2, నవంబర్ 2021, మంగళవారం

శ్రీమద్భాగవతము

 *02.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2310(౨౩౧౦)*


*10.1-1450-*


*సీ. అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు*

  *కారణమానవాకారుఁడైనఁ*

*జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి*

  *రతికృతార్థులరైతి; రనవరతము*

*శోభిల్లు నింధనజ్యోతి చందంబున*

  *నఖిల భూతములందు నతఁ; డతనికి*

*జననీ జనక దార సఖి పుత్ర బాంధవ*

  *శత్రు ప్రియాప్రియ జనులు లేరు*


*ఆ. జన్మకర్మములును జన్మంబులును లేవు*

*శిష్టరక్షణంబు సేయుకొఱకు*

*గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర*

*క్షణ వినాశకేళి సలుపుచుండు."* 🌺



*_భావము: "సకల జీవుల యందు ఆత్మగా ఉన్నవాడు, కారణ వశమున మానవ స్వరూపము గ్రహించిన వాడగు శ్రీమన్నారాయణునిపై మనసులు లగ్నం చేసి సేవించి మీరు ధన్యులయ్యారు._*   

*_కట్టెలో నిగూఢంగా అగ్ని దాగి ఉన్నట్లు, పరమాత్మ సమస్త జీవుల యందు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు; ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, విరోధి, ప్రియులు, అప్రియులు అంటూ ఎవ్వరూ లేరు; జన్మము, కర్మలు, పునర్జన్మ లేనే లేవు; త్రిగుణాతీతుడైనను సాధు జీవులను సంరక్షించుట కొరకు గుణములతో కూడిన శరీరము ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలలు కొనసాగిస్తూ ఉంటారు.”_* 🙏



*_Meaning: “You had focussed your minds on SrimanNarayana, who took incarnation as a human being and fulfilled the purpose of your lives, by serving Him with great reverence and regard. Like the hidden fire in the wood, He resides and shines in every being; He has no birth, death, rebirth or any other predefined duties; Though He is beyond Trigunas (Sattva, Rajas, Tamas), He adorns a physical form consisting of these gunas and performs the acts of creation, preservation and dissolution._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

అహం నాశనమే★

 ★"నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు. అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. 🍀


★"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.☘


★"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్త కుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.. 🍀


★"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.🍀


★పాపం... తులసి ఆకు🍃 ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని 🌳👏పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.🍀

★గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని ⚖తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు.🍀


★అంతెందుకు...? -అంత్య ఘడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుంఠమే సంప్రాప్తిస్తుంది. అంతేకాదు తులసి లక్ష్మీ స్వరూపం....తులసికోటలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నివాసముంటాడన్నది పురాణ సమ్మతం. తులసి ఆరాధన జరిగే గృహములో మనశ్శాంతికి లోటుండదంటారు. 🍀☘🌿🌱🍃

                          

★ కాబట్టి ఎప్పటికైనా అహం నాశనమే★

😊💐

Brihadeeswara Temple

 The Brihadeeswara Temple in Thanjavur is one of the greatest structures ever built. Do you know why?


The architecture used is the interlock method where no cement, plaster or adhesive was used between the stones. It has survived 1000 years and 6 earthquakes. 


The Mandir tower at 216 feet was likely the tallest in the world at the time.


The other structures built using this method Big Ben and Leaning Tower of Pisa are tilting with time. The Mandir which is way older has zero degree inclination. 

1.3 lakh ton of granite was used to build the Mandir which was transported by 3000 elephants from 60 kms away.


The Mandir was constructed without digging the earth. 

The Kumbham at the top of the Mandir tower weighs 81 tons and is carved from a single piece of granite. 


Nothing ever comes close to the level of engineering used to construct the Brihadeeswara Mandir. There is nothing quite like it and there will never be something quite like it. Raja Raja Chola was a visionary. We must treasure this timeless marvel. 


📸 Artistic imagination : Sunil Pookode. 


#SanatanaDharma

#ancient

#hindutemple

#IncredibleIndia🇮🇳 #TeamLostTemples

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు 1895 సంవత్సరంలో జన్మించాడు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవాడు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించాడు. అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే సుప్రసిద్ధుడయ్యాడు.

పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టాడు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో ఇతని నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.

అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న తెలుగు సినిమా రంగంలోనూ క్యారెక్టర్ నటునిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించాడు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, బాలనాగమ్మలో మాయల మరాఠీగా ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందాడు.

ఈయన చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 28, 1959 సంవత్సరంలో మరణించారు.

ఆయన నటించిన సినిమాలు:

సామ్రాట్ విక్రమార్క (1958) .... ప్రచండుడు

భాగ్యరేఖ (1957)

పాండురంగ మహత్యం (1957)

చరణదాసి (1956) .... బసవయ్య

కన్యాశుల్కం (1955) .... లుబ్ధావధానులు

షావుకారు (1950) .... షావుకారు చంగయ్య

ధర్మాంగద (1949)

గుణసుందరి కథ (1949)

పల్నాటి యుద్ధం (1947) .... బ్రహ్మనాయుడు

రత్నమాల (1947)

బాలనాగమ్మ (1942) .... మాయల మరాఠి

గృహలక్ష్మి (1938)

మాలపిల్ల (1938) .... సుందర రామశాస్త్రి

 ప్రముఖ నటుడు గోవిందరాజుల సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ...💐💐💐🙏🙏🙏

1, నవంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *1.11.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*21.9 (తొమ్మిదవ శ్లోకము)*


*కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా|*


*యతో నివర్తతే కర్మ స దోషోఽకర్మకః స్మృతః॥13051॥*


కర్మలు చక్కగా నెరవేరుటకు, అందుకు కావలసిన సామాగ్రి పూర్తిగా లభించుటకు అనువైన కాలమే పవిత్రమైనది. కర్మలను నిర్వహించుటకు తగిన సామాగ్రి లభించునట్టి, ఆగంతుకమైన లేదా సహజమైన దోషములచే కర్మలు కొనసాగనట్టి కాలము అపవిత్రము - - అశుద్ధము అని తెలియవలెను.


*21.10 (పదియవ శ్లోకము)*


*ద్రవ్యస్య శుద్ధ్యశుద్ధీ చ ద్రవ్యేణ వచనేన చ|*


*సంస్కారేణాథ కాలేన మహత్వాల్పతయాఽథ వా॥13052॥*


ద్రవ్యములు, వచనములు, సంస్కారములు, కాలము, అధికము, అల్పము మొదలగువానిని బట్టి పదార్థములయొక్క పవిత్రతను, అపవిత్రతను నిర్ణయింపవలెను.


పాత్రలు జలముచే పవిత్రములగును, మూత్రాదులచే అపవిత్రములగును. ఏదైనను ఒక వస్తువు పవిత్రమైనదా? అపవిత్రమైనదా? అను శంక కలిగినప్పుడు బ్రాహ్మణుడు చెప్పినమీదట అది పవిత్రమగును. లేనిచో అది అపవిత్రమగును. పుష్పాదులపై జలములను చల్లినప్పుడు అవి పవిత్రములగును. వాసన చూచినచో అవి అపవిత్రములగును. అప్పుడే వండిన అన్నము పవిత్రము. చద్దిఅన్నము అపవిత్రము. పెద్దపెద్ద సరోవరములు, నదులు మొదలగు వాటియందలి జలములు పవిత్రములు, చిన్నచిన్న గుంతలలోని నీరు అపవిత్రము.


*21.11 (పదకొండవ శ్లోకము)*


*శక్త్యాశక్త్యాథ వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే|*


*అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః॥13053॥*


దేశకాల, అవస్థాది భేదములను అనుసరించి, శక్తినిబట్టి, అశక్తతనుబట్టి, బుద్ధిబలమునుబట్టి, సంపద్వైభవనములనుబట్టి దోషాదోషభావములు వర్తించును. ఉదాహరణమునకు గ్రహణాదుల సమయమున శక్తిగలవారు స్నానాదులను ఆచరింపకుండుట దోషమగును, శక్తిలేనివారి విషయమున అది దోషముగాదు. పుత్రజన్మాదుల విషయమున తెలిసి జాతాశౌచములను పాటింపకుండుట దోషము, తెలియనప్పుడు అది దోషముగాదు. అట్లే సంపద్వైభవములు కలిగియున్నప్పుడు జీర్ణ మలినాది వస్త్రములను ధరించుట దోషము, నిర్ధనుల విషయమున అది దోషముగాదు. దేశ, కాల, అవస్థాదుల విషయమునగూడ దోషాదోషములు ఇట్లే వర్తించును (ధనికుడు, దరిద్రుడు, బలవంతుడు, దుర్బలుడు, బుద్ధిమంతుడు, మూర్ఖుడు, ఉపద్రవములు, ప్రశాంతతగల దేశములు, యువకులు, వృద్ధులు, ఇత్యాది భేదములనుబట్టిగూడ దోషాదోషముల విచారణ (నిర్ణయము) చేయవలెను.


*21.12 (పండ్రెండవ శ్లోకము)*


*ధాన్యదార్వస్థితంతూనాం రసతైజసచర్మణామ్|*


*కాలవాయ్వగ్నిమృత్తోయైః పార్థివానాం యుతాయుతైః॥13054॥*


ధాన్యములు, కర్రలు, ఏనుగు దంతములు మొదలగు ఎముకలు, దారములు (వస్త్రములు), నెయ్యి, తేనె, ఉప్పు, నూనె మొదలగు రసపదార్థములు, బంగారము, కంచు మొదలగు తైజస వస్తువులు, చర్మవస్తువులు, మట్టి వస్తువులు మొదలగునవి కాలానుగుణముగను, వాయువు, అగ్ని, మట్టి, జలము మొదలగువాటివలన పరిశుద్ధములగును.


ధాన్యాదులు కాలానుగుణముగా, వాయువువలనను, దార్వాది (చెక్కమొదలగు) పాత్రలు, మట్టి, జలములతోడను, గజ దంతాదులు వాయువు, సూర్యరశ్మిచేతను, వస్త్రాదులు జలములవలనను, క్షీరాదులు కాచుటవలనను, బంగారము, కంచు మొదలగు లోహములు అగ్నివలనను, చర్మవస్తువులు తైలముతోను, అన్నము మొదలగు భోజన పదార్థములలో కేశములు వచ్చినప్పుడు వాటిని తీసివేసి, ఆజ్యసంస్కారము జరుపుటవలనను పరిశుద్ధములగును.


*21.13 (పదమూడవ శ్లోకము)*


*అమేధ్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి|*


*భజతే ప్రకృతిం తస్య తచ్ఛౌచం తావదిష్యతే॥13055॥*


అపవిత్ర పదార్థములు అంటినప్పుడు దుర్గంధములు, మాలిన్యములు తొలగిపోయి యథాస్థితికి వచ్చునంతవరకు వాటిని శుభ్రపరచవలెను. అప్పుడవి పవిత్రములగును.


*21.14 (పదునాలుగవ శ్లోకము)*


*స్నానదానతపోఽవస్థా వీర్యసంస్కారకర్మభిః|*


*మత్స్మృత్యా చాత్మనః శౌచం శుద్ధః కర్మాచరేద్ద్విజః॥13056॥*


ద్విజులు (మానవులు) నన్ను (భగవంతుని) స్మరించుచు, చిత్తశుద్ధిని పొంది, స్నానము, దానము, తపస్సు, వయస్సు (కర్మానుష్ఠాన వయస్సు), శక్తి, ఉపనయనాది సంధ్యోపాసనాది సంస్కారములు మున్నగు వాటిని ఆచరింపవలెను. అప్పుడు ఆ కార్యములు పరిశుద్ధములు అగును. అట్లొనర్చిన పిమ్మట ఇతర కార్యములను నిర్వర్తింపవలెను.


*21.15 (పదునైదవ శ్లోకము)*


*మంత్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణమ్|*


*ధర్మః సంపద్యతే షడ్భిరధర్మస్తు విపర్యయః॥13057॥*


గురువుద్వారా ఉపదేశమును పొంది, దాని అర్థపరిజ్ఞానముతో మననము చేసినప్పుడు మంత్రశుద్ధి ఏర్పడును. కర్మములను భగవదర్పణము చేసినప్పుడే అవి పవిత్రములు (సార్థకములు) అగును. ఈవిధముగా దేశము, కాలము, పదార్థము, కర్త, మంత్రము, కర్మలు అను ఆరును శుద్ధమొనర్చుట ధర్మము, దీనికి వ్యతిరేకముగా ఆచరించినచో అవి పరిశుద్ధములుగావు. అట్లు చేయుట అధర్మము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం

 *1.11.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*21.1 (ప్రథమ శ్లోకము)*


*య ఏతాన్ మత్పథో హిత్వా భక్తిజ్ఞానక్రియాత్మకాన్|*


*క్షుద్రాన్ కామాంశ్చలైః ప్రాణైర్జుషంతః సంసరంతి తే॥13043॥*


*శ్రీకృష్ణభగవానుడు పలికెను* ఉద్ధవా! నేను ఉపదేశించిన మోక్షసాధకములైన భక్తి, జ్ఞాన, కర్మ మార్గములను వీడి చంచలములైన ఇంద్రియములద్వారా క్షుద్రములైన శబ్దాది విషయములను అనుభవించువారు పదేపదే జన్మమృత్యురూపమైన సంసారచక్రమున పరిభ్రమించుచుందురు.


*21.2 (రెండవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*విపర్యయస్తు దోషః స్యాదుభయోరేష నిశ్చయః॥13044॥*


మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల యందు దృఢమైన నిష్ఠకలిగియుండుటయే గుణము. అందులకు విరుద్ధముగా ఇతర వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట దోషము. సారాంశమేమనగా గుణదోషములయొక్క నిర్ణయము ఆయా వ్యక్తుల అర్హతలనుబట్టి యుండును.


*21.3 (మూడవ శ్లోకము)*


*శుద్ధ్యశుద్ధీ విధీయేతే సమానేష్వపి వస్తుషు|*


*ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాఽశుభౌ॥13045॥*


తాత్త్విక (వాస్తవిక) దృష్టితో చూచినప్పుడు వస్తువులు అన్నియును సమానములే. వాటి ప్రయోజనమును బట్టి, వాటి గుణదోషములు నిర్ణయింపబడును. ద్రవ్యముయొక్క మంచి-చెడులను గురుంచి కలిగిన సందేహముసు నివారించుటకై ఆ ద్రవ్యమును చక్కగా పరిశీలించి నిరీక్షణ-పరీక్షణలద్వారా దాని సహజస్వభావమును గురుంచిన గుణదోషములు, శుభాశుభములు నిగ్గుదేల్చబడును.


*21.4 (నాలుగవ శ్లోకము)*


*ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ|*


*దర్శితోఽయం మయాఽఽచారో ధర్మముద్వహతాం ధురమ్॥13046॥*


పుణ్యపురుషా! ఉద్ధవా! వర్ణాశ్రమ ధర్మానుష్ఠానము శాస్త్రసమ్మతముగా, లోకవ్యవహారమునకు అనుగుణముగా, వ్యక్తులయొక్క జీవనవిధానములకు తోడ్పడునదిగా ఉండవలెను. ధర్మబద్ధముగా జీవించువారికి కలిగే సందేహములను నివారించుటకొరకే ఆచార (ధర్మ)మును నేను మనువుద్వారా తెలిపియుంటిని.


*21.5 (ఐదవ శ్లోకము)*


*భూమ్యంబ్వగ్న్యనిలాకాశా భూతానాం పంచధాతవః|*


*ఆబ్రహ్మస్థావరాదీనాం శారీరా ఆత్మసంయుతాః॥13047॥*


భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను పంచమహాభూతములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు గల సకల శరీరములకును మూలకారణములు. ఇవి అన్నియును శరీరదృష్టితో చూచినప్పుడు సమానములే. వీటియందలి ఆత్మకూడ ఒక్కటే.


*21.6 (ఆరవ శ్లోకము)*


*వేదేన నామ రూపాణి విషమాణి సమేష్వపి|*


*ధాతుషూద్ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థసిద్ధయే॥13048॥*


ఉద్ధవా! పంచమహాభూతములు సమస్తప్రాణి పదార్థములయందును సమానముగనే యున్నవి. లోక వ్యవహారమునకై వాటికి వేదము వేర్వేరు నామరూపములను కల్పించెను.


*21.7 (ఏడవ శ్లోకము)*


*దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమ|*


*గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణామ్॥13049॥*


సాధుసత్తమా! మానవుల కర్మలయందు విశృంఖలప్రవృత్తి ఏర్పడగూడదనియు, నియమాను సారముగా, మర్యాదపూర్వకముగా కర్మలను ఆచరించుట కొరకు దేశము, కాలము, ద్రవ్యము మొదలగు వాటి గురుంచి గుణదోషములను విధించితిని.


*21.8 (ఎనిమిదవ శ్లోకము)*


*అకృష్ణసారో దేశానామబ్రహ్మణ్యోఽశుచిర్భవేత్|*


*కృష్ణసారోఽప్యసౌవీరకీకటాసంస్కృతేరిణమ్॥13050॥*


కృష్ణసారములు (నల్లజింకలు) లేనిదేశమును, ధార్మికప్రవృత్తి లేని దేశమును అపవిత్రమైన దేశముగా భావింపవలెను. ఒకవేళ కృష్ణసారములు ఉన్నను వేదవేత్తలను ఆదరించనిచో ఆ దేశములు అపవిత్రములే యగును. కీకట (కళింగాది) దేశములు అపవిత్రమైనవే. తీర్థయాత్రలకై దప్ప అవి మసలుటకు అర్హములు కావు. సంస్కారరహితములు, మరియు ఊసరక్షేత్రములు గూడ అపవిత్రమైనవే.


(శ్రీ వేదవ్యాసప్రణీతబ శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*486వ నామ మంత్రము* 1.11.2021


*ఓం శ్యామాభాయై నమః* 


శ్యామలవర్ణంలో భాసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్యామాభా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శ్యామాభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ రాకినీదేవిస్వరూపంతో భాసిల్లు ఆ జగన్మాతను ఆరాధించు సాధకులు సకలార్థసిద్ధిని పొందుటయే గాక, ఆ పరమేశ్వరిని హృదయస్థానమునందలి దహరాకాశంలో ప్రతిష్టించుకొని, ధ్యాన నిరతితో తరించుదురు.


అనాహతాబ్జనిలయమందు విలసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరి శ్యామల వర్ణముతో (నల్లని శరీర వర్ణముతో) భాసిల్లును. పదహారు వత్సరముల బాలికను *శ్యామ* అని అందురు. అమ్మవారు అటువంటి పదహారు వత్సరముల బాలికగా భాసిల్లుచున్నది గనుక, రాకినీస్వరూపిణియైన ఆ తల్లి *శ్యామాభా* అని యనబడినది. *భా* యని అనగా ప్రకాశించుట అని అర్థము. నల్లనికాంతితో భాసిల్లు రాకినీదేవి నలుపులోనే చక్కదనముగల నలుపు వర్ణము. అ నల్లని వర్ణముగల ముఖమునందు దొండపండువంటి పెదవులు, నక్షత్రకాంతులను ధిక్కరించే నాసాభరణముతో అమ్మవారు ప్రసన్నస్వరూపముతో భక్తులకు వరదాయనిగా గోచరిల్లు చుండును. సిందూరవర్ణశోభితమైన కుంకమతిలకముతో భాసిల్లు ఆ పరమేశ్వరి నల్లనిమోము నీలోత్పలమువలె (నల్లకలువవలె) తేజరిల్లుచున్నది. 


నీలోత్పలమువంటి మోము గలిగిన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శ్యామాభాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*485వ నామ మంత్రము* 1.11.2021


*ఓం అనాహతాబ్జనిలయాయై నమః*


హృదయమునందలి అనాహతచక్రము అను ద్వాదశ (పన్నెండు) దళముల పద్మమందు రాకినీయోగినీ రూపంలో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనాహతాబ్జ నిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు రాకినీస్వరూపిణియైన ఆ పరమేశ్వరి వారికి ఇష్టమగు కోరికలను నెరవేర్చును.


జగన్మాత హృదయమునందు పండ్రెండుదళములుగల అనాహతపద్మమునందు రాకినీయోగిని స్వరూపంలో విలసిల్లుచున్నది. రాకినీయోగిని ఈ విధముగా వివరింపబడినది: రాకినీదేవి పండ్రెండుదళములుగల పద్మమందు శ్యామలవర్ణముతో భాసిల్లుచున్నది. ఆ దేవికి రెండుముఖములుగలవు. నాలుగు బాహువులయందును చక్రము, శూలము, కపాలము, డమరుకములను ధరించియున్నది. ఆ తల్లి మూడునేత్రములు గలిగినదిగా ఉన్నది. సప్తధాతువులలో రక్తధాతునందు విలసిల్లుచున్నది. రాకినీదేవి కాళరాత్రి మొదలగు పండ్రెండు మంది యోగినులచే పరివేష్టింపబడినది. రాకినీదేవికి నేతి అన్నము అనిన ప్రీతి. ఆమె ఉపాసకశ్రేష్ఠులచే నమస్కరింపబడుచున్నది. ఆ దేవి ఇష్టమైన కోరికలు నెరవేర్చునదిగా చెప్పబడుచున్నది. అనాహతాబ్జ చక్రాధిష్ఠానదేవతను వామదేవి అందురు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను వాక్కునకు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను నాలుగురూపములు ఉండగా పరాస్థానమునందు పుట్టి, పశ్యంతిగామారిన వాక్కు అనాహతాబ్జమునందు మధ్యమ రూపమునకు చేరును. అనాహతాబ్జపద్మము బంగారు రంగులో ఉండును. అనాహతాబ్జ చక్రమునకు అధిధేవత రుద్రుడు. అనాహతాబ్జపద్మమునందుగల పండ్రెండు దళములందు క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ అను పండ్రెండు వర్ణములు పండ్రెండు శక్తిరూపములుగా ఉండును. *అనాహతాబ్జనిలయా* యను 485వ నామ మంత్రము నుండి *మహావీరేంద్రవరదా* యను 493వ నామ మంత్రమువరకూ రాకినీదేవియొక్క విశేణములు వివరింపబడినవి. 


రాకినీదేవి స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ఇదే కదా ఇదే కదా

 *ఇదే కదా ఇదే కదా* 

*నీ కథా..*


కూతురు అమెరికాలో..

అమ్మ అంబాజీపేటలో..

కొడుకు ఇంగ్లండ్ లో

తండ్రి ఇరుకు సందులో..

నువ్వు ఇన్ఫోసిస్

నాన్నకేమో క్రైసిస్..

నువ్వు వీసాపై ఎక్కడో

అమ్మ అంపశయ్యపై 

నీ ఊళ్ళో

నువ్వు రావు..

రాలేనంటావు..

నిజానికి రావాలని అనుకోవు..

టికెట్ దొరకదంటావు..

సెలవు లేదంటావు..

వస్తే తిరిగి రావడం కష్టమంటావు..

నువ్వు వచ్చేదాక

పెద్ద ప్రాణం పోనంటుంది..

నీ రాక కోసం ఆ కళ్ళు 

గుమ్మం వైపే..

రావని నాన్నకి

తెలిసినా అమ్మకు 

ఆ కబురు చెప్పలేక..

కక్కలేక..మింగలేక..

మంచం చుట్టూ 

అటూ ఇటూ

అవతల ఆ తల్లి 

ఇంకాసేపట్లో అటో ఇటో..!


వయసు వచ్చినప్పటి నుంచి 

డాలర్ డ్రీమ్సే..

పొద్దున లేస్తే ఆ ఊసే..

నీ కలల వెనకే 

తల్లిదండ్రుల పరుగు..

వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..

బ్రతుకుతెరువు కోసం నువ్వక్కడ..

గుండె బరువుతో వారిక్కడ..

మొదట్లో రోజూ 

ఓ వాట్సప్ కాలు

రెండ్రోజులకో వీడియో ఫోను

పోను పోను కొంత విరామం

ఏంట్రా అంటే వర్కులోడు

అప్పటికే నిద్ర లేచి ఉంటాడు 

నీలో ఓ మాయలోడు...

అక్కడ కొనుక్కున్న 

కొత్త కారుతో 

నీ ఫోటో ఫోజు

ఇక్కడ డొక్కు స్కూటరుతో

తంటాలే నాన్నకి ప్రతిరోజు..!


ఈలోగా అన్నీ బాగుంటే 

పెద్దలు కుదిర్చిన పెళ్లి..

లేదంటే అక్కడే 

ఓ మేరీతో మేరేజ్..

ఆలికి కడుపో కాలో వస్తే

ఆయాగా అమ్మకి వీసా

నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా..!

ఎంత అమ్మయినా

నీ పిల్లలకు నాన్నమ్మయినా

ఆమె నాన్నకు భార్య

అక్కడ పెద్దాయన 

రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని

బెంగ..

ఆ దంపతులను 

అలా వేరుగా ఉంచి 

మీ జంట మాత్రం

టింగురంగ..!


మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక

అప్పుడిక ఆమె ఉంటే బరువు

ఈలోగా ముగుస్తుంది 

ఆమె వీసా గడువు..

ఆమె చేతిలో టికెట్

నాన్నకిమ్మంటూ 

ఓ గిఫ్టు పేకెట్..!


ఇటు నిన్ను వదలి వెళ్ళలేక

అటు భర్తని విడిచి ఉండలేక

చెమ్మగిల్లిన కళ్ళతో

విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని

ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు

నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..

నువ్వు పంపుతావేమో..

కాని ఆ వయసులో 

నాన్నకు శ్రమ..

నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..

వచ్చే ప్రాణం..పోయే ప్రాణం

చివరకు అనివార్యమయ్యే మరణం..

వాడు వస్తున్నాడా..?ఏమంటున్నాడు..

ఊపిరి వదిలే వరకు 

అదే ప్రశ్నతో అమ్మ..

నిర్జీవమైన ఆ కళ్ళలో 

నీ బొమ్మ..

కొరివి పెట్టాల్సిన 

నువ్వు సీమలో...

నాన్న కర్మ చేస్తుంటే 

ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..

అస్తికల నిమజ్జనం అంటూ 

నాన్న కాశీకి పయనం

అంత శ్రమ ఎందుకు..

పక్కనే ఉండి కదా 

గోదారని నీ అనునయం..!


ఇప్పుడిక నాన్న కథ..

ఉన్న ఊరు..

కట్టుకున్న ఇల్లు

ముఖ్యంగా ఆ ఇంట్లో 

అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక..

ఒంటరి బ్రతుకు ఈడ్వలేక..

కష్టాలకు ఓర్వలేక..

ఓ రోజున ఆయన కధా కంచికి

ఈసారి వస్తావు..

కొరివి పెట్టి

ఊళ్ళో ఇల్లు అమ్మేసి

ఉన్న ఊరు..కన్న తల్లి..

అన్నిటితో రుణం తెంచుకుని 

నేను ఎన్నారై..

మిగిలినవన్నీ 

జాన్తా నై..

అంటూ

పుట్టిన గడ్డను వదిలి

పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస

ఇదే కదా చాలామంది వరస..!


(అన్ని కథలూ ఇలాగే ఉంటున్నాయని కాదు..

కానీ చాలా ఇళ్ళలో

ఇదే బాగోతం.!

సంపాదనపై మోజుతో విదేశాలకు వెళ్ళడం..

ఇక్కడి కన్నా అక్కడ జీవితం చాలా గొప్పగా 

ఉంటుందంటూ 

సన్నాయి నొక్కులు..

మారిపోయే దృక్కులు..

అక్కడి నుంచి మేజిక్కులు..జిమ్మిక్కులు..

ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసే పిల్లలూ..

ఈ దేశంలో ఉండి కూడా పట్టించుకోని పిల్లలూ లేకపోలేదు.అయితే పూర్తిగా అలాగే ఉంటున్న సంతానం గురించే ఈ ఆవేదన..

కాస్తయినా 

మారండని నివేదన)


      *ఇ.సురేష్ కుమార్*

   మరో సముదాయం నుంచి🙏👏

రామాయణం Day -5*

 *రామాయణం Day -5*

     

నారదుని వలన నీకు ఏవిధముగా *రామ కథ* చెప్పబడెనో ఆ విధముగనే నీవు *రామ కథ* చెప్పు.


*రాముడు* ధర్మాత్ముడు,లోకములో శ్రేష్ఠమైన గుణములు అని మనము చెప్పుకొనేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి!

*రాముని* గూర్చిన అన్నివిషయములు నీకు తేటతెల్లము కాగలవు!


" కురు రామకధాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్"


మనస్సును రమింపచేసేది, పుణ్యప్రదము అయిన *రామకథను* అక్షర బద్ధం చేయి. నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షరసత్యము కాగలదు!.


యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావద్రామయణకధా లోకేషు ప్రచరిష్యతి!


....ఎప్పటి వరకైతే భూమిమీద పర్వతాలు నిలచి ఉంటాయో! 

ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో

అప్పటివరకు భూమి మీద *రామకథ* ప్రాచుర్యంలో ఉంటుంది!.


అప్పటివరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు!

అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు.


బ్రహ్మ వరంచేత మహర్షి మనోఫలకం మీద ( మనసు తెర మీద) *రామచరిత* మొత్తం కనపడజొచ్చింది! .


*రామకథను* అక్షరబద్ధం చేయటానికి మహర్షి సంకల్పం గావించుకొన్నారు! .


పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశముండేది! వారు కోసలదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు.

 అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు.


విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య! ఉన్నతమైన కోట బురుజులు, వందలకొద్దీ శతఘ్నులు మొహరించి ఉండేవి ! రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది.

ప్రజలంతా ధనధాన్యసమృద్ధితో, సుఖసంతోషాలతో, ఆనందంగా ఏ లోటులేకుండా జీవనం సాగించేవారు .


ఆ సమయంలో దశరధుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు.

ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవారాయన!.


దశరధమహారాజు వద్ద ఎనమండుగురు మంత్రులుండేవారు!

వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు! ఎదుటివ్యక్తి ముఖకవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు!

రాజుకు మేలుకలిగించేవి, హితకరంగా ఉండేవి,మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్ధులు.


వారు వరుసగా, ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్దుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు .


వసిష్ఠ, వామదేవులు ప్రధాన ఋత్విక్కులు.


మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు , పటిష్ఠమైన గూడచార వ్యవస్థ కలిగి , రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకొన్నారు.

ఆ మంత్రులు, స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారుకాదు! 

వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు! ..


బలవంతుడయిన వ్యక్తి, బలహీనుడయిన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది! ( సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము).


రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు!


రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్రవైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరధమహారాజు!


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో....... *जय श्रीराम*

గుండె పోటు.

 గుండె పోటు.

దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.

1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).

2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.

3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది

ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.

మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.

4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.

5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.

6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?

చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.

వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.

7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.

దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.

ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.

8) గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.

బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.

ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.

9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.

10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.

11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి

తెలియజేయండి.

12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.

మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది

మీ కోసం ఈ సందేశం పంపిన వారు.

డా. ఎం .అశోక్

Cardiology Doctor

అందరి గమ్యం.....*

 *ఇదేకదా నిజమైన జీవితం?*

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : మధ్యతరగతి పడక గది

వయసు. : భర్త 21+ ఏళ్ళు, భార్య:18+ఏళ్ళు. 

భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది, ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం , తొందరగా రావచ్చుగా గదిలోకి, ఒక్కడినినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా. 

భార్య : నాకూ రావాలనే ఉంది మీ అమ్మ వదిలితేగా, ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది, అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది. 

               *******

        వయసు: 30+, 

సమయం : రాత్రి 10

ప్రదేశం : అదే పడకగది

భర్త: పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు, బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు, మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది, మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు....

భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి...

                     ****

వయసు : 50+

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : అదే పడక గది

భర్త: గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా, పాలు తోడు పెట్టావా..

భార్య:ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్

 తెచ్చుకున్నారా? 

భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు. 

భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.

          *******

వయసు. : 55+

సమయం : రాత్రి 10 ఎప్పటి లాగే

ప్రదేశము : అదే పాత పడక గది

భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా, పిల్లలు పండగకి వస్తామన్నారా?

భార్య: నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా, పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు. 

భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?

భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?

ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు

                   ******

   వయసు : 65+

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : అదే పాత పడకగది

భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా....

భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి...

భర్త: సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.

భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు. మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు, వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట, సరే పొద్దు పోయింది పడుకోండి..

భర్త: వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,

పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది, అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో, ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం, నీకన్నా నిద్ర పడుతున్నదా?

భార్య: నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర, కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు, ఏంచేస్తాం అంతా మన ఖర్మ , 

సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.

ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.

                   *******

వయసు : 80+

సమయం : రాత్రి 11 గంటలు

ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం. 

భార్య: ఆయన పోయి నెల రోజులు అయింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు, కన్నతండ్రి చనిపోతే కర్మ కాండకూడా చేయలేని, తీరిక లేని కొడుకులు, సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం కర్మకాండలు అయినా పూర్తి అయినయి. 

ఇక నా పరిస్థితి ఏమి కానుందో....

ఎప్పటికయినా నా పిల్లలు వస్తారో..రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు, మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు, అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే "భార్య" శాశ్వత నిద్రలోకి పోయింది.

చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.

*ఇదండి జీవితం,,,,,*

*ఇదేనండి అందరి గమ్యం.....*

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన

 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన

I

*Devulapalli Krishna Sastry*


మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.. 

సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.. 

మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…

అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. . 

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…

మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం…ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..

అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..

“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”

అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…

కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…

“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…

సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..

చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమె తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..

మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…చిత్ర పరిస్రమకు సంబందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..

గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..

ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలోమారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..

“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..

ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..

కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..

మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..

“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తె ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”

తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్నఅక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..

అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..

ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…

మీరే చదవండి .తెలుస్తుంది .

శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…

మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చిఅలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…

ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…

అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…ఆ తరువాత అందులోని విషయాన్నిసంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…

“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ ఉగాదులూ వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…

ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..

“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి.. 

ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…

దుంఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…

“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”

తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపది మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..

ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని

“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…

అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాదించారు శాస్త్రిగారు…

“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”

వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…

“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..

“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”

దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు.. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..

“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”

“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…

ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..

వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…

కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…

“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…

గుండె పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..

“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “

“..సరే…అట్లాగే రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..

వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…

అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…

వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…

“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”

అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..

“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”

“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…

ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….

ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా వున్నారు…అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..

ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..

మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు

“…అయ్యా మీరిక్కదేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా ” అని…

దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..

“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..

అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…

ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..

ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..

ఆ పాటే…

అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”

ఉపసంహారం 

ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…

“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం) “.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు) “..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం) “..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం) మొదలైనవి…ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు.. 

“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ… రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..

ముక్తాయింపు

“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం.   

                   స్వస్తి!


రసజ్ఙభారతి సౌజన్యంతో--

అరచేతులులలో చెమటని హరించుట

 అరికాళ్ళు , అరచేతులులలో చెమటని హరించుట కొరకు సులభ యోగం - 


      దానిమ్మ చిగుళ్లు పూటకు 5 చొప్పున రోజూ రెండుపూటలా తీసుకుంటూ ఉంటే అరికాళ్లు , అరచేతుల్లో పుట్టే చెమట హరించును ....


          

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శ్రీమద్భాగవతము

 *01.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2309(౨౩౦౯)*


*10.1-1449*


*మ. బలుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా*

*రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు*

*జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ*

*డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై* 🌺



*_భావము: "ఈ బలరామకృష్ణులు సామాన్య మానవులా? కానే కారు. మోక్షప్రదాత యగు ఆ శ్రీమహావిష్ణువే భూభారాన్ని తగ్గించటం కొరకు ఈ రామకృష్ణుల రూపాలలో అవతరించాడు. మోక్ష కాములు ప్రాణోత్క్రమణ సమయమున, ఈ రూపములోనున్న సర్వేశ్వరుడగు శ్రీహరిని స్మరించినంత మాత్రమున, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ, నిత్యమైన, మహోత్కృష్టమైన పరబ్రహ్మమును పొందగలడు."_* 🙏



*_Meaning: “These Boys are not any ordinary mortals. To reduce the weight on this earth, the Supreme Being Bhagwan Sri Maha Vishnu took incarnation as Sri Krishna and Balarama. The mere chanting and reciting the names of Sri MahaVishnu, by the seekers of Moksha, in their dying moments, will shine like the Sun, reach His Lotus Feet and attain eternal Moksha.”_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*