అనగలను ? నేను మౌనంగా ఉండి పనిలో పడ్డాను. ఆసక్తి లేకుండా, నేను ఇంటిని అలంకరించడం ప్రారంభించాను, నేను కూడా తయారయ్యి సిద్ధంగా ఉన్నాను._* 


*_కాసేపటికి, డోర్‌బెల్ మోగింది, అత్తయ్యగారు తన స్నేహితురాలిని స్వాగతించమని నన్ను పంపారు._*


*_నేను తలుపు తెరిచేసరికి, పెద్ద పుష్పగుచ్ఛం వెనుక దాగిఉన్న ముఖం చూసేసరికి, నా కళ్ళు పెద్దవిచేసి, తెల్లబోయాను !_*


*_అక్కడ నా ఎదురుగా మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ నాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, ఆశ్చర్యపరుస్తూ నన్ను పలకరించింది._*


*_నేను ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మ వైపు చూస్తూ నిలబడిపోయాను. "నా స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా ?" అని మా అత్తగారు వెనుక నుండి అన్నారు._*


*_"అమ్మ... మీ స్నేహితురాలా ?"  ఆశ్చర్యంతో అడిగాను._*


*_"అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు ! మేం స్నేహితులుగా ఉండకూడదని ఎవరు చెప్పారు ?" అన్నారు అత్తయ్యగారు._*


*_"తప్పకుండా ఉండగలం ! ఇది తన కోడలిని కూడా కూతురిలా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం." అంటూ ఆవిడ వెళ్లి అమ్మని కౌగిలించుకుంది._*


*_ఆనందంతో నాకు నోట మాటరాలేదు, నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నేను అత్తయ్యగారి చేతులను నా చేతుల్లోకి తీసుకుని, వాటిని కళ్ళకద్దుకున్నాను, అరచేతులను ముద్దుపెట్టుకొని, ఆమెను కౌగిలించుకున్నాను._*


*_మా అమ్మ మమ్మల్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్లతో నవ్వింది._*


*_బాంధవ్యాల పండుగను ఎంతో ప్రేమగా జరుపుకుంటూ, ఒకవైపు మా అమ్మ - నాకు సంబంధాల ప్రాముఖ్యతను నేర్పితే, మరోవైపు, మా అత్తయ్యగారు - హృదయపూర్వకంగా వాటిని ఎలా కొనసాగించాలో నేర్పించారు._*


*_వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డారు, నాకు కలిగిన అదృష్టానికి గర్వంతో ఇద్దరి మధ్య నిలబడి ఉన్నాను - నా కళ్లలో నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో._* ✍️


♾♾♾♾♾♾♾♾♾♾


*_"ఆత్మగౌరవంపై దృష్టి పెట్టే బదులు, ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి ఆలోచించాలి."…గురువర్యులు._*


*_అనుభూతి : నా జీవితంలోని ప్రతీ ప్రేమపూరిత సంబంధానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.._*🙏


🙏🇮🇳😷💉🎊🪴🦚🐍

తాయత్తు

 తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు., దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే. ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది. అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమనప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం" ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం"


(సేకరణ)

రక్షింపుము

 శ్లోకం:☝️

*యా కుందేందు తుషార హార ధవళా*

*యా శుభ్రవస్త్రాన్వితా*

*యా వీణావరదండ మణ్డిత కరా*

*యా శ్వేతపద్మాసనా l*

*యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్*

*దేవైస్సదా పూజితా*

*సా మాం పాతు సరస్వతీ భగవతీ*

*నిశ్శేష జాడ్యాపహా ll*


భావం: మల్లెపూవువలె, చంద్రునివలె, మంచువలె, ముత్యమువలె స్వచ్ఛమైన ధవళ వస్త్రములను ధరించి శ్వేత పద్మమునందు ఆశీనురాలై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన దేవతలచే స్తుతింపబడుచు విద్యలకు దేవతయైన ఓ సరస్వతీ! మా మనస్సులనుండి అజ్ఞానమును పూర్తిగా తొలగించి రక్షింపుము.🙏

మావిడిపండంటే

 🥭🥭🥭🥭

వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋 


... భలే తియ్యటి వాసన గదంతా! 

గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍


కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.

మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. 

వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.

అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 

ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! 

వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. 

ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. 

నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡

నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤

ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝


అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. 

కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. 


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? 

ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.  

అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.

లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. 

అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! 

తీపి జ్ఞాపకం కూడా! 

 💭 😍 🥭🥭🥭


మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍 

 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰

25, ఏప్రిల్ 2022, సోమవారం

న్యాయమూర్తుల_పదవీవిరమణ_వయస్సుపై_

 #న్యాయమూర్తుల_పదవీవిరమణ_వయస్సుపై_సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం*


*:-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి  జస్టిస్ యన్.వి.రమణ*


తులనాత్మక రాజ్యాంగ చట్టంపై ఆన్‌లైన్ సంభాషణ సందర్భంగా చేసిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ...

 ఎవరైనా పదవీ విరమణ చేయడానికి 65 సంవత్సరాలు చాలా తక్కువ వయస్సు అని నేను భావిస్తున్నాను.

CJI యొక్క ఈ ప్రతిస్పందన సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై దీర్ఘకాల డిమాండ్ మరియు చర్చకు మళ్లీ తెర లేపింది. పదవీ విరమణ వయస్సును పెంచాలని గతంలో వాటాదారుల నుంచి డిమాండ్లు వచ్చాయి. భారత అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అనేక సందర్భాల్లో ఈ సూచనను బహిరంగంగా సమర్థించారు. సుప్రీంకోర్టులో నాల్గవ సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ పదవీ విరమణ వయస్సు పెంపుదలకు అనుకూలంగా బహిరంగంగా అభిప్రాయపడ్డారు. బార్‌కు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు కూడా ఈ ఆలోచనను సమర్థించారు.


2002లో జస్టిస్ వెంకటాచలయ్య నివేదిక (రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్ నివేదిక) తన నివేదికను సమర్పించింది. నివేదికలోని పేరా 7.3.10లో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును వరుసగా 65 మరియు 68 సంవత్సరాలకు పెంచాలని సిఫార్సు చేయబడింది. రెండు దశాబ్దాలు గడిచినా ముందుకు సాగకపోవడంతో నివేదిక అంధకారంలో మగ్గుతోంది.


మార్చి 2021లో, హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.


*ప్రస్తుత పదవీ విరమణ వయస్సు మరియు దాని వెనుక ఏదైనా హేతుబద్ధత ఉందా?*


రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ' అరవై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు' పదవిలో ఉంటారు . ఈ అంశంపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను విశ్లేషించడం మంచిది. ఇది 24.05.1949 నాటి రాజ్యాంగ సభ కార్యకలాపాలకు సంబంధించిన అంశం. చర్చ మరియు ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తితో, చర్చ సమయంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు మనస్సాక్షిగా నొక్కిచెప్పబడ్డాయి. స్పెక్ట్రమ్ యొక్క ఒక చివరలో, జస్పత్ రాయ్ కపూర్, మోహన్‌లాల్ గౌతమ్ మరియు ఇతరులు వంటి సభ్యులు ఉన్నారు, వారు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే సరిపోతుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ అధికారుల పదవీ విరమణ వయస్సుపై వారు తమ వాదనను ముందుంచారు మరియు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాల్సిన అవసరం లేదని సూచించారు. 60 ఏళ్లు దాటిన న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇతరులకు చోటు కల్పించాలని సూచించారు.


స్పెక్ట్రమ్ యొక్క మరొక చివరలో ప్రొఫెసర్ KT షా వంటి సభ్యులు ఉన్నారు, వారు ఇంగ్లాండ్ మరియు USA యొక్క పద్ధతులను అవలంబించాలని మరియు మంచి ప్రవర్తనకు లోబడి జీవితాంతం న్యాయమూర్తులు పదవిలో ఉండాలని డిమాండ్ చేశారు.


ఫెడరల్ కోర్టు మరియు భారతదేశంలోని వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 68 సంవత్సరాలు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు అని సిఫార్సు చేయడం విలువైనదే. మిస్టర్ బి. పోకర్ సాహిబ్, మిస్టర్ నజీరుద్దీన్ అహ్మద్ మరియు మిస్టర్ మహబూబ్ అలీ బేగ్ వంటి సభ్యులు పైన పేర్కొన్న సిఫారసులకు అనుగుణంగా పదవీ విరమణ వయస్సు 68 సంవత్సరాలు ఉండాలని నొక్కి చెప్పారు. శ్రీ M. అనంతశయనం అయ్యంగార్ వంటి సభ్యులు ఈ విరుద్ధమైన డిమాండ్ల మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ప్రయత్నించారు, పదవీ విరమణ వయస్సు 65 ఏళ్ల ప్రతిపాదనకు అంగీకరించారు.


రాజ్యాంగ సభ చర్చలను లోతుగా విశ్లేషిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలుగా ప్రతిపాదించడానికి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరియు న్యాయ మంత్రి ఎటువంటి హేతుబద్ధతను అందించలేదని రుజువు చేస్తుంది, ప్రత్యేకించి పైన పేర్కొన్న సిఫార్సుల వెలుగులో ముందు పారా. రాజ్యాంగ పరిషత్ ముందు నెహ్రూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ముసాయిదా కమిటీ సూచించిన 65 ఏళ్ల పదవీ విరమణ వయస్సు "ఏ విధంగానూ అన్యాయం కాదు, ఎందుకంటే ఇది సూచించబడే ఏ సహేతుకమైన వయో పరిమితిని మించి ఉండదు" అని ఆయన నొక్కి చెప్పారు.. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ప్రబలంగా ఉన్న పద్ధతులను నెహ్రూ మెచ్చుకున్నప్పటికీ, భారతదేశంలో పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు ఉండాలనే కారణాన్ని నెహ్రూ అందించలేదు. ఇది అక్షరాలా ప్రభుత్వం గాలి నుండి ఉపసంహరించుకునే చర్య. నెహ్రూ యొక్క ఈ మాటలు వయస్సును నిర్దేశించడంలో స్పష్టమైన అహేతుకతను ప్రదర్శిస్తాయి, అతను అసెంబ్లీలో ఇలా పేర్కొన్నాడు '...అరవై ఐదు లేదా అరవై ఆరు సంవత్సరాలకు నిర్దిష్ట కారణాలను చెప్పడం చాలా కష్టం; చాలా తేడా లేదు. చాలా ఆలోచించిన తర్వాత, ఆ దశలో మమ్మల్ని సంప్రదించిన వారు అరవై ఐదే సరైన వయోపరిమితి అని అనుకున్నారు....


బిఆర్ అంబేద్కర్, మొదటి న్యాయ మంత్రి, ముసాయిదా ఆర్టికల్ 107 (రాజ్యాంగంలోని ఆర్టికల్ 128) దృష్ట్యా రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించి నిర్దిష్ట కేసు లేదా కేసులను కూర్చోబెట్టి పరిష్కరించేందుకు తక్కువ లేదా ఓడిపోయే అవకాశం లేదని సూచించడం ద్వారా కొంత హేతుబద్ధతను ప్రేరేపించడానికి ప్రయత్నించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పనిచేసిన ప్రతిభావంతులైన వ్యక్తులు. ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్ల తార్కికం తప్పుగా ఉంది. ముందుగా, న్యాయమూర్తుల సముచిత పదవీ విరమణ వయస్సు మరియు నిర్దిష్ట కేసు లేదా కేసులను నిర్ణయించడానికి తాత్కాలిక ప్రాతిపదికన రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకం మధ్య ఎటువంటి సంబంధం లేదు. రెండవది, భారతదేశం వంటి విభిన్న మరియు జనాభా కలిగిన దేశంలో ఈ నిబంధన పూర్తిగా అసాధ్యమైనది.


1975కి ముందు ఈ నిబంధన ప్రకారం రిటైర్డ్ జడ్జీలను నియమించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ గత 47 సంవత్సరాలుగా, ఆర్టికల్ 128లోని నిబంధనల ప్రకారం అటువంటి నియామకం జరగలేదు. ఇది నిబంధనలో అసాధ్యమనే స్వాభావిక తప్పిదాన్ని వ్యక్తపరుస్తుంది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను తిరిగి నియమించుకోవడం '...బయటి నుండి తేలికగా కనిపించవచ్చు...' అని CJI బాబ్డే చెప్పినప్పుడు ఈ లోపాన్ని స్పష్టంగా చెప్పారు .


చట్టబద్ధమైన తార్కికం లేనప్పుడు, ఫెడరల్ కోర్టు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు చేసిన సిఫార్సులను మరియు ఇతర ప్రజాస్వామ్య దేశాలలో బాగా స్థిరపడిన పద్ధతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదు.


1950 నాటి భారతదేశంలో, సగటు ఆయుర్దాయం 35.1 సంవత్సరాలు మరియు 2022 సంవత్సరంలో సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాల కంటే ఎక్కువ.. శాసనసభ మరియు కార్యనిర్వాహక వర్గం అనేక ప్రాతినిధ్యాలు మరియు పదవీ విరమణ వయస్సును పెంచాలని పిలుపునిచ్చినప్పటికీ ఈ కీలకమైన అంశాన్ని గుర్తించలేదు. ఈ కారణంగానే పదవీ విరమణ వయస్సును పెంచడం మంచిది.


పరిగణనలోకి తీసుకోవలసిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 1950లలో ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు ఎదిగినప్పుడు సగటు వయస్సు 56-57 సంవత్సరాలు. గత దశాబ్దానికి పైగా సగటు వయస్సు 59-60 సంవత్సరాలు మరియు మహిళా న్యాయమూర్తుల విషయంలో 60.3 సంవత్సరాలకు పెరిగింది. దీని వల్ల సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయమూర్తికి ఐదేళ్ల పదవీకాలం ఉండదు. న్యాయమూర్తులు సంవత్సరాల తరబడి సంపాదించిన అనుభవం మరియు జ్ఞానం సుప్రీంకోర్టులో ఉపయోగించబడకుండా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థలో న్యాయమూర్తులు వారి సామర్థ్యం, ​​​​అనుభవం మరియు సామర్థ్యం యొక్క ప్రధాన పదవీ విరమణ చేయవలసి ఉంటుంది . సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన చాలా మంది న్యాయమూర్తులు బెంచ్‌లో సీనియర్ న్యాయమూర్తిగా కూడా అవకాశం పొందలేరు.


హైకోర్టు న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు మధ్య మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య వ్యత్యాసాన్ని ఫెడరల్ కోర్టు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సిఫార్సు చేశారు. ఈ ప్రాతిపదికన ముసాయిదా ఆర్టికల్ 193 (రాజ్యాంగంలోని ఆర్టికల్ 217)లో హైకోర్టుల న్యాయమూర్తుల వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.


రాజ్యాంగం (పదిహేనవ సవరణ) చట్టం, 1963 ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచబడింది, అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సులో సారూప్య పెరుగుదల లేదు. ఇది మళ్లీ మునుపటి పేరాలో పేర్కొన్న సిఫార్సుల దంతాల్లో ఉంది మరియు మళ్లీ ఎటువంటి హేతుబద్ధత అందించబడలేదు. అదేవిధంగా, స్టేట్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్ మరియు నోట్స్ ఆన్ క్లాజ్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్ (పదిహేనవ సవరణ) చట్టం, 1963 కేవలం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సులో ఎంపిక చేసిన మార్పుకు గల కారణాలను పేర్కొనలేదు.


ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తుల పదవీ విరమణపై స్థానం-


భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య సంవత్సరంలో ఇతర అధికార పరిధులు/దేశాలలోని రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయమూర్తులతో పోల్చితే రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయమూర్తులు చాలా తక్కువ వయస్సులో పదవీ విరమణ చేసే కష్టతరమైన దేశాలలో ఒకటి. యునైటెడ్ స్టేట్స్‌లో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరణించే వరకు పదవిలో కొనసాగుతారు. నార్వే, ఆస్ట్రేలియా, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్ణీత పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలు. జర్మనీలో, పదవీ విరమణ వయస్సు 68 మరియు కెనడా వంటి ప్రముఖ ప్రజాస్వామ్యంలో, పదవీ విరమణ వయస్సు 75 సంవత్సరాలు.


ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలకు అనుగుణంగా రాజ్యాంగ న్యాయస్థాన న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచడం మన న్యాయవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.


రాజ్యాంగ మార్పు (న్యాయమూర్తుల పదవీ విరమణ), 1977 (సెక్షన్ 72 ప్రకారం 70 సంవత్సరాల పదవీ విరమణ వయస్సుగా నిర్ణయించబడింది) ముందు ఆస్ట్రేలియన్ ఫెడరల్ కోర్టులో నియమితులైన చివరి న్యాయమూర్తి జస్టిస్ గ్రాహం బెల్, పదవీ విరమణపై పేర్కొన్న సమయంలో 78 ఏళ్ల వయస్సు, ఈ రోజుల్లో 70 అంటే 60 లేదా 55కి సమానం... న్యాయమూర్తులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులైతే 80 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. అన్నింటికంటే, పెన్షన్ పదవీ విరమణలో న్యాయమూర్తులను చాలా ఖరీదైన జీవులుగా చేస్తుంది. వాటిని చాలా త్వరగా పచ్చిక బయళ్లకు పంపుతారు...'.


*వయసు ఎందుకు పెంచాలి?*


కేసుల పెండింగ్‌తో భారత న్యాయవ్యవస్థ కుంటుపడింది. 01.04.2022 నాటికి భారతదేశ సుప్రీంకోర్టులో మాత్రమే 70,632 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. డేటా ప్రకారం, దేశంలోని హైకోర్టులలో 56 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదనంగా, హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులలో 21% 10 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. కోవిడ్ 19 మహమ్మారి ఫలితంగా పెండింగ్‌లు మరింత పేరుకుపోయాయని గుర్తుంచుకోవడం విలువైనదే. మహమ్మారి సమయంలో న్యాయాన్ని అందించడానికి సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ అసాధారణ ప్రయత్నాలు చేసినప్పటికీ, కేసుల పెండింగ్‌లు అనేక రెట్లు పెరగాలి. న్యాయవ్యవస్థ ఖాళీలతో కూడిన భారీ పెండెన్సీ న్యాయ బట్వాడా వ్యవస్థను స్తంభింపజేసింది. తాజా నియామకాలు సుదీర్ఘమైన ప్రక్రియగా మారాయి. హైకోర్టుల్లో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టుల్లో 42% ఖాళీగా ఉన్నాయి. జస్టిస్ రమణ CJIగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, న్యాయస్థానం 24 మంది న్యాయమూర్తులతో 34 మంది న్యాయమూర్తులతో పనిచేసింది. CJI రమణ చేసిన కృషి అభినందనీయం, అతను నియామక ప్రక్రియను వేగవంతం చేశాడు మరియు ఫలితంగా 9 మంది న్యాయమూర్తులు ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 31.08.2021. ఈ ఏడాది చివరి నాటికి 8 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేయనున్నారు, ఇది మళ్లీ ఖాళీలకు దారి తీస్తుంది.


ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచితే వచ్చే ఐదేళ్ల వరకు పదవీ విరమణ ఉండదు. కేసుల పెండింగ్‌ను తగ్గించే స్మారక పనిలో ఇది అద్భుతమైన సహాయాన్ని అందిస్తుంది.


పెరిగిన వయస్సు బార్-లోని మరింత ప్రతిభావంతులైన సభ్యులను ఆకర్షిస్తుంది.


న్యాయమూర్తి కార్యాలయం వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా భారీ త్యాగాలకు హామీ ఇస్తుంది. ఆచరణలో ఉన్న న్యాయవాదులు న్యాయ కార్యాలయాన్ని అలంకరించడానికి వెనుకాడడం అందరికీ తెలిసిందే. అరవై-ఐదు సంవత్సరాల వయస్సు పరిమితి అధిక న్యాయపరమైన కార్యాలయాలను అంగీకరించకుండా అధిక న్యాయ ప్రతిభను నిరుత్సాహపరుస్తుంది. 65 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి చట్టపరమైన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి లేడనే భయాన్ని రుజువు చేసే అనుభావిక డేటా అందుబాటులో లేదు. మీకు ఉత్తమ పురుషులు అవసరమైనప్పుడు, వయస్సు మాత్రమే ప్రమాణం కాదు.


ప్రముఖ యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ ఆలివర్ వెండెల్ హోమ్స్, Jr. 'గొప్ప భిన్నాభిప్రాయాలు' మరియు బహుశా US సుప్రీం కోర్ట్‌ను అలంకరించిన అత్యుత్తమ న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. అతని 91 వ పుట్టినరోజుకు రెండు నెలల ముందు పదవీ విరమణ చేశారు. షెంక్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ (1919) 249 US 47 అనే మైలురాయి కేసులో వాక్ స్వాతంత్య్ర హక్కుకు పరిమితి యొక్క ఏకైక ప్రాతిపదికగా 'స్పష్టమైన మరియు ప్రస్తుత ప్రమాదం' పరీక్షను నిర్దేశించినప్పుడు జస్టిస్ హోమ్స్ వయస్సు 78 సంవత్సరాలు .


ముగించే ముందు, రాజ్యాంగ సభలో శ్రీ నజీరుద్దీన్ అహ్మద్ చర్చను ప్రస్తావించడం వివేకం. అతను పదవీ విరమణ వయస్సు కనీసం 68 సంవత్సరాలు ఉండాలని వాదించాడు మరియు అతను ఇలా పేర్కొన్నాడు '... మీరు అరవై ఐదు సంవత్సరాల వయస్సు పరిమితిని పెట్టినట్లయితే, మీరు వారి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న నిజమైన విలువ మరియు సామర్థ్యం ఉన్న దేశపు పురుషుల సేవ నుండి తొలగించబడతారు. సామర్థ్యం మరియు అనుభవం. ఈ పరిస్థితులలో, నేను వయస్సు పరిమితి అరవై ఎనిమిది ఉండాలి…..


రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయమూర్తులు తమ సమర్థత, సామర్థ్యం మరియు విజ్ఞతతో అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారని, మన గొప్ప దేశానికి మరియు దాని న్యాయ వ్యవస్థకు తమ సేవలను అందించగలరని నిర్ధారించడానికి CJI రమణ యొక్క ప్రకటన స్పష్టమైన పిలుపుని చూడాలి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు

 🙏ద్వాదశ జ్యోతిర్లింగాలు🙏

      🌼దర్శన ఫలాలు🌼

                   

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం.*


*1. సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, ఆయన పేరు తోనే అలరారుతున్న కుండం లో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో జీవిస్తారు.*


*2. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జున నామంతో వెలసిన శివుడి  జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.*


*3. ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.*


*4. అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.*


*5.  శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుంది. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.*


*6.  ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.*


*7. సర్వప్రపంచం చేత సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన  మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.*


*8. మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.*


*9.  చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.*


*10.   నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాదుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.*


*11.  శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనే విరాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం  చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.*


*12.   ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇలను అందజేస్తుంది.*


🙏లోకాస్సమస్తా సుఖినోభవన్తు🙏

నేను అనే భావన

*నేను అనే భావన మరీ పెరిగిపోతూ ఉంటే  అహంకారం అవుతుంది.*


తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'.  అంటే  'నేను' .... ఈ నేను అనే భావన మరీ పెరిగిపోతూ ఉంటే  అహంకారం అవుతుంది.

ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకంలో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో  జత చేయడానికి మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే !


అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.  'అహం' అనేది పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.


 సంస్కృత వృత్తాంతం ప్రకారం  సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న పండితుడెవడూ కనిపించక, ఇద్దరూ సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరిలో యెవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు దండి గొప్పవాడని జవాబిస్తుంది సరస్వతి.


దానికి ఖిన్నుడైన కాళీదాసు “నేనేమీ కానా తల్లీ ?” అని అడిగిన ప్రశ్నకు జవాబుగా “త్వమేవాహం”, (నువ్వే నేను) అని జవాబిస్తుంది సరస్వతి.


నేను నా అనే పదాలు మనలోని దైవత్వం నుండి మనని వేరు చేస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ


“నేను”, “నా”, అని సూచించేంత వరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. అయితే “నేనే”, “నాదే” అనే అర్థాలు జోడించుకోవడంతో  అదొక భావంగా వాడుకలోకి వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే అహంకారం అలాగే వుంచి దురహంకారం (చెడ్డ అహంకారం) పదాన్ని వాడటం మంచిది.


 ఆత్మ గౌరవానికి, అహంకారాకి చాలా పోలిక ఉంది. వాటిని విభజించేది చాలా సన్నటి రేఖ.     “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మ గౌరవం.“ఈ సామర్థ్యం నాకొక్కడికే వుంది” అనడం అహంకారం. ఇంట్లో చిన్న చిన్న గొడవల దగ్గరినుండి,      బాహ్య ప్రపంచంలో మహా యుధ్ధాల వరకూ అహంకారాల వల్లే  జరుగుతాయి. ఒకరి అహంకారం ఆ మనిషి పొందే నష్టానికే పరిమితమైతే పోనీ అనుకోవచ్చు. ఒక్కరి అహంకారం వల్ల, ఒక కుటుంబం, జాతి, దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలున్నాయి కదా. ..

24, ఏప్రిల్ 2022, ఆదివారం

వాగ్దేవతలు

 💐💐💐వాగ్దేవతలు..!💐💐💐


 తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :


"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.


"క"  నుండి  "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.  ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత  "మోదిని"  అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది. 


"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత.


"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ"  కరుణను మేలుకొలిపేదే అరుణ.


"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది.


అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత " సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి. 


ఆఖురులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని" 


ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము. 


మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి. 

           🙏🌹🙏🌹🙏

చెడు సంతానం

 శ్లోకం:☝

*ఏకేనాఽపి కువృక్షేణ*

    *కోటరస్థేన వహ్నినా |*

*దహ్యతే తద్వనం సర్వం*

    *కుపుత్రేణ కులం యథా ||*


భావం: పంచభూతాల్లో ఒకటైన అగ్ని చెట్టులో ఉన్న కారణంగా కట్టె మండుతుంది అని పండితులు చెప్తారు. అలా ఒక్క చెడు (ఎండిన) వృక్షంలో అగ్ని పుట్టి మొత్తం అడవిని దహించి వేసినట్టు, ఒక్క చెడు సంతానం మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని భావం.

 శ్రీరస్తు


శ్రీ గురుభ్యో నమః


శ్రీమాత్రేమః


శ్రీశర్మదా జ్యోతిషాలయం


వారి


సూక్తి సుధ


తేది: 24 ఏప్రియల్ 2022


4


శ్రీ శుభకృత్ చైత్ర శుక్ల అష్టమి ఉపరి నవమి - శనివారం. -


--


క్వచితృథ్వీశయ్య: క్వచిదపి చ పర్యట్కశయన: క్వచిచ్ఛాకాహార: క్వచిదపి చ శాల్యోదనరుచి: క్వచిత్క నాధారీ క్వచిదపి చ దివ్యామ్బరధరో మనస్వీ కార్యార్థి న గణయతి దు:ఖం న చ సుఖమ్


భర్తృ-73


కార్యార్థి అయినటువంటి ధీరుడు వీలునుబట్టి ఒకచోట నేలపై * పరుండును. మరొకచోట సుఖవంతమై పాన్పుపై పరుండును. ఒకచోట *కాయగూరలను తినును. మరొకచోట రుచివంతమైన వరియన్నమును తినును. ఒకచోట బొంతను గట్టుకొనును. మరొకచోట పట్టువస్త్రముల ను ధరించును.


అంతేగాని తనకు కలిగిన సుఖదు:ఖములను లెక్కచేయడు.


శ్రీ శర్మదా జ్యోతిషాలయం ---- చరవాణి: +91 9347945040