7, మే 2024, మంగళవారం

అక్షయ తృతీయ

 అక్షయ తృతీయ ప్రాముఖ్యత:   10 5 2024 శుక్రవారం అక్షయ తృతీయ

1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5.

 వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం

అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి. బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం


                 *_🌻శుభమస్తు🌻_*

                             ఇట్లు

                              మీ

              అవధానుల శ్రీనివాస శాస్త్రి 

               ❀┉┅━❀🕉️❀┉┅━❀

          🙏 సర్వే జనాః సుఖినోభవంతు

         🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

        🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*07-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


ఆప్తుల నుండి శుభవార్తలు అవుతాయి. స్థిరాస్తి  కొనుగోలు  ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


దూరప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

సింహం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు  హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి  మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

తుల


బంధుమిత్రులతో అకారణ  వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు  ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక  వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

హాస్యానందం

 శ్రీ అధరాపురపు మురళీ కృష్ణ  గారు .


ఆలు -మగల హాస్యానందం!


"ఏఁవోయ్ .... "


"ఆఁ .... "


"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"


"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"


"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"


"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".


"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".


"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"


"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".


"ఓహో .... అలాగా?"


"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."


"ఇంకా ....?"


"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".


"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"


"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."


"అవేఁవీ కావు .... "


"మరి .... ?"


"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ  ...."


"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"


"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"


"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".


"మీరా, నేనా కదిలించింది? శ్రావణ మాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".


"శ్రీ మహా విష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే ...."


"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే .... అని చెప్పుకోవాలి".


"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".


🤫🤫🤫🤫🤫🤫🤫🤫

విఘేశ్వరునికి పూజతో

 శ్లోకం!!

గణేశస్మరణా త్పశ్చాత్.

 శుభే షోడశవాసరైః!

గృహారంభే త్రిభిః వేశే !

నగచ్చేత్ అశుభాదిషు!!


*!!భావము!!*

విఘేశ్వరునికి   పూజతో మొదలు వివాహ ఉపనయనాది శుభకార్యాల అనంతరం పదహారురోజులు దాటువరకూ.... 

శంకుస్థాపన నూతన గృహప్రవేశం వీటికి ముందు వెనుకలు మూడు రోజులు అశుభాదులకు 

(శ్రాద్ధాన్న భోక్త.భోజన. శవానుగమన,

పరామర్శాదులకు) వెళ్ళ రాదు...

మంగళవారం,మే 7,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం,మే 7,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి ఉ10.59 

వారం:మంగళవారం(భౌమవాసరే )

నక్షత్రం:అశ్విని మ3.15 

యోగం:ఆయుష్మాన్ రా9.05 

కరణం:శకుని ఉ10.59 వరకు

తదుపరి చతుష్పాత్ రా9.57 వరకు

వర్జ్యం:ఉ11.29 - 12.59 మరల రా12.22 - 1.53

దుర్ముహూర్తము:ఉ8.07 - 8.58 &

మరల రా10.48 - 11.33

అమృతకాలం:ఉ8.28 - 9.58

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి: మేషం 

సూర్యోదయం:5.35

సూర్యాస్తమయం:6.17


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.07.05.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం. 

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.36

సూ.అ.6.17

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం చతుర్దశి ప. 10.59 వరకు.

మంగళ వారం. 

నక్షత్రం అశ్విని. 

సా.3.13 వరకు. 

అమృతం ఉ. 8.26 ల ల 9.56 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.07 ల 8.58 వరకు. 

దుర్ముహూర్తం రా. 10.48 ల 11.33 వరకు. 

వర్జ్యం ప. 11.27 ల 12.57 వరకు. 

వర్జ్యం రా. 12.20 ల 1.51 వరకు. 

యోగం ఆయుష్మాన్ రా.9.01 వరకు.  

కరణం శకుని వ. 10.59 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.     

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మంగళవారం*🍁 🌹 *మే 7, 2024*🌹

 *ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ*

🍁 *మంగళవారం*🍁 

 🌹 *మే 7, 2024*🌹

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి      : *చతుర్దశి* ఉ10.59 వరకు

వారం   : *మంగళవారం* (భౌమవాసరే )

నక్షత్రం  : *అశ్విని* మ3.15 వరకు

యోగం : *ఆయుష్మాన్* రా9.05 వరకు

కరణం  : *శకుని* ఉ10.59 వరకు

       తదుపరి *చతుష్పాత్* రా9.57 వరకు

వర్జ్యం   :  *ఉ11.29 - 12.59*

               మరల *రా12.22 - 1.53*

దుర్ముహూర్తము :  *ఉ8.07 - 8.58* &

                  మరల *రా10.48 - 11.33*

అమృతకాలం    :  *ఉ8.28 - 9.58* 

రాహుకాలం       : *మ3.00 - 4.30*

యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.35* || సూర్యాస్తమయం:* *6.17*


🍒 శ్రీరామ రామ  రామేతి 

      రమే రామే మనోరమే  

     సహస్రనామ తత్తుల్యం   

     రామనామ వరాననే 🙏


🍁 *శ్రీ హనుమాన్నామము*  

     *శత విజయమస్థు*🍁

 👉 *కృష్ణాంగారక చతుర్దశి*

*సర్వేజనా సుఖినో భవంతు* 

        *శుభమమస్తు* 🙏

----------------------------------------

*_గోమాతను పూజించండి_* 

        *_గోమాతను సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఆవకాయ రుచిని

 ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామగారట మరినే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా

----------------------------------------

కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

------------------------------------------------

కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

-------------------------------------------------

కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!

---------------------------------------------

కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

-----------------------------------------------

కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

--------------------------------------------

కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

------------------------------------------------

ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

-----------------------------------------------------

ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

--------------------------------------------------

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

-----------------------------------------

మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

------------------------------------------

చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

----------------------------------------------

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

-------------------------------------------------

పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి. 

రచయిత పేరు తెలియదు. వారికి  నమస్సులు. 🌹💐🙏


*సేకరణ:- శ్రీ పురం వేంకటేశ్ ప్రసాద్ గారి పోస్టు.*

నేత్ర వ్యాధులు

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.            *🌹తాళపత్ర గ్రంధం🌹*

( అనేక గ్రంథాల్లో దాగి ఉన్న జీవన ఆచార... ఆరోగ్య సాంప్రదాయ రహస్యాలు... స్థూల అక్షరాలతో...)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.                    *భాగం 12*


*108. నేత్ర వ్యాధులు హరించుటకు?*


*ఓం కేశవ పుండరీకాక్ష నమో నమః.*

సాయంత్రపు ఎండలో కనులు మూసుకుని ఏకాంతప్రదేశంలో ధ్యానించుట ద్వారా కనులకి శక్తి, దృష్టి పెరిగి ఆనందం స్వంతమవుతుంది.


*109. అపమృత్యు భయం పోవాలంటే?*


గంధము, అక్షితలు, పుష్పములు వంటి

పూజాద్రవ్యములతో భరణీ నక్షత్రమునాడు యముణ్ని

పూజిస్తే అపమృత్యు భయం తొలగుతుంది.


*110. వంట ఇంటికీ, గృహానికి పరిమితమైతే మీ ఆయుషు పదేళ్ళు తగ్గినట్టే?*


ముఖ్యంగా భారత దేశంలో మహిళలు పై రెంటికే

పరిమితమవుతుంటారు. పూర్వకాలంలో గృహం పెద్ద

ఆవరణలో ఉండేది. దానితో వారు ఆ ఆవరణలో

ఇంటి పనులకు తిరగటం వల్ల సూర్య కిరణాల నుండి

వచ్చే 'డి' విటమిన్ అందేది. చర్మము పైనున్న అనేక

క్రిములు నశించిపోయేవి.

రాజపుత్ర స్త్రీలూ, ఇంకొంత మంది స్త్రీలు ఘోష

పద్ధతి వల్ల అనారోగ్యం పాలవుతారు. కేవలం నీడపట్టునే ఉండటం వల్ల భయంకరమైన టి.బి కూడా వచ్చే అవకాశము ఉంది. సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే ఆయుర్వేద వైద్య రీత్యా రోగాల పాలవ్వక తప్పదు.


*111. నాగులచవితికి పుట్టలో పాలుపోస్తే సంతానం కలుగుతుందా?*


కార్తీక శుద్ధ చవితినాడు వచ్చే నాగపంచమి రోజు సంతానం కోసం పెట్టి మొలకెత్తిన

ధాన్యములతోనూ, పాలతోనూ నాగపుట్టను పూజించి ఈ

పాలు పోస్తారు. ఇలా చెయ్యటం భక్తితో పాటు

సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటం వల్లా, పుట్ట వద్ద పూజ చేస్తూ స్పందించటం వల్ల స్త్రీలలో నాడీమండలం ఉత్తేజం చెంది సంతానవంతులయ్యే అవకాశం కలిగిస్తుంది.


*112. ముక్కుపుడక కుట్టించుకోవటంలోని ఆరోగ్యము?*


వివాహ సమయంలో ఏడు అడుగులు వేసి ఒకరికి

ఇల్లాలైన ఆమెని పార్వతీ దేవితో సమానంగా భావించి

ముక్కుపుడకను అందివ్వటం మన సంప్రదాయం. పెళ్ళి

అయిన వారు ధరించటంలో అర్థం... భర్త

ఆయురారోగ్యాలతో, సకల ధనాలతో సంతోషంగా

ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ధరించటము. ముక్కుకి

రంధ్రం చేయటం ద్వారా ఆక్యుపంక్చర్ వైద్య విధానం

ద్వారా రక్తపోటు నివారణమవుతుంది.


*113. గృహస్థు తామరాకు, మోదుగ ఆకుల్లో భోజనం చేయరాదు. ఎందువలన?*


ఆ రెండు ఆకుల్లో భోజనము మునులూ, ఋషులూ, సన్యాసులూ మాత్రమే తినాలి. ఆ ఆకుల్లో భుజించటం వల్ల సత్వగుణం అలవడుతుంది. ఆ కారణంగానే గృహస్థు జీవితం గడుపుతున్నవారు ఆ ఆకుల్లో తినరాదు. అయితే మోదుగ ఆకుల్లో ఆహారం

తీసుకోవటం వల్ల కంటి సంబంధిత అనేక వ్యాధులు

తగ్గుతాయి.


*114. అకాల భయము తొలగిపోవుటకు?*


ఓం హృషీకేశ నమో నమః అని జపించ

వలయును. రాత్రి స్నానము అయ్యాక, ఇష్ట దైవాన్ని

తలుచుకొని 108సార్లు జపిస్తే భయవీడలు

తొలగిపోతాయి.


*115. ఆడ, మగ తేడా లేకుండా చెవులు కుట్టించటం ఎందుకు?*


చెవి మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది.

అది మెదడుకి అనుసంధానం కలిగి ఉంటుంది.

ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం వద్ద ఒత్తిడి తెస్తామో మెదడులో

ఉన్న జ్ఞాననేత్రం వికసించి బుద్ధి వికసిస్తుంది. ఈ కార్యాన్ని బంగారంతో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందువలననే బంగారు పోగులు ధరించలేని వారికి సైతం చెవి కుట్టే సమయంలో

బంగారు తీగతోనే రంధ్రం ఏర్పరచటం జరుగుతుంది.

పూర్వం చెవులు కుట్టించటం ఉపనయనం సమయంలో చేసేవారు. కానీ ఈ కాలంలో మూడు సంవత్సరాల వయస్సులోనే మగ, ఆడ బేధం లేకుండా చెవులు కుట్టించటం జరుగుతుంది.

విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువులకూ, పెద్దలకూ చెవులను తమ్మె వద్ద పట్టుకుని శిష్యులు తమ గోత్రనామాలను చెప్పుకొనేవారు. ఈ విధానంలో అంతరార్థం ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి

తేవటం కొరకే.


*రచన* ✍️ *మైధిలి వెంకటేశ్వరరావు.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

సాక్షాత్తూ స్వర్గమే

 దృఢగాత్రత్వమానృరణ్యమఘమోచనమ్।అపారవశ్యం నైశ్చిన్త్యమాస్తిక్యం స్వర్గ ఏవ హి॥ భావము॥ మంచిఆరోగ్యం, గట్టిశరీరం, ఋణంలేకపోవడం, పాపముక్తి,పరతంత్రం లేకపోవడం,నిశ్చింతత,ఆస్తికత-ఇవన్నీ సాక్షాత్తూ స్వర్గమే.॥ వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు। నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాద సిధ్ధిరస్తు॥

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్ధశి  - అశ్వనీ -‌‌  భౌమ వాసరే* *07.05.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ*  గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*07-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


ఆప్తుల నుండి శుభవార్తలు అవుతాయి. స్థిరాస్తి  కొనుగోలు  ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


దూరప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. 

---------------------------------------

కర్కాటకం


దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

సింహం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు  హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి  మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

తుల


బంధుమిత్రులతో అకారణ  వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు


అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు  ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------

మకరం


బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక  వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

విఫల ప్రయత్నం

 శు భో ద యం🙏


విఫల ప్రయత్నం!


             శా:  తృష్ణాతంతు  నిబధ్ధ  బుధ్ధులయి  రాధేయాదులం  గూడి   శ్రీ


                   కృష్ణుం గేవల  మర్త్యుగాఁ   దలచి ,బంధింపంగ   నుత్సాహ   వ


                   ర్ధిష్ణుండయ్యె , సుయోధనుం  డకట!  ధాత్రీనాధ!  యూహింపుమా?


                   ఉష్ణీషంబున   గట్టవచ్చునె ?మదవ్యూఢోగ్ర    శుండాగ్రమున్ ; 


                                   -  అధర్వణ  భారతము.- ఉద్యోగ పర్వము- అధర్వణుడు; 


                

            అర్ధములు:- తృష్ణాతంతువు- ఆశయనేదారము ;మర్త్యుడు-మానవుడు; ఉత్సాహ వర్ధిష్ణుడు- ఉత్సాహము(కోరిక)ను పెంచుకొనినవాడు;  ఉష్ణీషము- తలకుచుట్టుకొను వస్త్రము; మదవ్యూడోగ్ర- మదముతో మత్తెక్కిన; శుండాగ్రమున్-ఏనుగును;


     

              భావము:- ఆశయనే  దారముతో  బంధింప బడిన  బుధ్ధిగలవాడై  సుయోధనుడు  శ్రీకృష్ణుని  సాధారణ మానవుడనితలచి

బంధింప  నుత్సాహమును  జూపెను. అయ్యో ! ఏమనిచెప్పను? మదగజము  తలపాగ గుడ్డకు  గట్టువడునా? మూర్ఖుడు తెలియ నేరకున్నాడు. అనిభావము.


                   శ్రీ కృష్ణుడు  పాండవ రాయబారిగా  కౌరవ సభకేగినపుడు  అతనిని బంధిప  దుర్యోధనుడు యత్నించును. అపుడు సభలో  జరిగెడి  యలజడిని  ధృతరాష్ట్రునకు  విదురుడు  తెలుపు సందర్భము.


                         నన్నయ్యకు  కొంచెము  ముందో వెనకో  అధర్వణుడను  జైన  కవి యుండేవాడట. అతడుగూడా  భారతమును ఆంధ్రీకరించెననియు, కారణాంతరములచే  నది మరుగున పడి నశించిన దనియు చరిత్రకారులు వ్రాయు చున్నారు. అందుకు నిదర్శనముగా పైపద్యములను ప్రదర్శించు చున్నారు. చారిత్రికాంశము లెట్లున్నను అధర్వణుడు  గొప్పకవి యనుట నిర్వివాదము.


                  దుష్కర ప్రాసతో  పద్యారంభము. సుయోధనకార్యము దుష్కరమని  సూచించుటకు! 


                  తంతువు  అంటే  దారము. చాలాసులభముగా  తెంపవచ్చును. సుయోధనాదులు ఆశాపాశ బధ్ధులైనారట. తామే మొదలు కట్టుబడినారు. వారికిక యితరులను కట్టు శక్తియెక్కడిది? అయినను  వ్యర్ధప్రయత్నము. కృష్ణుని బంధించుట  మదపుటేనుగును తలగుడ్డతో  బంధించుట వంటిదట!  ప్రయత్నము విఫలమగుటయేగాదు. ప్రత్నించిన వారికే ప్రమాద మగును.


                ఈరీతిగా  భావ స్ఫోరకముగా  రసోచితముగా   సన్నివేశమునకు అనుగుణముగా  చక్కనిపద్యములను  రచించిన

యధర్వణుని  భారతము మనకు లభింపక పోవుట  మనదురదృష్టము. మరోపద్యం మరోసారి.


                                                      స్వస్తి!🙏🙏🌷🌷

పరుల మేలుకై

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 

*ధనాని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్*।

*తన్నిమిత్తో వరం త్యాగో వినాశే నియతే సతి*॥


తా𝕝𝕝 *"ప్రాఙ్ఞుడైనవాడు ధనాన్ని జీవితాన్ని పరుల మేలుకై త్యజించాలి*.... మరణం తప్పనిదై ఉండగా అట్లు త్యాగం చేయుట శ్రేష్ఠము గదా!"


*ఏది శాశ్వతం*?


     👇 //------ ( *భజగోవిందం* )-----// 👇


*కాతే కాంతా ధనగతచింతా*

*వాతుల కిం తవ నాస్తి నియంతా*

*త్రిజగతి సజ్జనసంగతిరేకా*

*భవతి భవార్ణవతరణే* ॥13॥


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? *ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక*

పంచాంగం

 శుభోదయం, పంచాంగం                卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*మంగళవారం, మే 7, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

 చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి చతుర్దశి* ఉ10.59 వరకు

వారం   : *మంగళవారం* (భౌమ్యవాసరే )

నక్షత్రం  : *అశ్విని* మ3.15 వరకు

యోగం : *ఆయుష్మాన్* రా9.05 వరకు

కరణం  : *శకుని* ఉ10.59 వరకుతదుపరి *చతుష్పాత్* రా9.57 వరకు

వర్జ్యం   :  *ఉ11.29 - 12.59*

  మరల *రా12.22 - 1.53*

దుర్ముహూర్తము :  *ఉ8.07 - 8.58* &

   మరల *రా10.48 - 11.33*

అమృతకాలం    :  *ఉ8.28 - 9.58* 

రాహుకాలం       : *మ3.00 - 4.30*

యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.35* || సూర్యాస్తమయం:* *6.17*

 👉 *కృష్ణాంగారక చతుర్దశి*

*సర్వేజనా సుఖినో భవంతు* 

 

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*