అక్టోబర్ 2023 "శ్రీ గాయత్రి" సంచికలో రెండు ప్రత్యేక వ్యాసాలు "సనాతన ధర్మం (శ్రీ గాయత్రి డెస్క్) "; " కిడాంబి వేణుగోపాలన్ గారి సనాతన ధర్మం-అత్యంత పురాతనం" అనేవి ప్రచురించబడుతున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటో అవగాహన అవుతుంది. మన హైదవం లో సనాతనం అంటే నిత్య జీవితమే. మనం ఆచరించే ఆచార వ్యవహారాలు అన్నీ అందులోనివే. ఈ విషయంలో అనుమానం ఉండకూడదు. పత్రిక రాగానే తప్పనిసరిగా చదవాలి. పై వ్యాసాలె కాకుండా ఇంకా తెలుసుకోవాలసింది ఎంతయినా ఉండవచ్చు. మన శ్రీ గాయత్రి రైటర్స్ నుంచి సనాతన ధర్మం మీద వ్యాసాలు ఆపేక్షితం. పూర్తి వ్యాసం కాకపోతే బాక్స్ అయిటమ్స్ కూడా పంపవచ్చు. ప్రతీ నెలా 10 వ తారీఖు లోగా పంపగలరు. మన సర్వే (Survey) ప్రకారం, పెద్ద పెద్ద వ్యాసాలు ఎవరూ చదవక విడిచి (skip) పెడుతున్నారు. WhatsApp లో కూడా ఇదే పరిస్థితి. ఇదివరలో చాలా సార్లు చెప్పడం జరిగింది. పూర్తి వ్యాసం 5-6 పేజీలు దాటకుండా పంపండి. ప్రత్యేక పరిస్తితులలో 8 పేజీలు ఉండవచ్చు. 8 పేజీలు దాటితే, రెండు భాగాలుగా వేయవలసి ఉంటుంది. గమనించ గలరు. ఆధ్యాత్మిక - జ్యోతిష విషయాలలో బాక్స్ అయిటమ్స్ కూడా మీ నుంచి ఆపేక్షితం. ఒక పేజీలో 3/4, 1/2, 1/4 వంతు బాక్స్ అయిటంగా వేస్తాము. అందరూ పత్రిక చదివిన వెంటనే స్పందన కూడా పంపితే మీ పేరు, ఫోన్ నంబర్ తో ప్రచురిస్తాము. అక్టోబర్ 2023 సంచిక విషయ సూచిక (Index) ఈ నెల 28 న తెలిగియ చేస్తాము. 30 న పత్రిక విడుదల. .. .. .. మీ, డా. వి. యన్. శాస్త్రి - మానేజింగ్ ఎడిటర్.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, సెప్టెంబర్ 2023, గురువారం
Santana Dharma
*Santana Dharmas inroads into the world*
Nearly 177 countries have signed up for International Yoga Day and 2 billion people practice yoga across the world (as per UN statistics). Yoga is an integral part of Sanatana Dharma. Such yoga practice only is unifying one fourth of the world population under a common platform by whatever name you call it, be it Sanatana Dharma or anything else.
In fact, Christians in the West seems to have rejected Church warnings that yoga is satanic. In the United States alone, about 10 per cent of the population practices yoga regularly. In the YMCA where people go for fitness classes, almost all non-Hindu members start and end their yoga practice with ‘OM’ and Namaste. Almost every other class they offer is related to yoga and meditation. They even had a ‘Yoga Day’ a few years ago that included bhajans.
Late Steve Jobs, the founder of Apple, who is considered the greatest inventor of the last century, states in his biography how an autobiography of a Yogi with minute details of Sanatana Dharma is his most revered book which he had to read at least once a year to be motivated and inspired. He carried it on his iPad until his last moments. Not only that, before he died of cancer, he had arranged to buy 500 copies of the book and be given as a special gift with a personal message to every single top executive of many multi-billion dollar companies who would attend his funeral.
It's not a surprise that J Robert Oppenheimer and many quantum physicists such as Heisenberg, Bohr and Schrodinger, all winners of the Nobel Prize in Quantum Physics, carried the book of Vedanta or BhagavadGita in one hand and physics in the other. In fact, Oppenheimer, who led the famous Manhattan Project that built the first atomic bomb, spontaneously chanted the verses from the 11th chapter of Gita when he saw the massive ball of fire after the bomb exploded in the New Mexican desert to test it. This poor man spent so much time of his life learning Sanskrit and attributed his deep insights to the Gita and the teachings of Sanatana Dharma.
CERN institute near Geneva, where the topmost scientists in the world are today, with 23 member states, building the most sophisticated and advanced collider has an imposing statue of Nataraja, the lord of dance of the universe, right on its premises.
14 top German universities are teaching Sanskrit and European universities are not able to keep up with the demand.
Late Joseph Campbell, who is the most well-known mythologist of the last century and who inspired the famous Star Wars series, expresses Sanatana Dharma in the widely popular ‘Power of Myth’ series. This multi-part series was in fact filmed in the home of George Lucas who produced the Star Wars series. He as a university student quit the university because it did not offer Sanskrit. All his life he was a great follower of Upanishads.
Carl Sagan, the well- known astrophysicist who created the Cosmos series, says the secrets of the universe are hidden in the Hindu scriptures. This series was seen by 50 crore people in 60 different countries! He praised the Nasadiya Suktam, the seven ‘hymns of creation’ in Rig Veda as the most sophisticated analysis of the origin of the universe.
The spiritual teachers of the Christian world today, such as Eckhart Tolle, Mike Singer, Wayne Dyer, Stephen Wolpert (Ram Dass) and many others who have hundreds of millions of followers in the Christian world, all across the globe, are also deep believers of Hinduism and Buddhism teachings. They are bypassing the Church to explain Jesus’ teachings based on the teachings of Krishna and Buddha.
When Oprah Winfrey had a show with Echart Tolle, 3.5 crore followers across the world watched or downloaded it. His books are translated into 33 languages across the world and they are bestsellers. There is even an article in Newsweek in 2009 by Lisa Miller ‘We (Christians ) are all Hindus now’ and the Harvard Pluralism project talks about how Hindu concepts have deeply seeped into this nation (US).
It is through Sanatana Dharma that most advanced inventions have been made to the world — the concept of zero, plastic surgery, gravity, chess, the Chakras, the Ayurveda, the martial arts that Chinese/Japanese follow, the binomials, etc — and that it led to most prosperous civilisation with 25-30 per cent of world GDP for millennia until the 1700s, when the British plundered $45 trillion and murdered more than 100 million in just three or four decades alone.
Gandhi said “Stop all conversions in India, it is the deadliest poison that ever sapped the fountain of truth.” If he had power, he added, he would legislate to stop all conversions in India. Ambedkar said that conversion is a denationalisation.
So colonial rule and the mass conversions have had their effect on the basic Indian trait of Sanatana Dharma but it has risen again like Phoenix from Ashes and started reverberating in the whole world now.
గృహస్థాశ్రమం
ಸುಭಾಷಿತ . 629 .
ಈಹಂತೇ ಸರ್ವಭೂತಾನಿ ತದಿದಂ ಕರ್ಮಸಂಜ್ಞಿತಂ | ಸಿದ್ಧಿಕ್ಷೇತ್ರಮಿದಂ ಪುಣ್ಯಮಯಮೇವಾಶ್ರಮೋ ಮಹಾನ್ ||
ಸಕಲ ಪ್ರಾಣಿಗಳೂ ಕರ್ಮಪ್ರಧಾನವಾದ ಗಗಹಸ್ಥಾಶ್ರಮವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಿವೆ . ಇದು ಪುಣ್ಯಕರವಾದ ಸಿದ್ಧಿಕ್ಷೇತ್ರ . ಈ ಗೃಹಸ್ಥಾಶ್ರಮವೇ ದೊಡ್ಡದು .
ಭಾರತಮಂಜರೀ .
: సకల జీవరాసులు కర్మ ప్రధాన మైన గృహస్థాశ్రమమును ఆశ్రయించి ఉన్నాయి. గృహస్థాశ్రమం పుణ్యకరమైన సిద్ధిక్షేత్రం మరియు ఉత్తమమైనది
నవగ్రహా పురాణం🪐* . *32వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *32వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*గురుగ్రహ జననం - 3*
*"ఆ సుముహూర్తాన్ని - మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !"* ఇంద్రుడు సవినయంగా అన్నాడు.
అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది. ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్లి అక్కడ తన విధుల్ని నిర్వహిస్తున్నాడు బృహస్పతి.
ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంటబెట్టుకుని , చతుర్ముఖ బ్రహ్మ సన్నిధికి వెళ్ళాడు. బృహస్పతిని దేవతల గురువుగా బ్రహ్మకు పరిచయం చేశాడు.
*"మా గురుదేవుల వివాహం సంకల్పించారు. వారి జననీజనకులు. తగిన స్త్రీ రత్నాన్ని తమరే సూచించాలి"* అంటూ ఇంద్రుడు బ్రహ్మను ప్రార్ధించాడు.
బ్రహ్మ బృహస్పతిని తదేకంగా చూశాడు. *"బృహస్పతి చక్కని దేహసౌందర్యం , వర్ఛస్సూ కలిగిన వాడు. అతనికి తగిన అందగత్తె లభించాలి..."* అంటూ బ్రహ్మ. అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడయ్యాడు..
ఇంద్రుడూ , బృహస్పతీ , ఆశ్చర్యంగా ఆయనవైపే చూస్తూన్నారు. బ్రహ్మ రెప్పలు పైకెత్తి బృహస్పతి వైపు చూశాడు.
*"తార అనే జవ్వని తగిన పెనిమిటి కోసం తపస్సు చేస్తోంది. ఆమె జగదేక సుందరి ! కాలం మీ ఇద్దర్నీ కలుపుతుంది. ఆ తారను ధర్మపత్నిగా స్వీకరించు !"* బ్రహ్మ వాక్కులో అనుశాసనం ధ్వనించింది.
బ్రహ్మ హఠాత్తుగా సాక్షాత్కరించి , తార వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్వేత వర్ణ వస్త్రాలు ధరించిన తార - తెల్ల రేకుల్లో దాగిన ఎర్ర తామరలా ఉంది. తార సర్వస్వమూ పద్మమయంగా కనిపిస్తోంది బ్రహ్మ చూపులకు. ముఖం పద్మం. రెప్పలు మూసిన విశాలవిలోచనాలు పద్మ పత్రాలు. చేతులు నాజూకైన పద్మనాళాలు. అరచేతులు పద్మపత్రాలు. తార తనువల్లిపైన తామరమొగ్గలు కనిపిస్తున్నాయి. ఓహ్ ! తారది నిసర్గ సౌందర్యం ! ఎనిమిది కళ్ళతోనూ చూడాలనిపిస్తోందామెను !
*"తారా..."* అప్రయత్నంగా పిలిచాడు బ్రహ్మ.
బోర్లించిన అరచేతుల్లా ఉన్న విశాలమైన రెప్పలు నెమ్మదిగా స్పందిస్తూ - పైకి లేచాయి. తార విశాల నేత్రాలు ఆశ్చర్యానందాలతో బ్రహ్మ దేవుణ్ని చూశాయి. *“స్వామీ...”* తార చేతులు జోడించింది.
*"నువ్వు తగిన వరుని కోసం తపస్సు చేస్తున్నావని మాకు తెలుసు. స్ఫురద్రూపీ , కుశాగ్రబుద్ధీ అయిన యువకుడు నీ భర్త కాబోతున్నాడు...”*
*"స్వామీ...!"* తార కంఠంలో వీణలు పలికా యనిపించింది. నిరంతరం వాణి వీణానాదం వినే బ్రహ్మకు.
*"అతని పేరు బృహస్పతి ! దేవ గురువుగా విశిష్ట పదవిలో వున్నాడు. అచిర కాలంలో బృహస్పతి నీకు తారసిల్లుతాడు. ఆ సుందరుణ్ని భర్తగా స్వీకరించు !"*
*"ఆజ్ఞ !"* తార నమస్కరిస్తూ అంది.
*"బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం. ఆనందం ద్విముఖం ! కళ్యాణమస్తు !"* తారను దీవించి , మరికాసేపు ఆమె అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి , బ్రహ్మ అంతర్ధాన మయ్యాడు.
తపస్సు ఫలించిన ఆనందం తార వదనం మీద దరహాస చంద్రిక రూపంలో ప్రత్యక్ష మవుతోంది. తార కూర్చున్న చోటి నుంచి లేచింది. ఎదురుగా వున్న కొలను తామర కన్నులతో తననే చూస్తూ చిన్ని చిన్ని తరంగ హస్తాలతో రమ్మని పిలుస్తున్నట్టు కనిపిస్తోంది తారకు.
యజ్ఞం ముగిశాక 'అవభృథ స్నానం' చేయడానికన్నట్టు తార పిలుస్తున్న కొలను వైపు అడుగులు వేసింది. జుత్తు ముడి విప్పుకుంటూ నెమ్మదిగా కొలనులోనికి దిగింది. కొలనులోని తేటనీరు పై పైకి వ్యాపిస్తూ తారను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభించింది.
తార ఒక్కసారిగా నీటిలో మునిగింది. క్షణంలో ఆమె మొహం నీటిపైన ప్రత్యక్షమైంది. కొలనులో వున్న తామరలను వెక్కిరిస్తున్న 'ముద్దు తామరలా' ఆమె ముఖం కనిపిస్తోంది.
రోజులు గడుస్తున్నాయి. కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ సాగిస్తోంది. అందమైన ప్రకృతిలో , ఆకర్షణీయమైన స్థలాల్లో ఆమె అదే పనిగా విహరిస్తోంది.
తనతో తారను కలిపే కాలం ఎప్పుడొస్తుందో అని లోలోపల అనుకుంటూనే వున్నాడు బృహస్పతి.
ఆశ్రమంలో శిష్యులు క్రిందటిరోజు బోధించిన వేదపాఠాన్ని వల్లె వేస్తున్నారు. అనుష్ఠానాలు తీర్చుకునేందుకు బృహస్పతి సమీపంలోని నది వైపు బయలుదేరాడు.
నదీతీరానికి చేరుకున్న బృహస్పతి , తటాలున ఆగాడు. నదిలోంచి ఎవరో స్త్రీ గట్టు వైపు అడుగులు వేస్తోంది. సచేల స్నానం చేసిన ఆమె వలువలలోంచి నీరు - వయ్యారంగా వొలికిపోతోంది. తడిసిన శ్వేతాంబరం ఆ శరీరాన్ని దాచీ , దాచకుండా చూపుతున్న తెరలా వుంది.
నీటిలో నుంచి పైకి లేవనెత్తిన బంగారుబొమ్మలా వుందామె. ఎవరు ? ఎవరామె ? నదీ కన్యా ? సముద్రంలోంచి ఎదురీదుతూ వచ్చిన మత్స్యకాంతా ? లేక సాగరకన్య ? కమ్మెచ్చులోంచి తీసిన బంగారు తీగలాంటి ఆమె శరీరం బృహస్పతి సర్వస్వాన్నీ అయస్కాంత శిల్పంలా లాగుతోంది. అసంకల్పితంగా ఆమె వైపు అడుగు వేశాడతను.
బృహస్పతి తనలో కలుగుతున్న భావావేశానికి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకూ ఏ స్త్రీని తాను అలా నిర్భయంగా , నిస్సంకోచంగా , రెప్పవేయకుండా చూడలేదు. బ్రహ్మదేవుడు ఎవరో 'తార' అన్నాడు ! తార కాకుండా ఈ లావణ్యవతి అని వుంటే ?....
లేకపోతే.... ఈ లావణ్యవతే తార అయితే ? లోపల్నుంచీ తన్నుకొస్తున్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ బృహస్పతి ఆగాడు. ఆమె కూడా ఆగింది.
సచేలస్నానం చేసిన ఆమె తనువు కాకుండా , బలిసిన చేపల్లా స్పందిస్తున్న ఆమె కళ్ళు బృహస్పతి దృష్టిని బలంగా లాగుతున్నాయి.
బృహస్పతి పెదవులు ఆరిపోతూ కదిలాయి.
అయితే - మాటను ఆమె పెదవులు పలికాయి.
*" ఆర్యా... నా పేరు తార. మీరు బృహస్పతీ కుమారులను ఎరుగుదురా ?"* తార ! బృహస్పతి గుండెగూటిలో పావురంలా కొట్టుకుంది. మౌనంగా , తెలుసన్నట్టు తల పంకించాడు.
*"వారు ఎక్కడున్నారో చెప్పండి !"* తార కంఠంలో కోయిల దాగి వుందేమో అనిపించింది బృహస్పతికి.
*“ఇక్కడే... నీ సన్నిధిలో...”*
*“మీరా ?!”* ఆశ్చర్యానందాలు తార కంఠంలో జంట స్వరాల్లా పలికాయి.
*"తారా !"* అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ.
శ్రద్ధా అంగిరసులకు తార ఎంతగానో నచ్చింది. తారను తనంత తాను పరిగ్రహించకుండా , తమ అనుమతికోసం ఆమెతో బాటు వచ్చిన బృహస్పతిని చూసి అంగిరసుడూ , శ్రద్ధా సంతోషపడిపోయారు.
బృహస్పతీ తారల వివాహం నిశ్చయమైంది. ఇంద్రాది దేవతలూ , నారదుడూ , మానస పుత్రులూ వివాహానికి విచ్చేశారు. దేవేంద్రుడి ఆధ్వర్యంలో బృహస్పతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రద్ధా , అంగిరసుడూ - తారకూ , బృహస్పతికీ వేర్వేరుగా గృహస్థ ధర్మాలూ , దాంపత్య సూత్రాలూ బోధించారు. దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమనీ , వంశాన్ని సత్ సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దర్నీ దీవించి పంపించారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌷కులశేఖర పడి🌷*
తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆళ్వారులలో ఒకడు, తిరువాన్కూరు మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఈ గడప పేరు ఏర్పడింది.
కేరళ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు, తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని తన కోరిక విన్నవించుకున్నారు. కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.
*🌷ఆనంద నిలయ విమానం:*
గర్భాలయం మీద మనకు బంగారు పూత పూసిన గోపురం కనిపిస్తుంది. దీనిని ఆగమ భాషలో విమానం అంటారు. శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఇది త్రిదళ విమానం. ఈది మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది.
*🌷బేడి ఆంజనేయస్వామి దేవాలయము:*
బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజలీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది.
*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 45*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
*ఓం నమో భగవతే రామకృష్ణాయ*
*🚩శ్రీ వివేకానందస్వామి🚩*
*🚩జీవిత గాథ🚩*
*భాగం 45*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*నరేంద్రుని పరీక్ష*
"మీ గురువును పగటి పూట పరీక్షించండి, రాత్రి కూడా పరీక్షించండి. అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు కూడా అందుకు సాహసించాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు శశధర పండితుని ఇంటిని పావనం చేశారు. అప్పుడు ఇంట్లోని ఒక వ్యక్తి త్రాగడానిక ఆయనకు మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసును పుచ్చుకొన్న శ్రీరామకృష్ణులు ఆ నీరు
త్రాగలేదు. ఎవరి కంటా పడకుండా ఆ నీటిని క్రింద పారబోశారు. నరేంద్రుడు ఇదంతా గమనించాడు. తదనంతరం మంచినీటిని తెచ్చిన ఆ వ్యక్తిని గురించి వాకబు చేసినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది - ఆ వ్యక్తి దుశ్శీలుడు.
శ్రీరామకృష్ణులు కామాన్నీ, ధనేచ్ఛనూ సమూలంగా త్యజించిన వ్యక్తి. ఆయన ధనం మాత్రమే కాక, ఏ లోహపు వస్తువునూ తాకలేరు. ఒకవేళ తాకితే ఆయన చేతులు ఏదో తేలు కుట్టినట్లు కొంకర్లు పోయేవి. ఈ విషయం కూడా నమ్మడానికి నరేంద్రుడు సిద్ధంగా లేడు. దీనిని పరీక్షించాలనుకొని ఒక రోజు శ్రీరామకృష్ణులు గదిలో లేనప్పుడు ఆయన పడక క్రింద ఒక నాణెం ఉంచాడు.
తరువాత గదిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు పడక మీద కూర్చున్నారు. మరుక్షణమే విలవిలలాడుతూ లేచారు. అందుకు కారణం ఏమిటోనని అందరూ పడకను క్షుణ్ణంగా పరీక్షించారు. పడకను దులిపినప్పుడు ఒక నాణెం క్రింద పడింది. శ్రీరామకృష్ణులు తమ ప్రియతమ శిష్యునిపై అర్థవంతమైన దృక్కును సారించారు. నరేంద్రుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹.
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 28*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 28*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం*
*విపద్యన్తేమ విశ్వే విధి శత మఖాద్యా దివిషదః |*
*కరాళం యత్ క్ష్వేళం కబలళితవతః కాలకలనా*
*న శమ్భో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||*
ఈ శ్లోకంలో అమ్మవారి పాతివ్రత్య మహిమను గురించి చెప్తున్నారు.
సుధామప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం= దేవతలు పాల సముద్రాన్ని ఎందుకు మధించారు? అమృతాన్ని పొంది వృద్ధ్యాప్య, మృత్యు భయాలను పోగొట్టుకోవటానికి. మరి అమృతం వారిని కాపాడిందా?
విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః = బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ మహా ప్రళయంలో నశించారు కదా!
కరాళం యత్ క్ష్వేళం కబలితవతః = క్షీరసాగర మధనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోయి బ్రహ్మ గారి వద్దకు వెళితే ఆయన వీళ్ళను తీసుకొని శివుడి వద్దకు వెళ్లి అందరూ ప్రార్ధన చేశారు కాపాడమని. అప్పుడు శివుడు ఆ విషాన్ని మ్రింగటానికి ముందుకు వచ్చాడు. దానిని అన్నం ముద్దలాగా మ్రింగి తన ఉదరంలో వున్న లోకాలు నశించకుండా ఆ గరళాన్ని కంఠంలో నిలిపాడు.
కాలకలనా న శమ్భో= కాల, కలన (లెక్కించటం, పరిణామాలని) పరిమితులు లేని శంభుడు ఆ విషాన్ని లోక క్షేమం కోసం కంఠంలో నిలిపాడు. కాల, కలనములకు లోబడి ఉండేవాడు పశువు (మానవుడు) వాటిని తన అధీనంలో ఉంచుకొనేవాడు పశుపతి.(ఈశ్వరుడు)
మరి అమ్మవారు తన భర్త కాలకూట విషాన్ని మ్రింగుతుంటే భయపడి అడ్డు పడలేదా? లేదట. పైగా లోక రక్షణ కోసం ఆమె కూడా ప్రోత్సహించిందట. ఎందుకని ఆమెకు భయం లేదు? అది ఆమె ధరించిన తాటంకముల (చెవికమ్మలు) మహిమయట. ఆమెకు తన మాంగల్యంపై నమ్మకమని శుక మహర్షి పరీక్షిత్తుతో అంటారు. భాగవతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు.
*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అని అమ్మవారి నామం. తపః అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. వీరిద్దరి కదలిక వల్లనే కదా రోజులు,మాసములు, సంవత్సరములు, యుగములు, కల్పములు మున్నగునవి. ఆ విధంగా కాలమును నిర్దేశించే సూర్య చంద్రులను ఆవిడ నియంత్రించి చెవికమ్మలుగా ధరించాక ఇక *కాల కలన* కు ఆమె వెరవవలసిన అవసరం ఏముంది? అమ్మవారు శాశ్వత సుమంగళి. స్వామి శాశ్వత శుభంకరుడు.
అసలు తాటంకములు తాటియాకులతో చేయబడినవి. ఒకప్పుడు చెవి కమ్ములను, మంగళ సూత్రములను కూడా తాటియాకులతోనే చేసేవారట ముహూర్త సమయంలో ధరింపజేయటానికి. అవి సౌమంగళ చిహ్నాలని. అందుకే, శుభకార్యాల సందర్భంగా ఇంటి ముందు తాటాకు పందిరి వేసేవారు. తాటియాకు తోరణాలు కట్టేవారు.
తిరుచిరాపల్లి నగరం కావేరీ నది ఇవతలి ఒడ్డున ఉంటే అవతలి ఒడ్డున తూర్పుగా శ్రీరంగనాథ క్షేత్రం శ్రీరంగం, పశ్చిమ దిశగా శ్రీ అఖిలాండేశ్వరీ సమేత జంబుకేశ్వర స్వామివారి ఆలయం ఉంటాయి. ఈ క్షేత్రాన్ని తిరు వనై కోయిల్ అంటారు. పంచభూత లింగ క్షేత్రములలో ఇది జల లింగ క్షేత్రం. స్వామివారి లింగరూపం అడుగు నుండి నిరంతరము నీరు స్రవిస్తూ ఉంటుంది.
మిగిలినవి
పృధివీ -ఏకామ్రేశ్వర
కాంచీపురం
తేజో/అగ్ని - తిరువణ్ణామలై అరుణాచలం
వాయు - శ్రీ కాళహస్తి
ఆకాశ లింగ క్షేత్రం - చిదంబరం
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి ధరించే తాటంకముల గురించి. ఒకప్పుడు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉండేవారట. పూజ చేయటానికి వెళ్లిన ప్రతి పూజారి మూర్ఛపోయేవారట. ఈ విషయం ఆది శంకరులకు తెలుపగా, వారు వచ్చి అమ్మవారి ఉగ్రతనం అంతా మంత్రపూర్వకంగా సంగ్రహించి ఈ తాటంకములలో యంత్రరూపంలో ప్రవేశపెట్టారట. వాటిలో ఒకటి శివ చక్రము, రెండవది శ్రీచక్రము. అంతే కాక అమ్మవారి సన్నిధికి ఎదురుగా గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారట. పుత్ర వాత్సల్యంతో అమ్మవారి ఉగ్రతను శాంతిపొందుతుందని. ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ తాటంకములను శుద్ధిచేసి తిరిగి ధరింపజేసే అధికారం కంచి కామకోటి పీఠాధిపతులకు మాత్రమే ఉన్నది. అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకములను దర్శించినవారు సమస్త సన్మంగళములను పొందుతారని స్త్రీలు దీర్ఘ సుమంగళులై ఉంటారని కన్యలకు త్వరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుందనీ విశ్వాసం.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కల్కి అవతారం.
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌷 కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది 🌷
🌹కృతయుగం నుండి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.
కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.🌹
🌸పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.🌸
1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.
2. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది.
3. వివాహ వ్యవస్థ నిలబడదు..
4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు..
5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు..
6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పడిపోతుంది
7.స్త్రీలు కేశపాశములు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది
8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యేశుడు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు
9. అది ఎప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది
10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు
11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి
12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు
13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు
14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృత యుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది
15.ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.
16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి పోతుంది.
17 అంత గొప్ప అవతారం కల్కి అవతారం.
ఓం నమో నారాయణాయ ....
*సేకరణ:- శ్రీ శర్మద గారి వాట్సాప్ సందేశం.*
చవితి సందేశాలు
ॐ వినాయక చవితి సందేశాలు
-----------------------
సందేశం - 5/11
గణపతి పూజ - దూర్వాయుగ్మం (గరిక)
గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక.
ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య.
తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక.
దూర్వాయుగ్మం అంటే రెండు కొసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.
ఈ గరిక మహా ఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి.
గరిక
- మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది.
- కఫ, పైత్య దోషాలను హరిస్తుంది.
- చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
- ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది.
గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది.
హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.
దూర్వాయుగ్మం (జంట గరిక) తీసుకొని, ఈ క్రింది 21 నామాలతో వినాయకునికి పూజచేస్తాం.
1. సుముఖాయ నమః
2. గణాధిపాయ నమః
3. ఉమాపుత్రాయ నమః
4. గజాననాయ నమః
5. హరశూనవే నమః
6. లంబోదరాయ నమః
7. గుహాగ్రజాయ నమః
8. గజకర్ణాయ నమః
9. ఏకదంతాయ నమః
10. వికటాయ నమః
11. భిన్నదంతాయ నమః
12. వటవే నమః
13. సర్వేశ్వరాయ నమః
14. ఫాలచంద్రాయ నమః
15. హేరంబాయ నమః
16. శూర్పకర్ణాయ నమః
17. సురాగ్రజాయ నమః
18. ఇభవక్త్రాయ నమః
19. వినాయకాయ నమః
20. సురసేవితాయ నమః
21. కపిలాయ నమః
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
⚜ శ్రీ మద్వారాణి మందిర్
👆🕉 మన గుడి : నెం 184
⚜ ఛత్తీస్‌గఢ్ : కోర్బా
⚜ శ్రీ మద్వారాణి మందిర్
💠 మద్వారాణి ఆలయం దట్టమైన అడవులు మరియు పండ్ల చెట్లు మరియు పూలతో చుట్టుముట్టబడిన ఎత్తైన కొండపై హస్దేవ్ నది ఒడ్డున ఉంది.
ఇక్కడ అమ్మవారు కల్మి చెట్టు కింద కూర్చుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆ తల్లి స్వయంగా కాపాడుతుందని చెబుతారు.
💠 ఆలయంలో మా మద్వారాణి కూర్చున్న దృశ్యం చాలా అందంగా ఉంటుంది.
ఆలయ సముదాయంలో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి, వీటిలో కాళీ మా, దుర్గామాత సహా అనేక దేవతలు ఉన్నారు.
💠 మా మద్వారాణి దేవాలయం ఆమె భక్తులకు చాలా ప్రీతికరమైనది, ఆమె భక్తులు శతాబ్దాలుగా ఇక్కడికి వస్తూనే ఉన్నారు.
ఆమె మహిమ పరోపకారానికి నిదర్శనం.
మా మద్వారాణి తమను మరియు వారి కుటుంబాన్ని కాపాడుతుందని మరియు కష్టాల నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు.
💠 తల్లి మద్వారాణిని సంస్కృతంలో మాండ్వీ దేవి అంటారు.
అమ్మవారి రూపానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి.
ఇది చాలా అద్భుతమైనది. పెద్దలు లేదా నమ్మకం ప్రకారం, నవరాత్రి సమయంలో జొన్న పంట కల్మి చెట్టు మరియు దాని ఆకులపై పెరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శనానికి దూరప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. పర్వతం క్రింద ఒక ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. అమ్మవారి దర్శనం తర్వాత భక్తులు జాతరను సందర్శిస్తారు.
💠 ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే ఎత్తైన పర్వతం ఎక్కాలి. ఇది కోర్బా-చంపా ప్రధాన రహదారిపై ఉన్న మా మద్వారాణి ఆలయం నుండి మొదలై 5 కిలోమీటర్ల పొడవైన కొండ రహదారి గుండా వెళుతుంది. ఇప్పుడు ఈ మార్గాన్ని కాలినడకనే కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో కూడా చేరుకునేలా అభివృద్ధి చేశారు.
⚜ చరిత్ర ⚜
💠 మా మద్వారాణి యువరాణి, గోడ్వానా సామ్రాజ్యం రాజు బలిరాజ్ కుమార్తె అని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం.
ఆమె యుక్తవయస్సు వచ్చిన వెంటనే, రాజు యువరాణికి వివాహం చేసేయాలని ప్రతిపాదించాడు.
ఆమెకు పెళ్లి ఇష్టం లేదని, తండ్రితో నేరుగా, ధైర్యంగా చెప్పలేక.... ఒక షరతు పై పెళ్లికి అంగీకరించింది.
కానీ ఒక్క రాత్రిలో మొత్తం వివాహ వేడుకను నిర్వహించమని ఆమెను కోరింది.
రాజు దీనిని సంతోషంగా అంగీకరించాడు. విశ్వకర్మ పెళ్లి మంటపాన్ని నిర్మించాడు.
కానీ పెళ్లి ఊరేగింపు రాకపోవడంతో పెళ్లి జరగలేదు.
💠 అప్ఫడు ఆమె ధైర్యంగా తనకు పెళ్లి ఇష్టం లేదని, ఆమె తన పెళ్లి మండపాన్ని విడిచిపెట్టి, ఛత్తీస్‌గఢ్‌లోని మద్వా అని పిలువబడే "భాగ్ గయీ మండపం"కి వెళ్లిందని, బర్పాలి అనే గ్రామానికి చేరుకుందని ఇక్కడ నివసించేవారని చెబుతారు.
💠 బర్పాలికి మద్వారాణి రోడ్డు మార్గంలో ఈ గ్రామానికి చేరుకుంది, అక్కడ పెళ్లి కోసం సిద్దం అయినప్పుడు శరీరంపై పసుపు ఇక్కడి రాతిపై పడింది, దాని కారణంగా రాయి పసుపు రంగులోకి మారింది, దీనికి సాక్ష్యం ఈ గ్రామంలో ఈ రోజు కూడా చూడవచ్చు.
💠 తల్లి మద్వారాణి పర్వతం మీదనే ఆశ్రయం పొందింది. మార్గమధ్యంలో పెళ్లి మంటపం విడిచిపెట్టినందుకు తల్లికి మద్వారాణి అని పేరు పెట్టారు.
💠 ఇక్కడ మీరు ఆలయానికి వచ్చినప్పుడు, మీరు ఇక్కడ కల్మి చెట్లను చూస్తారు, దాని గురించి మా మద్వారాణి తన భక్తుల కోసం కల్మీ చెట్టును నాటినప్పుడు, నవరాత్రులు వచ్చినప్పుడు, ఆకులలో, చెట్లు చుట్టూ జొన్న పంట పెరుగుతుంది, దానికి మీరు సాక్ష్యం ఇక్కడి గ్రామస్తుల నుండి పొందవచ్చు.
ఇది అడగడం ద్వారా తెలుసుకోవచ్చు మరియు జొన్న పంట పెరిగినప్పుడు, ఈ అంటుకట్టిన చెట్ల చుట్టూ పాములు తిరుగుతున్నట్లు కూడా చెబుతారు.
💠 ఒక కల్మి చెట్టును నరికిన తరువాత, తల్లి మద్వారాణి తన నలుగురు సోదరీమణులతో అక్కడికి వచ్చి తన శక్తిని అక్కడ ఉంచి, దానిని ఐదు రాళ్లలో చేర్చి, నేటికీ పిండి రూపంలో పూజించబడుతుందని నమ్ముతారు.
💠 ఇక్కడి అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులకు సహాయం చేస్తూ ఉంటారని చెబుతారు. ఆమె మానవ రూపంలో వచ్చి తప్పిపోయిన ప్రజలకు మార్గం చూపుతుంది. దాహంతో ఉన్నవారికి నీరు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తుంది.
💠 మద్వారాణి ఆలయానికి ప్రక్కనే కాళీ దేవి ఆలయం, కాలభైరవ బాబా ఆలయం మరియు హనుమాన్ ఆలయం ఉన్నాయి.
💠 రైలు ద్వారా: కోర్బా రైల్వే స్టేషన్ నుండి 30 కి.మీ దూరంలో మరియు చంపా రైల్వే స్టేషన్ నుండి 35 కి.మీ దూరంలో ఉంది.
మూర్ఖుడు
శ్లోకం:☝️
*ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే*
*గతం న శోచామి కృతం న మన్యే |*
*ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్*
*కిం కారణం భోజ భవామి మూర్ఖః ||*
భావం: నేను నడుస్తూ తినను, నవ్వుతూ మాట్లాడను, గడచిన కష్టాల గురించి దుఃఖించను. నేను గతం గురించి ఆలోచించను. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆహ్వానం లేకుండా వెళ్లి మూడవవాడిని కాను. నేను ఇవి చేయనందున నిజంగా బుద్ధిశాలిని. అలాంటప్పుడు, ఓ భోజరాజా! నన్ను ఎందుకు మూర్ఖుడు అని పిలుస్తావు?
ఒకసారి భోజరాజు తన రాణిని ఆమె తోటలో సందర్శించడానికి వెళ్ళాడు. తన ఇష్టసఖితో ఏకాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్న ఆమెను చూశాడు. వారి ఏకాంతాన్ని గౌరవించకుండా, రాజు లోపలికి వచ్చాడు. రాణి అతనిని సమీపించడం చూసి, "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని పిలిచింది.
తరువాత, భోజరాజు తన రాజభవనానికి తిరిగి వచ్చి, రాణి తనను మూర్ఖునిగా ఎందుకు సంబోధించిందో ఆలోచించి సరైన సమాధానం రాకపోవడంతో, అతను ఒక ఉపాయం పన్నాడు.
భోజుని ఆస్థానంలో 14 మంది పండితులు కవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆస్థానంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అతను ఇలా అన్నాడు: "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని
వారిలో ఎవరికీ ఎలాంటి స్పందన లేదు. వారు తమ తమ స్థానాలలో కూర్చున్నారు, "ప్రభువు నన్ను మూర్ఖుడని ఎందుకు సంబంధించారు? నన్ను ఎంతో గౌరవించేవాడు కదా! మూర్ఖుడిని ఆస్థానంలో ఎవరు నియమిస్తారు?"
చివరికి మహాకవి కాళిదాసు ఆస్థానంలోకి ప్రవేశించాడు. రాజు తన వింత సంబోధనని పునరావృతం చేస్తూ, "లోపలికి రండి, మూర్ఖుడా" అన్నాడు! "మూర్ఖడ"నే పదాన్ని కవి విన్న వెంటనే, అతను దానిని ఒక రకమైన సమస్య అనుకుని స్వీకరించి, తక్షణమే పై శ్లోక రూపంలో పూరణ ఇచ్చాడు.🙏
పంచాంగం 21.09.2023 Thursday,
ఈ రోజు పంచాంగం 21.09.2023 Thursday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: షష్థి తిధి బృహస్పతి వాసర: అనురాధ నక్షత్రం ప్రీతి యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం
షష్థి మధ్యాహ్నం 02:09 వరకు.
అనురాధ మధ్యాహ్నం 03:30 వరకు .
సూర్యోదయం : 06:08
సూర్యాస్తమయం : 06:10
వర్జ్యం : రాత్రి 09:05 నుండి 10:41 వరకు.
దుర్ముహూర్తం : పగలు 10:09 నుండి 10:57 వరకు తిరిగి మధ్యాహ్నం 02:57 నుండి 03:46 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శుభోదయ:, నమస్కార:























