30, సెప్టెంబర్ 2024, సోమవారం

గణపతి జ్ఞానం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

          *గణపతి జ్ఞానం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"అనుకూలత - ప్రతికూలత" అనేవి కాల లక్షణాలు. ప్రతికూలతను తొలిగించి అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వరచైతన్యమే విఘ్నేశ్వరుడు. మంచి పనులకు విఘ్నాలను తొలగించి, చెడు పనులకు విఘ్నాలను కలిగించే విఘ్న నియామకుడు 'వి-నాయకుడు'.*


*ప్రథమదేవుడు, ప్రధానదేవుడు గణపతి. ఏ కార్యానికైనా - అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు - వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే "గణపతి"గా ఉపాసించడం వేదసంప్రదాయం.*


*శివుడు జ్ఞానమూర్తి - శక్తి ఆనందస్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. ఈ శివశక్తుల ఏకతత్త్వమే గణపతి- అంటే- జ్ఞానానంద సమాహార స్వరూపం. జ్ఞానానంద శక్తి నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి.*


*కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం వంటివి లేకుండా, ఉత్సాహంగా, "తప్పక సిద్ధి లభిస్తుంది" అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని "ఆమోదం" అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని "ప్రమోదం" అని భావించవచ్చు. ఆనందపు ఈ రెండు భావాలే గణపతి శక్తులు.*


*'పూర్ణ'త్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డు..వంటివి గణపతికి నైవేద్యాలుగా - ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానందతత్త్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం.*


*వేదాంతపరంగా.. బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే 'వక్ర'మైన మహాశక్తే 'విఘ్నం'. దానిని తొలగించి, తన పరతత్త్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్ననాశకుడు, మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు.*


*శివశక్తుల సమైక్య తత్త్వం, ప్రకృతీ - పురుషుల ఏకత్వం వినాయకముర్తి. శరీరం తల్లి సమకూర్చింది, గజశిరస్సు తండ్రి అమర్చినది. ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మకం. నరశరీరం జగత్తుకి సంకేతం. గజశిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక.*


*ప్రపంచంలో శబ్ద, స్పర్శ, రూప, గంధాలను ఇంద్రియ గణాలద్వారా స్వీకరించి, హృదయమనే చిన్న కలుగులో రహస్యంగా అనుభవించే జీవుడే మూషికం. 'ముష్' అనే ధాతువును 'చోరత్వం' అని అర్థం. దీనిని అధిష్ఠించిన మహోన్నత అపరిమిత పరమాత్మ చైతన్యమే - మూషిక వాహనారూఢుఢైన గణపతి.*


*భిన్నత్వంలో ఏకత్వమే గణపతి (గణేశ) తత్త్వం. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ, ఏకం దైవత్వం - అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏకచైతన్యమే గణేశుడు. విశ్వమే అనేకగణాలతో కూడిన మహాగణం. విశ్వనాయకుడే మహాగణపతి.*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

     *అతి సర్వత్ర వర్జయేత్**

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*అతి దానాత్ హత: కర్ణ:*


*అతి లోభాత్ సుయోధన:*


*అతి కామాత్ దశగ్రీవో*


*అతి సర్వత్ర వర్జయేత్॥*


*తాత్పర్యము:~*


*మితిమీరిన దానం వలన కర్ణుడు చంపబడ్డాడు. విపరీతమైన లోభం వలన సుయోధనుడు చంపబడ్డాడు. మితిమీరిన కామం వలన దశకంఠుడైన రావణాసురుడు చంపబడ్డాడు. అతి అనేది అన్నిచోట్లా వర్జింపబడవలసినదే!*


*వ్యాఖ్య :~*


*తన పుట్టుకతోనే ఉన్నటువంటి సహజ కవచకుండలాలని తీసివేస్తే అది తన చావుకి కారణం అవుతుందని తెలిసికూడా, వచ్చినవాడు శత్రువని తెలిసి కూడా తన దాన గుణాన్ని అనుసరించి కవచకుండలాలు దానం చేసిన కర్ణుడికి చివరకి మహాభారత యుద్ధంలో అదే అతని చావుకి కారణం అయింది. హద్దులు మీరిన దాన గుణం మంచిది కాదు. అందుకే, తన్నుమాలిన ధర్మ పనికి రాదు అనిపెద్దలు చెపుతారు.*


*ఐదు ఊళ్ళిచ్చినా చాలు పాండవులకి అని శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారానికి వస్తే తన అహంకారపూరితమైన లోభత్వం వలన నిరాకరించాడు దుర్యోధనుడు. చివరకి అదియే మహాభారత యుద్ధానికి దారి తీసి అసంఖ్యామైన జన నష్టానికి దారి తీసింది. తను, అంటే దుర్యోధనుడు కూడా మరణించాడు. విపరీతమైన లోభం కూడా వినాశనానికి హేతువు అవుతుంది.*


*వనవాసంలో ఉన్న రాముని భార్యని ప్రతీకారచర్యతో అపహరించి ఆమె అందానికి దాసుడై మితిమీరిన కోరికతో వివాహమాడమని బలవంతంగా నిర్బంధిస్తాడు. అదే అతని చావుకి కారణమైంది. శ్రీరాముని చేతిలో సంహరింపబడ్డాడు. హద్దులు దాటిన కోరికలు పతనానికి దారి తీస్తాయి.*


*కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు మనిషి పతనానికి వినాశనానికి మూల కారణమని అనేక ఉదాహరణలు మన దేశ చరిత్రలోను ప్రపంచ చరిత్రలోనూ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రస్తుత ప్రపంచంలో కూడా వాటిని ప్రతి నిత్యమూ ఏదో మూల అటువంటివి జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత!*


*వీటి అన్నిటినుండీ మనిషి తనని తాను సంరక్షించుకునేందుకు మంచి విద్య, మంచి వాతావరణంలో పిల్లల పెంపకం చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రుల మరియు సమాజం యొక్క బాధ్యత.*


*అందుచేతనే, అతిసర్వత్ర వర్జయేత్ అనేది మన నిత్యజీవితంలో విస్త్రుతంగా ఉపయోగించే నానుడి అయింది.*


*అదియే ఈ సుభాషితంలోని ఉద్దేశం.*


*ఇదే అర్థంవచ్చే మరొక శ్లోకంకూడా ప్రచారంలోవుంది.*


*అతిదానాత్ బలిః బద్ధః*

*హ్యతిమానాత్ సుయోధనః |*

*వినష్టో రావణో లౌల్యాత్*

*అతి సర్వత్ర వర్జయేత్ ” ||*


*మితిమీరిన దానం వల్ల బలిచక్రవర్తి బంధించబడ్డాడు. మితి మీరిన స్వాభిమానం దుర్యోధనుణ్ణి నాశనంచేసింది. అదుపుతప్పిన (స్త్రీ)లోలత్వం రావణాసురుడిని రాలిపోయేలాగ చేసింది. (అందువల్ల) అతి దేనిలోనైనా పనికిరాదు”.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

Akila Bharata nityaannadaana



 

Panchang


 

జీవితంలో అసలైన తోడు ఎవరు?* అమ్మనా?

 💯💯💯💯💯💯💯💯💯

 

*నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు?*

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బంధువులా ?

సడ్డకులా?

బామ్మర్దులా ?


లేదు. ఎవరూ కాదు.!


నీ నిజమైన తోడు *నీ శరీరమే!*నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!

నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!

*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ.

*ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.* 

ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో !

*నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!*

నీ శరీరమే నీ ఆస్థి, సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తుల తూగదు.

నీ శరీరం నీ బాధ్యత...


డబ్బు వస్తుంది. వెళ్తుంది.

బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు.

*గుర్తుంచుకో.!*

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...!


ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*

మనసుకు- *ధ్యానము*

శరీరానికి- *యోగా.*

గుండెకు- *నడక.*

ప్రేగులకు- *మంచి ఆహారం.*

ఆత్మకు- *మంచి ఆలోచనలు.*

*సమాజం కోసం*- *మంచి పనులు.*

_*👆ఒకటికి రెండు సార్లు చదవండి. ఈ మంచి సందేశాన్ని అందరికీ పంపండి🙏*_

ప్రధాన మంత్రి

 ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు

 *నెహ్రూ* దీనిని నిరూపించారు.


ఒక పేదవాడు కూడా ప్రధాన మంత్రి కాగలడు

 *లాల్ బహదూర్ శాస్త్రి జీ* దీనిని నిరూపించారు.


 వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు

 *మొరార్జీ దేశాయ్* దీనిని నిరూపించారు.


ఒక యువకుడు ప్రధాని కాగలడు

 *రాజీవ్ గాంధీ* దీనిని నిరూపించారు.


 ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు

ఇది *ఇందిరా గాంధీ* గారు నిరూపించారు.


 నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు

 *చరణ్ సింగ్* నిరూపించాడు.


 రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు *V.P. సింగ్ గారు* నిరూపించాడు.


విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు

 దీనిని *పి.వి.నరసింహారావు గారు* నిరూపించారు.


 కవి ప్రధాని కాగలడు

 *అటల్ బిహారీ వాజ్‌పేయి గారు* దీనిని నిరూపించారు.


ఎవరైనా ప్రధాని కావచ్చు

ఇది *HD దేవెగౌడ* గారు నిరూపించారు.


 దేశానికి ప్రధాని అవసరం లేదు *డాక్టర్ మన్మోహన్ సింగ్* నిరూపించారు.


 ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు

 *సోనియా గాంధీ* దీనిని నిరూపించారు.


 *కానీ ఒక టీ అమ్మేవాడు కూడా ప్రధానమంత్రి కాగలడు* మరియు *వీరందరి కంటే మెరుగైన పని చేయగలడు* మరియు *భరతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు* అని *నరేంద్ర మోదీ జీ* 500 వందలసంవత్సరాలనుండి ఎదురుచూస్తున్న అయోధ్యను స్వాధీనం చేసుకుని రామమందిరాన్ని కట్టి ప్రతిష్ఠించాడు.కాశ్మీర్ ను తిరిగి పూర్తిగా భారత్ లో కలపడమేకాక త్వరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు.త్వరలో కాశీలో జ్ఞానవాపీ,మథురలో కృష్ణమందిరం మనఖాతాలో వేస్తాడు.


ఈ రోజు ప్రపంచం లోని కొన్ని దేశాలు, మన దేశం లో ఉన్న చాలా మంది ఒక వ్యక్తిని గద్దె దించడానికి కుయుక్తులు పన్నడంలో నిమగ్నమై ఉన్నారు.


*కొంచెం ఆలోచించు...*


*అమెరికా, చైనా లాంటి దేశాల మెడలు వంచగలిగే మొనగాడు, గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బల్లెం లా ఉండే పాకిస్థాన్ ను ఈ రోజు ఆకలి కేకలతో అలమటిస్తూ అడక్కుతినే స్థాయికి దిగజార్చిన మొనగాడు మోడీ* మోడీని చేజార్చుకుంటే మోడీకి ఏమీనష్టం లేదు.నష్టమంతా దేశానికి మరియు హిందువులకు మాత్రమే. ఆయన ఒక మహర్షి.

కాబట్టి, మిత్రులారా ! అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దగలడు!


 *"మన దేశానికి మోడీ అవసరం"*


 "నేను ఉచితంగా ఆహారం ఇస్తాను" - *రాహుల్ గాంధీ*


 "నేను ఉచితంగా నీరు ఇస్తాను" - *కేజ్రీవాల్*


*"నేను ఉచితంగా భోజనం ఇవ్వను, నేను నీరు కూడా ఉచితంగా ఇవ్వను నేను చాలా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనుకుంటున్నాను, భారతదేశంలోని యువతను క్రియాశీలురు గా చేస్తాను, తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ స్వశక్తి తో కడుపు నింపుకుంటారు మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలరు" - నరేంద్ర మోదీ*


 *సమస్య కేజ్రీవాల్‌లోనో, రాహుల్ లోనో లేదు, ఉచిత సామాగ్రి లభిస్తే లాడెన్‌కు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ ప్రజలలో ఉంది.* 

           

*మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపండి. త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది.*


*జస్ట్...కొంచెం ఫార్వర్డ్ చేయండి.. దీనికి 2-3 సెకన్లు మాత్రమే పడుతుంది...*


 *జై హింద్....జై భారత్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

తిరుమల ఆలయంలో

 అక్టోబర్ 1న తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు


విఐపి బ్రేక్ దర్శనం  సిఫార్సు లేఖలు సెప్టెంబర్ 30న ఆమోదించబడవు


తిరుమల, 28 సెప్టెంబర్ 2024:


 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది. 


ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.


తమిళంలో, కోయిల్ అంటే 'పవిత్ర పుణ్యక్షేత్రం', ఆళ్వార్ అంటే "భక్తుడు", తిరు అంటే "శ్రేష్ఠo", మంజనం అంటే  "స్నానం".  కోయిల్ ఆల్వార్  తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం. 


ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన "పరిమళం" అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.


 ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా  జరుగుతుంది.  తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు .  అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.


ఈ యావత్ కార్యక్రమం  ఆగమ శాస్త్రం ప్రకారం  నిర్వహించబడుతుంది. 


 సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .

గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును

వి ఐ పి బ్రేక్ దర్శనం రద్దు 


 టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి టీటీడీ కి సహకరించవలసిందిగా మనవి.

-----------------


టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


  *జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వా*

  *ద్యము ల్కలశబ్దధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు*

  *ల్మెఱుం గులు నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తు*

  *న్నిన్నున్ భక్తి రంజిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*



            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 50*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కావ్యరసములే స్నానముగా, పద్యములే పూలుగా, అర్థమే భేరీకాహళవాద్యములుగా, అలంకారములు వస్త్రములుగా, కవితాసౌందర్యమే దీపములుగాశ చేతనయినట్టుగా నీ కైంకర్యము చేసెదను స్వామీ*


✍️🌷🌺🌹🙏

సుదర్శన శతకము*

 *సుదర్శన శతకము*

 *తెలుగు పద్యాను వాదము 15* 

*రచన:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


*సేనా సేనామ్*

 


*తే గీ. చక్రజ్వాలల ధాటికి సాగలేక*

*ఇనుమడించె మూడు గుణాలు నింద్రునందు* 

*భయము కలిగించె సైన్యాన్ని వశము చేసి*

 *రణమునందన నాయక ప్రాణములను*

*రాక్షసులు నుండి లోకాన్ని రక్ష చేసె*

*జన్మజన్మల కర్మల  సంచితమ్ము*

*తొలగజేయును పాపాలు దూరమగును*


*గర్వసహితులౌ వైరుల సర్వమణచి*

*చండ శాసన చెయుమో చక్ర రాజ*




*ఓం నమో భగవతే సుదర్శనాయ*



*💐🌹🙏🙏*

*శ్రీ చెట్టికులంగర భగవతి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 455*


⚜ *కేరళ : మావెల్లిక్కరా : అలెప్పి*





⚜ *శ్రీ చెట్టికులంగర భగవతి ఆలయం* 



💠 చెట్టికులంగర భగవతి ఆలయం అలప్పుజ జిల్లాలోని మావెలిక్కర తాలూకాలో ఉంది.

 ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధ దేవి ఆలయాలలో ఒకటి,


💠 భద్రకాళి, పరమాత్మ శక్తి దేవి అవతారం, రాక్షస రాజు దారుకుడిని చంపడానికి శివుని మూడవ కన్ను నుండి జన్మించింది.

 'భద్ర' అంటే మంచిది మరియు 'కాళి' అంటే కాలదేవత. కాబట్టి భద్రకాళి శ్రేయస్సు మరియు మోక్షం కోసం పూజిస్తారు. 

దేవి సృష్టికర్త, రక్షకుడు, విధ్వంసకం, ప్రకృతి, శక్తి మరియు కుండలినీ శక్తిగా పరిగణించబడుతుంది. 


💠 ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే బగవతి దేవత ఒక రోజులో మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. 

ఉదయం మహా సరావతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం భద్రకాళిగా దర్శనమిస్తుంది. 

కొడంగల్లూర్ దేవి ఆలయంలో కూడా ఈ ప్రత్యేకమైన పరివర్తనను చూడవచ్చు, అందుకే చెట్టికులంగర దేవిని కొడంగల్లూర్ దేవి కుమార్తెగా భావిస్తారు.


🔆 చరిత్ర


💠 పరశురాముడు 108 దుర్గా ఆలయాలు, 108 శివాలయాలు, అనేక శాస్తా దేవాలయాలు, 108 కలరీలు (దేవుని ముందు సంప్రదాయ యుద్ధ కళలు నేర్చుకునే స్థలం), శక్తి కేంద్రాలు మొదలైనవాటిని స్థాపించాడని పరశురాముడు కేరళ యొక్క ఆవిర్భావ సిద్ధాంతాన్ని చాలా మంది అనుచరులు గట్టిగా నమ్ముతారు. 

ఐదు అంబాలయాలను స్థాపించాడు.


💠 ఈ ఆలయాన్ని  823లో మకర మాసంలోని ఉత్రిత్తతి రోజున పద్మపాదాచార్య (ఆది శంకరుల ప్రధాన శిష్యుడు) ప్రతిష్ఠించారు. 


💠 పండుగలు :  ఈ ప్రసిద్ధ బగవతి ఆలయంలో ప్రధాన పండుగలు కుంభ భరణి ఉత్సవం, పరాయిడుప్పు పండుగ, ఎతిరప్పు ఉల్సవం మరియు అశ్వతీ ఉల్సవం. 

భరణి ఉత్సవాల సమయంలో నిర్వహించబడే ఈ దేవాలయంలోని అతి పెద్ద కార్యక్రమాలలో కుతియోట్టం ఒకటి. 

కుతియోట్టం అనేది ఒక కళారూపంలో ప్రదర్శించబడే నరబలికి ప్రతీక.

 కుతియోట్టం పాటలతో కూడిన ఈ నిర్మాణాత్మకమైన మరియు చక్కటి నృత్యరూపకం కలిగిన కళారూపం ఇప్పటికీ కేరళలో పాటిస్తున్న అరుదైన ద్రవిడ జానపదం.


💠 కేరళలో అనేక దేవాలయాలలో, "పరాయిడుప్పు" కాలం పండుగ కాలం. చెట్టికులంగర దేవాలయంలోని దేవతను మలయాళ మాసం మకరంలోని మకాయిరియం నక్షత్రం నాడు పరాయిడుప్పు కోసం ఊరేగింపుగా తీసుకువెళ్లినప్పుడు ఇదంతా ప్రారంభమవుతుంది.

 మీనం చివరి వరకు పండుగలు కొనసాగుతాయి.

కుంభ భరణి చెట్టికులంగరలో ప్రధాన పండుగ కుంభ భరణి. ఇది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉంటుంది. 

మలయాళ క్యాలెండర్ కొల్లవర్షం ప్రకారం తేదీ నిర్ణయించబడుతుంది. 


💠 చెట్టికులంగర భరణిని కుంభ మాసంలో మరియు భరణి నక్షత్రం ఉన్న రోజున జరుపుకుంటారు కాబట్టి దీనికి కుంభ భరణి అని పేరు వచ్చింది. 

ఈ ఉత్సవంలో కుతియోట్టం మరియు కెట్టుకజ్చా ప్రధానమైనవి.


💠 ఈతిరేల్పు ఉల్సవం : 

 ఇది ఆలయ వార్షికోత్సవం. 

కుంభ భరణి తరువాత 13వ రోజున ఆలయంలో వార్షిక ఉత్సవం 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. 

పండుగ యొక్క ప్రతి రోజు 13 మంది కారా నివాసితులు నిర్వహిస్తారు. 

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆచారాలు జరుగుతాయి.


💠 అశ్వతీ ఉల్సవం : 

ఉత్సవాలలోని విశిష్టమైన ఆచారాలు ప్రజలకు మరియు వారి ప్రియమైన భగవంతుడికి మధ్య విడిపోయే సమయంలో దృఢమైన బంధాన్ని మరియు మానవ దుఃఖాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. 

మీనోమ్ మాసంలో అశ్వతి రోజున జరిగే ఈ పండుగ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పండుగ కొడంగల్లూర్‌లోని తన తల్లిని దర్శించుకోవడానికి ప్రయాణంలో దేవతకి పంపే పండుగగా భావించబడుతుంది. 


💠 'కుతీర' (గుర్రాలు), ఐదు తేరు' (రథాలు) మరియు భీముడు మరియు హనుమంతుల చిహ్నాలుగా పిలువబడే ఆరు ఆలయ కార్ల యొక్క నేర్పుగా చెక్కబడిన మరియు అలంకరించబడిన రూపాలను కెట్టుకజ్చా ప్రదర్శిస్తుంది.

కుతిరాస్కుతిరాస్ సుమారు 70 నుండి 105 అడుగుల ఎత్తును కలిగి ఉంటాయి మరియు అవి నాలుగు భాగాలుగా ఉంటాయి - ఆదిక్కూట్టు, కతిరకల్, ఎడక్కోడారం, ప్రభద మరియు మెల్క్కూదరం, ఒకదానిపై ఒకటి వరుసగా.


💠 చెట్టికులంగర శ్రీ భగవతి ఆలయం నుండి అలప్పుజ బస్ స్టేషన్ (45.4 కి.మీ).

హైందవం వర్ధిల్లాలి 16*

 *హైందవం వర్ధిల్లాలి 16*

(స్వధర్మ ప్రోత్సాహం అభిలషణీయమే)




 *ధర్మ మరియు దేశ ద్రోహులను నిరోధించాలి*:- గత  అధ్యాయాలలో ధర్మ మరియు దేశ ద్రోహ  వాస్తవాలను గమనించాము. దేశ ద్రోహుల ఆగడాలకు అంతముండుటలేదు. రోజులు గడిచినా కొద్దీ కొత్త కొత్త శాంతి భద్రతల సమస్యలు. మన దేశంలో హిందువులు మాత్రమే గాకుండా అనేక మతాల వారు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, భౌద్దులు, జైనులు, యూదులు, జోరాష్ట్రీయన్లు, బహాయీలు, పార్సీలు నివాసమేర్పర్చుకునిఉన్నారు. 


అవుతే, దేశవాసులందరు ద్రోహులు కారు. అన్ని మతాలకు చెందిన వారిలో దేశాభిమానులు ఉన్నారు. *అందరు కూడా దేశ ప్రతిష్ట మరియు రక్షణకై ఉద్యుక్తులు కావాలి*.   ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింలు కుల, మత, వర్గ వివక్షత లేకుండా ప్రధాన పాత్ర పోషించాలి. ఇతర దేశాల్లో ప్రజలు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఉంటారు. *ముందు దేశం తదుపరి మాత్రమే ఇతరత్రా*. కాని, భారత దేశంలో అధికులు *ముందు తాము, తదుపరి మతము, ఆ చివరన దేశము*. ఇది ముమ్మాటికీ  గర్హనీయమైన వ్యవస్థ. 


దేశాభిమానులందరు దేశ ద్రోహుల పట్ల జాగరూకులై, ఏమరుపాటు లేకుండా అప్రమత్తతో దేశ రక్షణ మరియు శాంతి భద్రతల పట్ల మెళుకువగా ఉండాలి. 


ఏ ప్రాంతపు వాసులు ఆ ప్రాంతపు పరిసరాలపై నిఘా ఉంచాలి. కొన్ని దేశ ద్రోహ మరియు దేశ విచ్ఛిన్నకర అవకాశాలను పరిశీలిద్దాము.  రైలు పట్టాలపై అడ్డంకులు అనగా సిమెంటు దిమ్మెలు, బండ రాళ్ళు, ఇనుము కడ్డీలు, గ్యాస్ సిలిండ్లర్లు పెట్టి రైల్వే వరుస ప్రమాదాలకు దుండగులు పాల్పడుతున్నారు,  

జాతి జనుల మధ్య విభేదాల సృష్టి, తీవ్ర మరియు ఉగ్ర వాద సంస్థల ఆగడాలు,  నక్సల్ మరియు మావోయిస్టుల బెడద, మత కలహాలు, స్వప్రయోజనాల కోసం అల్లర్లు సృజించు వారు, పరదేశస్థులు  దొంగ చాటుగా సరిహద్దులు అతిక్రమించడం. ఇటువంటి అసాంఘిక మరియు దేశ ద్రోహ చర్యలపై స్థానికులు డేగ కన్ను ఉంచాలి మరియు ఆ వివరాలన్నీ అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి అందజేసి *నేరస్తులను కలిసికట్టుగా చట్టానికి అప్పజెప్పాలి*. ఎక్కడ ఏమైనా నాకెందుకు అన్న ప్రజల నిర్లిప్తతనే ఇటువంటి అరాచకాలకు ఊతము. 


అన్నిటికన్నా మనదేశంలో ఎక్కడ లేని విచిత్ర వాతావరణం నెలకొని ఉన్నది.  మసీదుల మరియు చర్చిల వద్ద పోలీసు కాని భద్రతా దళాలు గాని ఉండవు. కాని హిందూ మందిరాల వద్ద, హిందూ పండుగల ఊరేగింపుల వద్ద భారీ బందోబస్తు ఉంటుంది. దేశ వాసులు గమనించాలి  ఎవరి నుండి ఎవరికి ప్రమాదము, ఎవరు శాంతి కాముకులో ఎవరు హింసావాదులో. 


*దేశ రక్షణ మరియు శాంతి భద్రతల వ్యవహారం ప్రభుత్వాలది మాత్రమే కాదు దేశ వాసుల పూచికత్తు గూడా*.  దేశంలో ఇన్ని ఇబ్బందులు చూసిన తర్వాత గ్రహణకు వచ్చే *మొదటి* విషయమేమిటంటే *అన్నిటికంటే ముఖ్యమైన మరియు ప్రధాన బాధ్యత ప్రజలు సచ్చీలురను  ధనం ఎరజూపని, ఉచితాలంటూ ఆశజూపని సంక్షేమం , అభివృద్ధి మాత్రమే కోరుకునే వారిని దేశ నాయకులుగా ఎన్నుకోవాలి*. ఈ దేశంలోనే మరొక వింత... ప్రశ్నించే వారిని, వాస్తవాలు వెల్లడించే వారిని వేధించే నాయకులు ఉంటారు.  కనుక ఐకమత్యంగా ఉంటేనే చట్టబద్ధమైన విధంగా

సామూహికంగా ఆ దుర్మార్గులను ఎదుర్కొనే  కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళవచ్చు.

ఈ దేశ ధర్మాలను, సంప్రదాయాలను ప్రోత్సహించాలని అనుసరించడం ద్వారా అనుసరింప జేయడం చేస్తారని ఈ విషయమై సభ్యులు గట్టిగా నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. *కావున మన  హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - మఘా / పుర్వాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (30.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పద్యసౌరభం

 .

                   *పద్యసౌరభం*



సీ॥

మదిలోన దలబోసి మమతనంతయు గూర్చి 

లేఖినిం గదిలించ లేమవోలె 

పదముల నొయ్యార ముదయించ నడయాడు 

ప్రాసలు శ్లేషల పరిహసించు 

యమకగమకవృత్తి యాశ్చర్యముల జూప

నుపమాదు లర్థాల నూరడించు 

సౌందర్యమును జూపు ఛందాల నందమౌ 

సరససాహిత్యాన సరసమాడు 

తే॥గీ॥

హృద్యవిన్యాసమాకన్యకిష్టసఖియ 

అర్థసంపద శబ్దాల నాడి పాడు 

భట్టుమూర్తికి గుట్టుగా పట్టిబడిన 

పద్య మెంచగ సాధ్యమ్మె? పండితులకు 

*~శ్రీశర్మద*

పండితులు లేని దేశంలో

 శ్లోకం:☝️

*యత్ర విద్వజ్జనో నాస్తి*

 *శ్లాఘ్యస్తత్రల్పధీరపి |*

*నిరస్తపాదపే దేశే*

 *ఏరణ్డోఽపి ద్రుమాయతే ||*

 - హితోపదేశః । 3.70॥


అన్వయం: _యత్ర విద్వజ్జనో విద్వాన్ నాస్తి తత్ర అల్పధీః అల్పజ్ఞోఽపి శ్లాఘ్యః । నిరస్తపాదపే వృక్షహీనే దేశే ఏరణ్డోఽపి ద్రుమాయతే వృక్షాయతే ।_


భావం: పండితులు లేని దేశంలో మంద బుద్ధులు కూడా ప్రశంసనీయులుగా చలామణీ అవుతారు. ఉదాహరణకు, ఏ చెట్టు లేని ప్రదేశంలో (చిన్న చిన్న ముళ్లతో ఉన్న) ఆముదం మొక్కను కూడా మహావృక్షంగా లెక్కిస్తారు.

పంచాంగం 30.09.2024 Monday,

 ఈ రోజు పంచాంగం 30.09.2024 Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష త్రయోదశి తిధి ఇందు వాసర: మఘ నక్షత్రం శుభ యోగ: వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి సాయంత్రం 04:49 వరకు.

మఘ ఉదయం 06:18 వరకు .


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:02


వర్జ్యం : మధ్యాహ్నం 03:17 నుండి సాయంత్రం 05:05 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:30 నుండి 01:17 వరకు తిరిగి మధ్యాహ్నం 02:52 నుండి 03:40 వరకు. 


అమృతఘడియలు : రాత్రి 02:04 నుండి 03:52 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార: