25, జులై 2023, మంగళవారం

హిందూ ధర్మం జ్ఞానం

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*


*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం

మహాభారతంలో ఒక కధ

 ॐ            సైన్స్ : తద్దినం ఎందుకు ? 

     (తప్పక చదవవలసిన సేకరణ వ్యాసం) 


    మహాభారతంలో ఒక కధ ఉంది... 

    కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

    ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. 

    అదేంటి? అని అడిగాడు రాజు. నీకు తెలియదా? భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. 

    నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 మహాయుగాలు (చతుర్యుగాలు) గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

    దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. 

    అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తోంది. అక్కడ మహావిష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


    ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

    ఆ చిత్రం పేరు "Interstellar". ఈ చిత్రం 2014 లో వచ్చింది. 

    ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 

    ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి, గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

    తన కూతురు గదిలో ధూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. 

    అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా, అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

    అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని, కొంతమంది బృందాన్ని తయారు చేసి, ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  

    వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే, ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. 

    అప్పటికి ఆ హీరో కూతురు వయస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). 

    ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. 

    అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం. అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట! అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట.  

    అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

    ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

    ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కానీ హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


    పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం" (Time dilation), "కృష్ణ బిలం" (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


    అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


    ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. 

    మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కానీ, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి? అని అనుమానం వస్తుంది.  నాక్కూడా వచ్చింది.


    పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట.    

    అలాగే ఆది శంకరాచార్యుల వారు బదరీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. 

    అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


    మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. ఎందుకో తెలుసా? 

    చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. 

    ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  

    ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం. ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. 

    ఇలానే ఎన్నో లోకాలూ, ఎన్నో డైమెన్షన్లూ ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


    ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా 

   *మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు*.


     కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  

    *కనీసం చదువుకున్న వాళ్లకు* అర్థం అవుతుంది.


నా జతపరపుమాట 


    దశరథుడు తన అంత్యక్రియలు జరిగిన 14 సంవత్సరాలకి, 

    అదే దేహంతో స్వర్గంనుండీ, విమానంలో వచ్చి, 

    రాముణ్ణి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొనడం, సీతారామలక్ష్మణులతో మాట్లాడడం కూడా కట్టుకథ కాదు. (యుద్ధకాండ 122వ సర్గ)


|| ఓం నమః శివాయ ||

మంచి మాట..లు

 

💐🌹🍇🥭

*మంగళవారం :25-07-2023*

ఈ రోజు ** మంచి మాట..లు 

        మనకు *ఇష్టం* ఉన్న చోట *కష్టం* ఉంటుంది *కష్టం* ఉన్న చోట *బాధ* ఉంటుంది *కష్టం బాధ*  ను అర్థం చేసుకున్న చోట *ప్రేమ* ఉంటుంది వీటన్నీటిని అర్థం చేసుకునే *మంచి మనసుంటే* జీవితం *అద్భుతంగా* ఉంటుంది .


       నీకు *కావాలి* అనుకున్నప్పుడు *ఏది నీ* దగ్గరకురాదు , *నీ సొంతం* అనుకున్నది ఎప్పటికి నిన్ను *విడిచిపెట్టి పోదు* , నీకు రావాలని , నీకే చెందాలని *రాసిపెట్టి* ఉంటే రాకుండా ఆగదు  . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ *తలరాతలో* నీ *కర్మ* లో భాగమే,, అంతా నీ *మంచికే నేస్తమా* .


    మనలో మనం *గొడవ* పడినంత మాత్రాన *విడి పోయేంత* బలహీనమైంది కాదు *బంధం*,అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత *గట్టిగా* అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , *ప్రేమించిన* వారికే తెలుస్తుంది *ఆ ప్రేమ* విలువ . లేనిపోని *అనుమానాలు* లేనిపోని *ఆవేశాలతో* మీ బంధం,, బంధుత్వాన్ని  *వదులు కోకండి* .


     మనం *ఎడుస్తూ* కూర్చుంటే మనలో *కన్నీళ్ళు* కరిగిపోతాయి . *కాలం* కదిలి పోతుంది *కష్టం* మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని *గుండెలో* దాచిపెట్టు *గెలుపు* కోసం *పరిగెత్తు* , అలుపు లేకుండా *ప్రయత్నించు* నీ ఏడుపుకి కారణం *ఐన వాళ్ళే* నీ గెలుపునీ *చూసి* తలదించుకోవాలి . *నీ జీవితం నువ్వే నిర్ణయించుకో* .


         *రాయి* లాగా కూర్చోకు భూమికి భారం అయ్యేలా, *గడియారం* లాగా పని చేస్తూండండి, *విజయం* ఏదోనాడూ తప్పక నిన్ను *వరించకమానదు*.. నేటి ఆధునిక సమాజంలో *జీవించాలంటే*  పరిగెత్తాలి.. కుదరకపోతే నడవాలి.. అది కుదరకపోతే.. పాకుతూ అయినా పోవలిసిందే.. మంచం *అసహ్యించుకునేలా* *పరుండితే* బతకడం కష్టం

శ్రీరాముడు అరణ్యవాసంలో

 శ్రీరాముడు అరణ్యవాసంలో 108 గుండాలు తవ్విన ప్రాతం ....


అరణ్యవాసంలోభాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి గోదావరి తీరం వెంట వస్తూ అలసిపోయి ఈ గుట్ట ప్రాంతంలో సేదదీరాడు. ఈప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజుల పాటు నివాసముండి, నీటి కోసం 108 గుంటలు తవ్వాడు. ఈ గుంటలే నేటి గుండాలు! అలా వీటికి రాముడి గుండాలు అనే పేరొచ్చింది. దీని ఆధారంగానే సింగరేణి బొగ్గుగనులు విస్తరించిన ఈ ప్రాంతానికి రామగుండం అనే పేరొచ్చిందని చెబుతారు.కొండపై సుమారు 30ఎకరాల విస్తీర్ణంగల చదునైన ప్రదేశం ఉంది.


కరీంనగర్‌జిల్లాలోని రామగుండంలో ఉన్న ఈ రాముడి గుండాలు ప్రకృతి రమణీయప్రదేశం. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లే దారిలో రామగుండం బీ పవర్‌హౌజ్ గడ్డ వద్ద (తహశీల్ కార్యాలయం) దిగి, ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్‌వరకు) సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి ఈగుతూ కిందకు దూకుతుంది. గుట్టపై గల బండ కొన్నిచోట్ల మెత్తటి శిలాపదార్థంతో ఉండడం వల్లే ఈ గుండాలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం(గుండం)లోంచి బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 108 గుండాలను జీడిగుండం, పాలగుండం, నేతి గుండం, అమతగుండం, మోక్షగుండం, కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం, యమగుండం.. అనే పేర్లతో పిలుస్తారు. సంరక్షణ లేక కొన్ని గుండాలు దెబ్బతిన్నా మిగిలినవి మాత్రం కనువిందు చేస్తాయి. ఇంకా రాముని పాదాలు, శంఖు చక్రం, శ్రీరామచంద్రమూర్తి, గాయత్రి, భైరవస్వామి, శ్రీ సంతోషిమాత, వేంకటేశ్వర ఆలయాలు, బోగందాని మఠం, మునులు తపస్సు చేసినట్లుగా భావించే లోయలు ఇక్కడి దర్శనీయ స్థలాలు. గుట్టపై నుంచి చూస్తే గోదావరినది, పంటపొలాలు, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల దశ్యాలు కట్టిపడేస్తాయి. జైశ్రీరామ్🚩

Copied post....

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-3🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-3🪔*


 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *బ్రహ్మలోకమున భృగువు* 


అది సత్యలోకము, అది మహాసభ, అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారయి వెలుగొందుచుండిరి. 


మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మున్నగువారుండిరి, మరియొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులయియున్నారు. 


వారికందఱకు సృష్టి విజ్ఞాన సంపన్నుడయిన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములయిన రహస్యముల నెన్నింటినో బోధించుచుండెను. 


ఆ సమయమునకు భృగమహర్షి అచ్చటకు వచ్చెను. చరచరా సభను ప్రవేశించినాడు. సభాసదుల నొక్కసారిగా కలయజూచెను. 


బ్రహ్మకాని మరెవ్వరుకానితనను కూర్చును’డని అడుగకయే తనంతట తానుగా నా సభలో గల నొక ఆసనము పై గర్వముగా కూర్చునినాడు.


 సభాసదులకు భృగుమహాఋషి వచ్చుట వలన కలిగిన ఆనందముకన్న ఆయన ఆ విధముగా కూర్చోనుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగానుండెను.


బ్రహ్మకు భృగుమహర్షి ప్రవర్తన అవమానకరము, సభాసంప్రదాయములను పాటించి పెద్దవాడయిన తనకు నమస్కరించకమునుపై భృగువు ఆసీనుడగుట కోపము వచ్చి యిట్లనెను.


 భృగూ! ఏమిటి నీ యీ వింత ప్రవర్తన, నీ ఇచ్చవచ్చినట్టున్నూ, నీకు నచ్చినట్లున్నూ సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా! యీ సభలో మునిగణము కన్న మిన్నయని నీవు నీవు భావించుచుంటివా! 


వీరిలో నీవ వెవరకన్న గొప్పవాడవు? త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ యత్రిమహామునికంటే అధికుడవా?


ఇంద్రునే శపించిన యీ గౌతమమహర్షి కంటె గొప్పవాడవా? 


చూడు, నివురుగప్పిన నిప్పువలె ఆ యాసనము పై జమదగ్ని ఎట్లు వినయముగా కూర్చొనియున్నాడో? 

శక్తిసంపన్నుడైన ఆ జమదగ్ని కన్న నీవు ఊడబొడిచినదేమున్నది? 


సభాకార్యములందెట్లు మెలగవలెనో తెలియని తెలివితక్కువ వాడవని నిన్ను నేనిదివరకొనుకొనలేదు’’ అని బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చివాట్లూ పెట్టినాడు. 


భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా! 


సత్త్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగనే కనిపించునుగదా! 


నమస్కారము చేయనంతమాత్రమునకే వుగ్రుడైన బ్రహ్మ. సత్త్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగనే సభను వీడి వెడలిపోయెను. 


సభాసదులు మరింతగ ఆశ్చర్యపడిరి.


 *నందనందన గోవిందా, నవనీత* *చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా,* *పాపవిమోచన గోవిందా;* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. ||* 

||


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.

 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 125*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 125*


🔴 *రాజనీతి సూత్రాణి - తృతీయ అధ్యాయం* : 


📕 *సర్వసాధారణ నీతులు* : 📕


1. బాలాదపి యుక్తమర్థం శృణుయాత్ 

(బాలుడు చెప్పినా మంచి విషయం వినాలి.) 


2. నత్యమప్యశ్రద్దేయం న వదేత్ 

(నిజమే అయినా వినేవాళ్ళు నమ్మరనే సందేహం ఉన్నప్పుడు అది వాళ్ళకి చెప్పకపోవడమే మంచిది.) 


3. నాల్పదోషాద్భహుగుణా స్త్యజ్యంతే 

(చాలా మంచి గుణాలు ఉన్నవాళ్ళని ఒక చిన్న దోషం ఉన్నంత మాత్రాన విడిచి పెట్టకూడదు.) 


4. విపశ్చిత్స్వపి సులభా దోషాః 

(మహాపండితులలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు.) 


5. నాస్తి రత్న మఖనింతమ్ 

(ఖండించని రత్నం ఉండదు. ఎంతటి వాళ్ళకైనా కొన్ని కష్టాలు తప్పవు.) 


6. మర్యాదాతీతం న కాచిదపి విశ్వసేత్ 

(అవధులు దాటిన విషయం ఎన్నడూ నమ్మకూడదు. మర్యాద లేనివాడిని ఎన్నడూ నమ్మకూడదు.) 


7.  అప్రియే కృతం ప్రియమపి ద్వేష్యం భవతి (అప్రియుడికి ఏదైనా ప్రియమైనది చేసినా దాన్ని అతడు ద్వేషిస్తాడు.) 


8. నమన్యపి తులాకోటిః కూపోదకక్షయంకరోతి (ఘటీయంత్రానికీ (బావిలోనుంచి నీళ్ళు తోడడానికి కుండలు కట్టిన చక్రానికి) సంబంధించిన చివరి భాగం వంగుతున్నా నూతిలోని నీళ్ళన్నీ తోడేస్తుంది.) 


9. సతాం మతం నాతిక్రామేత్ 

(సత్పురుషుల అభిప్రాయం కాదనకూడదు.) 


10. గుణవదాశ్రయాన్నిర్గుణోపి గుణీ భవతి (గుణవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల గుణవిహీనుడు కూడా గుణవంతుడు అవుతాడు.) 


11. క్షీరాశ్రితం జలం క్షీరమేవ భవతి 

(పాలను ఆశ్రయించిన నీరు పాలే అవుతుంది.) 


12. మృత్పినే పి పాటలిపుష్పం స్వగంధముత్పాదాయతి 

(పాటలిపుష్పం మట్టిముద్దలోనికి కూడా తన సువాసనను సంక్రమింపచేస్తుంది.) 


13. రజత కనకసంగావత్ కనకం భవతి 

(బంగారంతో కలిసిన వెండి కూడా బంగారం అవుతుంది.) 


14. ఉపకర్తర్యపకర్తు మిచ్చత్యబుథః 

(తెలివి తక్కువవాడు ఉపకారం చేసినవాడికి కూడా అపకారం చెయ్యాలని అనుకొంటాడు.) 


15. న పాపకర్మణా మాకృశభయమ్ 

(పాపం చేసేవాళ్ళకి ఇతరులు తిడతారనే భయం ఉండదు.) 


16. ఉత్సాహవతం శత్రవో పి వశీభవంతి (ఉత్సాహవంతులకి శత్రువులు కూడా వశం అవుతారు.) 


17. విక్రమధనా హి రాజానః 

(రాజులకి పరాక్రమమే ధనం.) 


18. నాస్త్యలసస్య ఐహికమాముష్మికం వా 

(సోమరికి ఐహికమూ లేదు, పారలౌకికమూ లేదు.) 


19. నిరుత్సాహాదైవం పతతి 

(నిరుత్సాహపడితే దైవం కూడా వ్యతిరేకిస్తుంది.) 


20. మత్సార్థీన జాలముపయాజ్వార్థం 

(చేపలు పట్టేవాని వలె వలపన్ని ధనం సంపాదించాలి.) 


21. అవిశ్వస్తేషు విశ్వాసో న కర్తవ్య 

(తన మీద నమ్మకం లేనివాళ్ళని నమ్మకూడదు.) 


22. విషం విషమేవ సర్వకాలమ్ 

(విషం ఏనాటికీ విషమే.) 


23. అర్ధసమాదానే వైరిణాం సంగ ఏవ న కర్తవ్య (ధనం సేకరించేటప్పుడు శత్రువులతో సంబంధమే పెట్టుకోకూడదు.) 


24. అర్థసిద్దౌ వైరిణం న విశ్వసేత్ 

(కార్యసిద్ధి విషయంలో శత్రువును నమ్మకూడదు.) 


25. అర్ధాధీన ఏవ నియతసంబంద 

(ఇద్దరి మధ్య ఒక నిశ్చితమైన సంబంధం ఉన్నదంటే అది ఏదో ఒక ప్రయోజనం యొక్క మూలంగా ఏర్పడుతుంది.) 


26. శత్రోరపి సుతః సఖా రక్షిఇతవ్య 

(శత్రువు కుమారుడైన స్నేహితుడైతే వాడ్ని రక్షించాలి.) 


27. యావచ్చత్రో శ్చిద్రం పశ్యతి తావద్దస్తేన వా స్కందేన వా సంవాహ్యచిద్రేతు ప్రహరేత్ 

(శత్రువులో ఉన్న లోపం కనబడేవరకు వాడ్ని చేతులమీద కాని, భుజాలమీద కాని మోయ్యాలి. లోపం కనబడగానే వాడిమీద దెబ్బతీయాలి.) 


28. ఆత్మచ్చిద్రం న ప్రకాశయేత్ 

(తన లోపాలను బయట పడనీయకూడదు.) 


29. చిత్ర ప్రహారిణ శత్రవో పి 

(శత్రువులు కూడా ఏవో లోపాలు కనబడినప్పుడే దెబ్బతీస్తారు.) 


30. హస్తగతమపి శత్రుం న విశ్వసేత్ 

(చేతికి చిక్కినా శత్రువును నమ్మకూడదు.) 


31. స్వజనస్య దుర్వంత్తిం వారయేత్ 

(తన వాళ్ళలో ఉన్న చెడ్డ నడవడికను నివారించాలి.) 


32. స్వజనావమానో పి మనస్వినాం దుఃఖమావహతి 

(తనవాళ్ళకి అవమానం జరిగినా ఆత్మాభిమానవంతులు బాధపడతారు.) 


33. ఏకాంగదోష పురుషమపసాదయతి 

(ఒక్క అవయవ దోషం కూడా మనిషిని కృంగదీస్తుంది.) 


34. శత్రుం జయతి సువృత్తతా 

(సచ్చరిత్ర శత్రువును జయిస్తుంది - శత్రువుల నుండి కూడా మెప్పును తెస్తుంది.) 


35. నికృతిప్రియా నీచాః 

(అపకారం చేయడమే నీచులకు ఇష్టం.) 


36. నీచస్య మతిర్న దాతవ్యా 

(నీచుడికి సలహాలు ఇవ్వకూడదు.) 


37. నీచేషు విశ్వాషో న కర్తవ్య 

(నీచుల్ని నమ్మకూడదు.) 


38. సుపూజితో పి దుర్జనః పీడయత్యేవ 

(దుర్జనుడ్ని ఎంత గౌరవించినా పీడించడం మానడు.) 


39. చందనాదీనపి దావో గ్నిర్ధహత్యేవ 

(దావాగ్ని చందనవృక్షాదులను కూడా కాల్చి తీరుతుంది.) 


40. కదాపి కమిపి పురుషం న బాధేత 

(ఎప్పుడూ, ఎవర్నీ అవమానించకూడదు.) 


41. క్షంతవ్యమితి పురుషం న బాధేత 

(క్షమించడమే యుక్తం; అందుచేత ఎవర్నీ బాధించకూడదు.) 


42. భర్తధికం రహస్యుక్తం వక్తుమిచ్చన్యంతబుద్దయః (తెలివితక్కువవాళ్ళు ప్రభువు రహస్యంగా చెప్పిన విషయాన్ని అదీ ఇదీ కలిపి నలుగురికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు.) 


43. అనురాగస్తు ఫలేన సూచ్యతే 

(ఎంత అనురాగం ఉందో ఫలాన్ని పట్టి తెలుస్తుంది.)


44. ఆజ్ఞాఫలమైశ్వర్మమ్ 

(ఐశ్వర్యం ఉన్నందుకు ప్రయోజనం అధికారం చెలాయించడం.) 


45. దాతవ్యమపి బాలిశః పరిక్లేశేన దాస్యతి (మూర్ఖుడు ఇవ్వవలసినది కూడా ఎంతో కష్టం మీద ఇస్తాడు.) 


46. మహదైశ్వర్యం ప్రాప్యాపి అధృతిమాన్ వినశ్యతి (ధైర్యం లేనివాడు, చిత్తస్థైర్యం లేనివాడు గొప్ప ఐశ్వర్యం లభించినా కూడా నశిస్తాడు.) 


47. నాస్త్యధృతే రైహికమాముష్మికం వా 

(చిత్తస్ధైర్యం లేనివానికి ఐహికమూ లేదు, ఆముష్మికమూ లేదు.) 


48. న దుర్జనైః సహ సంసర్గ కర్తవ్య 

(దుర్జనుల సహవాసం చెయ్యకూడదు.) 


49. శౌండహస్తగతం పయో ప్యవమన్యతే జనః 

(కల్లు అమ్మేవాడి చేతిలో ఉన్న పాలను కూడా మనుష్యులు నిరాకరిస్తారు.) 


50. కార్యసంకటేష్వర్ధవ్యవసయినీ బుద్దిః 

(పనులలో కష్టాలు ఏర్పడినప్పుడు విషయార్ధారణ చేయగలిగిందే బుద్ధి.) 


51. మితభోజనమ్ స్వాస్థ్యమ్ 

(మితంగా భుజించడమే ఆరోగ్యం.) 


52. పథ్యమప్యపథ్యాజీర్నే నాశ్నీయత్ 

(హితమైన పదార్థాన్ని అజీర్ణంగా ఉన్నప్పుడు తినకూడదు.) 


53. జీర్ణభోజినం వ్యాధిర్నోపర్పతి 

(తిన్నది జీర్ణమైన తర్వాతనే మళ్ళీ భుజించేవాడి దగ్గరికి రోగాలు రావు.) 


54. జీర్ణశరీర వర్ధమానం వ్యాధిం నోపేక్షేత 

(శరీరంలో జీర్ణమైన తర్వాత వార్ధక్యంలో వచ్చిన వ్యాధిని ఉపేక్ష చేయకూడదు.) 


55. అజీర్నే భోజనం దుఃఖమ్ 

(అజీర్ణంగా ఉన్నప్పుడు భోజనం చేయడం దుఃఖహేతువు.) 


56. శత్రోరపి విశిష్యతే వ్యాధి 

(శత్రువుని మించినది వ్యాధి.) 


57. దానం నిధానమనుగామి 

(దానం అనేది కూడా వచ్చే నిధి.) 


58. పటుతరే పి తృష్ణాపరే సులభమతిసంధానమ్ (ఎంత తెలివైనవాడైనా దురాశ కలవాడ్ని మోసగించడం సులభం.) 


59. తృష్ణయా మతిశ్చాద్యతే 

(దురాశ ఆలోచనాశక్తిని కప్పివేస్తుంది.) 


60. కార్యబహుత్వే బహుఫలమాయతికం కుర్యాత్ (చాలా కార్యాలున్నప్పుడు ఎక్కువ ఫలాన్ని ఇచ్చేపనీ, భవిష్యత్తులో లాభకరమైన పనీ చెయ్యాలి.) 


61. స్వయమేవాస్కన్నం కార్యం నిరీక్షేత (చెడిపోయిన పనిని తానే చక్కదిద్దుకోవాలి. లేదా తానే పని చెడిపోకుండా చక్కదిద్దుకోవాలి.) 


62. మూర్ఖేసు సాహసం నియతమ్ 

(మూర్ఖులలో సాహసం తప్పకుండా ఉంటుంది.) 


63. ముర్ఖేసు వివాదో న కర్తవ్య 

(మూర్ఖులతో వాగ్వాదం పెట్టుకోకూడదు.)


64. మూర్ఖేషు మూర్ఖవదేవ కథయేత్ 

(మూర్ఖులతో మూర్ఖుడులాగే మాట్లాడాలి.) 


65. ఆయసైరాయసం భేధ్యమ్ 

(ఇనుపదానిని ఇనుపదానితోనే చేదించాలి.) 


66. నాస్త్యధీమతః సఖా 

(తెలివితక్కువవాడికి స్నేహితుడు ఉండడు.) 

(ఇంకా ఉంది)...🙏


సేకరణ:-  మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మంగళవారం, జూలై 25, 2023* రాశి ఫలాలు

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*మంగళవారం, జూలై 25, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *సప్తమి ఉ10.03* వరకు 

.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సమాజంలో  ప్రముఖ వ్యక్తులతో  విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి  వ్యాపారాలు లాభాలబాటలో  సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగస్తులకు  పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో  శుభకార్యాలలో పాల్గొంటారు.


*వృషభం*


బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు  అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంభందమైన  సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు  కార్యరూపం దాలుస్తాయి. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో   నూతన అవకాశాలు అందుకుంటారు. 


*మిధునం*


ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో  మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ  ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.


*కర్కాటకం*


ఇంటా బయట అదనపు  బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది.     మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన  ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి.   ఉద్యోగస్తులకు  ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.


*సింహం*


కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.  అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.   ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.


*కన్య*


అవసరానికి మించిన  ఖర్చులు  పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ  ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత  నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.


*తుల*


ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి  సాధిస్తారు. ఇంటా బయట   మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృత్తి  ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


*వృశ్చికం*


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం  మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. నేత్ర   సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక  విషయంలో  లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన  ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా  సాగుతాయి.


*ధనస్సు*


సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై   ఊరట చెందుతారు. ఆలోచనలు  కార్యరూపం దాల్చుతాయి.   వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో  ఆశించిన పురోగతి సాధిస్తారు.


*మకరం*


ధనపరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది.  దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు  లాభసాటిగా సాగుతాయి. సమాజంలో  ప్రముఖుల నుండి   ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో  సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.


*కుంభం*


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన  మానసికంగా  చికాకు కలిగిస్తుంది. జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో తొందరపాటు  నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. 


*మీనం*


కుటుంబ వ్యవహారాలలో  అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.  నిరుద్యోగ  ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహనప్రయాణలో అప్రమత్తంగా  వ్యవహరించాలి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


సేకరణ:- మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

అమంగళకరమైన పనుల

 అమంగళకరమైన పనుల అస్సలు చేయకండి


1. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడము. 

2. నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం.

3. కాళ్లు దాటుకుంటూ నడవడం.  

4. ఎడమ చేతితో పిల్లలను కొట్టడం.

5. ఓడిలో కంచం పెట్టుకొని భోజనం చేయటం.

6. వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం.

7. అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం. 8. అదే పనిగా కాళ్ళు ఊపడం.

9. మంచం మీద కూర్చొని భోజనం చేయడం.

10. నిలబడి భోజనం చేయడం. 

11. స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం. 

ఈ పనులను అసులు చేయకూడది

పద్మనాభ స్వామి ఆలయం విముక్తి

 ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది...

రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు...

రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది... సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని  పొందారు...

 ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. 

ఈ సమాచారం ట్రావెన్కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన తల్లి గౌరీ లక్ష్మికి వివరించినప్పుడు, 

ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు..

ఇది ఆరంభం దేవాలయాల ప్రభుత్వ యాజమాన్యాన్ని వదిలించుకోవడానికి పోరాటం ఇంకా చాలా కాలం. హిందువులు ఐక్యత గురించి ఆలోచిస్తే, ఇదే పరిస్థితి, మీరు ఐక్యమయ్యే రోజు, భూమిని తిప్పగల సామర్థ్యం మీకు ఉంది, మీరు దేశంలోని అన్ని దేవాలయాలను విడిపించాలి. # జై సనాతన ధర్మం # భారత్ మాత కి జై 👏👏🙏

శుకమహర్షి జన్మ వృత్తాంతం

 *నిత్యాన్వేషణ:*


శుకమహర్షి జన్మ వృత్తాంతం ఏమిటి?


శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

*జన్మరహస్యము:*

ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది. అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను. కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు. పరమశివుడు మొదట నందిని, ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు. అక్కడినుండి పంచభూతములను, గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు. పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు. కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను విన్నది. ఈ విషయం పసిగట్టిన శివుడు ఆ చిలుక జన్మలో ఆ జ్ఞానం యొక్క విలువ అర్థం కాదని అందువలన ఆ చిలుక అప్పుడు మరణించి మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు. ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి. అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు. అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు. మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు. జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి. ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది. విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు. శుకుడు అతనివద్దకు బయలుదేరాడు. జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు. శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు. ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు. శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు. రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి. కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు. అప్పుడు జనకుడు శుకుడికి  అంచుల వరకు నూనెతో నిండిన ఒక పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు. కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు. అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు, నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు. కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు. శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.

ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు. ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు. అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను. నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. వేదవ్యాసుడు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి. అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు. కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు. వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు. వారి నవయవ్వనంలో ఉండి దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు. వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా! మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు. కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు "మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు, ఎలాంటి బంధాలు లేనివాడు. కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు. అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది. మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.

ఇదీ శుకమహర్షి చరిత్ర.

*శుకుడి విశేషాలు:*

1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షియే. 

2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు, నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు. వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.

3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షియే.

శ్రీనాధ కవితా వైభవం!

 శ్రీనాధ కవితా వైభవం!


            

             ఉ:  ఎక్కడ లేరె  వేల్పులు సమీప్సిత దాతలు,  ముద్దుకూన !  నీ


                   వెక్కడ ?  ఘోర వీర  తపమెక్కడ ? యీపటు  సాహసిక్యమున్


                   తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్    మధువ్రతం


                  బెక్కిన  నోర్చునో?  విహగ  మెక్కిన  నోర్చునొ ?  నిశ్చయింపుమా?


                    హరవిలాసం--  4: ఆ:   శ్రీనాధ మహాకవి!


                        ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు  దీర్చుటకు,   దేవత  లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ?  ఘోర మైన  యీకఠోర తపమెక్కడ?   ఈదుస్సాహసమును  వీడుము, దిరిసెనపూవుపై  తుమ్మెద వ్రాలిన  నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా!  యని దీనిభావము.


                    పార్వతి  పరమేశ్వరుని  భర్తగా బడయఁ గోరి  తపమాచరింపఁ  బోవుచు ,తండ్రి హిమవంతుని  యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని,  సుకుమారివి  నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున  వీడుమని  హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము. 


                "దిరిసెన పూవు  మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా  శంకరునితో  నీకు  పొందు అనుచితము. అనిసూచించెను.


                  పార్వతిని  శిరీషపుష్పముతో బోల్చి  యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును  కవి నిరూపించెను.


                             ఈరీతిని శ్రీనాధుని కవిత్వము  వ్యంగ్య  వైభవ  విలసితమై  యొప్పారును!


                                                  నిదర్శనాలంకారము.


                                                           స్వస్తి!🙏🙏🌷🌷👌

విన్నదేదో

 .   

                  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_*


                        _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝


*క్షత్రియో బాహువీర్యేణ*

*తరేదాపదమాత్మనః౹*

*ధనైర్వైశ్యశ్చ శూద్రశ్చ* 

*మంత్రైర్హోమైశ్చ వై ద్విజః౹౹*


తా𝕝𝕝 

క్షత్రియుడు తనకు ఆపద కలిగినప్పుడు బాహుబలంతో బయటపడాలి... ధనంతో వైశ్య శూద్రులు... *మంత్రాలు, హోమాలతో బ్రాహ్మణుడు* 

ఆపదల నుంచి ముక్తులు కావాలి.....

-----------------------------------------------------------


𝕝𝕝శ్లోకం𝕝𝕝


*_యచ్ఛ్రుతం న విరాగాయ*, 

*న ధర్మాయ, న శాంతయే_*

*_సుశబ్దమపి శబ్దేన* 

*కాకవాశితమేవ తత్....._*


తా𝕝𝕝

*విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటే* – అది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.....

ధనముల కన్నను


*కం*

ధనముల కన్నను భువిలో

మనసుల నవగతమునొందు మనుషుల నొందన్

ఘనముగ బతుకంగ దగును

మనుగడ సూక్ష్మంబిదియని మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనముల కన్నా మన మనస్సు ను అర్థం చేసుకునే మనుషుల ను సంపాదించగలిగితే గొప్పగా బతకగలమనే మనుగడ సూక్ష్మము ఇదే అని మరువవద్దు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

నడిచే దైవము గోవగు

నడిపించెడివాడు భువిని నారాయణుడౌ.

ఎడబాయని హితము శివుడు

కడవరకీ కరణి తలువ ఘనుడగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నడిచే దైవము ఆవు,నిన్ను నడిపించేవాడు నారాయణుడు, నిన్ను విడిచిపెట్టకుండా ఉండే శ్రేయోభిలాషి శివుడు అని చివరి వరకూ నమ్మినచో గొప్పవాడవగుదువు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మనసుకు బాధాకరంగా ఉండదు.

 *1795*

*కం*

మనసుకు నచ్చిన వారలు

మనసు కు గాయంబుజేయ మదినొచ్చదయా.

మనలకు నహితులు మనకిడు

ఘనసత్కారంబుగూడ కటువే సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసుకు నచ్చిన వారు మన మనసు ను గాయం చేసిన నూ మనసుకు బాధాకరంగా ఉండదు. మనకు నచ్చని వారు మనకు గొప్ప సత్కారాలు చేసిన నూ కటువుగా నే అనిపిస్తుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

3 D Art