🎻🌹🙏హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?
🌸జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.
🌿ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.
🌸12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
🌿జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు.
🌸ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది.
🌿వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా,
🌸ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.
🌿13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
🌸జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.
🌿14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
🌸జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.
🌿15. కపీశ అంటే అర్థం ఏమిటి?
🌸జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.
🌿16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
🌸జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు
🌿17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ?
🌸జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే
అగ్ని ముఖావై దేవాః.
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము.
🌿 అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది.
🌸వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు.
🌿 అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు.
🌸 అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అని మాత్రమే కాదు.
🌿18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
🌸జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.
🌿19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
🌸జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.
🌿20 . నామస్మరణ మహిమ ఏమిటి?
🌸జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం....స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి