27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

శరన్నవరాత్రి మహోత్సవాలు*

 *శ్రీ మాత్రేనమః*

రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో గల *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం* లో 

*03-10-2024  నుండీ 12-10-2024 వరకూ* శ్రీ క్రోధి నామ సంవత్సర *శరన్నవరాత్రి మహోత్సవాలు* నిర్వహించబడును. ఈ సందర్భంగా దుర్గాష్టమినాడు బాలాకుమారీపూజలు, ప్రతి రోజు చండీ పారాయణం, చివరి రోజున చండీహోమం ,విజయదశమి నాటి సాయంత్రం శమీపూజలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాలలో గోత్రనామాలు చెప్పించుకునే ఆసక్తి గలవారి వివరాలను మాకు వాట్సాప్ 

ద్వారా తెలుపగలరు.

మా UPI & WhatsApp number 9492050200,

*ఈ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చిన భక్తులు*

1. బ్రహ్మ శ్రీ కొంపెల్ల సూర్యనారాయణ శర్మ, శ్రీమతి లక్ష్మీ నరసింహం దంపతులు, కాశ్యపసగోత్రం...1,008₹,

2. 

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

వాసన

 ఏదైనా క్రియ లేదా అనుభవం వల్ల మనస్సులో మిగిలిపోయినదానికి వాసన అని పేరు. అది మంచి, చెడు అని రెండు రకములు. శాస్త్రాధారముతో ఏది మంచి, ఏది చెడు అని అర్థం చేసుకొని మంచి వాసనలను అలవరచుకోవాలి ధ్యానం ఫలించడం కొరకు. తరువాత నిరంతర శ్రమ చేత మంచి చెడులను మించిపోవచ్చు. ఇది సఫలం ఆవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహం అవసరం. --- శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి #SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24 వ భాగము* 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*పద్మపాదుని కథ:*


పద్మపాదుడు గురువు లను రక్షించిన తెఱగు చూచి అద్భుత పడిన శిష్యులు శ్రీ నృసింహ స్వామి పద్మపాదునకు ఎలా ప్రసన్నుడయ్యాడో తెలుపమని కోరగా పద్మపాదుడు వారికి ఈ కథ చెప్పాడు. 


“అహెూబిలమనే పర్వతం మీద మహారణ్యముంది. ఆ అడవిలో చాల కాలం తపస్సు చేస్తున్నాను. అప్పుడు ఒక కిరాతుడు వచ్చి 'ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నా'వని అడిగాడు నన్ను. 'ఈ అడవిలో ఒక విచిత్రమృగ ముంది. ఎప్పటి నుండో వెదుకుతున్నాను. ఇప్పటి దాకా కన్పించ లేదు. అందు చేతనే ఎప్పుడయినా కనిపించకపోదా అనే నమ్మకంతో ఇక్కడే తపస్సు చేస్తున్నాను'.


అప్పుడు కిరాతునికి నాపై జాలి కలిగి నా కోసం ఆ అడవి అంతా వెదకి ఆ మృగాన్ని లతలతో బంధించి నా యెదుట నిలబెట్టాడు. నీకెలా దొరికింది అని  అడిగే లోపలే నేను చూస్తున్నది సాక్షాత్తు శ్రీనరసింహస్వామినే అని తెలిసి సాష్టాంగ వందనం చేశాను ఆ అపురూపమైన అవతారికి. అప్పుడు స్వామికి నమస్కరించి ఇలా అడిగాను: "పరమాత్మా! ఘోరమైన తపస్సు లాచరించే మహర్షులకు కూడ తమ దర్శన భాగ్యం దొరకదే! ఈ కిరాతు నకు ఎలా వశమయ్యా వో సెలవియ్యండి" అందుకు స్వామి మందహాసంతో “సనందనా! మునులు గాని, బ్రహ్మర్షులు గాని ఈ కిరాతుని వలె నా రూపమును నిశ్చలులై ధ్యానం చేసిన వారు లేరు. అందుచేత ఇతని నిర్మలచిత్తానికి మెచ్చి పట్టుబడ్డాను. ఇంక ఇతని గురించిన సంశయము వీడుము” అని చెప్పి అంతర్హితు డయ్యారు.పరమానంద భరితులైన శిష్యగణం ఈ కథకు ఫలశ్రుతి చెప్పమని కోరగా పద్మపాదుడుచెప్పాడు: 


"ఈ నృసింహస్వామి కథ చదివినా, విన్నా, చెప్పినా, వ్రాసినా స్వామివారి అనుగ్రహా నికి పాత్రులగుతారు. అట్టివారికి అసాధ్య మైన రోగములు, బ్రహ్మ రాక్షస, భూతప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిన్యా ది సర్వ దుష్ట గ్రహ బాధలు, ప్రయోగాది బాధలు తొలగి, సుపుత్ర ప్రాప్తి పొంది, కోరికలు సిద్ధించును. భక్తి జ్ఞాన వైరాగ్యము లు కలిగి ముక్తిని బడయుదురు.”


శంకరాచార్యులు శిష్యులతో కొన్ని దినములు శ్రీశైలములో గడపి పశ్చిమతీరాన గల గోకర్ణక్షేత్రమునకు బయలు దేరారు.


*గోకర్ణక్షేత్రము:*


గోకర్ణం ఆకారంలో సముద్రుడు భూభాగం లోనికి చొచ్చుకువచ్చి నందు వలన ఈ క్షేత్రానికి ఈ నామం కలిగింది, ఆ పేరు శివుడే పెట్టాడని అంటారు. పండ్రెండు తేజోలింగముల లోని దైన మహాబలేశ్వర లింగం ఇక్కడ ఉన్నది. ఈశ్వరుడు రావణాసు రునికి ఇచ్చిన లింగము లలోని భాగమే ఇది అంటారు. కాశీ క్షేత్రము కన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమని అచ్చోట గల చిహ్నములను బట్టి యందురు. రావణ సంహారా నంతరం శ్రీ రాముడు ఈ క్షేత్రంలో కొన్నినాళ్ళు ఉండి ఆత్మలింగాన్ని అర్చించి నట్లు అందుచేత కొండ దరిని గల స్థలాన్ని 'రామతీర్థము' అని స్థలపురాణము. 


శ్రీశంకరాచార్యులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సంద ర్శించి అందు వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వ రులను స్తుతించారు. తరువాత హరిహర దివ్యక్షేత్రానికి బయలుదేరారు.


*హరిహర క్షేత్రము:*


ఈ క్షేత్రము చాలా  విశిష్టమైన పుణ్యస్థలం. ఒకప్పుడు ఈ ప్రాంతం లో వీరశైవమని ఒక తెగ, వీరవైష్ణవమని మరొక తెగ - రెండు తెగల 'భక్తులు’ పరస్పరం స్పర్థలతో ఒకరి నొకరు ద్వేషిస్తూ, దూషించుకొంటూ మితిమీరిన వైరాలతో చెలరేగుతూ ఉండే వారు. ఒకరి పొడ ఒకరికి గిట్టేది కాదు. బొట్టూ, కట్టూ వేరు వేరు. దేవుళ్ళు వేరు. ఆచారాలు వేరు. ఆగమాలు వేరు. పద్ధతులు వేరు. పేళ్ళు వేరు. మా దేవుడు అధికుడు, మా దేవుడే అధికుడు అని ఇరు తెగల వారూ తెగని తగని శత్రుత్వాలు పెంచి పోషించుకొనే వారు. ఇది చూచిన పరమాత్మ      దయామయుడై శివుడు, విష్ణువు కలిసి ఉన్న రూపంలో ప్రత్యక్ష మయ్యాడు. ఈ విషయం వేదం లోనే ఉందని అజ్ఞప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినదీ హరిహర నాధ రూపం. స్వామిని దర్శించుకొని అప్పుడు శంకరా చార్యుడు దశావతార స్తోతం చేశారు.


మొదటిగా మత్స్యావతారాన్ని, తరువాత వరుసగా కూర్మావతారాన్ని, వరాహావతారాన్ని, నరసింహావతారాన్ని, వామనావతారాన్ని, పరశురామా వతారాన్ని, రామావతారాన్ని, బలరామ కృష్ణా వతారాలను, బుద్ధావ తారము, కల్క్యవ తారమును సోత్రము చేశారు. ఈ విధంగా శంకరస్వామి శివ కేశవుల అభేదత్వాన్ని నిరూపించినారు. అక్కడినుండి ప్రయాణము మూకాంబికా క్షేత్రమునకు.


మూకాంబికా క్షేత్రము:


క్షేత్రం లోని ఏ క్షేత్రాన్ని దర్శించినా శంకరా చార్యులు మొదటగా ఆ ఆలయం ప్రవేశించి తరువాత మిగతా విషయాలను చూచుకొనే వారు. ఆ ఆచారాన్ని వీడకుండా మూకాంబికా క్షేత్రం వచ్చాక తిన్నగా ఆలయం లోనికి వెడలుచుండగా వారి కొక విషాద దృశ్యం కనిపించింది.


దేవాలయానికి ఎదురుగా చచ్చిన బిడ్డను ఒడిలో ఉంచుకొని తల్లిదండ్రు లు రోదన చేయుచున్న దృశ్య మది. శంకరులు అది చూచి జాలి నొందారు.


"వీరలను రక్షించుటకు ఎవడు సమర్థుడు కాడో వాడున్నూ ఏడ్చిన వాడగుచున్నాడు”అన్న ఆకాశవాణి వినిపిం చింది గట్టిగా. ఆ పలుకులువిన్న శంకరుడు అవి దేవి పలుకులుగా గుర్తించారు.


"పరమేశ్వరీ! దయా మయీ! తమ దయయే ఈలోకాన్ని పాలిస్తు న్నది. ఆ దయయే లోకాన్ని రక్షిస్తోంది. కనుక 'కటాక్షించు' అని శంకరుడు ఆ దేవికి బదులుగా పలికాడు. వెంటనే ఆ బాల శిశువు బ్రతికి లేచి కూర్చు న్నాడు.


తల్లిదండ్రుల ఆనందమునకు అవధి లేదు. ఆ దృశ్యం చూచిన వారందరూ చకితులై శంకరస్వామి ని వేనోళ్ళ కొనియాడి నమస్కరించారు. సాక్షాత్తు శంకరుడే అని భావించారు. శంకరాచార్యుడు ఆలయ ప్రవేశము చేసి, మూకాంబికాదేవిని స్తుతించారు. “అమ్మా! నీ మహిమలు కొని యాడడానికి మాటలు చాలవు. నిన్ను నుతించినా, దర్శించి నా, స్మరించినా మూగవాళ్ళు వాగ్ధార లతో వెలుగొందు తున్నారు. సృష్టి, స్థితి, లయములకు కారకు రాలివి. జగదంబా! బ్రహ్మాది దేవతలు నిన్ను తెలిసికొనజాలరు. పరిపూర్ణంగా నిన్ను తెలిసికొన్నవారు జీవన్ముక్తులే గదా!” అని స్తోత్రం చేశారు. ఈ క్షేత్రంలో కొన్నాళ్లుండి తత్త్వప్రచారం చేస్తూ తరువాత బల్యగ్రహారానికి బయలు దేరారు.


బల్యగ్రహారము:


రెండు వేల బ్రాహ్మణుల కుటుంబములు కలది బల్యగ్రహారము. అందున్నవారికి సత్కర్మలు చేయుటే గాని దుష్కర్మల జోలికి ఎన్నడూపోరు. అకుంఠితదైవభక్తితో, శ్రద్ధతో దీక్షతో ఎల్లపుడూ సత్కర్మా చరణలలోనే కాలం గడిపేవారు ఆ అగ్రహార వాసులు. యధావిధిగా ప్రతి యింట అగ్నిని ఆరాధించే వారే. ఎక్కడ చూచినా వేదఘోష, అట్టి పరమపవిత్రమైన ఆ అగ్రహారంలో మృత్యువు ప్రవేశించ డానికి భయపడి చుట్టూ తిరిగి వెళ్ళి పోవలసిందే! ఆ విప్రులను దర్శించి శంకరులు వారికి తత్త్వబోధ గావించి వారిని సంతుష్టులను చేశారు.


శృంగగిరిలో శారదా పీఠము:


ఇంక మధ్యలో ఎక్కడా ఆగక శంకరాచార్య స్వామి తిన్నగా శృంగ గిరి చేరుకొన్నారు. శృంగగిరి అతి విశిష్ట మైన చరిత్ర కలది. పూర్వము ఋష్యశృంగుడు అనే మహర్షి తపస్సు చేసిన పావన భూమి అది. తుంగభద్రా నదీతీరాన ఉన్నది ఈ గిరి. ఇది పండితులకు తపో ధనులకు నిత్యావాసము. సర్వకాల సర్వావస్థల యందు వేదఘోష వినబడుతూనే ఉంటుంది. ఈ ప్రాంత మందున్న వారు యజ్ఞయాగాది క్రతువు లాచరించిన వారు. వైదిక కర్మనిరతులై శాంతము, దయ, శమము, దమము కలిగి కరుణాంత: కరణలతో అతిథి అభ్యాగతులను ఆదరిస్తూంటారు. వితరణబుద్ధిలో కల్ప తరువు, కామధేనువు ను మించినవారు. దేవతలు కూడ అచ్చోట ప్రీతిగా వసింప నెంచేవారు. శృంగగిరి వాసులు విఘ్నాలు వచ్చియెఱుగరు. ఇటువంటి మేటి సజ్జనులకు నివాసమైన శృంగగిరిలో శంకరా చార్యస్వామి ఎక్కువ కాలము గడుపుతూ ఆ పండితజనులకు ప్రస్థానత్రయ భాష్యమును బోధిస్తూ ఉపనిషత్తుల సారాంశాన్నీ వేదాల సారాంశాన్ని పవిత్రులు, పాత్రులూ అయిన విద్వజ్జన సమాజాన్ని ఆకట్టుకొని అధ్యాపకు లయ్యారు. తృటికాలం లో కుశాగ్రబుద్ధులు శంకరునికి శిష్యులైపోయారు.


శంకరాచార్యులకు ఆ చోట శారదాపీఠంగా నెలకొల్పాలన్న సంకల్పము వచ్చి అనువయిన స్థలాన్ని ఎన్నుకొన్నారు. శుభ ముహూర్తాన శంకు స్థాపన గావించి ఆగమశాస్త్రరీత్యా అన్ని ఏర్పాట్లు చేసి ప్రవీణులయిన శిల్పు లతో మనోహర మైన మఠనిర్మాణం చేయిం చారు. ఇంద్రాది దేవతలు సర్వదా పూజించే శారదాదేవిని అందు ప్రతిష్ఠించారు. వేదవిహితంగా సకలోపచారాలు శాశ్వతంగా జరిగే విధంగా అమలు పరచారు.

శ్రీసురేశ్వరాచార్యులను ఆ పీఠమునకు అధిపతిగా నియ మించారు. నేటికిని ఆ పీఠము అద్వితీయము గా అలరారుచున్నది. చతురామ్నాయ పీఠములలో మిన్నగా ప్రతిభకెక్కి యున్నది.


తోటకాచార్యుడు:


ఆనందగిరి అనే పేరు గల ఒక బ్రహ్మచారి శృంగగిరికి వచ్చి

శ్రీశంకరాచార్యుల పాదపద్మములకు మ్రొక్కి క్రింది విధంగా ప్రార్థించాడు: 


"మహాత్మా! ఏమియు తెలియని వాడిని. చదువుకొన్నవాడిని కాను. మీ శిష్యుడనై మీ సేవ చేసి కోవాలని వచ్చాను. తాము ఎందరినో చదువులేని వారిని జేర దీసి విద్వాంసులను చేశారని విని పేరాసతో వచ్చాను. నాకు మీ సేవాభాగ్యం ఇప్పిం చండి. మీ సేవలు చేసుకుంటూ ధన్యుడి నవుతాను”.


అతడి వైఖరి, మాట పొందిక శ్రీశంకరులకు నచ్చి ఆ బ్రహ్మచారిని శిష్యునిగాతీసుకొన్నారు. ఆనందగిరి శాస్త్రాలు చదువక పోయినా, వేదాధ్యయనం చేయక పోయినా వేదాల్లో చెప్పినట్లే నడచు కొంటున్నాడు. వినయ విధేయతలతో, మృదు మధురమైన మిత భాషణలతో చక్కగా గురుసేవ చేస్తున్నాడు. వేకువనే గురువులు లేవక ముందే లేచి తన కాలకృత్యములు, అనుష్ఠానములు ముగించుకొని సిద్ధంగా ఉంటాడు. గురువులకు ఆసనం అమర్చడం, కాలకృత్యాదులకు అన్నీ సిద్ధం చేయడం, తానే గురువులకు స్నానం చేయించడం, వారికి శుభ్రమైన కాషాయవస్త్రం ఇవ్వడం వంటివి అతని దినకృత్యాలు. గురువులు విడచిన కౌపీనము, శాఠీలను ఉతికి ఆరవేసి భద్రపరచడం ఇవన్నీ తానే ఆనందంగా శ్రద్ధగా చేసే చర్యలు. తిరిగి పాఠము వినే వేళకు తన కార్య క్రమాలు ముగించుకొని వస్తాడు. గురువులను నీడ వలె వెంటాడుతూ, పరుండినపుడు పాదములుఒత్తుతాడు. ఈ విధంగా గురుసేవ లో తనను తానే మరచి ఉండే వాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్యచరిత్రము*

*24 వ భాగము సమాప్తము* 

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23 వ భాగము* 

 💕💕💕💕💕💕💕💕💕💕💕💕


*దక్షిణ యాత్ర:*


మండనమిశ్రుని, ఆతని భార్య ఉభయభారతిని ఓడించి మండన మిశ్రునికి సన్న్యాసం ఇప్పించిన వార్త దేశం నలుమూలలా వ్యాపిం చింది. 


శంకరాచార్యులను ఎందరెందరో కలిసి జోహారులర్పించి వారికి శిష్యులయ్యారు. శంకరుల లక్ష్య సాధన ఇంతటితో పూర్తి కాలేదు. ఇది మొదలు మాత్రమే. అందుకు శిష్యసమేతంగా మాహిష్మతీపురం నుండి బయలు దేరారు దక్షిణ దిశగా. దారిలో అనేక ప్రాంతాలు దర్శించుచూ, వాటి స్థల మాహాత్మ్యాలను చెప్పుకొంటూ శాస్త్ర చర్చలతో నడుస్తూ, మధ్య మధ్య కనిపించిన పర్వతాలను, సెల యేళ్ళను, అరణ్యాలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాల ను తిలకించుచూ మధ్య మధ్య గ్రామాల లో ఆగి ఆ జనులకు

దర్శనము ఇస్తూ సాగి పోతోంది వారి కాలి నడక ప్రయాణము. 


మొదట తగిలినది మహారాష్ట్రము. ఎందరో మహాభక్తులూ, మహా వ్యక్తులూ ప్రభ వించిన రాష్ట్రమది. మహా యతీశ్వరుడు వచ్చాడని తెలిసి శంకరుని కలిసి వారికి శిష్యులయిన వారు ఎందరో! మహారాష్ట్ర మంతటా పర్యటించాక ముందుకు వెళ్ళారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చారు.


*శ్రీశైలక్షేత్ర దర్శనము:*


అక్కడికి చేరుకొనే ముందు కుతూహ లంతో శిష్యులు అడుగగా శ్రీశైలమాహా త్మ్యము గురించి శంకరులవారు ఇట్లా సెలవిచ్చారు: 


“ద్వాదశ మహా లింగములు ప్రసిద్ధి కెక్కి యున్నవి. అందు బహు ప్రఖ్యాతి గాంచిన త్రిలింగముల లోను శ్రీశైలమందున్న దొకటి. క్షేత్రమందున్న దేవుడు శ్రీమల్లికార్జునస్వామి. శ్రీ భ్రమరాంబికఅమ్మవారు. ఈ క్షేత్రమహిమ వర్ణించుటకు అపూర్వమై వినుటకు తనివి తీరనిది. 'శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే' అని పురాణ వాక్కు. అంటే శ్రీశైలశిఖరం చూచినంత మాత్రాన జన్మ రాహిత్యం లభిస్తుందని. మన దేశం లోని పుణ్యక్షేత్రాలలో సాధారణంగా దేవునికో దేవికో లేదా క్షేత్రానికోమహిమ లుంటాయి. రెండింటికి మహిమలు గలవి అక్కడక్కడ కలవు గాని మూడింటికి మహత్తు గల పుణ్య క్షేత్రము ఇదొక్కటే. ఈ క్షేత్రము ముప్పది ఆమడల పొడవు, వెడల్పుకలిగి నాలుగుద్వారము లున్నవి. తూర్పున ఉన్న ద్వారము త్రిపురాంత కము, దక్షిణమున నున్నది సిద్ధవటము, పశ్చిమాన అలంపురం, ఉత్తర దిక్కున ఉమా మహేశ్వరము అనే ద్వారము. 


ఒకానొకప్పుడు ఈ క్షేత్రములో మూడువేల ఎనిమిది వందల నివాస మందిరములు, విశాలమైన వీధులు కలిగి ఉండెడిదని ఇటీవల ఆధారములతో తెలిసిన విషయము. క్షేత్రములోని రాళ్ళు, మట్టి, చెట్లు, దుంపలు, తీగలు, ఓషధులు, నీరు, గాలి మున్నగు సకల జడపదార్థములు మహా మహిమ కలిగి యున్నవి. సిద్ధులు, యోగులు మొదలగు వారు ఆకాశగమనము, స్వేచ్ఛా గమనము, అదృశ్యగమనము, భూగర్భదృశ్యము వంటి అద్భుతముల నెన్నో సాధించు చుంటారు. తప మాచరించుటకు బహు యోగ్యమైనతావిది. జ్యోతిర్లింగము నాశ్రయించు కొన్న శక్తి ఉండవలెను కదా! అష్టాదశ మహాశక్తులలో ప్రధానమైన భ్రమరాంబికాశక్తి ఇచటనే వెలసినది" అని ఆ పవిత్ర క్షేత్ర మహిమను వెల్లడించారు.


“గురుదేవా! ఈ క్షేత్రమునకు శ్రీశైలమనే పేరు ఎలా వచ్చింది?” శిష్యులు అడిగారు. శంకరులు ఇట్లా వివరిం చారు: 


“పూర్వకాలమందు వసుమతి అను పేరు కల ముని కన్య పరాత్పరుని గూర్చి తపస్సు చేసి తన పేరు స్థిరంగా ఉండవలెనని, తన పేరుకు బదులుగా శివుడు వేంచేసి యున్న శైలమునకు మొదట 'శ్రీ' చేర్చమని ప్రార్థించి నది. ఇదికృతయుగము నాటి కథ. మరియొక గాథ - కొన్ని యుగాల క్రితం శిలాదుడనే మహర్షికి పర్వతుడనే పుత్రుడు, శ్రీదేవి అనే కుమార్తె ఉన్నారు. ఈ యిరువురూ ఈశ్వరుని గూర్చి తపస్సుచేయగా పరమేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకొమ్మ న్నాడు. పర్వతుడు తానొక పర్వతాకారములో నుండగా ఆ పర్వతంపై లింగాకార ముగా పరమేశ్వరుడుం డాలనీ అర్థించాడు. ఆ పర్వతం పేరులో ముందు 'శ్రీ' చేర్చమని అర్థించింది శ్రీదేవి.


భూమి పుట్టినప్పుడే ఈ క్షేత్రంలో మల్లికార్జునుడు వెలసెనని భక్తుల విశ్వాసం. హిరణ్యకశిపుడు, శ్రీరామచంద్రుడు, పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని అర్చించినట్లు పురాణ గాథ. వ్యాసభగవాను డు, ఘంటాకర్ణ శివా చార్యుడు ఇచ్చటనే తపమాచరించినట్లు ప్రతీతి.” స్నానం చేసినంత మాత్రాన సర్వపాపాలు హరించి శాంతిని చేకూర్చే పాతాళగంగలో శిష్యుల తోసహా స్నానాలాచ రించి మల్లికార్జున స్వామి ఆలయం లోనికి ప్రవేశించారు. అప్పుడు శంకరాచార్యుడు ఈ విధంగా స్తోత్రం చేశారు స్వామిని:


*సన్ధ్యారంభ విజృంభితం శ్రుతి శిరస్థానాన్తరాధిష్టితం*

*సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితం*

*భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం*

*సేవే శ్రీగిరి మల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ |*


*భృంగీచ్ఛానటనోత్కట: కరి మద గ్రాహీ స్ఫురన్మాధవా*

*హ్లాదో నాద యుతో మహా సితవపు: పంచేషుణాచాదృత:*

*సత్పక్ష స్సుమనో వనేషు సపున స్పాక్షాన్మదీయే మనో*

*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః |*


ఈ క్షేత్రంలో కొన్ని నాళ్ళు ఉన్నారు శంకరాచార్యులు.


ఆగమశాస్త్రానుసారము భ్రమరాంబికా దేవిని మహాశక్తిగా స్థాపన చేశారు. ప్రతిదినము పాతాళ గంగా తీరానికి పోయి గంగలో స్నానం చేసి, జప తపాదులు ముగించుకొని తత్తీరమందే శిష్యులకు పాఠాలు చెప్పేవారు.


చుట్టు ప్రక్కల గల పండితులు వచ్చి అప్పుడప్పుడు శంకరుని అద్వైత మార్గాన్ని బోధింప జేసుకొని వెళ్ళేవారు. పాశుపతాది మతస్థులువచ్చి అద్వైతమతాన్ని అంగీకరించక వాదాలకు దిగే వారు. అట్టివారితో పద్మపాదాది శిష్యులే ఎదుర్కొని ఓడించి పంపించే వారు. ఇలాంటి వారిలో తార్కికులు, సాంఖ్యులు, వీరశైవులు, వీరవైష్ణవులు, నాస్తికులు, న్యాయవాదులు, మీమాంసాదర్శకులు, జైనులు ఉన్నారు. వారందరు తుదకు శంకరతత్త్వం ముందు నిలబడలేక నిర్జితులై వెడలే వారు.


*కాపాలికుల కుట్ర:*


శంకరుని ప్రతిభా పాటవాలు, తేజో వైభవాలు అనన్య సామాన్యమైన శాస్త్ర వైదుష్యం అపార జ్ఞాన సంపద చూచిన ఇతర మతవాదు లందరూ ఆధాటికి నిలువలేక పాదా క్రాంతు లైన వారే. కాని కొందరు వివేకహీనులు కూడా ఉన్నారు ఆ పరిస్థితిని సహించక దురభిప్రాయంతో అప మార్గంలో అద్వైత వ్యాప్తిని అడ్డుకోకపోతే తమ మనుగడకే ముప్పు వస్తుందని. అందులో కాపాలికులు అనబడేవారు ప్రముఖులు. ఒక కాపాలికుని పంపిం చారు శంకరుని వద్దకు. అతడు అవధూతవేషం లో శంకరుని చేరాడు. వారు పాతాళ గంగా తీరంలో ఒంటరిగా ఉన్న సమయం చూచి. అతి వినయ విధేయతలు ఉట్టిపడు తుండగా బహు నమ్రభావంతో నిలబడి ఈ విధమైన వింత కోరికను వెలిబుచ్చాడు:


"స్వామీ! పరమపావన మూర్తీ! కృపాసాగరా! తమ దర్శనం కోసం నేను ఎప్పటి నుండియో ఎదురు చూస్తున్నాను. నేటికి సిద్ధించింది నా పుణ్యఫలంగా. మీరు సర్వశాస్త్రవిద్యా విజ్ఞాన స్వరూపులు. అపార కరుణా సముద్రులు. అహంకార మమ కారాలు ఏనాడో మీచే హతమైనవి.సర్వజ్ఞత్వం తో లీలామానుషమైన ఈ శరీరాన్ని ధరించి లోకోపకారం చేస్తున్న వారు. మీ దయ ఉండాలే కాని అసాధ్యములు సాధ్యము కాకపోవు. నాకొక కోరిక ఉన్నది. అది సిద్ధించడానికి మీ సహాయం తప్ప వేరు దారి లేదు. నేను కాలభైరవస్వామి అనుగ్రహం కోసం బహు విధములుగా ప్రయత్నించి విఫలుడ నయ్యాను. ఇప్పుడు ఆ కోరిక మీ కరుణతో సిద్దించవచ్చు. ఘోర తపస్సు చేయగా కాలభైరవుడు ప్రత్యక్ష మై నాతో ఈ విధంగా సెలవిచ్చాడు: 'నీ కోరిక సఫలం అవ్వాలంటే ఒక సార్వభౌముని శిరమును గాని, ఒక

