7, జనవరి 2023, శనివారం

పరమాచార్య

 ఆచార్య - పరమాచార్య


శతాబ్దాలుగా మన పుణ్యభూమి భారతదేశం ఎందఱో ఆచార్యులకు, సాధువులకు, సన్యాసులకు, మహాత్ములకు జన్మను ఇచ్చింది. అటువంటి వారి పాద రజస్సు చేత, లోతైన జ్ఞనము చేత, తపస్సు చేత, పాండిత్యము చేత దశాబ్దాల పాటు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరికీ నా సాష్టాంగ ప్రణామాలు.


ఈ ప్రపంచం కాని, మన భారతదేశం కాని ఎన్నడూ చూడని గొప్ప సాధు సత్పురుషులు పూజ్య జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠం 68వ పీఠాదిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు. మనకు తెలిసినంతలో 87 సంవత్సరాల పాటు పీఠాదిపతిగా ఉన్నవారు బహుశా ఎవరూ లేరు. అతి చిరు ప్రాయంలో 13 సంవత్సరాల వయస్సులో సన్యసించి జగద్గురు స్థానాన్ని అలంకరించి, 87 చాతుర్మాస్యాలను చేసి తమ నూరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వారు కూడా ఎవరూ లేరు.


దాదాపు 25 శాతబ్దాలకు పూర్వం సాక్షాత్ శంకరుడే కేరళలోని కాలడిలో శ్రీ ఆది శంకర భగవత్పాదులుగా ఈ భూమిపై వెలసి, 72 అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిస్తాపించి, సనాతన మతమును ఉద్ధరించారని మనకు చెరిత్ర తెలుపుచున్నది. శతాబ్దాల తరువాత మరలా వైదిక మత స్థితిని, సమసిపోతున్న మానవతా విలువలను చూసి, ఆదిశంకరులే మరొక్కసారి అవతరించాలని నిర్ణయించుకున్నారు. మన పరమాచార్యుల వారి జీవితము, బోధలూ కూడా భగవాన్ ఆది శంకరులకు సమము. మన అదృష్టం ఏమిటంటే మనం జీవించిన కాలము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదుల కాలము.


పరమాచార్యుల వారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాలవేదులు. కేవలం భారతియులనే కాక, విశ్వ మానవాళిని అనుగ్రహించిన ఇరవైవ శతాబ్దపు అవతారం. విశ్వ ప్రజల బాధలను, ఆర్తిని తీర్చడానికి వచ్చిన సమతామూర్తి. వారిపై వచ్చిన గ్రంథాలు అనేకం. కానీ అవన్నీ ఎప్పటికి అసంపూర్ణములే, ఎందుకంటే ఒక శతాబ్దపు జీవితాన్ని, బోధలను వ్రాయడానికి ఆ శతాబ్దపు జీవితాలన్నీ కూడా సరిపోవు.


మా తాతముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు వారి ప్రథమ సందర్శనం కలిగింది. అప్పటినుండి నలభై ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జివితపాఠాలు నాకు ప్రసాదించారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వేలసార్లు స్వామిదర్శనం చేసుకున్నాను. వాటిలో ఎన్నో మరపులేని మరపురాని మధురస్మృతులు.


1967లో పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక యాభై మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తులకోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డ్ చేసి సాయింత్రం వెళ్ళే కలకత్తా రైలుకి నాతో తీసుకుని తిసుకునివేళ్ళాలని భిక్షావందనం రోజు తెల్లవారుఝామున ఒక సేవకునితో చెప్పాను.


మద్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నను శ్రీవారు రమ్మన్నారు. కాని ఐదు ముప్పావు తరువాత కాని నాకు స్వామివారి పిలుపు రాలేదు. మిగిలినవారందరినీ సాయింత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి, నేను నా భార్య మరుసటిరోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము.

అపార కరుణాసముద్రులైన స్వామివారు మాకోర్కే మన్నించి టేప్ రికార్డర్ లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు.


కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6-45 గంటలప్పుడు “కలకత్తాకి ఎప్పుడు వెళ్తున్నారు?” అని మమ్మల్ని అడిగారు. ఆరోజు 6-30 ట్రైనుకే మేము కలకత్తా వెళ్ళవలసి ఉందని, కాని ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని, మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో స్వామివారికి చెప్పాను.


మహాస్వామివారు సన్నటి నవ్వుతో, “వెళ్ళు, వెళ్లి ప్రయత్నించు. బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు” అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగు పరుగున స్టేషనుకు చేరుకుంటే, ఆరోజు మేము వెళ్ళవలసిన రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జివన్ముక్తులకు తెలుసు. కాని అలా చెప్పక “వెళ్ళు, దొరకవచ్చేమో” అని అన్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “కైంకర్య శిరోమణి” డా. యస్.వి. నరసింహన్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మాతృ భాష

 30వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

30వ దినము (06-01-2023):

శంఖము: అంత:కుటిలము, అంబుజన్మము, అంబుజము, అబ్జము, కంబుకము, చిందము, జలజము, జలకరము, త్రిరేఖము, దరము, నీరజము, పాథోజము, పూతము, పినగుల్ల, బహునాదము, బూరగొమ్ము, మహానాదము, ముఖరము, వారిజము, శంబూకము, శ్వేతము, షోడశావర్తము, సంకు, పారంగము, సింధుపుష్పము, సూచికాముఖము, హరిప్రియము.

