7, అక్టోబర్ 2023, శనివారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-67🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-67🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఈసన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్ష్ముణులతో కొలువై ఉన్నారు

ఇందుకు కారణమేమనగా;


దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమునకు "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని (విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది. 


ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట. 


ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడా వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలై లోని తిరువేంగడముడై యాన్ సన్నిధిలో వేంచేసింప చేసారు


. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.


ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధికై కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించారు.


 ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు చేయబడుచున్నది.


ఇట్లే "తిరుక్కురువై" అనే గ్రామంలో "కురువైనంబి" అనుకుమ్మరి శ్రీవేజ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు. 


అతడు పరమపదించు సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆ భక్తునకు దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట. 


ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆగ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదుల లేక సహజరూపంలో ఉండు శ్రీవేజ్కటాచలపతిని, ఆప్రక్కనే "కురువైనంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.


 ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.


శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట. 


ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట. 


మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామి పాదములు దర్శనమిచ్చినవి. 


శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్భుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడా అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించారు.


తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు


భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్దసంగ్రహమును ఉపన్యసించారు.


అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే

విసత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే

శ్రుతి శిరసి విదిప్తే బ్రహ్మణి శ్రీనివాసే

భవతు మమ నరస్మిన్ శేముషీ భక్తిరూపా||


అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈ ఆలయ ప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చు చున్నది. మరియు ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు.


 వీరు శ్రీవేంకటాచలాదీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!


ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్దులైన శ్రీవేదాన్త దేశికులవారి "దయాశతకమ్" అగ్రగణ్యమైనది

.తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకును కరుణైక పాత్రమ్" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళ మహామునుల అష్టదిగ్గజములలో నొకరైన "శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామిని గూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించారు.


 ఇవినేడును అనుదినం ఉష:కాల సేవలో స్వామియొద్ద అనుసంధింపబడును బహుళప్రచారం పొందియున్నవి.


శ్రీగోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు. 


శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీశ్రీశ్రీ పరకాల మఠం జీయర్స్వామివారు (మైసూర్) "అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీశ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు. 


పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు. 


తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి.దేవస్థానం వారు స్వర పరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించారు. 


పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించారు.


మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయేగాక స్వామి మహిమలను ప్రత్యక్షముగా నిరూపించింది.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 57*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 57*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేము. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రదావస్థలో జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరియైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం.


నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తన లాంటి తన 'కవల'ను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే!  అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా, నరేంద్రుడు చేసేదంతా ఆ 'కవల' కూడా చేసేవాడు. కొన్ని సమయాల్లో ఒక గంటసేపటి దాకా ఆ 'కవల' ఉండేవాడు. ఈ విషయాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కాని ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు; అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని మాత్రం ఆయన చెప్పారు. '


మరొక అనుభవం: ఒక రోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, "ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసివున్నాను! ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది, ఏం ఆశ్చర్యం!" అన్నాడు. తమాషా ఏమిటంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అదే మొట్టమొదటిసారి. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు:


"చిన్నతనం నుండే కొన్ని చోట్లను, వస్తువులను, వ్యక్తులను చూసినప్పుడు, వారిని మునుపే చూసాను, మెలగాను అనే భావన కొన్ని సమయాలలో కలగడం కద్దు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి రాదు. అలాగని వారిని అంతకు మునుపు చూడలేదనీ చెప్పలేను. ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతుంది. 


మిత్రులతో మాట్లాడుతూవుంటాను. హఠాత్తుగా వారిలో ఏదో ఒక మాట నా జ్ఞాపకాన్ని రగుల్కొల్పుతుంది. 'ఇదే విషయం గురించి వీరితో ఇదే ఇంట్లో మునుపు కూడా మాట్లాడివున్నాను. కచ్చితంగా ఈ మిత్రుడే అప్పుడూ ఇదే అభిప్రాయం వెల్లడించాడు' అని అనిపిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడ, ఎప్పుడు అని మాత్రం జ్ఞాపకానికి రాదు. 


పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకొన్నప్పుడు, ఈ చోట్లను ఈ వ్యక్తులను గత జన్మలలో కలుసుకొని ఉండవచ్చు, ఆ జ్ఞాపకాలే కాస్త అప్పుడప్పుడు వస్తున్నాయని సరి పెట్టుకొన్నాను. కాని ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు. ఇప్పుడు నాకు నిజం బోధ పడింది. నేను ఈ జన్మలో ఎవరెవరిని ఎక్కడ, ఎప్పుడు ఎలా కలుసుకోబోతున్నాను, మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునుపే చిత్రప్రదర్శనలా చూసివుండాలి; ఆ జ్ఞాపకాలే అప్పుడప్పుడు మనస్సులో మెదలుతున్నాయి.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 46*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 46*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

      

      *లలాటం లావణ్య ద్యుతివిమల మాభాతి తవ యత్*

       *ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |*

       *విపర్యాసన్యాసా దుభయ మపి సమ్భూయ చ మిథః*

        *సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ‖* 


అమ్మవారి లలాటము గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో.


ఆ లలాటము ఎలా వున్నది?

ఆమె లలాటము లావణ్యమై కాంతివంతంగా వున్నది. తెల్లని కాంతులను చిమ్ముతున్నది. ముత్యములోని తెల్లని కాంతినీ, నునుపుదనాన్నీ లావణ్యం అంటారు. అలాగే ఉప్పులోని తెల్లని కాంతిని కూడా. అందుకే లవణము అని పేరు.


ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ = అష్టమినాటి చంద్రబింబం శుక్లపక్షం లోనూ, కృష్ణపక్షంలోనూ ఒక్కలాగే ఉంటుంది. 

శివ, పార్వతులు లలాటంపై ధరించే శుక్ల తదియ నాటి చంద్రకళ యొక్క రెండు కొసలు కలిపితే ఎలా ఉంటుందో నీ లలాటము అలాగ వున్నదమ్మా అంటున్నారు ఇక్కడ. రెండవ సగభాగం అమ్మవారి కిరీటము క్రింది భాగంలో ఉండి, రెండూ కలిపి పూర్ణ చంద్రబింబంలాగా వున్నదమ్మా!


విపర్యాసన్యాసా దుభయమపి సమ్భూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః = ఈ రెండు అర్ధచంద్ర బింబములను అమృత లేపముతో అతికించినట్లుగా ఉందమ్మా! రాకా హిమకరుడు అంటే పూర్ణ చంద్రుడు.


*అష్టమీచంద్ర విభ్రాజదళికస్థలశోభితా* *ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా* అమ్మవారి సహస్రనామాల్లోనివి.అమ్మవారి లలాటము అష్టమి నాటి చంద్రుని కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆమె ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రునిలో మచ్చ వలె ఉన్నదట.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సాయి బాబా

 ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా*  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.

సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.


ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..

1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, 

మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..


1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. 

హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..


(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )


 *సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.

 *సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*

*సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  

  ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*


 విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..


1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..

ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..

కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 


దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..


 ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..


హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.

* *

సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),

ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 


శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "


ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43


సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 

(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )


" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 

 " పేజీ No. 103 &

" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 

" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )


సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.

               * *

సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,  

ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. 

తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. 

  * * *

ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. 

తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,

    **  

త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  

అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, 

విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.

విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,

అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,

కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?


ఇందులో నే   పెద్ద కుట్ర  ఉన్నది..


హిందువుల ఆహారపు అలవాట్ల పై  " హలాల్ " పేరుతో  దాడి.

(హలాల్ ఆంటే " అల్లా కు అర్పించి,,  ఇస్లాం  నిబంధనలు ప్రకారం  చేసిన  ఆహారం ).


ధార్గాలు ( సామాధులు / గోరీలు ) ల పేరు తో   హిందూ గ్రామ దేవాతలపై  దాడి,


ఇప్పుడు,    సాయిబాబా ( సాయిబు ) పేరుతో   హిందూ ప్రధాన  దేవాతలపై  దాడి,,


ఒక అల్లా ను ఆరాధించి, మసీదు లో  ఉండి  నమాజ్  చేసే  ఒక  సాయిబు ను  హిందూ ధర్మం లో  ఒక Plan ప్రకారం  ప్రవేశపెట్టినారు,,  first ధాత్తత్రేయ అవతారం  అన్నారు,  క్రమం గా,  సాయిరాం, సాయికృష్ణ  అంటూ  హిందూ ప్రధాన దేవుళ్ళ పై దాడి ప్రారంభించారు,,  ఇప్పుడు, ఏకంగా  విష్ణు సాయి సహస్ర నామాలు అంటూ  పుస్తకాలు కూడా వ్రాసినారు,, ఒక Plan ప్రకారం  అన్ని  ప్రాంతలలో  పెద్ద పెద్ద విగ్రహాలు ( కనీసం 20 అడుగులు ) కడుతున్నారు. 


ముస్లిం మేధావులు ఎప్పటినుంచో చెపుతున్నారు   , నమాజ్ చేసి, అల్లా మాలిక్ అంటూ   అల్లా  ను ఆరాధించిన   సాయిబాబా ను  పూజించడం ఆంటే, అల్లా ను ఆరాదించడమే అని,,


చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న  ఈ ప్రమాదం ను    అడ్డుకట్ట వెయ్యక పోతే, భవిష్యత్ లో  హిందూ ధర్మం నాశనం అవుతుంది......

👆🏼👆🏼👆🏼👇🏾👇🏾👇🏾

రామాయణ భారత భాగవతాలలో 

ముస్లిం కుటుంబాలలో

ఎక్కడా కనిపించని 

సాయి

సాయిరాం

సాయి కృష్ణ

హిందువుల కుటుంబాలలో

రాముడు 

కృష్ణుడు 

ఈశ్వరుడు 

వెంకటేశ్వరస్వామి లను

మించిన దైవముగా వెలుగొందుతున్నాడు.


ఎంతలా అంటే

రాముడు కృష్ణుడు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామిల కన్నా సాయిబాబానే అసలు సిసలైన దేవుడిగా నిత్యం సాయి స్మరణ చేసుకుంటూ కొంతమంది హిందువులు జీవిస్తున్నారు.

మరీ ముఖ్యంగా రామాయణ భారత భాగవత పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన బ్రాహ్మణ పండిత పూజారి ఉత్తమలు కూడా సాయి నామ స్మరణలో నిత్యం జీవిస్తున్నారు


సాయిబాబా అసలు హిందువా ముస్లిమా

హిందువు అయితే హిందువులందరి కుటుంబాలలో తండ్రి తాత ముత్తాతలు అందరూ పూజించాలి కదా

ముస్లిం అయితే ప్రతి ముస్లిం కుటుంబంలో ముస్లింలందరూ సాయిబాబాను పూజించాలి కదా

ముస్లిం ఐనా సాయిబాబా

ఒక్క ముస్లిం ఇంట్లో కూడా లేడు. 

సాయిబాబాను ముస్లింలందరూ బహిష్కరించారా


హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి


మీ తండ్రులు

మీ తాతలు

ముత్తాతలు

సాయిబాబాను పూజించారా

రామ కృష్ణ ఈశ్వర వెంకటేశ్వర తదితర హిందూ దేవుళ్లను పూజించారా

ఒక్కసారి లోతుగా ఆలోచించగలరని ఓ హిందువుగా నా మనవి

🚩🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🚩

*మీ*

*సగటు హిందూ అభిమాని*


*NOTE:-*

*ప్రపంచంలోHC హిందువులంత అమాయకులు మరియు మనం మోసపోయినంత ఈజీగా ఎవరూ ఉండరు......!!!


Disclaimer. The above message is not the opinion of this blogger. The message obtained from Watts app is pasted


భక్తిసుధ


ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం౹*

*వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం౹*

*వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


// *శివస్తుతి - 5* //


ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

కళ్ళు తెరువు ఇండియా

 _*అమెరికా - కళ్ళు తెరువు ఇండియా !*_

------------------------


అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధి మాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందు కొస్తున్నాయా అని తెగ పరిశీలించా చాలా సార్లు. వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. అవి, 


1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్. అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. 


2. ఆహారదోషాలు. అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.


3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి వివరీతంగా తీసుకోవడం.


4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.


5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం. 


6.. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.


ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టి పారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.


మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను.  వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితు లేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకోని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది.  ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది.  మొదటి రోజు నుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌ తున్నట్లు అనిపించింది.  అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున  మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రాడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు.


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి.చ చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యే సరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే బిత్తరపోయే నిజాలు బయటపడ్డాయి.


_ఇక్కడ స్టోర్స్ లో, 'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది._


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్  ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతి కరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.


ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !


_అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు.  వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు._


చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్  లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లిన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం  ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలై పోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్ అయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !

________________

సేకరణ        *బాబ్ లాల్*


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

*07-10-2023* *రాశి ఫలితాలు

 *శనివారం* 

  *స్థిర వాసరః* 

 *07-10-2023*

*రాశి ఫలితాలు*

*మేషం*

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

*వృషభం*

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. కీలక వ్యవహారాలలో ముఖ్యమైన  నిర్ణయాలు  వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. 

*మిధునం*

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.

*కర్కాటకం*

నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

*సింహం*

 సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు.  వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*కన్య*

ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.  కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది.

*తుల*

చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.  కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

*వృశ్చికం*

రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

*ధనస్సు*

పాత విషయాలు గుర్తుకు వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన  కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

*మకరం*

విలువైన వస్తు  లాభలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

*కుంభం*

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.  వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. 

*మీనం*

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. 

🕉

భక్తిసుధ


ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం౹*

*వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం౹*

*వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


// *శివస్తుతి - 5* //


ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

గుణ సంకేతపదం

 కృష్ణ ప్రసాద్ ఆలూ


* బ్రాహ్మణుడు" అంటే ఎవరు..?


'బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.


రాజులకు జన్మించిన వాడు రాజు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం, వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి.


బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల *బ్రాహ్మణత్వం *లభిస్తుంది.


బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు *బ్రాహ్మణుడు గా* జీవించడం గొప్ప


సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.


సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీ రాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీ కృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలేవి


బ్రాహ్మణత్వం కాదు.


(వేదాలలో ఎక్కడా కుల ప్రసక్తి లేదు )


జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం..


బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చేసుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు. సుఖాభిలాష ఉండరాదు. వికారాలు ధరించకూడదు. మద్యపానం చేయకూడదు. మాంసాహారం ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోను కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్దం చెప్పకూడదు. అనైతిక ధనాన్ని, అశుద్ధ సుఖాలను అభిలాషించకూడదు. స్త్రీల వంక నిశితంగా చూడకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించారాదు. ప్రాణులను కర్రతో కానీ, రాయితో కానీ కొట్టరాదు. ఏ విధమైన అధర్మ వ్యాపారాలు చేయకూడదు. సినిమాలు, నాటకాలు మున్నగునవి చూడకూడదు. సర్వజన శాంతి సుఖాలకోసం దేవుని ప్రార్థించాలి. దైవప్రార్థనలో తన స్వార్థం విడచి జనాహితాన్ని కోరాలి. మనసు, మాట, శరీరం, పని లోకహితార్థమై ఉండాలి. కోరికలను త్యజించాలి.


బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మ మూర్తినే బ్రాహ్మణుడు అని


భావించి గౌరవించాలి, నమస్కరించాలి.


ధార్మిక లక్షణాలున్న వారు ఎవరైనా బ్రాహ్మణులే!


భీష్మ పితామహుడు శ్రీ కృష్ణుడిని " సుబ్రహ్మణ్యం" అని అనేవాడు.


'బ్రాహ్మణ్యం' కుల సంకేతపదం కాదు. గుణ సంకేతపదం.. ఈ విషయాలన్నీ మీకు పరిపూర్ణంగా అర్ధం. అవ్వటం కోసం చెప్తున్నాను.


మీ మిత్రుడు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి

Greatness


 

నవగ్రహ పురాణం - 73 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 73 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*కుజగ్రహ చరిత్ర - 3*


*"అమ్మా ! నేను మంగళవారం జన్మించాను ! నాకు నువ్వు నేడు - అంటే మంగళవారమే దర్శనం అనుగ్రహించావు. నా పేరు మంగళుడు ! ఈ 'మంగళ' శబ్దం మనిద్దరినీ కలిపి ఉంచాలి. నా నామధేయం నీ నామధేయంతో కలిసి పరమపావనం కావాలి ! అనుగ్రహించు !"*


*“తథాస్తు ! నీ ఆలోచనా సరళి నన్ను అలరిస్తోంది."* పార్వతి చిరునవ్వులు చిందిస్తూ అంది. *"నువ్వు ఆవిర్భవించింది మంగళవారం ! నేను నీ ముందు అవతరించింది మంగళవారం ! నీ పేరు మంగళ... నా పేరు కూడా మంగళను స్వీకరిస్తుంది. 'చండిక' అయిన నేను ఈనాటి నుండి 'మంగళ చండిక'గా వ్యవహరింపబడతాను !”*


*"ధన్యోస్మి మాతా, మంగళ చండికా !”*


*"ఇంకా ఏం కావాలో కోరుకో కుమారా !”*


*“అమ్మా ! నీకు ఇష్టమైన వరం ప్రసాదించు !"* కుజుడు వినయంగా అన్నాడు.


*"నీ వినయం , నీ ఆప్యాయతా నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పరమేశ్వరుల స్వేదపుత్రుడుగా జన్మించావు , నా నామధేయాన్ని నీ నామధేయంతో పొదుగుకున్నావు. పేరును అంటిపెట్టుకుని నీ పేరు ఉన్నట్టే - నా సమీపాన నువ్వు ఎప్పుడూ ఉండేలా వరమిస్తున్నాను...”*


*“అమ్మా !”*


*"ఔను ! ఈ మంగళచండిక గ్రామ దేవతగా ఎక్కడెక్కడ నెలకొని ఉంటుందో , అక్కడ నువ్వు నెలకొని ఉంటావు ! నాతో బాటుగా పూజలు అందుకుంటావు !"*


*“ధన్యోస్మి మాతా !”* కుజుడు చేతులు జోడించాడు.


*"మంగళా ! నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నిన్ను ఆరాధించే వాళ్ళకు నా అనుగ్రహం లభిస్తుంది !"* మంగళచండిక చెయ్యెత్తి దీవిస్తూ అంది. 


కుజుడు భక్తి పారవశ్యంతో చండిక చరణాల ముందు సాగిలపడి , సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇందాక ఆ ప్రాంతాన్ని ఆవరించిన మనోహర సుగంధం దూరంగా వెళ్తున్నట్టు అనిపించింది కుజుడికి. మెల్లగా పైకి లేచాడు.


అంబ అప్పటికే అంతర్థానమైంది.


*"చాలా సంతోషం నాయనా ! ఊహకు అందని దివ్యమైన వరం కోరావు !"* భూదేవి మెచ్చుకుంటూ అంది. *"నీ మాతృభక్తి నీకు తెలియకుండానే , చిగురు తొడిగింది. నీ జనకులు పరమేశ్వరులు నీ జనన సమయంలో ప్రసాదించిన పేరులో ఈ అమ్మ భూదేవి మిళితమై ఉంది. ఆ తండ్రికి ఇల్లాలైన ఆ చండిక కూడా నీ పేరులో మిళితమైంది. ఇందులోని అద్భుతమైన విశేషమేమిటో నీకు తెలుసా , కుజా ?"*


కుజుడు మంత్రముగ్ధుడిలా తల అడ్డంగా ఊపి , తనకు తెలియదని తెలియజేశాడు.


భూదేవి చిరునవ్వు నవ్వింది. *“నీ నామధేయంతో తమ నామధేయాలను కలిపి అల్లుకున్న తల్లులిద్దరిలో ఎవ్వరూ నిన్ను కన్నతల్లి కాదు. అంటే ఈ భూమాత నిన్ను కనలేదు. ఆ చండికామాతా నిన్ను కనలేదు ! అంటే , గర్భవాసక్లేశం అనేది లేకుండా... జన్మించిన మహా అదృష్టం నీది ! నీ జననంలోని విశేషం ఇదే ! అలాగే గర్భభార క్లేశమూ , ప్రసవ వేదన , ప్రసవమూ అనేవి లేకుండా నీకు తల్లులైన అదృష్టం ఆ దేవిదీ , నాదీ !"*


*"అమ్మా , నీ మాటలు వింటూంటే నేను మహాభాగ్యశాలి ననిపిస్తోంది !"* కుజుడు ఆనందంగా అన్నాడు.


*"అందుకు సందేహం లేదు నాయనా ! నిన్ను సేవించే వాళ్ళకూ ఆ మహద్భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు నీకు సేవలు చేయడానికి పత్ని కావాలి. తగిన వధువును అన్వేషించు ! పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులతో వివాహం జరిపిస్తా !”* అంది భూదేవి.


*"అలాగే , అమ్మా ! వధూన్వేషణ ప్రారంభిస్తాను. ఆశీర్వదించు !"* కుజుడు. నమస్కరించాడు.


*"విజయోస్తు ! కళ్యాణమస్తు !"* భూదేవి ద్విముఖంగా ఆశ్వీరదించింది.


భూమాత దీవించినట్లే కుజుడు - వధువు కోసం సాగించిన అన్వేషణలో విజయం సిద్ధించింది. 'శక్తి' అనే సౌందర్యవతి లభించింది. ఆమెతో కుజుడి కళ్యాణం వైభవంగా జరిగింది. పార్వతీపరమేశ్వరులూ , లక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ బ్రహ్మలూ నూతన దంపతులను దీవించారు.


*“నాయనా , త్రిమూర్తుల ఆదేశం ప్రకారం విశ్వకర్మ నీకు మందిరం నిర్మించాడు. సతీసమేతంగా నీ మందిరంలో నివాసం ప్రారంభించు !”* భూదేవి కుజుడితో అంది. కుజుడు విచారంగా ఆమె వైపు చూశాడు. *"నిన్ను వదిలి వెళ్ళను !"* అన్నాడు నిష్కర్షగా.


భూదేవి చిరునవ్వు నవ్వింది. *"తప్పదు నాయనా ! నువ్వు కారణజన్ముడివి. నీ ఆవిర్భావానికి ఒక ఉద్దేశం , ఒక మహాలక్ష్యం ఉన్నాయి. ఆ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు నీ స్థానంలో ఉండి తీరాలి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికీ పోలేవు. ఎక్కడ ఉన్నా నన్ను దర్శించకుండా ఉండలేవు. నేను విపులను ! విపులమైన విస్తారమైన పృథ్విని కదా నేను !"*


కుజుడి ముఖం మీద చిరునవ్వు పరుచుకుంది. *“ఎక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం అక్కడికే వెళ్తాను !”* అంటూ కుజుడు భూమాతను కౌగిలించుకున్నాడు. శక్తి కళ్ళల్లో ఆనందబాష్పాలు నిండుతున్నాయి.



*“గురువుగారూ , నవగ్రహాల చరిత్రలు విన సొంపుగా ఉన్నాయి ! ప్రతీ చరిత్రలోనూ ఒక పరమార్థం ఉంది !"* చిదానందుడు ఉత్సాహంగా అన్నాడు. కుజుని చరిత్ర ముగించిన నిర్వికల్పానందతో. 


*"అవును ! ఇప్పుడు మీరు ఆలకించబోయే బుధుడి చరిత్ర ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. అది అద్భుతాలకు ఆటపట్టు !"* నిర్వికల్పానంద అన్నాడు. 


*"పితామహులైన అత్రి మహర్షి వద్ద విద్యాభ్యాసం చేస్తూ బుధుడు పెరుగుతున్నాడని విన్నాం !"* సదానందుడు గుర్తు చేసుకున్నాడు..


*"అత్రీ అనసూయల పెంపకంలో బుధుడు యువకుడయ్యాడు. అతడు స్వయం సాధనలో , స్వయం పోషణలో జీవించాల్సిన సమయం వచ్చినట్టు గుర్తించాడు అత్రి మహర్షి. ఆ విషయాన్ని సతీమణి అనసూయతో చర్చించాడు...”* నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు...




*రేపటి నుండి బుధగ్రహ చరిత్ర ప్రారంభం*

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,52వ శ్లోకం*


 *యధాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి |* 

 *తదా గంతాసి నిర్వేదం శ్రోత వ్యస్య శ్రుతస్య చ||* 


 *ప్రతిపదార్థం* 


యదా = ఎప్పుడైతే; తే =నీ యొక్క; మోహ = మోహము ; కలిలం =క్లిష్టపరిస్థితి (ఊబి); బుద్ధిః = బుద్ధి; వ్యతితరిష్యతి = దాటిపోవును; తదా = అప్పుడు; గంతాసి = నీవు పొందెదవు; నిర్వేదం = వైరాగ్యమును; శ్రోతవ్యస్య = ఇంకా వినబోయే దానికి; శ్రుతస్య =ఇప్పటి దాక విన్న దానికి; చ = మరియు.


 *తాత్పర్యము* 


 మోహమనెడి  ఊబి నుండి పూర్తిగా బయటపడి నప్పుడే నీవు వినిన, వినబోవు ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 347

 రామాయణమ్ 347

...

చిన్నాన్నా! ఏమిటీ పిరికితనము!మనకులములో పుట్టని సామాన్యుడు కూడా ఈ విధముగా మాటలాడడే నీకెచటినుండి వచ్చినదీ బేలతనము ! ఒక సామాన్య రాజపుత్రయువకుని చూసి మనము భయపడుటయా?

.

ముల్లోకములకూ ప్రభువైన దేవేంద్రుని నేను నేలపై పడవేసి ఈడ్వలేదా ! అది నీకు గురుతులేదా! ఐరావతదంతములు ఊడబెరికి దేవతలను భయభ్రాంతులకు గురిచేయలేదా !

.

అంతటి మహాపరాక్రమవంతుడనైన నేను ఆ రామలక్ష్మణులను ఓడించలేనా ? ఎందుకు పినతండ్రీ ఈ అర్ధములేని వ్యర్ధపు పిరికి మాటలు ....అని ఇంద్రజిత్తు విభీషణునితో గర్వముగా పలికెను.

.

అది విని విభీషణుడు ," నాయనా మేఘనాధా ! నీవింకా చిన్నవాడవు ! బుద్ధి పరిపాకము చెందలేదు ! మంత్రాంగమునందు నీకింకా నిశ్చితమైన బుద్ధిలేదు .నీ మాటలు ఆత్మవినాశకారకములు.

.

తీక్షణమైన స్వభావము కల!

 నిన్ను ఈ మంత్రాంగమందిరములోనికి అనుమతించినవాడు దండనార్హుడు.

.

రామబాణములు మృత్యుదేవత ఒడిలోనికి నెట్టివేయు యమదండములు అవి మనజాతికి పెనుగండములు.

.

రాజా ! నా మాట విను సీతమ్మను సర్వరాజలాంఛనాలతో ఆయనకు అప్పగించు. నా మాట విను మన జాతిని కాపాడు అని రాక్షససార్వభౌముని వేడుకొన్నాడు.

.

స్థిరగంభీరముగా హితవుపలికిన విభీషణుని చూసి ఈసడించి, ఛీ ! శత్రువుతోనైనా బ్రతుకవచ్చు

పామును ఒడిలో పడుకొనపెట్టుకొనవచ్చు !...కానీ నీలాంటి బంధువు రూపములోని శత్రువుతో ఒక్క క్షణము కూడా కలిసి ఉండలేము. 

.

జ్ఞాతుల స్వభావమే అంత! వారు తమకన్నా ప్రధానుడు,విద్యావంతుడు,శూరుడు అయిన వానిని తిరస్కరింతురు.

.

ఒక పూవునుండి మకరందము సేకరించు తుమ్మెద ఆ పూవువద్ద కృతజ్ఞతతో ఉండక మరియొక పూవు వద్దకు వెళ్ళును .నీవునూ అట్లే ! 

.

నీవు కాక మరొకడెవ్వడైనా ఇటుల మాటలాడి ఉన్నచో వాని కుత్తుక ఈ పాటికే ఉత్తరింపబడియుండెడిది.

.

ఛీ! కులద్రోహీ వెళ్ళిపో నా ముందునుండి అని తీవ్రముగా హెచ్చరించాడు రావణుడు.

.

ఆ వెనువెంటనే విభీషణుడు గద ధరించి ఆకసములోనికి ఎగురగా ఆయనను నలుగురు సహచరులు అనుసరించిరి.

.

వూటుకూరు జానకిరామారావు 

.


.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - అష్టమి / నవమి - పునర్వసు -  స్థిర వాసరే* *(07-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

పదవిని బట్టి విలువ!

 


పదవిని బట్టి  విలువ!

              

           ఉ: "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ?  వికాసము నిత్తువొ?  విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!


                       

                            విచిత్రమైన పద్యమే ! కానీ  లోకంలో  నకీలీల బారిన పడి బాధపడుతున్నవారెందరో?  అలాంటి కవులెవ్వరో  రాయల పరిసరాలలో చేరి డాబుచేస్తూ, తిమ్మనకు దక్కవలసిన గౌరవాన్ని  దక్కకుండా చేస్తున్నారేమో? వారిని మనస్సులో 

పెట్టుకొని  తిమ్మనగారు యీపద్యం వ్రాశారు.


               "  ఉదయపువేళలో  సరోవరాలలో  కనిపించే  దృశ్యం,తామఱాకుపై పడిన  నీరు ముత్యంలా  తళతళలాడుతూ  కనిపిస్తుంది.సూర్యరస్మి వలన తామరపాకుకుండే  స్నిగ్ధత్వంవలన  ఆవిధంగా కనిపిస్తుంది.చూచేవారికది ముత్యమేమోనని  భ్రమకల్గిస్తుంది.

అది నీరేగానీ  ముత్యంగాదు. అదిగో దాన్ని నిందిస్తున్నట్లుగా  సాకుచేసికొని  తిమ్మనగారు  యీవిధంగా అంటున్నారు.


                            "ఓనీటి చుక్కా! తామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదు సుమా?"-అని హెచ్చరిక!


                   నేడు గూడా  యేమాత్రము విలువలేనికొందరు  మహానాయకుల నాశ్రయంచి  తామేదో మహనాయకులమన్నట్లు

డాబులు చేయువారున్నారు. అట్టి నకిలీల కందరకూ యాపద్యము చెంపపెట్టు.


                      మహా కవుల  నర్మగర్భసందేశము  లిట్లుండును!


                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