యతీంద్రుని శిరస్సు గాని అగ్నిలో హెూమం చేయి' అని చెప్పి అంతర్ధాన మయ్యాడు. మహాత్మా! నాకు భూమండలంలో సార్వభౌముడన దగిన వాడు కాన రాడయ్యె. ఇక యతీంద్రుని కొరకే నా అన్వేషణ. కాని ఏ యతి నాకు శిరో దానం ఇవ్వడానికి సిద్ధ పడతాడు? అలా చేయడానికి తగిన విజ్ఞానపరిణతి, వైరాగ్య పరిపక్వత, మహాదాన సంకల్పం ఎవరికి ఉంటుంది? మీరు ఒకరే నాకు కనబడ్డారు ఇంద్రియముల మీద, దేహం మీద పూర్తిగా స్పృహ విడచిన వారు. మీ ఒక్కరికే నిజంగా అవగతమయింది ఈ జగత్తు అంతా అసత్య మని, సత్యమైనది వేరేదో ఉన్నదని. ఆ ఆత్మజ్ఞాన పరిపూర్ణు లైన మీరు నా ప్రార్థనను మన్నించి నన్ను ధన్యుణ్ణి చేయాలి. గతంలో దధీచి దేవతలకు తన ఎముకలను దానం చేసి అజరామరమైన కీర్తి సంపాదించాడు. అలాగే శిబి తన తొడను కడకు శరీరాన్నే ఇచ్చాడు డేగ ఆకలి తీర్చడానికి. మీ కరుణా కటాక్షం కోసం నిలబడ్డాను” ఆ కపట సన్న్యాసి కోరికకు తలయూపి శంకరుడు ఇలా అన్నాడు: “ఓయి సిద్ధపురుషుడా! ఎప్పటి కయినా విడువ దగినదే ఈ శరీరం. నా తల తీసికొని నీ పని కానిమ్ము. కాని ఒకటి గుర్తుంచుకో. ఇది చాల రహస్యంగా కావలసిన పని. కాబట్టి ఒక రహస్యప్రదేశం చూసుకో. నా శిష్యులు ఎవరి కయినా తెలిస్తే నీ పనికి అంతరాయం కలుగుతుంది" అని శంకరుడు కపాల దానానికి సిద్ధపడ్డాడు. అనుకొన్న రహస్య ప్రదేశంచేరి శంకరాచార్యుడు సుఖాసీనుడై, గెడ్డాన్ని కంఠం కుతుకున ఆన్చి, రెండు చేతులూ, మోకాళ్ళనూ తాకి, నిమీలిత నేత్రుడై, భ్రూమధ్యాన్ని చూస్తూ, సంకల్ప వికల్పములు లేనివాడై ఇంద్రియ వ్యాపారాన్ని అరికట్టి పరమాత్మను తానుగా భావిస్తూ అలా యోగసమాధి లోనికి వెళ్ళాడు. ఇక కాపాలి కుడు తన మనోరథం పూర్తి కానున్నదన్న ఆనందంతో ఒడలంతా ఎముకల బూడిదను పూసుకొని, మత్తుగా మద్యపానం చేసి,ఒకచేత కరవాలం వేరొక చేత త్రిశూలంతో కాలభైరవ వేషధారిగా వచ్చాడా చోటికి. వస్తూనే దూరాన నుండి కనబడినదా కండ్లు మిరుమిట్లు గొలిపే దివ్య దృశ్యం. ఏనాడో సుకృతం చేసికొని ఉండాలి ఆతడు. లేకపోతే ఎలా లభ్య మవుతుంది యోగ సమాధిస్థితుడై ఉన్న పరమేశ్వరుని దర్శనం!


*పద్మపాదుని నృసింహావతరణ:*


కాలకృత్యాలకు వెడలిన శిష్యులు స్నానాలు చేసి, సంధ్య నుపాసించి ధ్యానంలో ఉన్నారు. పద్మపాదుడు కూడా ధ్యాననిమగ్నుడై ఉండగా అతనికి గోచరించింది కరవాల ము ధరించి జగద్గురు వుల శిరమును ఖండించడానికి ఉద్యుక్తుడై ఉన్న కాపాలికుని దృశ్యం. వెంటనే పద్మపాదుడు తన ఇష్టదైవాన్ని తలచుకొన్నాడు. తలచిన మరు క్షణమే పద్మపాదునికి నృసింహ స్వామి రూపు వచ్చింది. కాపాలికుడు గురుదేవుడు ఉన్న రహస్య స్థలంలో అదే క్షణంలో ప్రత్యక్ష మయ్యాడు. అగ్నిజ్వాలలు కక్కు తున్న ముఖంతో, వాడి కోరలతో, చీల్చి చెండాడే కత్తుల వంటి గోళ్ళతో చింత నిప్పు వంటి నాలుకతో భీకర రూపందాల్చి సింహ గర్జనను మించిన గర్జనతో ఒక్క ఉరకలో కాపాలికుని మీదికి లంఘించినాడు పద్మపాదుడు. పృథివి దద్దరిల్లింది. 


సకలభూతములు భీతిల్లాయి. దేవతలు అడలి అవనికి దిగి వచ్చారు. హిరణ్య కశిపుని బారి నుండి ప్రహ్లాదుని కాపాడినట్లు కాపాలికుని సంహరించి శంకరుని రక్షించు కొన్నాడు.


ఇంతలో శంకరుడు యోగ సమాధి నుండి వెలువడి జరిగినది గ్రహించాడు. ఆకాశం విరిగి మీద పడినట్లు అట్టహాసంతో ప్రత్యక్ష మయిన ఆ ఉగ్ర నరసింహ స్వామిని చూచి ఇలా ప్రార్థించాడు:

*“కల్పంతో జృంభమాణ ప్రమథ*

*పరివృఢ ప్రౌఢ లాలాట వహ్ని*

*జ్వాలాలీఢ త్రిలోకే జనిత చటచటధ్వాన ధిక్కార ధుర్యః ॥*


*మధ్యే బ్రహ్మాండభాండోదర కుహర,* 

*మనైకాంత్య దుస్థా మనస్థాం*

*ప్రాప్తస్త్యానో మమాయం*

*దళయతు దురితం*


 శ్రీనృసింహాట్టహాస:


ఉగ్రరూపాన్ని ఉపసంహ రించమని శంకరులు అర్థించగా ఆ రూపం అదృశ్యమై పద్మపాదా చార్యుడు గోచరించాడు. పద్మపాదుడు ఆనందా శ్రువులతో గురువు పాదాలకు అభిషేకం చేశాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*23 వ భాగము సమాప్తము*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

హరికిం బట్టపుదేవి,

 



💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణముల ననుగ్రహించును గాక!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఔషధసేవనం బాచరించెడి వేళ

 ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూద'ననతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ  వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "

లుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ॐపంచాంగం

 ॐపంచాంగం  ॐ

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

 *_సెప్టెంబరు 27, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *దశమి* సా4.19

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *పుష్యమి*

మర్నాడు తె4.46

యోగం : *శివం* తె3.52

కరణం: *విష్ఠి* సా4.19

&

*బవ* తె4.31

వర్జ్యం: *మ12.14-1.54*

దుర్ముహూర్తము: *ఉ8.16-9.04*

&

*మ12.16-1.04*

అమృతకాలం: *రా10.09-11.49*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.53*

సూర్యాస్తమయం: *5.52*

 *లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

ధారుణి రాజ్యపీఠములఁ

 ఉ॥

ధారుణి రాజ్యపీఠములఁ ధైర్యముఁ నీతియుఁ ధర్మపాలనం 

దీరిన నేతలుండిన నతీవముదావహమౌను ధాత్రికిం 

గూరిమి బెంపుగాంచు జనకోటులఁ దేశవిదేశరాశిలో 

భారము గాదు శాంతి యెడబాయని యుద్ధములెల్ల నశ్యమౌ 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - దశమి - పుష్యమి -‌‌ భృగు వాసరే* (27.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మగవాడు ఆడదానిలా

 *🍂మగవాడు ఆడదానిలా ఎలా మారతాడు🍂*


*మగాడికి_మగాడికి_పిల్లలు_ఎలా_పుడతారు?*


*

*మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు...*

         

1. *కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.*

          

2. *నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*

         

3. *పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం : పంచ భూతాలు + కుంతి= పాండవుల జననం...*

          

4. *ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే... కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు... తద్వారా అశ్వత్థామ జననం...*

          

5. *ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం...*

        

6. *అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం...*

        

7. *సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి=ఘటోత్కచుడు*


8. *ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.*

         

9. *మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు అనే గంధర్వవుడు...*

          

10. *చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి...*

        

*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి... కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*

      

*ఇవేమి, నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు... కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*

              

*ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు... కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*

         

*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్... అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని, స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు...*

        

*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని existency ఉండి తీరుతుంది...*

       

*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం... మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం...*


*హిందూ సాంప్రదాయం చాలా గొప్పది*

     

*భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?*

      

*భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)*


*భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*


*ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*


*విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*


*విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*


*భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే*


*గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే*


*రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*


*కాస్మోలజీ చెప్పిన కపిలుడు*


*అణువులు గురించి వివరించిన కణాదుడు*


*DNA గురించి చెప్పిన బోధిధర్మ*


*మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*


*మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*


*సంగీతాన్ని (స.రి.గ.మ.ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*


*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.*


 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*

*నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది*

🙏🕉️🙏 🕉️🙏🕉️ 🙏🕉️🙏

హైందవం వర్ధిల్లాలి 13*

 *హైందవం వర్ధిల్లాలి 13*




*సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి* 

v):- యుక్త వయస్సులో పిల్లలు చూసిన వాటికి ఆకర్షితులు కావడం సహజం. ఈ తరం పిల్లలు ఉన్నత పాఠశాల స్థాయినుండే చాలా స్వేచ్చా, స్వాతంత్రాలతో కోరిన వాటిని పొందుతూ సంతోషపడ్తూఉంటారు. పొందిన స్వేచ్చా స్వాతంత్రాలతో దుర్గుణాల పాలయిన పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి రావచ్చు. ఇది పూర్తిగా పిల్లలలో ఉండే లోపమని చెప్పడానికి వీలులేదు. వీటన్నిటికీ కారణాలు సరైన పెంపక లోపం, స్నేహితులు, పాఠశాల మరియు కళాశాల, ఇంట్లో వాతావరణం మరియు సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ వాతావరణం దాదాపు గత దశాబ్దం నుండి మన దేశంలో అధికంగా నెలకొనిఉన్నది.*


ఇట్టి దుర్గుణాలకు లోనైన వారందరూ ధనవంతుల పిల్లలే అనుకోవడానికి లేదు. ధనవంతులకు పిల్లలతో చెట్టా పట్టాలేసుకుని తిరిగే సన్నిహిత పిల్లలు, యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు ( దొంగతనాలు, జూదాలు, గుట్కాలు ,మద్యం మున్నగు) లోనైన వారు ఇటువంటి అలవాట్లకు లోనవుతారు. 


*కొన్ని చెడు అలవాట్లు*:- పొగత్రాగడం, సిగార్, బీడీ. బార్లు, క్లబ్బులు, పబ్బులు, మాదక ద్రవ్యాలైన నల్లమందు, గంజాయి సేవించడం. హుక్కా, నార్కోటిక్ డ్రగ్స్, ఇన్ హేలర్స్, ఇంజెక్టిబ్ల్స్, హాలుసినోజెన్స్ ఇత్యాది. 


మన హిందూ సమాజంలో ముఖ్యంగా నగరాలలో, విదేశాలలో, ధనిక వర్గాలలో ఉండే తల్లి, తండ్రి ఆధునిక స్వేచ్ఛాప్రపంచంలో మేమూ భాగస్వాములమే అను భ్రమలో మధ్య రాత్రి వరకు ఇంటి బయటే గడిపి రావడం. సమయాసమయాలు పాటించకుండా ఆ మత్తులో , పిల్లల ముందే గొడవలు పడడం, ఇత్యాది కారణాలు ఎదుగుతున్న పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. *తల్లి, తండ్రి ఆప్యాయత కరువైన పిల్లలు, అమ్మా నాన్న అడుగుజాడలలో నడిచే పిల్లలు ఇటువంటి దురలవాట్లకు గురయ్యే అవకాశాలు హెచ్చు*. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలలో మొండితనం, దురలవాట్లు, చెడు సాంగత్యం, బాధ్యతా రాహిత్యానికి కారణాలు పెద్దల ప్రవర్తన, మిత్ర బృందం మరియు వారుంటున్న సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ ప్రవర్తనలు అన్ని హిందూ ధర్మాన్ని బలహీన పర్చే అంశాలైనా ఇంకా విపులంగా చర్చించుటకు ఇది వేదిక కాదు*. సమాజంలో ఎన్ని రుగ్మతలో మననం చేసుకోవటానికి మాత్రమే ఈ అంశం ప్రస్తావించవలసివచ్చింది. *మంచైనా, చెడైనా పెద్దల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న విషయం జగద్విదితమే*. 


ఒక్కొక్క సారి అంగడిలో (market) కొన్ని కూరగాయలు దొరకవేమో గాని, దురభ్యాసాలకు అలవాటుపడిన పిల్లలకు ఈ మత్తు పదార్థాలు చాలా తేలికగా లభిస్తాయి. *ఇందుకు కారణం సమాజ ద్రోహులు మరియు వారు నిర్వహించే అక్రమ వ్యాపారాలు, అడిక్షన్ కేంద్రాలు*. ప్రతి విషయం చట్టం మాత్రమే చూడాలి అను భావన కూడదు. చట్టాన్ని నిందిస్తూ ఉండకూడదు. తల్లి తండ్రి మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు జాగరూకులై ఉండాలి, చట్టానికి సహకరించాలి. 


*ప్రతి సారి భారత దేశంలోని హైంద ధర్మ మరియు సంస్కృతి, సంప్రదాయాల హానికి వీళ్లది తప్పు, వాళ్ళది తప్పు (పాశ్చాతులు, దుర్మార్గులు) అని వాపోయే దానికంటే... మనం ఆత్మ విమర్శతో ఉండాలి. హైందవ ధర్మం, సంస్కృతి, ముఖ్యంగా కుటుంబ గౌరవం దేశభక్తి సంప్రదాయాలను "విస్మరిస్తున్నామనేదే" ప్రబల కారణం*. కావున మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.


ధన్యవాదములు.

*(సశేషం)*.

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

నమస్కుర్మః ప్రేఙఖన్ 

మణికటక నీలోపలమహః

పయోధౌ రింఖద్భిః 

నఖకిరణ ఫేనైః ధవలితే|

స్ఫుటం కుర్వాణాయ 

ప్రబల చల దౌర్వానలశిఖా

వితర్కం కామాక్ష్యాః

సతతమరుణిమ్నే చరణయోః ||18||

 

భావము:

కామాక్షీదేవి చరణమంజీరాలయందలి ఇంద్రనీలమణుల కాంతియనే నల్లని రంగుగల సముద్రమందు, దేవి చరణ నఖకాంతులనే తెల్లని నురుగు వ్యాపించగా, శ్రీచరణములయందలి అరుణిమ బడబాగ్ని జ్వాలగా తోచును. ఆ దివ్యచరణారుణిమకు నమస్కారము.

దేవి చరణ స్తుతిని చేస్తున్న మూకకవి ఇందు తెలుపు, నలుపు, ఎరుపు రంగులను ప్రస్తావించి త్రిమూర్త్యాత్మకతను ధ్వనింపచేసాడు. సత్వరజస్తమస్సుల వర్ణములును ఇవే. చరణారుణిమకు నమస్కారం అనుటచేత అగ్ని ఉపాసన వ్యక్తం అగుచున్నది.

 

*********

  

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

మనోహరమైన

 👆శ్లోకం

శుభాంగశ్శాన్తిదస్స్రష్టా                          

కుముదః కువలేశయః|.                    

గోహితో గోపతిర్గోప్తా.                       

వృషభాక్షో వృషప్రియః||


ప్రతిపదార్థ:


శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.


శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.


స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.


కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.


కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.


గోహిత: - భూమికి హితము చేయువాడు.


గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.


గోప్తా - జగత్తును రక్షించువాడు.


వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.


వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.

వ్యాధి సంభవించినట్లయితే

 శ్లోకం:☝️

*జాతమాత్రశ్చికితస్యః*

*స్యాన్నోపేక్షయోల్పతయా గదః |*

*వహ్నిశత్రువిషైస్తుల్యః*

*స్వల్పోఽపి వికరోత్యసౌ ||*


భావం: వ్యాధి సంభవించినట్లయితే, దానికి వెంటనే చికిత్స చేయాలి; కొంచం కూడ ఉపేక్షించవద్దు. లేకపోతే అగ్ని, శత్రువు మరియు విషం వలె విపరీతంగా పెరిగి నయం అది చేయలేనిదిగా మారుతుంది. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయ్యేంత వరకు వేచి చూడవద్దని భావం.

పంచాంగం 27.09.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 27.09.2024 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష దశమి తిధి భృగు వాసర: పుష్యమి నక్షత్రం శివ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


దశమి మధ్యాహ్నం 01:23 వరకు.

పుష్యమి రాత్రి 01:22 వరకు.


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:05


వర్జ్యం : పగలు 08:11 నుండి 09:54 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 01:19 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:29 నుండి రాత్రి 08:12 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార: