24, జులై 2024, బుధవారం

విజయవాడలో వెలసిన

తే.గీ 

విజయవాడలో వెలసిన వేల్పులమ్మ

కష్ట సుఖములు కనవమ్మ కల్ప వల్లి

ఎదురు చూచెను భక్తాళి యెల్ల వేళ

కంటి కగుపింప రమ్ము మా కనక దుర్గ!:

 తే.గీ.

మోస మెరుగనివారికి ముదము గూర్చ

నీదు నామమే దిక్కని నిజమయినది

పరుగు లెత్తుదురుగ మూఢ భక్తితోడ

కంటికగుపింప రమ్ము,మా కనక దుర్గ!

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు - 


 *  చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .


 *  దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


 *  ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును 


 *  జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును. 


 *  పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును . 


 *  విరేచనం సాఫీగా అయ్యేలా చేయును . 


 *  విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.


 *  రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి 


 *  వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును . 


 *  శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును . 


 *  శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును . 


 *  వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి. 


 *  థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .


 *  మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు . 


 *  తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .


 *  గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .


 *  స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.


 *  చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును . 


 *  క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు . 


         పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను. 


                మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను . 


          పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.  


       అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును.  మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు.  నా నెంబర్ 9885030034 కి ఫోన్ చేయగలరు. 


    ఈ అశ్వగంధ చూర్ణం 40 రకాల రోగాల మీద పనిచేయును . HIV సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగులకు ఇది ఇచ్చినప్పుడు CD4 కౌంట్ పెరగడం జరిగింది . వారి శరీరం నందు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా నీరసం , నిస్సత్తువ తగ్గాయి . ఈ చూర్ణముతో చాలా మందికి చికిత్స చేశాను . 


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

)నాడు* నేడు

 *🔵నాటి కాలం సినిమాల పేర్లు*


గుండమ్మ కథ,జయభేరి,లవకుశ, పాతాళ భైరవి,ఇల్లరికం, జగదేకవీరుని కథ,ఆరాధన,మిస్సమ్మ,బడి పంతులు,గుడి గంటలు,భక్త ప్రహ్లాద.



*🟣నేటి కాలం సినిమాల పేర్లు*


*రెండు రెళ్ళు ఆరు,ఆయన కిద్దరు,ఏమండీ ఆవిడొచ్చింది*,*ప్రేమించు కుందాం రా,మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది,నువ్వు నాకు నచ్చావు,కలిసుందాం రా,జంబ లకడి పంబ, కిత కితలు*


*⚫కాలాను గుణంగా మార్పులు సహజం.*.


*1)నాడు*...ఏమండీ,భోజనం చేశారా.

*నేడు*....తిన్నావా బాస్.


2) *నాడు*...ఏమోయ్,ఒక ప్లేట్ ఇడ్లీ,పెసరట్టు పట్టుకురా

*నేడు*.... బాస్,మంచూరియా,ఫ్రైడ్ రైస్.


3) *నాడు*..నమస్కారం అండి,బాగున్నారా.

*నేడు*.... హాయి,హౌ ఆర్ యు గురు.


✍✍మూర్తి's కలం.....

9985617100.

పంచాంగం 24.07.2024 Wednesday.

 ఈ రోజు పంచాంగం 24.07.2024 Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష తృతీయా తదుపరి చతుర్ధి తిధి సౌమ్య వాసర: శతభిషా నక్షత్రం శౌభాగ్య యోగ: భద్ర తదుపరి బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ ఉదయం 07:30 వరకు తదుపరి చవితి రా.తె 04:39 వరకు.

శతభిషం సాయంత్రం 06:14 వరకు.


సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:48


వర్జ్యం : రాత్రి 12:07 నుండి 01:35 వరకు


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:57 నుండి 12:48 వరకు.


అమృతఘడియలు : పగలు 11:39 నుండి మధ్యాహ్నం 01:07  వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

పురముల గూల్చినాడ

 చం. పురముల గూల్చినాడనని భూతిధరా! శిఖరాననుంటివా

పురముల రూపధారులగు పోకిరులన్ దునుమాడమంచు నిన్ 

కరములనెత్తి లోకులిట కామద ! వేడుకొనంగ నీవు భీ 

కరులగు రాక్షసేంద్రులను కాలుని కంపితివీవె యీశ్వరా ! 8.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻

✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

ధర్మపురి

గణనాథోద్భవము

 🙏 శ్రీ గణనాథోద్భవము!(మూలం: శ్రీ శివ మహాపురాణం.)

4.తే.గీ.

చెలియ మాటలతోనామె తలచె గతము, 

చాలహితకర మనుకొనెఁ చాన మదిని 

ముందరొకదిన మేకాంతమందు తాను, 

జలక మాడుచు నుండగా జరిగె వింత!!


భావము: చెలికత్తె మాటలు మంచివనితలచిన పార్వతికి గతము జరిగిన సంఘటనకూడా జ్ఞప్తి కివచ్చెను. ఒక దినము తానేకాంతమున స్నానము చేయుచున్నప్పు డొక వింత జరిగినది.

గురుదేవులు

 *గురుదేవులు*


సంధ్యావందనము 

చక్కగా నేర్పించి 

భువిలోన నడిపించు 

పూజ్యగురువు


శతకోటి గాయత్రి

శ్రద్ధగా నలవర్చి

మాన్యతన్ కాపాడు

మనిషి పరువు


ధర్మ వారధి తోడ 

మర్మ బోధలు జేసి

సత్య నిష్ఠను నిల్పు

నిత్య కొలువు


సామాజికాంశాలు

స్పష్ఠంబు లొనరించి

ప్రాణి కోటికి చూపు

బ్రతుకుతెరువు


పేర్మి గాయత్రి హవనమే పెద్ద చదువు


మండు సమిధలు  తొలగించు గుండె బరువు


ముక్తి నందించు మూర్తియే 

ముఖ్య గురువు


పరమ పావన స్ఫూర్తి!  సద్గురువు గురువు!


*ముత్య రామకృష్ణ*

*రాజమహేంద్రవరం*

తిరుగడు చిన్న సూరి చిన్న సూరి

 1417ఆ.

అల్ప విజయమైన నమితి యాడంబరి

గొప్ప యనుచు చాటు డప్పు కొట్టి

అధిక జయమునైన నతి నిరాడంబరి

చెప్పు కొని 1417ఆ.

అల్ప విజయమైన నమితి యాడంబరి

గొప్ప యనుచు చాటు డప్పు కొట్టి

అధిక జయమునైన నతి నిరాడంబరి

చెప్పు కొని తిరుగడు చిన్న సూరి చిన్న సూరి

నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

 నిత్యపద్య నైవేద్యం-1558 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-193. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

ఆరోగ్యం విద్వత్తా 

సజ్జన మైత్రీ మహా కులే జన్మ:l

స్వాధీనతా చ పుంసాం 

మహదైశ్వర్యం వినాప్యర్ధై:ll


తేటగీతి:

సుఖపు స్వాస్థ్యము, విద్వత్తు, సుజనమైత్రి,

నెనరు కులమును, యింద్రియ నిగ్రహమును..

అయిదివి గలట్టి పేదవాడైనగాని 

అధికమగు ధనవంతుడే యవనిపైన.


భావం: ఆరోగ్యం, విద్వత్తు, సజ్జనమైత్రి, కులీనత అనగా కులం, ఇంద్రియ నిగ్రహం.. ఇవి ఉన్నవాడు పేదవాడైననూ మహా ఐశ్వర్యవంతుడే.

మహాభారత ప్రశస్తి

 మహాభారత ప్రశస్తి 


సీ. ధర్మస్వభావమ్ము దర్శించువారలు 

               సమ్మతింతురు  ధర్మశాస్త్ర మనుచు 

     పరమాత్మ జీవాత్మ లెరిగిన వారలు 

              దర్శింతు రిద్ది వేదాంత మనుచు

     నీతివిషయమందు నేర్పున్నవారలు 

               సన్నుతింతురు  నీతిశాస్త్ర మనుచు

     కవనమున్ జెప్పెడి కవిముఖ్యు లందఱు 

              గణియింతు రిది మహాకావ్యమనుచు 

     లక్ష్యంబు లెఱిగిన లాక్షణికవరులు

              నేర్తృ సకలలక్ష్యనిధి యటంచు 

     నైతిహాసిక బుద్ధులమరిన పండితు

              లరయుదు రిది యితిహాస మనుచు 

     సకల పురాణముల్ చదివెడి వారలు

               రహి చూతురు బహుపురాణ మనుచు 

ఆ. ఇట్లు సర్వ జనుల యిష్టంబు కొఱకును 

     విష్ణుసన్నిభుండు విమలమౌని 

     వివిధ తత్త్వ విషయ వేద్యుండు వ్యాసుండు 

     భారతమును జేసె భాసురముగ                   


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

దశరథాత్మజ శతకము (54)

 దశరథాత్మజ శతకము (54)


 సీ.భరతాగ్రజా !  రామ ! భానువంశ ప్రదీప !

                  నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !

     తారకమంత్రమ్ము తలచిన మాత్రాన

                 పాపముల్ నశియించి పరము గల్గు  

     కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !

                 కైవల్యమిచ్చినన్ గావు మయ్య

     భూమిజపతిరామ ! భువనైక మోహనా !

                 కోసలాధిప రామ ! కూర్మి  కొలుతు

తే.నీదునామమ్ము  దలచియు న్నిచ్చ లందు     

     బడసె కైవల్య పదము నా భక్త శబరి      

     భక్తితో నిన్ను  గొల్చిన ముక్తి గల్గు

     దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


       జయలక్ష్మి  పిరాట్ల

పద్యతాంబూలం

 పద్యతాంబూలం


ఉచ్ఛనీచములను ఉత్తుత్తిగాజేయు  

సూత్రమంచు సుంత శుచియె లేక 

ఉమ్మి వేసినంత నుత్కృష్టమాయెనా? 

చెల్లుబాటు గాని సొల్లు కబురు..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్


ఉత్పలమాల:

++++++

రాగలకార్యమెప్పటికి,రాకనుదప్పదుకాలవాహినిన్!

తీగగసాగుగానమది,తీయగ జేరును కర్ణమందునన్!!

సాగగదీయలేకనొక,చప్పుడుజేసెడుగార్ధభమ్ముకున్!!

“యీగలువడ్డపానకమెయెంతొ,హితంబొనఁగూర్చుగ్రోలినన్!!”


[24/07, 4:45 am] +91 94413 20381: ఉ.

శ్రీలు వరించు, సద్యశము చేకురు నాయతగౌరవంబు స

చ్ఛీలమహత్వయుక్తునకు జీవనమందున హర్షసంపదల్

మేలగు శక్తు లెప్డమరు మేదిని గావున మానవుండు సౌ

ఖ్యాలకు నర్రు చాచక శుభాత్మకుడౌ టుచితమ్ము మిత్రమా!


హ.వేం.స.నా.మూర్తి.

24.07.24.

[24/07, 4:50 am] +91 94411 49608: 2.

అతిసనాతన ధర్మమీ- యవనియందు

జగతికెల్లను పంచిన-జ్ఞానభూమి

భరతదేశంబు-విజ్ఞాన ప్రాభవంబు.

పతిత పావన!వేణుగోపాలదేవ!!



: శా॥

ఏమాలాస్యము కామునేర్చితిననియా యీశ్వర! నిక్కేలనో! 

కామాంధుల్ కలరెందఱో ప్రబలి ధిక్కారముం జేయుచున్ 

కామమ్మున్ ధనవృద్ధి స్వార్థతలపున్ గర్ముత్తు లర్థాలుగా 

మా మౌలిన్ విచలింతురయ్య పసన్ మాయించు నిన్మెచ్చెదన్ 

*~శ్రీశర్మద*

: *

లోక రీతి*60.

రచన: కీ.శే.గుడిసేవ నరసింహారావు గారు, ఉప్పల కలువగుంట*

గానం: కవి కోకిల కుమార సూర్యనారాయణ గారు విజయవాడ

60.ఉ.

విత్తులు మంచి వంగడమువిత్తుచు భూమిని విస్తరించుచున్

సత్తువ జూపుచున్ శ్రమల సాగును జేయుచు భూతలంబునన్

ఎత్తుగ ధాన్యరాసులను నేర్పడజేతురు కర్షకావళుల్

మొత్తము దేశ రక్షణకు మొమ్మదటన్

గల మేటి నాయకుల్

*క్రొత్త పలుకు-1*

 *క్రొత్త పలుకు-1*


అన్నదానమంత పున్నెము మరిలేదు 

ఉచితమంత చెఱుపులుర్వి లేవు 

శ్రమయె లేనినాడు సౌఖ్యమ్ము చేదౌను 

వినగ మంచిమాట వేదమౌను 

*~శ్రీశర్మద*

వరసమగుణాఢ్య

 ऊँ!

----

" కం.

--

వరసమగుణాఢ్య ఘనజవ 

విరసదనుజవిదరణ హరి వినుతకపివరా..

సరసిజముఖురఘుభక్తా

' సరగున రారమ్ముప్రోవజయహనుమంతా ' !!! "..23..

----

గురువు పద్యాలు

 డాక్టర్ దేవులపల్లి పద్మజ....గురువు పద్యాలు

విశాఖ,  9849692414


భవిత .....శ్రీ గురుదేవాయనమ:

గురువు నందు ధరణి కొలువు దీరు

(ఆట వెలది పద్యాలు)


తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును

తండ్రి వెంట నిలచి దన్ను నిచ్చు

గురువు విద్య నేర్పి గుణములు నేర్పును

గురువు నందు ధరణి కొలువు దీరు.


భోగ భాగ్యములను పొందుట కష్టము

తలచినంత రారు కుల దివిజులు

గురువు తలచినంత దొరకును సర్వము

గురువు నందు ధరణి కొలువు దీరు.


పసిడి తొడుగ రాయి పరమాత్మ రూపము

మట్టిలోని రాయి మలిన సమము

గురువులేని వాడు బరువగు నేలకు

గురువు నందు ధరణి కొలువు దీరు.


పూవులేని తొడిమ జీవరహితమగు

జలములేని కొలను విలువ లేదు

ఙ్ఞానరహిత నరుడు హీనుడై నిలచును

గురువు నందు ధరణి కొలువు దీరు.


కామధేనువు మరి కల్పవృక్షము కూడ

గురువు మనసునందు కొలువుదీరు

గురువునకు సరియగు గురుదేవులే సుమా

గురువునందు ధరణి కొలువు దీరు


కాకిపొదుగుచుండు కోకిల కూనను

వైరి పిల్లకైన పంచు ప్రేమ

గురువు సమత చూపి కరపును విద్యను

గురువు నందు ధరణి కొలువు దీరు