గవ్వ: కపర్దకము, చరము, చూర్ణి, వటము, శంఖనఖము, శ్వేతము, హరణము,

నూటెనిమిది సార్లు

 ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు


పరమాచార్య స్వామివారికి మెడవెనుక భాగంలో కొంచం నొప్పిగా ఉంది. స్వామికి కంటిశుక్లాల ఆపరేషన్ చేసిన డా. బద్రినాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని, స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డా. కళ్యాణరామన్ ని కోరారు. 


ఒకరోజు మద్యాహ్నం షోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వచ్చారు. భోజనం అయిన పిదప వారిని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. మహాస్వామి వారికి మెడనొప్పితో పాటు చాలా జ్వరంగా కూడా ఉందని చెప్పారు. వారిని పరీక్షించడానికి స్వామివారు అనుమతిచ్చారు. 


డా. కళ్యాణరామన్ మొదటగా నమస్కరించారు. ఎందుకు నమస్కరించావని స్వామివారు అడిగారు. అందుకు మహాస్వామివారితో, “నా క్లినిక్ లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలచుకొని నమస్కరించి అతని వ్యాధి నయంకావాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను నా చికిత్స సఫలం అవ్వాలని. మీకు తప్ప” అని అన్నాడు. 


స్వామివారు నవ్వి “సరే కానివ్వు” అని అన్నారు. 


పరీక్షించిన తరువాత మహాస్వామివారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహించాడు. కొద్దిగా సంకోచిస్తూ స్వామివారితో, “స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గేంతవరకు ఒకటి రెండు రోజులపాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా?” అని అడిగాడు. 


”అది ఎలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను” అని అన్నారు. 


వారి మాటలు విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో, ”ఈశ్వరా! ఎలా పరమాచార్య స్వామివారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతోంది?” అని అడిగాడు.


మహాస్వామివారు అతనితో, “గ్రహణస్నానం ఎలా చేస్తారో తెలుసా?” అని అడిగారు. 


”లేదు పెరియవ”


“నీ చేతివేళ్ళతో ముక్కు మూసుకుని నదినీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి”


నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను. 


తరువాత మహాస్వామివారు “ఒక్కసారి కాదు. నూటెనిమిది సార్లు” అని అన్నారు. 


ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దాదాపు కుప్పకూలిపోయాను. తరువాత తేరుకుని “నేను మీకు ఏమి చికిత్స ఇవ్వగలను?”


“మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేమి ఉంది? మాలాంటి వారికోసం, మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ శివుణ్ణి వేడుకోవడం తప్ప” 


--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భగవంతుడు ఒక్కడే

 *సుభాషితమ్*

ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:

సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా

కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస:

సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ


అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడు ఒక్కడే. అతడే సర్వవ్యాపి. సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్త కర్మలకు ఫలప్రదాత. సమస్త ప్రాణులకు అంతర్యామి. అన్నికర్మలకు సాక్షి. జ్ఞాన స్వరూపుడు. సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు. అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు. అతని కంటే ఇతరుడు మరొకడు లేడు. అతనిలో ఎటువంటి విభాగము లేదు. అతడు గుణాతీతుడు. శుద్ధచైతన్య స్వరూపుడు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

వ్యాఘ్రేశ్వరం

 [05/01, 8:34 pm] +91 93903 43371: 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 పూర్వం పెద్దాపురం సంస్థానం లో ఉన్న ఈ ప్రాంతం అంతా ఒక అడవి,ఒక బ్రాహ్మణోత్తముడు మహాశివరాత్రి రోజున స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని శివపూజకు మారేడు దళాలు కోసమై అడవికి వెళ్ళాడు

ఇంతలో ఒక.పులి తరమగా పరుగెత్తి, పరుగెత్తి ఒక చెట్టు ను ఎక్కాడు.అది మారేడు చెట్టు.పులి

చెట్టు కింద ఉంది.చేసేది ఏమీ లేక ఆ బ్రాహ్మణుడు మనసు లో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు.రాత్రి సమయం అయింది, అయినా ఆ పులి 🐯 అక్కడ నుంచి కదలలేదు.అర్ధరాత్రి లింగోద్భవ కాలం అయింది.

మనసులో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఆ బిల్వదళం చెట్టు మీద నుండి ఒక్కొక్క దళం కోస్తూ చెట్టు కింద కు వేస్తున్నాడు.తెల్లవారేసరికి ఆ పులి 🐯 మారేడు దళాలతో కప్ఫబడింది.ఆ రాశి కదలకపోవడంతో ఆ బ్రాహ్మణుడు చెట్టు దిగి జనావాసాల మద్యకు వెళ్లి జరిగిన ది చెప్పడంతో ఆ జనాలు బరిశెలతో , డప్పులు వాయిస్తూ ఆ పులి ఉన్న ప్రదేశానికి వచ్చారు.అందులో ఒకడు ధైర్యం చేసి ఆ పులి ఉన్న రాశి దగ్గర కు వచ్చి,ఆ ప్రదేశాన్ని బరిశెతో పొడవగా రాయి తగిలిన శబ్దం వచ్చింది.ఆ శబ్దం నకు తొలగించి చూడగా, శివలింగం బయట పడింది.పరమేశ్వరుడు వారిలో ఒకరిని ఆవహించి, నేను ఈ బ్రాహ్మణోత్తముడుని పరీక్షించడానికి పులి రూపంలో వచ్చాను.ఇతని మానసిక బిల్వ పూజకు సంతోషించాను.ఈ బ్రాహ్మణుడు ఇహపరసుఖములను పొంది నాలో ఐక్యం చెందుతాడు,అని పలికాడు.అదేరోజు రాత్రి పరమేశ్వరుడు పెద్దాపురం మహారాజు కలలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో స్వయంభూ గా వెలిశాను, నాకు ఇక్కడ గుడి కట్టించమని ఆదేశించారు.పెద్దాపురం మహారాజు గారు, అక్కడ ఆలయాన్ని మండపప్రాకారాలను,

నిర్మించి ఆ పరమేశ్వరుడు కి ధూపదీప నైవేద్యాలు ఉత్సవాలు కు నలభై ఎకరాల సస్యశ్యామలంగా పండే భూమిని 

ఇచ్చారు.ఆ దేవుని పేరు మీదుగా ఒక అగ్రహారం ను ఏర్పాటు చేశారు.అదియే వ్యాఘ్రేశ్వరం గ్రామం.వ్యాఘ్రం లింగాక్రుతిగా మారడంతో,వ్యాఘ్రేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కాడు.అక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరి ని అర్చిస్తూ,

అనేక మంది భక్తులు ఇహపరసుఖములను పొందుతున్నారు.

మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ

ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా,క్రొత్తపేట మండలంలోని ముక్కామల దగ్గర ఉంది.

మాతృ భాష

 29వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

29వ దినము (05-01-2023):

అల: అక్కలి, అర్గళము, ఉత్కలిక, ఊర్మి, కడలు, కర, కరడు, కల్లోలము, కెరటము, ఘృణి, జలలత, తరంగము, తరగ, తళ్ళు, తెర, నీటిడొంక, భంగము, భంగి, లహరి, సుడి, వీచి. 

నురుగు: అబ్ధకఫము, ఉదధిమలము, జలహాసము, డిండీరము, సంతానిక, సముద్రకఫము, స్ధానకము. 


ఆంగ్లము: Wave

6, జనవరి 2023, శుక్రవారం

అష్టవిధ వివాహాలు.

 వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు.


 * బ్రాహ్మ్మము - 


     మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు ధరింప చేసి పూజించి కన్యాదానం చేయుట వరదక్షిణం అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.

 

 * దైవ వివాహం - 

  

  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .

 

 * ఆర్షం - 


    ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.

 

* ప్రాజాపత్యం - 


       నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .


 * రాక్షసం - 


      కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .

 

 * అసురం - 


         ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,

కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.

 

 * గాంధర్వం - 


       ప్రేమించి పెళ్లి చేసుకోవడం .

 

* పైశాచికం - 


   దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.


 అష్టవిద నాయకలు -


 * ప్రోషిత భర్త - 

 

    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.

 

* ఖండిత - 


 ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేశిన్చునది .

 

 * కలహంతరత - 

   

    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.

 

 * విప్రలబ్ద -


    ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.

  

* వాసవ సజ్జిక - 


  భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .

  

* స్వాధీన పతిక - 


    భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.

 

 * అభిసారిక -


  బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.


  * వరిహోత్కంటిక - 


      ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.


 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.


 వివాహం - 

 

స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .


 వివాహానికి శుభమైన వారములు. - 

 

 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.


 వివాహానికి తిధులు - 


 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.


 వివాహానికి సరైన నక్షత్రాలు. - 


 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .


 వివాహ యోగములు - 


 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పుర్తిగా వర్జిమ్పవలెను. మిగిలిన వాటిలో శుభాయోగములను తీసుకొనుట ఉత్తమము.


 వివాహ కరణములు -


 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.


 వివాహ లగ్నం -


  వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.


 వివాహనికి మాసములు - 


 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 


         

*ఉ సి రి* ని షే ధం? ఎందుకు

 🍈🍈🍈🍈🍈

*ఉ సి రి* ని షే ధం? ఎందుకు?

🍈🍈🍈🍈🍈

ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు......

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.....

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు..... 

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న..... 

అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం...... 

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే..... ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది...... 

ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.... దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.....

అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.....


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది..... 

సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది..... 

అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకు డగును కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు

5, జనవరి 2023, గురువారం

దేవుడి చిరునామా*



*# దేవుడి చిరునామా* 


కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీతని చదువుకోవడం చూశాడో నాస్తికుడు.

"స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.

సాధువు తల ఎత్తి అతని వంక చూసి, ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.

దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను.

అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు.

నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు. 

పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను... చెప్పిందా పిల్ల.

ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.

మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు? ఆడిగిందా అమ్మాయి.

"మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు చెప్పాడు తండ్రి.

"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల.

అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.

ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. 

అతని దగ్గరకు వెళ్లి ఆవిషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప... చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు... ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే.

కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.

"మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. 

అదే *దేవుని చిరునామా".*

భగవంతుడు నీ ఉనికి..

 భగవంతుడు పదార్థం కాదు -- యదార్థం .. 

భగవంతుడు ఒక రూపం కాదు -- నీ స్వరూపం... 

భగవంతుడు నిస్తేజం కాదు..

-- ఉత్తేజం... 

భగవంతుడు  నీ ఉనికి.. 

భగవంతుడు నీ చైతన్యం.. 

భగవంతుడు నీ విశ్వాసం.. 

భగవంతుడు నీ ధైర్యం... 

భగవంతుడిని భావనగా చూడకు... 

ఆ భావనే నీవుగా మారిపో... 

భగవంతుడే *నేను* గా తెలుసుకో....

పూజ్యాయ రాఘవేంద్రాయ

 ॐ పూజ్యాయ రాఘవేంద్రాయ 

    సత్య ధర్మ రతాయచ I 

    భజతాం కల్పవృక్షాయ  

    నమతాం కామధేనువే ॥ 


पूज्याय राघवेंद्राय सत्यधर्मरताय च।

भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे॥ 


Pujyaya Raghavendraya 

Sathya Dharma Rathayacha I

Bajatham Kalpa Vrukshaya 

Namatham Kamadehnave ॥ 


సత్య, ధర్మ రక్షకుడైన రాఘవేంద్రుని పూజిస్తాను. 

    కల్పవృక్షం వంటి మహోన్నతుడైన రాఘవేంద్రునికి నమస్కరిస్తున్నాను.  

    కామధేనుడి లాంటి శ్రీ రాఘవేంద్రుడికి నమస్కరిస్తున్నాను.


* కల్పవృక్షం ఒక దివ్య వృక్షం, ఇది మన కోరికలన్నిటినీ నెరవేర్చడానికి ఉంది. 

* అదేవిధంగా, కామధేను కోరికను తీర్చే ఆవు. దీనిని కొన్నిసార్లు అన్ని ఆవుల తల్లి అని కూడా పిలుస్తారు.


    శ్రీ రాఘవేంద్రుడు తనను మనస్ఫూర్తిగా ప్రార్థించే భక్తులందరి కోరికలను తీరుస్తాడు. 


पूज्य राघवेंद्र: 

    महान सार्वभौमिक गुरु श्री राघवेंद्र।


सत्य धर्म रत: 

    सत्य और धर्म के रक्षक। 


भजतां कल्पवृक्षlय 

    मैं सम्मानित राघवेंद्र को नमस्कार करता हूं जो इंद्रलोक में पाए जाने वाले एक कल्पवृक्ष वृक्ष की तरह हैं, जो एक प्रकार का मनोकामना पूर्ण करने वाला वृक्ष है। 


नमतां कामधेनवे

    मैं गुरु श्री राघवेंद्र को नमन करता हूं जो दिव्य गाय कामधेनु की तरह हैं, एक दिव्य गाय इंद्र लोक में रहती है। 


  - I worship the esteemed Raghavendra who is the protector of Satya and Dharma. 

    I salute the esteemed Raghavendra who is like a kalpavriksha. 

    I bow to Sree Raghavendra who is also like our Kamadhenu.


* Kalpavriksha is a divine tree, which is there to fulfill all our wishes. 

* Kamadhenu, similarly is a wish fulfilling cow. It is also sometimes referred to as mother of all cows.


Sree Raghavendra fulfills the desires of all the devotees who sincerely pray to him.

అంతః శుద్ధి కావాలి.

 #దేవుడికి  విసుగెత్తింది..    

           🌿🌷🥀🌷🌿


       🌹దేవుడికి బాగా విసుగెత్తింది.ఎప్పుడు చూసినా నాకది కావాలి ఇది కావాలి అని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోర్కెలతాకిడికి ఆయన అలసి పోయాడు.వీళ్ళకి కనిపించకుండా అతి రహస్యస్థావరానికి వెళ్ళిపోవాలని ధృఢంగా నిర్ణయించుకున్నాడు.తనకి బాగా సన్నిహితుడైన ఆంతరంగికులని సంప్రదించాడు..

ఒకరు చంద్రమండలానికి వెళ్ళమన్నాడు..మరొకడు ఎవరెస్ట్ శిఖరంమీద కూర్చోమన్నాడు..మరొకడు ఎవరూ రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్ళి దాక్కోమన్నాడు...

"లాభం లేదయ్యా ఏదో నాటికి మనిషి వీటన్నిటిని దాటి అక్కడికి కూడా దాపురించి అక్కడకూడా నాప్రాణం తీస్తాడు"అన్నాడు నిస్పృహగా...

అప్పుడు అత్యంత సన్నిహితుడైన ఆంతరంగికుడు ఒక అద్భుతమైన సలహాయిచ్చాడు...

"స్వామి నిన్ను మనిషన్నవాడు చూడలేని ప్రాంతం ఒకేఒక్కటుంది..అక్కడికి వెళ్ళు" అన్నాడు...

"ఔనా..ఎక్కడుంది" అని కుతూహలంగా అడిగాడు స్వామి..

"మనిషిలోనే స్వామి"అని ఓ చిరునవ్వు నవ్వి"అదే అతని మనసు"అన్న ఆ ఆంతరంగిక  సలహాదారు  వంక ఆశ్చర్యంగా చూసాడు..

"మనిషి అన్నీ చూడగలడు గాని-తన మనసులోపలికి తాను చూసుకోడు..అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడా దొరకదు స్వామి"అన్నాడు...

అంతే మరుక్షణం స్వామి అదృశ్యం..

ఇంకా మనుషులు దేవుడికోసం బయటే వెదుకుతున్నారు...

ఆంతర్యంలో వున్న సర్వంతర్యామి చిద్విలాసంగా        చిరునవ్వు నవ్వుతూ ఈమనిషిని గమనిస్తూనే వున్నాడు.


దేవుడిని కలవాలంటే

అంతః శుద్ధి కావాలి. 


దేవాలయంలోకి వెళ్ళాలంటే

బాహ్య శుద్ధి కావాలి


🥀🌷🌿🥀🌹🌿🥀🌷🌿🥀🌹🌿🥀🌷🌿

*సేకరణ*

        💐#శుభమస్తు💐

గొప్ప_సావు

 *గొప్ప_సావు

                  ➖➖➖✍️


"ఏమైంది…?" వెళుతున్న కారు వేగం తగ్గడంతో... అడిగాడు మాధవ, డ్రైవర్ని.


"ముందు ఏదో ఊరేగింపు లాగా వుంది సర్. వెళ్ళే బండ్లను ఆపేస్తున్నారు" డ్రైవర్ తలని బయటపెట్టి చూసి చెప్పాడు.


"అది వెళ్ళే దాకా మనం వెళ్ళలేమా? 

ఇంకో దారి ఏదైనా వుంటే అటుగా వెళ్ళు".


"ఇక్కడ వేరే పక్క దారి లేదండి. సగం దాకా వచ్చేశాం ఈ రోడ్డులో" బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్.


"కనుక్కో… ఏంటో " చేతిలోకి ప్రక్కన ఉన్న మాగజైన్ తీసుకుంటూ చెప్పాడు మాధవ.


కారు దిగి వెళ్లి ట్రాఫిక్ పోలీస్ తో మాట్లాడి వచ్చి చెప్పాడు డ్రైవర్ "మొన్న బోర్డర్ లో చనిపోయిన సైనికుడి బాడీ అంట సర్. ఇవ్వాళ వచ్చిందిట అక్కడి నుండి. ముందు వున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి తీసుకెళ్తున్నారు ట."  మళ్ళీ డ్రైవరే చెప్పాడు "పాకిస్థాన్ సరిహద్దుల్లో టెర్రరిస్ట్ లతో జరిగిన పోరాటంలో ఇద్దర్ని చంపి మరొకడిని సజీవంగా పట్టుకునేందుకు చేస్తుండగా వాడు పేల్చుకొడంతో ఈన చనిపోయాడట సర్! "


"ఆ బాడీ అక్కడకు చేరేదాకా మనం ఏం చేయలేమా! ఇట్లా రోడ్ మీద వుండిపోవాల్సిందేనా?" మాధవ మాటలు మనసులో అసహనాన్ని నింపుకున్నాయి!


"కొంచెం ముందుకెళ్లాక డబుల్ రోడ్ వస్తది. అక్కడ వచ్చే పోయే ట్రాఫిక్ ను పక్క రోడ్ నుండి పంపిస్తున్నారట సర్, పోలీస్ చెప్పాడు" చెప్పాడు డ్రైవర్.


బయటకి చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు, ఊరేగింపు లో కలవడానికి వెళుతున్న జనాన్ని చూసి. నేల ఈనినట్లు జనం వచ్చి కలుస్తున్నారు. వాళ్లు నినాదాలు వ్రాసివున్న ప్లాకార్డ్స్  చేతులతో పైకి ఎత్తి పట్టుకొని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు. కొన్ని స్కూల్ పిల్లల బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపు లోకి. ఇప్పుడు బండిని వెనక్కి త్రిప్పించుకొని కూడా వెళ్ళలేడు. ఇంతలో వాళ్ళ కారు ప్రక్కనే వచ్చి ఆగింది ఒక జీపు. ఆ జీపు కు ఒక ఫ్లెక్సీ కట్టబడి వుంది. దాని మీద "కెప్టెన్ శంకర్ స్వామి జిందాబాద్", " కెప్టెన్ శంకర్ స్వామి అమర్ రహే" అని వ్రాసి వున్నాయి.

అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు. ఆ పేరు తనకు పరిచయ మైనదే, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయతించ సాగాడు. ఇంతలో మరొక ఆటో వెనక భాగాన ఆ అమర సైనికుడి ఫోటో వున్న ఫ్లెక్సీ తగిలించుకుని ముందుకు వచ్చింది. ఆ ఫోటోలో వున్న వ్యక్తిని చూసిన మాధవ అతనిలో తెలిసిన వాళ్ళ పోలికలు కనపడగా, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయతించ సాగాడు. తన స్మార్ట్ ఫోన్ లో  గూగుల్ న్యూస్ చూసాడు. అందులో శంకర్ స్వామి జీవిత విశేషాలు, కొన్ని ఫోటోలు కనిపించాయి. 


ప్రక్కన ఆగిన జీపు ముందుకు కదులుతూ వుండగా వచ్చిన నినాదాలు "శంకర్ స్వామి అమర్ రహే" , మాధవ ఆలోచనలను తన ఉన్నత పాఠశాల రోజులకు మళ్ళించినయ్.

*******************


అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు.

"నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలను కుంటున్నావురా రంగా?" అడిగాడు సోషల్ మాష్టారు రంగారావు ను.


"నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కుంటున్నాను సార్."


" ఎందుకురా?"


" పోలీస్ అంటే అందరికీ భయం సార్. అందుకని!"


" నువ్వు రా శరత్?"


"లాయర్ అవుతాను సర్."


అలా తరగతిలో పిల్లలందరినీ అడుగుతున్న మాష్టారు శంకర్ స్వామి నీ అడిగాడు " నువు చెప్పరా శంకర్".


"గొప్పగా సావాలనుకుంటున్నాను సర్" శంకర్ స్వామి సమాధానంతో క్లాస్ అంతా నిశ్శబ్ధం అయ్యింది ఒక్కసారి.

సోషల్ మాష్టారు ఉలిక్కిపడ్డాడు శంకర్ సమాధానాన్ని విని.


తేరుకొని, "ఏంటిరా అట్లా అన్నావ్?" అడిగాడు శంకర్ స్వామిని.


"అవును సార్ గొప్పగా సావాలి సర్!" శంకర్ మళ్ళీ అదే మాట!


ఆశ్చర్యపోయిన మాష్టారు, " నువ్వు ఇక్కడకి రారా" పిలిచాడు శంకర్ ని తన దగ్గరకి. శంకర్ వచ్చాడు మాష్టారు దగ్గరకి.


"గొప్పగా చావడం ఏంటిరా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట?" అడిగాడు మాష్టారు ఆశ్చర్యంగా!


"మా యమ్మ సర్. కష్ట పడిన వాళ్లందరూ గొప్పవాళ్ళుగా బతకచ్చుట, కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సర్".


"అంటే?" రెట్టించి అడిగాడు మాష్టారు.


"మన బతుకు మనం బతుకుతా సస్తే గొప్ప కాదంట! మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావంట! అందు కోసం నేను ఆర్మీ లోకి ఎలతాను సర్" శంకర్ కంఠం ఎంత స్థిరంగా పలికిందంటే, అతను తన తల్లి మాటలను నూరు శాతం విశ్వశిస్తున్న అంతగా.


ఆ రోజు శంకర్ స్వామిలో ఒక క్రొత్త వ్యక్తి కనపడ్డాడు క్లాస్ మొత్తానికి! అప్పటి దాకా ఏ ప్రత్యేకతా లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి వున్న ఆశయ విస్ఫోటనం జరిగింది ఆ రోజు తరగతి గదిలో!   అది అందరినీ అతని వైపు ఆకర్షించింది, అందులో మాధవ కూడా ఒకడు.


మాధవ, ఇంకా ఒక నలుగురు స్నేహితులూ కలిసి సైకిళ్ల మీద స్కూలు కు వెళ్ళేవాళ్ళు. శంకర్ స్కూల్ కి నడిచివెళ్లే వాళ్ళల్లో ఒకడు. ఆర్థిక పరమైన తారతమ్యం వలన ఒకే తరగతి చదివే వాళ్ళు అయినప్పటికీ వేరు వేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు. శంకర్, స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణం లో తండ్రికి రెండు మూడు గంటలు సాయపడేవాడు. అందువల్ల బయట స్నేహాలు అలవాటు కాలేదు.


టెన్త్ లెక్కల పరీక్షలప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది మాధవకు – తనకు ముందు వరుసలో శంకర్ తల వంచుకొని పరీక్ష వ్రాస్తున్నాడు. ప్రశ్నాపత్రం చాలా కష్టంగా వుంది. తనకు తెలిసిన లెక్కలు రెండే వున్నాయి, వాటివల్ల పాస్ మార్కులు రావు. ఇంతలో శంకర్ వ్రాసిన ఆన్సర్ పేపరు ఒకటి జారివచ్చి మాధవ కాళ్ళ దగ్గర పడింది. శంకర్, మాధవ ఇద్దరూ గమనించలేదు. తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవకి ఇచ్చి - పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో - మని సలహా ఇచ్చాడు! అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తరచి చూసాడు. తనకు తెలియని ఇరవై మార్కుల లెక్క ఒకటి చేయబడి వుంది అందులో. తన అదృష్టాన్ని తానే నమ్మలేక పోయాడు. అంది వచ్చిన అవకాశాన్ని వదులు కోక దాన్ని పూర్తిగా కాపీ చేసి, ఇన్విజిలేటర్ చూడనప్పుడు శంకర్ ను పిలిచి "కింద పడి వుంది " అంటూ ఇచ్చాడు. శంకర్ పేపర్ నుండి కాపీ చేసిన దానివల్ల తను టెన్త్ క్లాసు లెక్కల పరీక్ష గట్టెక్కేసాడు. 


తర్వాత కాల ప్రవాహంలో తను ఇంటర్, ఇంజనీరింగ్    వేరే ఊర్లో చదవడం జరిగింది. ఊరు శివార్లలో తండ్రి తన చిన్నప్పుడు కొన్న అయిదు ఏకరాల వ్యవసాయ భూమి, పట్టణం విస్తరణ దాహానికి లోనయ్యింది! దాని విలువకు ముందుగా కాళ్ళు, తర్వాత రెక్కలు వచ్చేసరికి,   తను చదివిన సివిల్ ఇంజనీరింగ్ ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తనో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు. పెళ్లి, ఇద్దరు పిల్లలు, బంగళా, ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది.


శంకర్, ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియేట్ తర్వాత 18 సంవత్సరాల వయసు నిండుతోనే మిలిటరీ లో చేరాడు. ఆర్మీ లో వుంటూ టెక్నికల్ కోర్సు లు పూర్తి చెయ్యడం, అంకిత భావంతో విధులు నిర్వర్తించడం తో కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. 


ఈ విషయం తనకి అయిదేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది. చాలా ఏళ్ళ తర్వాత చూడడం, శంకర్ దేహ ధారుఢ్యం, గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు. ఆ సందర్భంలో శంకర్ ఎవర్తోనో -పురోహితులకు, దేశహితులకు అంటే మా డిఫెన్స్ వాళ్ళకి పెళ్లిళ్లు అంత తేలికగా అవవు! - అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది.

****************


స్కూలు రోజుల నుండి మాధవ ఆలోచనలు వర్తమానం లోకి వచ్చాయి.

తాను కట్టేవి ఖరీదైన బట్టలు, వాటి విలువ డబ్బుతోనే చూస్తారు, డబ్బున్న ప్రతివారు కొని వేసుకొనగలరు.

శంకర్ స్వామి వేసే యూనిఫాం ఖరీదైనది కాకపోయినా, హోదాని ఇచ్చేది. అది వేసుకోవాలి అంటే అర్హత వుండాలి.

నా బట్టలు నా శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాయి. శంకర్ స్వామి దుస్తులు వ్యక్తికి గౌరవాన్ని ఇస్తున్నాయి.

జాతీయ పతాకం కప్పబడిన ఆ శరీరం అర్హత ఏంటి? ఇంత సంపద వున్న నాకు ఆ అర్హత ఎందుకు లేదు? 

స్వామి దేశం కోసం శ్రమించాడు, నేను నా కోసం నా కుటుంబం కోసం శ్రమించాను.

నాది స్వార్థం. తనది త్యాగం!

నాకేమైనా అయితే నా కుటుంబానికి మాత్రమే నష్టం. తను లేని లోటు దేశానికి నష్టం.

తనకు చావు, వయసు అయిపోయో, అనారోగ్యం తోనో రావచ్చు. స్వామికి ఒక బాధ్యతా నిర్వహణలో వచ్చింది!


నా చావు వల్ల ఎవ్వరికీ ఒరిగేది ఏమీ లేదు. కానీ అతనిది ఓ కర్తవ్య నిర్వహణ ప్రయోజనం కలిగినది!


నాకు కలిగేది చావు మాత్రమే, అతని వచ్చినది మరణం!  - అంటే అది వాళ్ళ అమ్మ చెప్పిన  "గొప్ప సావు"  నా? 


ప్రభుత్వ లాంఛనాల తో సాగుతున్న శంకర్ స్వామి పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరకి మాధవ కారు వచ్చింది. శంకర్ శరీరం మీద జాతీయ జండా కప్పబడి ఉంది. ఆ వాహనం అంతా పూలతో అలంకరించ బడింది. దానికి ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్ళు వాయిస్తున్న పాట - జర యాద్ కరో ఖుర్బానీ!  - వినవచ్చింది. 


పోలీస్ బ్యాండ్ కి ముందు కొంత మంది కాలేజ్ యువతి యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లుగా నడుస్తున్నారు అతని ఫోటో పోస్టర్లను ఎత్తి పట్టుకొని.


ఒకే తరగతి గదిలో చదువుకున్న మేమిద్దరం ఒకే చోట ప్రక్క ప్రక్కనే ఒకరు నిర్జీవంగా, ఒకరు జీవించి.  అతను దేశం అంతర్గత భూభాగంలో నాలాంటి ఎంతో మంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువును కౌగిలించుకున్నాడు. ఆ శంకరుడు గరళాన్ని తీసుకున్నాడు, ఈ శంకరుడు బుల్లెట్లు తీసుకున్నాడు మామీదకు రాకుండా! దేశ ప్రజలకు రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే! చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంతగా ప్రేరితుడు అయ్యాడు శంకర్ స్వామి!?


మాధవ మనసు వ్యక్తం చెయ్యలేని వ్యాకులతతో బరువెక్కింది. అతని కళ్ళు తడి బారినయ్. గద్గద స్వరంతో "కారు అపు.." అన్నాడు డ్రైవర్ తో. 

ఆపిన కారులో నుండి దిగి, "నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను" అని చెప్పి, రోడ్డు మధ్యన వున్న విభాగినిని దాటి వెళ్లి శంకర్ స్వామి పార్థివ శరీరాన్ని మోస్తున్న వాహనం ప్రక్కనే నడుస్తూ, దానికి తగిలించి వున్న శంకర్ ఫోటో ప్లాకార్డ్ చేతపట్టుకొని 

"శంకర్ స్వామీ… అమర్ రహే " అన్న నినాదంతో గొంతు కలుపుతూ నడుస్తుంటే, మాధవ మనసు తేలిక పడ సాగింది.✍️


#నా స్పందన: 

కొన్ని కథలు సరదాగా నవ్విస్తాయ్!

మరికొన్ని కథలు ప్రశాంతతను కలిగిస్తాయ్!

ఇంకొన్ని కథలు ...

మనకి కన్నీరు తెప్పించి పశ్చాత్తాపం కలిగిస్తాయ్!


జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుందీ కథ ... 


సారీ, కాదుకాదు, కథ కాని సంఘటన!


"మా ఇద్దరి మధ్యా ఉన్న తేడాకి  ... 

ఖచ్చితంగా కారకులు మా తల్లులే!

మా మా కుటుంబ సభ్యులే!" అని ...

మాధవ అనుకుని ఉండాలి, మనసులో!


ఓ తల్లీ ... నీకు శతకోటి వందనాలు!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

4, జనవరి 2023, బుధవారం

అసలు మనది కాదు.. ఆఖరూ కాదు

 అసలు మనది కాదు..


ఆఖరూ కాదు


తెలుగులో ఒద్దికగా ఒదిగిపోయిన పరభాషా పదాలెన్నో...


భారతీయ భాషల్లో తెలుగుకు విశిష్ట స్థానం ఉంది. ఇది ద్రావిడం నుంచే వచ్చినా.. ఉత్తర భారతీయ భాషల కంటే విశేషంగా సంస్కృత భాషా ప్రభావం కలిగి ఉంది. పరభాషల నుంచి వందల కొద్దీ పదాలను స్వీకరించి తన పద సంపదను సుస్థిరం చేసుకుంది. తెలుగుకు హిందీ, ఉర్దూలతో సన్నిహిత సంబంధా లున్నాయి. నేడు మనం తెలుగు కింద వాడుతున్న అనేక పదాలు హిందీ, హిందూస్థానీ భాషల నుంచి వచ్చి చేరినవి. 'అసలు' మనది కాదు, 'ఆఖరూ' తెలుగు పదం కాదు. ఇలా తెలుగులో ఒద్దికగా ఒదిగిపోయి.. తెలుగు భాషగా వ్యవహారంలోకి వచ్చిన, మనం నిత్యం వాడుతున్న పరభాషా పదాలను 1934లోనే దిగవల్లి వేంకట శివరావు తన పారిభాషిక నిఘంటువులో ఏర్చి కూర్చారు.


ఖరీదు


ముల్కీ


ఖర్చు


యము తకరా


బులాసా తగాదా


అసలు


ఖరు


ఆర్టీ


తనవా




తనిఖీ


ఆటకా


తయారు


గుమా


గులామ్


UL


మజూరి


మరమ్మతు


తరం


अ ) ८८ अ,


తరహా


గైరుహా


తలారి


తహసీలు.


ర కీ


చట్టము


శ్రీ


సామి.


ఈనాము.


చలామణి


తాను


తారీఖు తుపాకీ


మునసబు


మూజు


చిల్లర


ముస్తాబు


తుఫాను


తెలుగు


యించు


మోతాదు


ఎకాఎకీ


కంగా


చేరి


Bot


కట్ట కత్తి


తూ


జనాభా


దగుల్బాజీ


ದಕ್


బిల్టీ జమాఖర్చు


నకలు


దరఖాస్తు


దరవా


ఖరారు


నగదు


దర్గా


నగరా


జవాబు


నమోదు



నమూనా


జాబితా


నవారు


దరిమిలా


జామీను


రంగు


నాజూకు


జాగీరు


నిఘా


మజిలీ


మామూలు



మినహా


యిం


ముక్తసర


రద్దు


సహారా


పాయకానా


రవాణా


బందు


రహదారి


దూక


తూరి


సిఫాయి


సిబ్బంది.


సిరా


రుజువు


నౌక


బకాయి


రుసుము


పంకా దస్తరము దస్తావేజు. పంపు


పురు


రోజు.


బట్వాడా


బడాయి


పురసత్తు


రైతు


పోరంబోకు


కిరాణా


సు


కిరాయి


బత్తా



బలాదూర


ఫకీరు


లంగరు


పాయిదా


లాలూచి


జుల్మా


బాతాఖాని


పక్కా


లావాదేవి.


దాఖలు


బురకా


యించు


జాస్తి


పరగణా


సిఫారసు


ఫిర్కా


బురుజు


దినుసు


సోబతి


కిస్తీ


| టపా


పరవా


వకీలు


బంగళా


సుబా


భరత


మా


సామాను



శివారు


సాలు


వజీరు


సు


సుమారు


హద్దు


కుమ్మక్


బంజరు


వాసు


స్వారీ


పరాయి


వస్తాడు.


హుండీ


షరతు


షుమారు


సబబు


సర్దారు


మంజూరు


హాజరు



సరిహద్దు


బందరు


సర్కారు


పరారి


సలహా


దివాణము


సంజాయిషీ


|


సవాలు


కాలు



కొ


హుషారు


కుళాయి


హోదా


A

ఈ నిమ్మకాయలు తీసుకో

 ఈ నిమ్మకాయలు తీసుకో


‘నడిచే దైవం’ పరమాచార్య స్వామివారి దర్శనంకోసం ఒక ముసలావిడ వరుసలో నిలబడి ఉంది. ఆమె తెల్ల చీర కట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు ధరించింది. నుదుటన విభూతి రేఖలు పెట్టుకుని తన వంతు రాగానే అత్యంత భక్తి వినమ్రతతో మహాస్వామి వారికి నమస్కరించింది. 


స్వామివారు ఆవిడని చూసిన తరువాత అక్కడ ఉన్న పరిచారకుడిని పిలిచి వెంటనే మఠం వంటగదిలోకి వెళ్ళి వంద నిమ్మకాయలు తీసుకుని రా అని చెప్పగా అతను వెళ్ళి తీసుకుని వచ్చాడు. 


“వీటిని ఆ ముసలావిడకు ఇవ్వు” అని ఆదేశించారు స్వామివారు. 


ఆమెకు అంతా అయోమయంగా ఉంది. మామూలుగా స్వామివారు ప్రసాదం ఇవ్వదలచుకుంటే ఒకటి లేదా రెండు నిమ్మకాయలు ఇస్తారు. ఇలా వంద నిమ్మకాయలను ఇవ్వరు. ఆమె స్వామివారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. 


”క్షుద్ర శక్తులను ప్రవేశపెట్టడానికని బజారులో నిమ్మకాయలు కొనడానికి చాలా ఖర్చు పెడుతున్నావు. అలా ఆభిచారిక ప్రయోగాలు చేసి ఎంతోమంది అమాయకులని కష్టాలకు గురి చేసి డబ్బు సంపాదిస్తున్నావు. అందుకే ఈ నిమ్మకాయలను తీసుకో. ఇవి నీ పిశాచ పనులకు పనికివస్తాయి” అని కొంచం ధృడమైన స్వరంతో అన్నారు స్వామివారు. 


ఆ ముసలావిడ చాలా కలవరపడుతోంది. తను రహస్యంగా చేసే పనులు స్వామివారికి ఎలా తెలిసాయో అర్థం కాక, చేసిన తప్పుకు పశ్చాతాప్పడుతూ కళ్ళ నీరు పెట్టుకుంటోంది. స్వామివారి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది. తను ఈ ఇక ఈ ప్రయోగాలు చెయ్యనని కర్తవ్యం సెలవివమని వేడుకుంది. 


”ఒక గోవు చెవిలో ఈ మంత్రములన్నిటిని చెప్పి ఇక వాటిని శాశ్వతంగా మరచిపో. మళ్ళా జీవితంలో ఎప్పుడూ ఈ చేతబడి ప్రయోగాలు చెయ్యలని అనుకోవద్దు. ఇది ధన సంపాదనకు ఒక మార్గంగా భావించకు. మిగిలిన జీవితం భగవన్నామాన్ని జపిస్తూ గడుపు. అది చాలు నిన్ను ఉద్ధరిస్తుంది” అని ఆదేశించారు. ఆమెని ఆశీర్వదించి విభూతి ప్రసాదం ఇచ్చి పంపించారు. 


“ఇకనుండి నేను ఇటువంటి పనులు చెయ్యను. నా జీవితాన్ని మార్చుకుంటాను” అని జీవిత పర్యంతం నిరంతరం రామ నామాన్ని జపిస్తూ గడిపింది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం