19, సెప్టెంబర్ 2023, మంగళవారం

తొలిపూజ లొనరించ

 *సర్వ "సల"సీసము*

తొలిపూజ లొనరించ తులుచంగ కరుణించి

   గరికంబులను గూర్చ  వరము లొసగు

నవరాత్రి వ్రతమందు లవపూజ లొనరించ

   మదిమెచ్చి ఫలమిచ్చు మహిత గుణుని

జగమెల్ల భజియించు సతతమ్ము మతిభక్తి

    వికలమ్ములను త్రుంచి వెతల నణచ

గణనాథ గరిమంబు గణుతించ సరిలేరు

   సురలైన నరులైన సుధులునైన.

*ఆ.వె.*

ప్రమథ గణములైన  ప్రథమార్చనముజేయ

విఘ్నరాశులెల్ల నిఘ్నమొనరు

పరమ పూజ్యుడైన పరమేశు తనయుండు

వరము లొసగు జనుల భక్తి మెచ్చి.

*అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మనస్సుని నిగ్రహించటమ్


🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ಅಪ್ಸ್ಯಬ್ಧಿಪಾನಾನ್ಮಹತಃ*

*ಸುಮೇರೂನ್ಮೂಲನಾದಪಿ |*

*ಅಪಿ ವಹ್ನ್ಯಶನಾತ್ಸಾಧೋ*

*ವಿಷಮಶ್ಚಿತ್ತನಿಗ್ರಹಃ ||*

(ಯೋಗವಾಸಿಷ್ಠ-ಶ್ರೀರಾಮನ ಚಿಂತನೆ)


ಸಮುದ್ರಜಲವನ್ನಾದರೂ ಪಾನಮಾಡಬಹುದು, ಮೇರುಪರ್ವತವನ್ನು ಸಮೂಲವಾಗಿ ಕೀಳಬಹುದು, ಬೆಂಕಿಯನ್ನು ಭಕ್ಷಿಸಬಹುದು. ಆದರೆ ಈ ಚಿತ್ತವನ್ನು ನಿಗ್ರಹಿಸುವುದು ಮಾತ್ರ ಅದೆಲ್ಲಕ್ಕಿಂತಲೂ ಕಷ್ಟಕರ. 


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

 సముద్ర జలమును త్రాగవచ్చు. మేరు పర్వతమును పెకిలించవచ్చు నిప్పుని భక్షించ వచ్చు. కానీ మనస్సుని నిగ్రహించటమ్ వీటన్నికన్నా కష్టం.

ధర్మాచరణమును

 *1920*

*కం*

కొందరు ధనార్జనమ్మును

కొందరు ధర్మాచరణము కోరుదురిలలో.

కొందరు మాత్రము ధనముల

నొందును ధర్మాచరణకు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఈ లోకంలో కొందరు ధనములు సంపాదించడాన్ని, మరికొందరు ధర్మాచరణమును కోరుకుంటారు.కానీ కొందరు మాత్రం ధర్మాచరణము కోసం ధనములు సంపాదిస్తారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జ్ఞాన సింధు 🚩 " గాణాపత్యము "

 🚩   జ్ఞాన సింధు   🚩

         "  గాణాపత్యము "

   హిందూ శాస్త్రాలని అనుసరించి

.   భగవత్ ఆరాధన పద్ధతులు

    షణ్ముతములుగా ప్రసిద్ధి

    అంటే 6 రకాల శాస్త్రీయ

     ఆరాధన విధానాలని

      వేదం ప్రసాదించింది

   1) గాణాపత్యము - గణపతి

   ప్రధాన దేవతగా ఆరాధించడం

  2) సౌరవము - సూర్యుని ప్రధాన

   దేవతగా ఆరాధించడం 

  3) శైవం - శివుడు ప్రధాన

   దేవతగా ఆరాధించడం     

   4) శాక్తేయము - జగన్మాతని

   ప్రధాన దేవతగా ఆరాధించటం 

   5) వైష్ణవం - నారాయణుని

   ప్రధాన దేవతగా ఆరాధించడం 

   6) షణ్ముఖం  - ప్రధాన దేవతగా

   సుబ్రహ్మణ్యస్వామి ఆరాధించటం


     గాణాపత్య సంప్రదాయాలని  

     అనుసరించి మరియు

   భారతదేశానికి తలమానికమైన

   గణపతి క్షేత్రములైన 

     ' అష్ట గణపతుల '

      పుణ్యక్షేత్రములలో

     ఈ రోజు భౌమ చతుర్థి

    యోగములో 19-09-2023

    శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి

     వ్రతము జరుగుతుంది


   నేటి వరసిద్ధి వినాయక వ్రతము

    సంపూర్ణ సత్ఫలితాలను

    ఆశీస్సులు అందిస్తుంది

   👉🏼 ' జ్ఞాన సింధు  ' ప్రకటించిన

    విధముగా వ్రతము ఆచరించే 

    ఆధ్యాత్మిక సాధకులకు

   తక్షణం మీ సంకల్పములు

  శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి

   అనుగ్రహంతో నెరవేరుతూ

    అనుభవంలోకి  రాగలవు   

  

    

  🥀  నేడు వ్రతం ఆచరిస్తున్న

       ధార్మిక సాధకులకు వినాయక

     చవితి శుభాకాంక్షలు 🥀

  

  🙏  గం గణపతియే నమః 🙏


   📞 *96403 00507* 


🚩® *Gnaana Sindhu* ®🚩


🕉️🌹🌹🌹🌹🔯✡️🌻🌻🌻🌻🕉️

నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 1*



తన సంతానం - శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ పెద్దవాళ్లయ్యే కొద్దీ - ఛాయ సంజ్ఞ పిల్లలకు మానసికంగా బాగా దూరంగా జరిగింది. వైవస్వతుడినీ , యముడినీ , యమినీ చూడడానికే ఆమె ఇష్టపడడంలేదు.


ఛాయ తన బిడ్డలు ముగ్గుర్నీ రహస్యంగా సమావేశపరిచింది. *"వైవస్వతుడూ , యముడూ , యమి మంచి వాళ్ళు కారు. వాళ్ళకు మీరు దూరంగా ఉండాలి"* అంది. ముగ్గురూ ముఖాలు చూసుకొన్నారు.


*“అన్నలిద్దరూ మంచివాళ్ళమ్మా !”* సావర్ణి ఆశ్చర్యపోతూ అన్నాడు.


*“నాకు కూడా అలాగే అనిపిస్తుంది ! వైవస్వతుడు , యముడూ మాతో చక్కగా ఆడుకుంటారు !”* శనైశ్చరుడు ఛాయనే చూస్తూ అన్నాడు.


*“వాళ్ల మనసులు మీకు తెలీవు ! మీరు చిన్న పిల్లలు...”* ఛాయ చెప్పుకుపోతోంది. 


*"అక్క యమి చాలా మంచిదమ్మా ! నేను ఏది కావాలన్నా అడ్డు చెప్పకుండా ఇచ్చేస్తుంది తెలుసా !"* తపతి ఛాయ వైపే చూస్తూ అంది.


ఛాయ అసహనాన్ని దాచుకుంటూ నిట్టూర్చింది. *"మీకో నిజం తెలుసా ? మంచివాళ్ళకు సర్వమూ మంచిగానే , అందరూ మంచివాళ్ళగానే అనిపిస్తారు !”* 


*“అయితే మేం మంచి వాళ్ళమా అమ్మా ?"* శని ఆసక్తిగా అడిగాడు.


*“అందుకే గద నాయనా ! ఆ ముగ్గురూ మంచి వాళ్ళు కాకపోయినా మీకు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు !”* ఛాయ తెలివిగా అంది. *“వాళ్ళు ముగ్గురూ ఎంత చెడ్డ వాళ్ళంటే , మీ పరోక్షంలో మీ గురించి నాతో చెడుగా చెబుతూనే ఉంటారు. అయినా , నేను నమ్మనుగా ! మీరు చాలా మంచివాళ్ళనీ , చాలా బుద్ధిమంతులనీ , అమ్మ మాట జవదాటరనీ నాకు తెలుసుగా !"*


శనీ , సావర్జీ , తపతీ అనుమానంగా ఒకర్నొకరు చూసుకొన్నారు. ముందుగా శని పెదవి విప్పాడు.


*“అందుకేనేమో వాళ్ళను చూసినప్పుడల్లా ఎందుకో తెలియకుండానే నాకు కోపం వస్తూంటుంది. గుడ్లు ఉరిమి ఆగ్రహంగా చూడాలనిపిస్తుంది !"* 


ఛాయ శనిని ఆప్యాయంగా చూసింది. *"చూశారా ! ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి...".*


*"అంటే..."* తపతి అమాయకంగా అడిగింది. *"ఏం చేయాలి ?"*


*"మీరు ముగ్గరూ ఒక బృందంగా కలిసి ఉండాలి. ఆ ముగ్గురితో కలవకూడదు. అర్ధమైంది కదా ?"* ఛాయ అడిగింది.


*"మా బృందానికి నేను నాయకుడిని ! సరేనా , అమ్మా !"* శని ఉత్సాహంగా అడిగాడు.


*"ఔను ! మీలో పెద్దవాడివి నువ్వేగా , నాయనా ! అయితే ఒక ముఖ్యమైన విషయం. నేను మీతో చెప్పిందంతా వైవస్వతుడికీ , యముడికీ , యమికీ చెప్పకూడదు. అలాగే మీ తండ్రిగారికీ చెప్పకూడదు !"* ఛాయ గొంతు తగ్గించి అంది. 


*"నాన్నగారికి చెప్తే ఏం ?"* శని అనుమానం వ్యక్తం చేశాడు.


*“చెప్పకూడదు. అన్నాను కద !"* ఛాయ విసుగ్గా అంది. 


*"ఎందుకు ?"* శని మొండిగా అడిగాడు.


*"మీ నాన్నగారు నమ్మరు ! ఆయనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం !"* ఛాయ అంది. 


*"అలాగా...మాకు తెలీదమ్మా !”* సావర్ణి ఆశ్చర్యంగా అన్నాడు. 


*"అందుకే మీరెప్పుడూ అమ్మ మాటే వినాలి !"* అంది ఛాయ.


ఛాయ ప్రబోధం ఆమె పిల్లల్లో మార్పు తెచ్చింది. వాళ్ళు సంజ్ఞ సంతానానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ముందుగా ఆడపిల్లలైన యమి , తపతి అభిప్రాయభేదాలకు అంకురార్పణ చేశారు. తల్లి మాటల్ని పూర్తిగా నమ్మిన తపతి యమి పట్ల ఇన్నాళ్ళూ ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకుంది.


రోజులు గడిచే కొద్దీ ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల వేళ్ళుతన్నిన ద్వేషం కొద్దికొద్దిగా వ్యక్తం కాసాగింది.


తల్లిలో కనిపిస్తున్న మార్పు వైవస్వతుణ్ణి , యముడినీ ఆశ్చర్యంలో పడవేసింది. తల్లి తనను చూస్తున్న విధానం వల్ల యమి అమితంగా బాధపడసాగింది. ముగ్గురూ , తమలో తాము బాధపడుతూ ఉండిపోయారు.


*“అమ్మ మనల్ని సరిగ్గా చూడడం లేదు. శనినీ , సావర్ణినీ , తపతినీ ప్రత్యేకంగా చూసుకుంటోంది. అమ్మలో వచ్చిన మార్పు మన మనసుల్ని బాధపెడుతోంది. నాన్నగారికి చెప్పాలి"* యముడు ఆవేశంగా అన్నాడు.


*"అమ్మ మంచిది కాదని నాన్నకు చెప్పడం తప్పు , తమ్ముడూ !”* వైవస్వతుడు యముడి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు.


*"తప్పెందుకవుతుంది ? తప్పు చేసే వాళ్ళ గురించి పెద్దలకు చెప్పడం తప్పు కాదు. ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళని వదిలి పెట్టరాదన్నయ్యా ! తల్లి అయినా , తండ్రి అయినా అంతే ! ధర్మం ధర్మమే ! అధర్మం అధర్మమే !"*


*"ఈ మధ్య నువ్వు ధర్మం గురించి ఎక్కువగా చెప్తున్నావు , యమా !"* వైవస్వతుడు నవ్వుతూ అన్నాడు.


*"అవును !"* యముడు వైవస్వతుడిని తదేకంగా చూస్తూ అన్నాడు. *"మీకు గుర్తుందో లేదో...మన తమ్ముడు శని జన్మించినప్పట్నుంచీ అమ్మ మారిపోయింది. సావర్ణి పుట్టాక ఇంకొంచెం , తపతి పుట్టాక మరికొంచెం - వాళ్ళు ముగ్గురూ పెద్ద వాళ్ళయ్యాక - ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అమ్మ !”*


*"ఏమో , యమన్నయ్యా ! నేను గమనించలేదు !"* అంది యమి. 


*"నేను కూడా !"* వైవస్వతుడు అన్నాడు. *"నువ్వెలా గమనించగలిగావో నాకు తెలీదు !"*


*"ఎలా గమనించానంటే - అమ్మ కళ్ళు చూసి ! ఆ తపతినీ , సావర్ణినీ , శనినీ చూస్తున్నప్పుడు అమ్మ కళ్ళు దీప కళికల్లా మెరుస్తాయి. మనల్ని చూసినప్పుడు అగ్ని గోళాల్లా మెరుస్తాయి"* యముడు వివరిస్తూ అన్నాడు. *"అమ్మ కళ్ళల్లో నాకు మన పట్ల ద్వేషం కనిపిస్తుంది , తెలుసా ? ఇప్పుడు అమ్మ మాటల్లో కూడా మన పట్ల అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతోంది !"*


*"అమ్మ... ఎందుకిలా అయిపోయిందన్నయ్యా !"* యమి వైవస్వతుణ్ణి అడిగింది అమాయకంగా. *“ఆలోచిస్తుంటే , నాకూ నిజమే అనిపిస్తోంది. తపతిని మెచ్చుకుంటుంది. నేను - కంటపడితే చాలు - కసురుతుంది !"*


*“బిడ్డలందర్నీ సమానంగా చూడడం తల్లిదండ్రుల విధి ! అది ధర్మం ! ఈ సారి అమ్మ పక్షపాతం చూపిస్తే నేను ఊరుకోను !"* యముడు నిష్కర్షగా అనేసి , అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.


*"యముడు ఎప్పుడూ 'ధర్మం , ధర్మం' అంటూ వుంటాడు ! ఏం చేస్తాడో ఏమో !"* వైవస్వతుడు ఆందోళనగా అన్నాడు. 


*“ఏం చేస్తాడు ? 'ధర్మం, ధర్మం' అనే వ్యక్తి ధర్మమైందే చేస్తాడు !"* యమి యముడు

వెళ్ళినవైపే చూస్తూ అంది.

మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.*

 *తాజా వార్తలు*


*ప్రధాని మోదీకి సంబంధించి దేశ మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పెద్ద ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి చెందినదానిని అయినప్పటికీ, ఈ రోజు భారతదేశ సామాజిక కార్యకర్తగా, భారతదేశాన్ని మంచి దేశంగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని భారతీయ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారికి సత్తా ఉంది అని ప్రతిభా పాటిల్ అన్నారు. భారత పౌరులకు కొత్త దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకోండి. మోదీజీ భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవ చేశాను. కానీ ప్రధాని మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.*

 **

🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 30వ శ్లోకం* 


 *దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య భారత* I

 *తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి* || 30


 *ప్రతిపదార్థం*


భారత = ఓ అర్జునా ! ; అయమ్,దేహీ = ఈ ఆత్మ; సర్వస్య = ప్రతి ప్రాణి యొక్క ; దేహే = దేహము నందు ; నిత్యమ్ = ఎల్లప్పుడు :ను; అవధ్యః = విధంప వీలుకానిది యై యుండును; తస్మాత్ = అందువలన; సర్వాణి = సమస్తములైన ; భూతాని = ప్రాణాలను గూర్చి ( ఏ ప్రాణి కొరకు) ఐనను; త్వమ్ = నీవు; శోచితుమ్ = శోకించుటకు;న, అర్హసి = అర్హుడవుకావు శ్రోకింప దగదు ).


 *తాత్పర్యము* 


ఓ అర్జునా ! ప్రతి దేహమునందును ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి యైనను నీవు శోకింపదగదు.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

వేదకుసుమాలు

 *అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్ వారి చే శోభకృత్ ఋషి పంచమి(19-9-23)నాడు సన్మానించబడే సీతారామ అగ్రహారవాసులైన శ్రీ శోభకృత్ వేదకుసుమాలు*

*గమనిక*:-- ఈ కార్యక్రమం ఈనాడు (19-9-23) సాయంత్రం *6 గంటకు* నిర్వహించబడుతుంది. అభీష్ట గణపతి భక్తులు, సీతారామ అగ్రహారం సభ్యులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని తరించగలరు.

*వేదిక*:-- సీతారామ అగ్రహారం లోని అభీష్ట గణపతి ఆలయం.


*ఘనాన్తపట్టభద్రులు*


*౧. బ్రహ్మ శ్రీ ధూళిపాళ మధుగణేశ శర్మ ఘనపాఠీ...* ఈయన మన అగ్రహారం నుండి ప్రప్రథమ సువర్ణపతకప్రాప్తులు


౨. బ్రహ్మ శ్రీ జోస్యుల హేమంత శర్మ ఘనపాఠీ,

౩. బ్రహ్మ శ్రీ ఆకెళ్ళ రామకృష్ణ శర్మ ఘనపాఠీ,

*క్రమాన్త పట్టభద్రులు*

ఈ సంవత్సరం ఎవరూలేరు, కానీ గడచిన సంవత్సరం విజయవాడ కౌతావారి పట్టాతో సహా సాధించిన *"బ్రహ్మ శ్రీ పిడపర్తి ఆంజనేయ శర్మ"* ను ఈ విభాగంలో గుర్తించడమైనది.

*మూలం పరీక్ష పూర్తి చేసి న వారు*

౧.  చి. గండికోట శేషవేంకట రమణ మూర్తి శర్మ.

౨. చి కొంపెల్ల ప్రణవేశ్వర శర్మ,

౩. చి. కొంపెల్ల ప్రమోదేశ్వర శర్మ,

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

నామం శక్తి వంతమైనది

 ఆత్మస్వరూపులారా..

దైవం సాకారుడు, నిరాకారుడు కూడా. ఆకారం ధ్యానం నిలబడటానికి దోహద పడుతుంది. క్రమంగా అది నిరాకారం వైపు మళ్ళుతుంది. అన్నింటి కంటే నామం శక్తి వంతమైనది. ప్రణవం, శివ, కేశవ, రామ ఇత్యాది నామాలన్నే భక్తిని స్థిరపరిచి పరబ్రహ్మను చేరుకునే మార్గాలే. సర్వం గచ్ఛతి వాసుదేవః. ఆ పరబ్రహ్మాన్ని ఈశ్వరుడు అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, పరమాత్మ అనొచ్చు. నామధారిగా, నామ రహితుడిగా ఉన్న ఆ నారాయణ నామ స్మరణ ఇహపరాలను అందించే తారకం. అభ్యాస, వైరాగ్యాలతో ఎవరైతే సాధన చేస్తారో వారు నన్నే పొందుతారని గీతలో భగవానుడు ఇచ్చిన అభయమే శరణ్యం. కృష్ణస్తు స్వయం భగవాన్..అని చెప్పిన వ్యాస మహర్షి వేదోక్తిని అనుసరిద్దాం, తరిద్దాం. హరి ఓం./అంతరంగ తరంగం/AVR🙏

ముక్తి కోసం ఇప్పటి నుండే

 మనం ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాం, ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కాని ఎవరూ మళ్ళీ జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. కొంత మంది ఇహలోక సుఖాలు, భోగాలు అనుభవించడం కొరకు ఆరాటపడుతుంటే, మరి కొంత మంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చేజన్మ మంచి రావాలని మరో మంచి జన్మకోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ, పోగుచేసుకుంటూ, జ్ఞానం సంపాదించుకొని, గతజన్మ వాసనలను పోగొట్టుకుంటూ చివరికి పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మ మయంగా కనిపిస్తుంది.


లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టిక్కట్టును, ఆ లాటరీ తనకే తగులుతుంది అనే ఆశతో కొనంగా లేనిది, ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు. 

"జన్మసార్ధకం అవ్వాలంటే ముక్తికోసం సాధన తప్పనిసరిగా చేయాలి."


అబ్బో! ఎన్నో జన్మల తరువాత వచ్చే ముక్తి కోసం ఇప్పటి నుండే ఎందుకు తాపత్రయపడటం దండగ అని చేతులుముడుచుకొని కూచోకూడదు. ఎందుకంటే, ఎప్పుడో 21 ఏళ్ల తరువాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడంలేదుగా!

5వ ఏటనుండి ABCD లతో చదువు మొదలు పెడుతున్నాము కదా! ప్రస్తుతం ఒకటో క్లాసు నుండి ఐఐటి కోచింగులు ఇచ్చే స్కూళ్లు కూడా మొదలైయ్యాయి. ఇదీ అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో! ఏమో! ఇదే ఆఖరి జన్మేమో.. కాబట్టి ఇప్పుటీనుండే ప్రయత్నం మొదలెట్టాలి.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

కురుకర్తా కురువాసీ

 కురుకర్తా కురువాసీ 

కురుభూతో గుణౌషధః I 

సర్వాశయో గర్భచారీ 

సర్వేషాంప్రాణినాంపతిః ॥ 77 ॥  


* కురుకర్తా = కురుక్షేత్రమును సృష్టించినవాడు, 

* కురువాసీ = కురుభూములందు నివసించువాడు, 

* కురుభూతః = కురుభూములందు పుట్టినవాడు, 

* గుణౌషధః = మంచి గుణములు ఔషధములుగా కలవాడు, 

* సర్వాశయః = సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు, 

* గర్భచారీ = సమస్త గర్భములందు సంచరించువాడు, 

* సర్వేషాం ప్రాణినాం పతిః = సమస్తమైన ప్రాణులకు అధిపతి.

ఆనందగణపతి

 ఆనందగణపతి (పాట


పాడరండి కలిసి మిత్రులార భక్తిమీర కొలువున్నది యిల ఆనందగణపతి

ఆదిశక్తి తనయుడట శక్తులకే నెలవు గజముఖవదనుడట విద్యలకే నెలవు

శశాంక ధారుడట సొగసులకే నెలవు సుందరాంగుడంట యీ ఆనందగణపతి పత్రిపూజనప్రియుడట

తనువులకే హితవు మోదకాప్రియుడట చవులకే హితవు ప్రణవనాద ప్రియుడట మనసులకే హితవు లేజీ విజయవరదుడంట యీ ఆనందగణపతి కళలతో తేజరిల్లె యీ ఆనందగణపతి

పిలిచినంత పలుకునట భక్తులకే చనువు సృష్టినెల్ల కాచునట జగతికే చనుపు ముదముమీర నర్తించే నృత్యగణపతి


డా. దేవులపల్లి పద్మజ,


విశాఖపట్నం, 



దాశరధీ



దాశరధీ! కరుణాపయోనిధీ!


"రంగదరాతిభంగ,ఖగరాజతురంగ,విపత్పరంపరో/

త్తుంగతమఃపతంగ,పరితోషితరంగ,దయాంతరంగ,స /

త్సంగ,ధరాత్మజాహృదయసారసభృంగ,నిశాచరాబ్జమా /

తంగ,శుభాంగ,భద్రగిరిదాశరధీ! కరుణాపయోనిధీ!

రచన:కంచర్లగోపన్న.

      (రామదాసు)


భావం:శతృసంహారీ! గరుడవాహనా! ఆపదోధ్ధారీ!రంగనాధసేవితా! కరుణాన్వితహృదయా! సత్సంగా!సీతాహృత్పద్మభృంగా!రాక్షసకులభీభత్సకరా!శుభాంగా! భద్రగిరినిలయా! దశరధకుమారా! కరుణాసాగరా! నన్నేలుముస్వామీ!


విశేషములు: తెలుగునవెలసిన శతక సముదాయమున దాశరధీ శతకము వెలలేనిది.పరమభక్తాగ్రేసరుడగు రామదాస విరచితమైనయీశతక మునందలి ప్రతిపద్యమొక అమృతబిందువు.భక్తిరస సింధువు.

                               స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంగళవారం, సెప్టెంబరు 19, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, సెప్టెంబరు 19, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి ఉ10.43 వరకు  

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:స్వాతి మ12.09 వరకు

యోగం:వైధృతి తె3.06 వరకు

కరణం:భద్ర ఉ10.43 వరకు తదుపరి బవ రా10.41 వరకు

వర్జ్యం:సా5.52 - 7.31

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.05 &

రా10.43 - 11.31

అమృతకాలం:తె3.42 - 5.20

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: కన్య

చంద్ర రాశి : తుల 

సూర్యోదయం:5.52 

సూర్యాస్తమయం:5.58


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

పంచాంగం 19.09.2023 tuesday,

 ఈ రోజు పంచాంగం 19.09.2023 tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి భౌమ వాసర: స్వాతి నక్షత్రం వైధృతి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం 

చవితి మధ్యాహ్నం 01:39 వరకు.

స్వాతి మధ్యాహ్నం 01:44 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:11

వర్జ్యం : రాత్రి 07:36 నుండి 09:17 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:21 వరకు తిరిగి రాత్రి  10:58 నుండి 11:46 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 

వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 


శుభోదయ:, నమస్కార: