🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
*ఓం నమో భగవతే రామకృష్ణాయ*
*🚩శ్రీ వివేకానందస్వామి🚩*
*🚩జీవిత గాథ🚩*
*భాగం 45*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*నరేంద్రుని పరీక్ష*
"మీ గురువును పగటి పూట పరీక్షించండి, రాత్రి కూడా పరీక్షించండి. అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు కూడా అందుకు సాహసించాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు శశధర పండితుని ఇంటిని పావనం చేశారు. అప్పుడు ఇంట్లోని ఒక వ్యక్తి త్రాగడానిక ఆయనకు మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసును పుచ్చుకొన్న శ్రీరామకృష్ణులు ఆ నీరు
త్రాగలేదు. ఎవరి కంటా పడకుండా ఆ నీటిని క్రింద పారబోశారు. నరేంద్రుడు ఇదంతా గమనించాడు. తదనంతరం మంచినీటిని తెచ్చిన ఆ వ్యక్తిని గురించి వాకబు చేసినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది - ఆ వ్యక్తి దుశ్శీలుడు.
శ్రీరామకృష్ణులు కామాన్నీ, ధనేచ్ఛనూ సమూలంగా త్యజించిన వ్యక్తి. ఆయన ధనం మాత్రమే కాక, ఏ లోహపు వస్తువునూ తాకలేరు. ఒకవేళ తాకితే ఆయన చేతులు ఏదో తేలు కుట్టినట్లు కొంకర్లు పోయేవి. ఈ విషయం కూడా నమ్మడానికి నరేంద్రుడు సిద్ధంగా లేడు. దీనిని పరీక్షించాలనుకొని ఒక రోజు శ్రీరామకృష్ణులు గదిలో లేనప్పుడు ఆయన పడక క్రింద ఒక నాణెం ఉంచాడు.
తరువాత గదిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు పడక మీద కూర్చున్నారు. మరుక్షణమే విలవిలలాడుతూ లేచారు. అందుకు కారణం ఏమిటోనని అందరూ పడకను క్షుణ్ణంగా పరీక్షించారు. పడకను దులిపినప్పుడు ఒక నాణెం క్రింద పడింది. శ్రీరామకృష్ణులు తమ ప్రియతమ శిష్యునిపై అర్థవంతమైన దృక్కును సారించారు. నరేంద్రుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి