21, సెప్టెంబర్ 2023, గురువారం

చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      


                   -----------------------     


                                  సందేశం - 5/11 


గణపతి పూజ - దూర్వాయుగ్మం (గరిక)          


    గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక. 

    ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

   తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

   దూర్వాయుగ్మం అంటే రెండు కొసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహా ఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    గరిక  

  - మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది. 

  - కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

  - చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

  - ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.


    దూర్వాయుగ్మం (జంట గరిక) తీసుకొని, ఈ క్రింది 21 నామాలతో వినాయకునికి పూజచేస్తాం.       


1. సుముఖాయ నమః 

2. గణాధిపాయ నమః 

3. ఉమాపుత్రాయ నమః 

4. గజాననాయ నమః 

5. హరశూనవే నమః 

6. లంబోదరాయ నమః 

7. గుహాగ్రజాయ నమః 

8. గజకర్ణాయ నమః 

9. ఏకదంతాయ నమః 

10. వికటాయ నమః 

11. భిన్నదంతాయ నమః 

12. వటవే నమః 

13. సర్వేశ్వరాయ నమః 

14. ఫాలచంద్రాయ నమః 

15. హేరంబాయ నమః 

16. శూర్పకర్ణాయ నమః 

17. సురాగ్రజాయ నమః 

18. ఇభవక్త్రాయ నమః 

19. వినాయకాయ నమః 

20. సురసేవితాయ నమః 

21. కపిలాయ నమః          


                    =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: