24, ఏప్రిల్ 2022, ఆదివారం

వాగ్దేవతలు

 💐💐💐వాగ్దేవతలు..!💐💐💐


 తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :


"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.


"క"  నుండి  "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.  ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత  "మోదిని"  అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది. 


"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత.


"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ"  కరుణను మేలుకొలిపేదే అరుణ.


"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది.


అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత " సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి. 


ఆఖురులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని" 


ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము. 


మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి. 

           🙏🌹🙏🌹🙏

చెడు సంతానం

 శ్లోకం:☝

*ఏకేనాఽపి కువృక్షేణ*

    *కోటరస్థేన వహ్నినా |*

*దహ్యతే తద్వనం సర్వం*

    *కుపుత్రేణ కులం యథా ||*


భావం: పంచభూతాల్లో ఒకటైన అగ్ని చెట్టులో ఉన్న కారణంగా కట్టె మండుతుంది అని పండితులు చెప్తారు. అలా ఒక్క చెడు (ఎండిన) వృక్షంలో అగ్ని పుట్టి మొత్తం అడవిని దహించి వేసినట్టు, ఒక్క చెడు సంతానం మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని భావం.

 శ్రీరస్తు


శ్రీ గురుభ్యో నమః


శ్రీమాత్రేమః


శ్రీశర్మదా జ్యోతిషాలయం


వారి


సూక్తి సుధ


తేది: 24 ఏప్రియల్ 2022


4


శ్రీ శుభకృత్ చైత్ర శుక్ల అష్టమి ఉపరి నవమి - శనివారం. -


--


క్వచితృథ్వీశయ్య: క్వచిదపి చ పర్యట్కశయన: క్వచిచ్ఛాకాహార: క్వచిదపి చ శాల్యోదనరుచి: క్వచిత్క నాధారీ క్వచిదపి చ దివ్యామ్బరధరో మనస్వీ కార్యార్థి న గణయతి దు:ఖం న చ సుఖమ్


భర్తృ-73


కార్యార్థి అయినటువంటి ధీరుడు వీలునుబట్టి ఒకచోట నేలపై * పరుండును. మరొకచోట సుఖవంతమై పాన్పుపై పరుండును. ఒకచోట *కాయగూరలను తినును. మరొకచోట రుచివంతమైన వరియన్నమును తినును. ఒకచోట బొంతను గట్టుకొనును. మరొకచోట పట్టువస్త్రముల ను ధరించును.


అంతేగాని తనకు కలిగిన సుఖదు:ఖములను లెక్కచేయడు.


శ్రీ శర్మదా జ్యోతిషాలయం ---- చరవాణి: +91 9347945040

23, ఏప్రిల్ 2022, శనివారం

కల్పిత కథానిక.

 అదొక పెద్ద దట్టమైన అడవి. ఎన్నో చెట్లు చేమలు మృగాలు ఆ అడవిలో ఆశ్రయం పొందుతున్నాయి.. ఎంతో అన్యోన్యంగా తమతమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. 


అలాంటి అడవివో కార్చిచ్చు దావానలంలా వ్యాపించింది ఓ రోజు. పెద్ద పెద్ద మంటలు పైకెగసి వ్యాపిస్తున్నాయి. ఎటు చూసినా మంటలే. జంతువులన్నీ భయంతో అటు ఇటు పరుగిడుతూ భీకరంగా అరుస్తున్నాయి. 


ఈ అరుపుల్లో ఆర్తనాదాలలో పెద్ద చిన్న, సాధు కౄర తారతమ్యం లేదు. ఈ మంటల్లోనుండి బ్రతికి బయటపడడమే  వాటన్నటి ఏకైక లక్ష్యం. కాని మూగ జీవులు. అవి ఏమి చేయగలవు  మంటలను ఆర్పలేని ఓ అయోమయ పరిస్థితి. 


అలాంటి ఓ నిస్సహాయ తరుణంలో ఒక కొంగ మాత్రం ఎంతో హడావుడిగా పైకెగురుతూ కనపించింది. ఒక్క సెకను క్రితమే అది ఇటు నుంచి అటు వెళ్ళింది. మరో సెకన్లో మళ్ళా అటు నుంచి ఇటు. అలా ఎన్ని సార్లు పచార్లు చేసిందో. 


ఇవన్నీ ఓపిగ్గా ఓ నక్క కనిపెడుతూనే ఉంది. ఒక్కసారి ఉండబట్టలేక ఆ కొంగను ఆపి ఏంటి కొంగా, ఇంత పెద్ద పెద్ద మంటలు పైకెగసి పట్తూంటే నీవు అటు ఇటు వెళ్తూనే ఉన్నావు. ఏం చేస్తున్నావు జాగ్రత్త మంటలు నిన్ను కబళించగలవు అంది. 


అందుకు ఆ కొంగ ఈ అడవిలో కొద్ది దూరంలో ఓ చిన్న సరస్సు ఉంది. నేను ఎన్నో ఏళ్ళుగా ఈ అడవిలో నివసిస్తూ నా పిల్లలను కాపాడుకుంటూ ఆ ఏటిలోను చేపలను తింటూ ఆ నీటిని తాగేదాన్ని. ఇప్పుడు ఈ మంటలతో నా నివాస స్థలం కనుమరుగవుతుంటే ఎలా ఊరుకోగలను. నా శక్తీ కొలదీ ఆ సరస్సు నుండి నీటిని నా నోటి ద్వారా సేకరించి ఈ మంటలను ఆర్పడానికి యత్నిస్తున్నాను అంది. 


అందుకు ఆ నక్క ఒకసారి పెద్ద నవ్వు నవ్వి నీకేమైనా మతి పోయిందా ఇంత పెద్ద కార్చిచ్చును ఆర్పడానికి నీవు తెచ్చే ఒక్కొక్క బిందువు నీళ్ళు ఎలా సరిపోగలదు నీకు పిచ్చి కాకపోతే అంది. 


అందుకు ఆ కొంగ ఆ విషయము నాకూ తెలుసు. కాని ఇన్ని రోజులు ఈ అడవి వల్ల ప్రయోజనం పొందినదాన్ని. నేనెలా ఊరుకోగలను. నా వంతు సహాయము చేస్తున్నాను. అందరూ వాటి వాటి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు సహాయం అందిస్తే ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఇట్టే ఎదుర్కొనగలం అంది. ఆ నక్క ఓ నవ్వు నవ్వి అట్నుంచి వెళ్ళిపోయింది. 


ఇవన్నీ గమనిస్తున్న ఆ ఆడవి దేవతలు కొంగ యొక్క విశాల దృక్పథానికి ఎంతో ఉప్పొంగి అప్పటికప్పుడు ఆ అడవిలో భారీ వర్షం పడేటట్టు తమ ప్రయత్నాన్ని చేపట్టారు. అంతే కొద్ది సేపట్లోనే ఆ దావానలం మటుమాయం. జంతువులు చెట్లు చేమలు ఊపిరి పీల్చుకున్నాయి. 


వీటన్నిటికి కారణం ఆ కొంగ యొక్క సమయస్ఫూర్తే. తనవల్ల ఏమవుతుంది అని ఊరుకోక తన వీలును బట్టి సహాయం కల్పించి ఆ కార్చిచ్చును ఆర్పగలిగింది. 


ఈ నాటి ఎర్త్ డే సంధర్భంగా మన భూమాతను ఎలా కాపాడుకోవాలి అన్న సందేశం ప్రజలందరికి అందజేయాలన్న తపనే ఈ కల్పిత కథానిక.

సూక్తి సుధ

 శ్రీరస్తు


శ్రీ గురుభ్యో నమః


శ్రీమాత్రేమః




సూక్తి సుధ



రత్నైర్మహాట్టేస్తు తుష్ను దేవా న భేజిరే భీమవిశేష భీతిమ్ | సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థా ద్విరమని ధీరాః ||


* తా॥ దేవతలు అమృతము కొరకై పాలసముద్రమును మధించునప్పుడు *లభించిన రత్నములకు సంతోషించక, కాలకూటవిషము పుట్టినప్పుడు *భయపడక, అమృతము లభించేవరకు తమ పట్టుదలను వదలలేదు.



ధీరులెప్పుడునూ తాము తలచిన కార్యము పూర్తి అయ్యేవరకు * తమ ప్రయత్నమును వదలరు కదా!


శ్రీ శర్మదా జ్యోతిషాలయం ---- చరవాణి: +91 9347945040

కర్మ- భోగము.

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


కర్మ- భోగము...!!

🌿🌿🌿🌿🌿

   

           

🌹మనం తయారు చేసుకున్నదే తింటాము🌹


మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో, తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి.


ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.


 🌹మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు?🌹


 మనకు పూర్వ జన్మలో సంబంధం వున్న వాళ్ళే.. ఈజన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు.


అవే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...


1.ఋణానుబంధం:


 గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండచ్చు.


 అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి, లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి 

ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యేవరకు మనతోనే వుంటారు.


2. శత్రువులు - పుత్రులు


 *మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు. 


అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు.  జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. 


ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ ఆనంద పడుతుంటారు.


3. తటస్థ పుత్రులు:


 వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు... 

మరో వైపు సుఃఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.  


   వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగి పోతారు.


4. సేవా తత్పరత వున్న పుత్రులు:


గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చుకోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు.


 అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతం లో    ఏది చేసుకున్నారో   ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. 


 మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు. 


లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారుకూడా మనవద్ద వుండరు.


 ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్టవచ్చును.


 ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. 


ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్యాకుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.


 లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు.


అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్యవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో  లేదా     వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలో కి తెస్తుంది.


  మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్యబడతాయి. 


ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి. (అనగా పాప పుణ్యాలు)


కొద్దిగా ఆలోచించండి "మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్లీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు..?     


   ఇప్పటివరకు పొయినవాళ్లు ఎంత బంగారం, వెండి పట్టుకుపోయారు..?    మీరు పోయే ముందు మీ బ్యాంకులో ఉన్న నగా, నట్రా, డబ్బు మూలుగుతుందో అదిపూర్తిగా పనికి రాని సంపాదన కాదా..?


ఒకవేళ మీ మీ సంతానం సమర్ధులైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కాదా..?   


వాటి అవసరం వాళ్లకు లేదు కదా..? ఒక వేళ వాళ్ళు ఆ డబ్బు దస్కం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా.  


  వాళ్ళు సదరు డబ్బు, నగానట్రా వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు.


 ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

నేను, నాది, నీది అన్నది అంతా ఇక్కడికిక్కడే పనికి రాకుండా పోతుంది.


 ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలయితే అంత  మంచికర్మలు చెయ్యండి.

         

 🙏సర్వే జనాః సుఖినో భవంతు            

లోకా సమస్తా సుఖినోభవంతు🙏

విన శక్యము కాదు

 శ్లోకం:☝️

*వరం రామశరస్సహ్యో*

    *న చ వైభీషణం వచః |*

*అసహ్యం జ్ఞాతిదుర్వాక్యం*

    *మేఘాంతరితరౌద్రవత్ ||*


భావం: రాముని బాణమైనా భరించవచ్చు గానీ విభీషణుని నీతి వాక్యాలు భరించలేక రావణుడు చింతించుచున్నాడు. శత్రువుతో యుద్ధము వలన వచ్చే శారీరిక బాధ కన్నా, స్వంత వారి నీతి వచనాలు, ఎత్తిపొడుపు మాటలు మేఘగర్జన వలే, పిడుగుపాటు వలే విన శక్యము కాదు అని భావం.

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదమూడవ అధ్యాయము 

క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము 

నుంచి 26వ శ్లోso


యావత్సంజాయతే కించిత్ 

సత్త్వం స్థావరజంగమమ్ ౹

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ 

తద్విద్ధి భరతర్షభ ౹(26)


యావత్ , సంజాయతే , కించిత్ ,

సత్త్వమ్ , స్థావరజంగమమ్ ౹

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ , 

తత్ , విద్ధి , భరతర్షభ ౹(26)


భరతర్షభ ! = ఓ అర్జున ! స్థావరజంగమమ్ = చరాచరాత్మకమైన 

సత్త్వమ్ = ప్రాణి 

యావత్ , కించిత్ = ఏదేది 

సంజాయతే = పుట్టుచున్నదో 

తత్ = అది ( ఆ ప్రాణి సముదాయము ) 

క్షేత్ర , క్షేత్రజ్ఞ సంయోగాత్ = క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే 

విద్ధి = (కలుగునని) ఎఱుంగుము 


తాత్పర్యము:- ఓ అర్జున ! ఈ స్థావరజంగమ ప్రాణులన్నియును క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నములగునని ఎఱుంగుము.(26)

   

          ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                Yours Welwisher

   Yennapusa Bhagya Lakshmi Reddy

*శ్రీ అన్నమయ్య సంకీర్తన*

 *శ్రీ అన్నమయ్య సంకీర్తన*

🕉️🌞🌏🌙🌟🚩


ప ఇదియె నాకు మతము ఇదివ్రతము | వుదుటుల కర్మము వొల్లనింకను 



చ|| నిపుణత హరినే నిను శరణనుటే | తపములు జపములు ధర్మములు |

నెపమున సకలము నీవే చేకొను | వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||



చ|| హరి నీదాసుడ ననుకొనుటే నా | పరమును ఇహమును భాగ్యమును |

ధర నీ మాయల తప్పు తెరువులను | వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||



చ|| నారాయణ నీ నామము దలచుట | సారపు చదువులు శాస్త్రములు |

ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి | వూరక ఇతరము లొల్ల నే యింకను ||


🕉️🌞🌏🌙🌟🚩

ఫొటోషూట్

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *🌷ఫొటోషూట్🌷*

(ఈనాటి వివాహ వేడుకలలో వింత పోకడలు)  రచన: జి.యస్. లక్ష్మి. 

                 🌷🌷🌷                                                                         

రెండురోజులక్రితమే వరంపిన్ని కొడుకు పెళ్ళికి ముందు జరిగే ఫొటోషూట్ కోసం రమ్మని ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది. కొడుకునీ, కాబోయే కోడలినీ అప్పటికప్పుడే నాల్రోజుల ముందునుంచీ వీడియోలు తీస్తున్నారుట. ఇప్పుడు బంధువులందరితో కలిసి వాళ్ళిద్దరినీ షూట్ చేస్తారుట. అందుకని వరంపిన్ని పొద్దున్నే పదిగంటలకల్లా వచ్చెయ్యమంది. పిన్నితో సరే నన్నాను, కానీ నాకేవిటో ఈ ఫొటోషూట్ ల గురించి అస్సలేవి తెలీదు.  ఆమాట పిన్నితో అంటే నేను అప్డేట్ లో లేనంటుంది.  అందుకని అప్పటికి పిన్నికి సరేనని చెప్పి నిన్న వదినని అడిగేను అసలీ గొడవంతా ఏవిటని.  వదిన ఇలాంటి విషయాలన్నీ భలే గమ్మత్తుగా చెప్తుంది.  ఏదడిగినా ముందు దాని మూలాల్లోకి వెళ్ళిపోతుంది.  దాని చరిత్రంతా చెప్పుకొచ్చి కానీ ప్రస్తుతం లోకి రాదు.  అందుకనే సాధారణంగా నేను వదినని కదపను.  కానీ వరంపిన్ని పిలిచినప్పుడు వెళ్ళేముందు అసలు ఈ ఫొటోషూట్ గురించి తెల్సుకోవాలి కదా, అని వదినకి ఫోన్ చేసి అడిగేను.  అంతే ఇంక వదిన మొదలెట్టింది.


వదిన _ నీకు మన ఊళ్ళల్లో ఇళ్ళల్లో గోడలమీద వరసగా ఫ్రేములు కట్టిన ఫొటోలు ఉండేవి ..గుర్తుందా!


నేను _ గుర్తు లేకేం.. చిన్నప్పుడు అమ్మమ్మగారింటి కెళ్ళినప్పుడు చూసేదాన్నిగా..


వదిన – అవన్నీ ఎవరి ఫొటోలూ..


నేను "ఎవరివేంటీ, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అయినప్పుడు అందరూ కలుస్తారు కనక అందరివీ కలిపి గ్రూప్ ఫొటోలుండేవి, ఇంకా మధుపర్కాలతో, కర్పూరం దండలతో ఎవరి పెళ్లయితే వాళ్ల ఫొటోలుండేవి.  మా అమ్మమ్మింట్లో అయితే మా అందరి మావయ్యల, పిన్నిల పెళ్ళిఫొటోలూ ఉన్నాయి.


వదిన – కదా! ఆ టైములో కల్సిన కుటుంబవంతా ఫొటోగ్రాఫర్ ని పిల్చి గ్రూప్ ఫొటో కూడా తీయించుకునేవారు.


నేను – అవునవును. అలాంటివి కూడా ఉన్నాయి.


వదిన – ఆ తర్వాత కొన్నాళ్ళకి పెళ్ళి జరుగుతున్నప్పుడు ఫొటోగ్రాఫర్ ని పెట్టి పెళ్ళిఫొటోలు తీయించుకునేవారు కదా..


నేను – అవును.. జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడూ, మంగళసూత్రం కడుతున్నప్పుడూ, తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, ఇలా ప్రతీదీ తీసేవారు.  వాటిల్లో అసలు వాళ్ళ కన్న వాళ్ల మధ్యన కూర్చున్న పురోహితుడు మటుకు చక్కగా పడేవారు..


వదిన – హహ.. సర్లే..ఆ పైన చాలామంది చేతుల్లోకి కెమెరాలు వచ్చేయి.  మెడలో కెమెరా వేసుకుని పెళ్ళిళ్ళలో తిరుగుతూ మగపిల్లలు హీరోల్లా ఫీలైపోయేవారు.


నేను – అవునవును.. మా అన్నయ్య అలాగే నా పెళ్ళిఫొటోలన్నీ తీసేడు.


వదిన – ఆ తర్వాత వీడియో లొచ్చేయి.  ఈ వీడియోలు వచ్చేక ఫొటోలూ, వీడియోల మీద లక్షలు ఖర్చుపెట్టడం మొదలైంది. అందులోనూ కేటరింగు లొచ్చేసేక, ఇదివరకులాగా పెళ్ళివాళ్లకి షాపింగ్ తప్ప వేరే పనులేమీ లేవు, కనక ఈ వీడియోలకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవడం ఎక్కువైంది. ఇంకిప్పుడైతే మరీనూ.. ఒక్కళ్ళూ ఇద్దరే పిల్లలవడంతోనూ, అప్పటికే ఆ పిల్లలు కూడా బాగా సంపాదించేవాళ్లవడంతోనూ పెళ్ళిళ్ళు చేయించడం ఈవెంట్ మేనేజ్ మెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.  ఇంకంతే… వాళ్ల బిజినెస్ పెంచుకోవడం కోసం పాత సాంప్రదాయాలని మళ్ళీ మొదలెట్టీ, పక్కరాష్ట్రాలవారి సాంప్రదాయాలను కూడా కలిపేసీ వాళ్ళు పెళ్ళిళ్ళను రోజులతరబడి మహా వైభవంగా చెయ్యడం మొదలెట్టేరు.


వదిన ఊపిరి పీల్చుకోవడంకోసం ఆగింది.


నేను – అది సరే.. అసలు సంగతి చెప్పు.  మనలో ఇలా పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ ముందుగా కలిసి డేన్సులు చేసే పధ్ధతి ఎప్పట్నించి మొదలైందీ..


వదిన – కూల్ స్వర్ణా.. అలా తొందరపడితే ఎలా చెప్పూ.. విత్తం కొద్దీ వైభోగం అనే సామెత విన్నావు కదా.. ఇప్పుడు చేతిలో బోల్డు డబ్బులున్నాయి.  అవి చూపించుకుందుకు ఇలాంటి సమయం కోసవే కదా చూస్తుంటారు.  అసలే మనలో చాలామంది సినిమాపిచ్చి వాళ్ళున్నారు.  హీరోలా హెయిర్ స్టెయిలూ, డ్రెస్సూ, నడకా, మాటా అన్నీ అనుకరించేస్తుంటారు. అలాగే వాళ్లని ఫాలో అయిపోతూ మనవాళ్ళు పెళ్ళికి ముందే డ్యూయట్లు పాడేసుకుని కొండలెక్కీ, నీళ్ళలో దూకీ, బురదలో దొర్లీ, వీడియోలు తీయించేసుకుంటున్నారు. మొన్నామధ్య వాట్సప్ లో వైరల్ అయిన వీడియో చూసేవు కదా!


నాకు ఒక్కసారి ఆ వీడియో గుర్తొచ్చింది. అందులో పెళ్ళికొడుకు డ్రెస్సులో ఒకతను తలకిందకీ కాళ్ళు పైకీ పెట్టి నిలబడ్డాడు.  అంటే చేతులమీద నిల్చుని కాళ్ళు పైకి పెట్టుకుని ఉన్నాడన్నమాట. పట్టుచీరతో, పూలజడతో, ఒంటినిండా నగలతో ఉన్న పెళ్ళికూతురు బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఓ సినిమాపాటకి అతని చుట్టూ నాలుగువైపులా తిరుగుతూ డేన్సు చేస్తోంది.  అది చూస్తుంటే అనకూడదు కానీ నాకైతే సినిమాల్లో చూపించినట్టు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూంటే తపోభంగం చెయ్యడానికి మేనక చేసిన డేన్సులా అనిపించింది.  ఆ పిల్ల డేన్సు ఎప్పటికవుతుందో, ఈ లోపల ఆ పిల్లాడు కింద పడిపోతాడెమో నని క్షణక్షణం ఆ వీడియోని ఉత్కంఠతో చూసిన విషయం గుర్తొచ్చింది.  వీళ్ళ సరదాలు సంతకెళ్ళా.. ఇలా శీర్షాసనాలూ గట్రా వెయ్యకుండా చక్కగా ఏ పూలతోటలోకో వెళ్ళి ఆ డేన్సేదో చేసుకుంటే చూసేవాళ్ళు సుఖపడతారు కదా అనిపించింది. దాని గురించి ఆ రోజు వదినా నేనూ చాలాసేపే మాట్లాడుకున్నాం.  వదిన మాటలకి ఇంక నాకు విసుగొచ్చేసింది.


నేను - అసలు సంగతి చెప్పకుండా ఈ ఉపోద్ఘాతమంతా ఏంటి వదినా..డబ్బులుంటే వాళ్ళిష్టమొచ్చినట్టు చేసుకోమను. ఆసనాలూ వెయ్యమను, సముద్రంలోకీ దూకమను.  అదేదో ఆ పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ సంబంధించిన విషయం కదా.. మరి మనందర్నీ ఫొటోషూట్ అంటూ పిలవడ మెందుకూ! పాయింట్ కి రా.


వదిన - రామాయణం అంతా విని రాముడికి సీత ఏవైతుందీ అన్నాట్ట నీలాంటివాడే.. వాళ్లల్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకున్న గొప్ప ఆలోచనలూ, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బూ మనకెలా తెలుస్తాయీ.. అందులోనూ సినిమాల్లో కూడా హీరో, హీరోయిను వెనకాల అటో డజనుమందీ, ఇటో డజనుమందీ ఆడా మగా ఎక్సరసైజులు చేస్తుంటారు కదా!  అలా చెయ్యడానికన్నమాట మనం..


వింటున్న నాకు నీరసమొచ్చేసింది.


నేను - అంటే నువ్వూ, నేనూ, పద్మక్క, లక్ష్మివదినా, వాళ్లక్కా, వరంపిన్ని చెల్లెలూ ఇలా అందరం వాళ్ల వెనకాల డేన్సు చెయ్యాలా.


వదిన - వాళ్ళేకాదు. వాళ్లతోపాటు వారి భర్తలు కూడా చెయ్యాల్సిందే..


నేను - నిజవా?  వాళ్లందరూ కూడా వస్తారా?


వదిన - ఎందుకురారూ.. వాళ్ళూ బంధువులేగా…. అందరూ వస్తారు, డేన్సులూ చేస్తారు.


నేను - ఎలా నాకు డేన్సు రాదే..


వదిన - రానక్కర్లేదు. అటూ ఇటూ చేతులు తిప్పడం, పక్కనున్న పిట్టగోడమీంచి అందరం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని ఒక్కసారిగా దూకడం లాంటివి ఉంటాయంతే.. నువ్వేం ఖంగారు పడకు.. నేను పక్కనే ఉంటానుగా..


నేను - సరే అయితే, ఇంతకీ నువ్వేం చీర కట్టుకుంటున్నావ్.. కంచిపట్టా, బెనారసా, పోచంపల్లా..


వదిన - దానిగురించి నువ్వేం కష్టపడక్కర్లేదులే, మీ వరం పిన్ని అందరికీ ఒక్కలాంటి చీరలు, పంచెలూ కొనేసింది. అందరం బేండుమేళంగాళ్ళమే..


వదిన ఫక్కున నవ్వుతూ ఫోన్ పెట్టేసింది.


నాకు ఒక్కసారిగా తల తిరిగిపోయింది.  చిన్నప్పుడు ఒకే తాను కొనేసి మగపిల్లలందరికీ లాగులూ, చొక్కాలూ కుట్టించేసే వారు. అప్పుడు వాళ్లని ఆడపిల్లలం బేండుమేళం అని వెక్కిరించేవాళ్ళం.  హూ.. చేసిన పాపం ఊరికే పోతుందా! ఇప్పుడు మేవే బేండుమేళం అయిపోయేం అనుకున్నాను బాధగా.


తప్పదుకదా అనుకుంటూ పొద్దున్నే లేచి వరంపిన్ని ఇంట్లో ఫొటోషూట్ కి వెళ్ళాలని పనులన్నీ గబగబా చేసేసుకుంటున్నాను.  అదేంటో బైటకి వెళ్ళాలనుకున్నప్పుడే మరిన్ని పనులు కనపడుతూ ఉంటాయి.  మొత్తానికి ఇంక పని అయిందనిపించుకుని, బయల్దేరదామా అంటూ వదినకి ఫోన్ చేసేను.  ఎత్తలేదు వదిన.


ఇంకా వదిన పనవలేదేమోనని కాసేపాగి మళ్ళీ చేసేను. ఊహూ.. అప్పుడూ ఎత్తలేదు.  నాకు ఆశ్చర్యం వేసింది.  పోనీలెమ్మని అప్పటికి ఊరుకుని మరో అరగంటయేక మళ్ళీ చేసేను. ఈసారి వదిన ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది.  దాంతో నాకు కంగారొచ్చింది.  మామూలుగా నేను చేసినప్పుడు వదిన ఏదైనా పనిలో ఉంటే ఆ పనవగానే నా కాల్ చూసుకుని తనే చేస్తుంది. అలాంటిది ఇవాళ మూడుసార్లు చేసినా మళ్ళీ చెయ్యలేదు సరికదా, ఫోన్ కూడా స్విచాఫ్ చేసేసిందేవిటీ, అనుకుంటూ ఇంక అన్నయ్యని అడుగుదామని అన్నయ్యకి చేస్తుంటే అప్పుడు వచ్చింది వదిన నుంచి ఫోన్.  వెంటనే పలికేను.


“ఏవైంది వదినా..ఫోన్ స్విచాఫ్ ఎందుకు చేసేవ్..”


“అంటే హాస్పిటల్ కి వెళ్ళేను. పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఆఫ్ చెయ్యమన్నారు. అందుకనీ..’


“హాస్పిటల్ కా, ఎందుకూ, ఎవరికి ఏవైందీ..” ఆదుర్దాగా అడిగేను.


అట్నించి వదిన ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలింది.


“నీకు మా పక్కింటాయన తెల్సుకదా.. పిల్లలిద్దరూ ఒకళ్ళు ఢిల్లీలోనూ, ఇంకోళ్ళు బెంగుళూర్ లోనూ ఉంటున్నారు.  ఆ పిల్లలిద్దరూ కల్సి ఆ దంపతులకి నలభై సంవత్సరాల పెళ్ళిరోజు చేద్దామని తలపెట్టేరు. ఆయనకి అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలని కాదనలేక సరేనన్నారు. మామూలుగా ఆ దంపతులు ఏమనుకున్నారంటే ఆ రోజు పొద్దున్నే గుడిలో పూజలూ, హోమాలూ చేసుకోవడం, ఆ తర్వాత బంధువులూ, స్నేహితులతో విందూ ఉంటుందనుకున్నారు.


కానీ పిల్లలిద్దరూ కల్సి మీకసలు లైఫ్ ఎంజాయ్ చెయ్యడవే తెలీదూ, పెళ్ళిరోజంటే సంబరంగా జరుపుకోవాలీ అంటూ ఎవరో ఈవెంట్ వాళ్ళకి వీళ్ళని అప్పచెప్పేరుట.  వాళ్ళు వీళ్ళని ఈ రోజుల్లో పెళ్ళిళ్ళలో డేన్సులు చేస్తున్నట్టు ఇద్దర్నీ కల్సి డేన్సు చెయ్యమంటూ ఆ స్టెప్స్ అవీ వెయ్యడం నేర్పించేరుట.  ఆయన నేను చెయ్యను మొర్రో అంటున్నా కూడా ఆవిడ "పిల్లలు సరదా పడుతున్నారు, అంతా వీడియో తీసుకుని తర్వాత పిల్లలు సంతోషంగా చూసుకుంటారు" అంటూ మొదలెట్టిందిట.  ఇంక ఆ స్టెప్స్ వేయడంలో ఆవిడకి కాలు మడతపడి, కిందపడి నడుము విరిగినంత పనైందన్న మాట. ఆవిణ్ణి చూడ్డానికే హాస్పిటల్ కి వెళ్ళేను” అంది.


“అదేంటి వదినా…పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇలా డేన్సులు చేస్తున్నారా!”


“ఎందుకు చెయ్యరూ.. ఇప్పుడు మీ వరంపిన్ని కొడుకు పెళ్ళిలో చెయ్యడానికి మనం వెళ్ళట్లేదూ!” ఎదురు ప్రశ్న వేసింది వదిన.


ఒక్కసారి నాకు ఖంగారుగా అనిపించింది.  సినిమాల్లో ఇలా పెళ్ళిళ్ళలో వెనకాల పెద్దవాళ్ళు చేసే డేన్సు చూసి చిరాకు పడటం గుర్తొచ్చింది.  సీరియల్స్ లోనూ, రియాలిటీ షోల్లోనూ అయితే మరీనూ.. ఇంతంత లావున్నవాళ్ళు అలా వంకరలు తిరుగుతూ అర్ధంపర్ధం లేని సినిమా పాటలకి డేన్సులు చెయ్యడం చూస్తుంటే కడుపులోంచి వికారం పుట్టుకొస్తోంది.


అంటే ఇప్పుడు మేం కూడా అలాగే స్టెప్పులు వేస్తూ, తిప్పుకుంటూ, పిట్టగోడలెక్కి దూకుతూ, ఒకళ్ళ నొకళ్ళు వెక్కిరించుకుంటూ డేన్సులు చేస్తే అవన్నీ వీడియో తీస్తారా.. రేప్పొద్దున్న నేను చేసిన డేన్సు చూసి నాకే వికారం వస్తుందేమో?


ఒక్కసారి వరంపిన్నింటికి ఫొటోషూట్ కి వెళ్ళడం మానేస్తేనో అనిపించింది.  కానీ ఇప్పటికే ఇంకా రాలేదేంటంటూ వరంపిన్ని రెండుసార్లు ఫోన్ చేసింది.


ఏమిటి చెయ్యడం.. వెళ్ళడమా.. మానడమా?  భగవంతుడా!  నాకేది దారి.

------------------------------

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

కోడిమాంసం సంపూర్ణ వివరణ

 కోడిమాంసం సంపూర్ణ వివరణ  - 


      కోడిని సంస్కృతము నందు కుక్కుటము అని పిలుస్తారు . ఇది జిగటగా , స్నిగ్దముగా ఉండును. ఉష్ణవీర్యముగా ఉండును. కంటికి హితముగా ఉండును. అనగా నేత్రసంబంధ సమస్యలతో ఇబ్బందిపడువారికి ఇది హితము కలిగించును. వీర్యవృద్ధిని కలిగించును. కఫోద్రేకము కలిగిచును . కోళ్ళలో ఆడకోడి , మగకోడి రెండు బేధములతో ఉండును. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కోడిని విష్కిర జంతువులలో ( అనగా కాలితో నేలను చిమ్మి అందుండు పురుగులు మొదలయిన వానిని తినేవి ) చేర్చడం జరిగింది . విష్కిర జంతువుల మాంసం సాధారణముగా శుక్రవృద్ధిని  కలిగించునదిగాను, కొంచం  వగరు , తీపి రుచులు కలదిగాను , చలువనిచ్చి , ఇంపుగా ఉండునదిగా వర్ణించబడినది. 


 

 *  కోడిపుంజు మాంస విశిష్టత  - 


        ఇది మిగుల శ్రేష్టమైనది . అందులోనూ కూతపెట్టని పుంజుమాంసం బలకరం . రక్తవృద్ధిని ఇచ్చి వాతవ్యాధులను , ఉదరశూల పోగొట్టును . సమశీతోష్ణత కలిగించును. ఏ కారణము చేతనైనను రక్తము తగ్గి కృశించి పోవువారికి సాధారణముగా వేడి శరీరతత్వము కానివారు కోడిమాంసం తినవచ్చు . ప్రాయపు పుంజుమాంసం అధిక బలకరము , దేహబుద్ధి పెంచును . వీర్యవృద్ధి కలిగించును. కాసరోగముచే కృశించువారికి ఇది హితము . వాతప్రకృతి కలవారికి అనుకూలత ఇచ్చును . ముదురుకోడిపుంజు మాంసం శరీరం నందు అమితముగా ఉష్ణమును పెంచును . ఉష్ణముతో వచ్చు శ్లేష్మముకూడా పెరుగును . దీనిని తీసుకోకపోవడము ఉత్తమం . దీనికి పులుసు విరుగుడు. 


 * కోడిపెట్ట మాంస విశిష్టత  - 


        ఇది స్నిగ్దముగా , హితముగా , రుచికరంగా , వాతశ్లేష్మ హరముగా ఉండును. గురుత్వము ఇచ్చును. వీర్యపటిమ , దేహబలము , రక్తవృద్ది ఇచ్చి కన్నులకు మేలు చేయును . కొడిపెట్ట మాంసం చక్కగా పక్వము కాకున్నచో విరుద్ధగుణములు ఇచ్చును. ముసలి పెట్ట మాంసం ఉదరవ్యాధులు , శూలలు మున్నగువానిని పోగొట్టును . వీటిలో పిల్లలమాంసం నీరసముతో ఉన్నవారికి హితము . ఇది విరేచనకారి . ముసలిపెట్ట మాంసం విరేచనబద్ధం , లేతకొడిపెట్ట మాంసం అత్యుష్ణము . ముదురుది శ్వాసకాసలను హెచ్చించును. దీనికి విరుగుడు పులుసు . 


         పైనచెప్పిన ఔషధ విలువలు అన్నియు దేశివాళి కోళ్లకు సంబంధించినవి . ఇప్పుడు మనకి లభ్యం అయ్యే బాయిలర్ కోళ్ళకి త్వరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాము . అలా ఆ కృత్రిమ హర్మోన్స్ మనశరీరములోకి ప్రవేశించి విపరీత ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యముగా ఆడపిల్లలు సాధారణ వయస్సు కన్నా ముందే పుష్పవతులు ( Matured ) అవ్వడం జరుగుతుంది. పెద్దవారిలో హర్మోనల్  inbalance అవ్వడం జరుగుతుంది.  


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం

 ఈ మ‌ధ్య రిక్లైన‌ర్‌లో కాళ్లు చాపుకుని సినిమా చూస్తుంటే గ‌త‌మంతా గుర్తుకొచ్చింది.. మా ఊళ్ళో నేల 0.40 , బెంచి  0.75, కుర్చీ రూ.1.50 రూపాలయల రోజులవి. అ థియేట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు. 


నేల ఫుల్‌గా నిండి ఒక‌రి భుజాల మీద ఇంకొక‌రు కూచున్నా బుకింగ్ ఆగ‌దు. లోప‌ల భీక‌ర యుద్ధాలు జ‌రుగుతున్నా గేట్ కీప‌ర్ చ‌లించ‌డు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగ‌స్ట్రా బెంచీలు, బాల్క‌నీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేల‌కి ఆ సౌక‌ర్యం లేదు. ఒక‌రి మీద ఇంకొక‌రు , ఎవ‌రి మీద ఎవ‌రు కూచున్నారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. కొంద‌రైతే స్క్రీన్ ముంద‌రున్న అరుగు మీద కూచుని కొండ‌ల్లా క‌నిపించే హీరో ముఖాన్ని చూసి జ‌డుసుకునే వాళ్లు. ఆడ‌వాళ్ల నేల‌క్లాస్‌లైతే కుళాయి నీళ్ల‌లా ధారాపాతంగా బూతులు, కొంద‌రైతే జుత్తు ప‌ట్టుకుని ఉండ‌ల్లా దొర్లేవాళ్లు. ఫ‌స్ట్ షోకి వ‌చ్చిన ఆడవాళ్లు సెకెండ్ షో వ‌ర‌కూ తిట్టుకునే వాళ్లు.


ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడ‌ని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగ‌రెట్లు ముట్టించి "బుస్‌"మ‌ని పొగ వ‌దిలేవాళ్లు. తాగిన వాళ్ల‌కి, తాగ‌ని వాళ్ల‌కి స‌మానంగా ద‌గ్గొచ్చేది. సినిమా మాంచి ర‌సప‌ట్టులో అంటే ఎన్టీఆర్ క‌త్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్న‌ప్పుడు రెండు ఈల‌లు, ఆయ‌న డూప్ రెండు చేతుల‌తో తిప్పుతున్న‌ప్పుడు ప‌ది ఈలలు వినిపిస్తూ వుండ‌గా అంద‌రినీ తొక్కుతూ కొంద‌రు ప్ర‌వేశించేవాళ్లు.


"ఎవ‌రిక‌యా నిమ్మ‌సోడా" అని ఒకడు, "వేయించిన శ‌న‌క్కాయ‌లూ" అని ఇంకొక‌డు, "చ‌క్కిలం, చ‌క్కిలం" ఇలా రాగ‌యుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ల‌కి కుయ్యిమ‌ని సౌండ్‌తో సోడా, తుప్పు ప‌ట్టిన పావుతో శ‌న‌క్కాయ‌లు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు వ‌స్తే జ‌నం ప‌కప‌క న‌వ్వేవాళ్లు. అంజ‌లిదేవిని చూసి ఏడ్చేవాళ్లు.


ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేట‌ర్ పుట్టిన‌పుడు కొన్ని వేల న‌ల్లులు బెంచిల్లోకి వ‌ల‌స వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల రాక కోసం ఎదురు చూస్తూ, వ‌చ్చిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా దాడి చేస్తాయి. మొద‌టిసారి పిర్రకు కుట్టిన‌పుడు ఉలిక్కిప‌డ‌తాం. రెండోసారి ప‌డ‌తాం. త‌ర్వాత అల‌వాటు ప‌డ‌తాం. ఆ దుర‌ద‌కు త‌ట్టుకోలేక కొంద‌రు లేచి నిల‌బ‌డి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమ‌ని అరుస్తూ వుంటారు.


కొంద‌రు సీనియ‌ర్ ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్ల‌కి న‌ల్లుల‌తో అనుభ‌వంతో పాటు శాశ్వ‌త శ‌త్రుత్వం వుంటుంది. అందుక‌ని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్ర‌యోజ‌నం ఏమంటే కొన్ని న‌ల్లులు వీర‌మ‌ర‌ణం పొందుతాయి. అయితే క‌సి, ప‌గ‌, ప్ర‌తీకారంతో మిగిలిన‌వ‌న్నీ కుట్ట‌డం ప్రారంభిస్తాయి. ఈ కుట్ల‌కి ప్రేక్ష‌కులు బెంచీల మీద ఎగిరెగిరి ప‌డుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు త‌క్కువ‌, సిగ‌రెట్ల కంపు ఎక్కువ‌.


బాల్క‌నీలో కుర్చీలు ఉంటాయి. వాటి చ‌ర్మం చిరిగిపోయి లోప‌లున్న కొబ్బ‌రి పీచు, దూది పొట్ట‌పేగుల్లా క‌నిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్ద‌గా న‌ల్లులుండ‌వు. కానీ మేకులుంటాయి. అవి మ‌న బ‌ట్ట‌ల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్ర‌త్త‌గా లేస్తే ప‌ర్‌మ‌ని సౌండ్. బాల్క‌నీలో ప్రొజ‌క్ట‌ర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శ‌న‌క్కాయ‌ల ట్రాఫిక్ పెరిగిన‌ప్పుడు వాళ్ల త‌ల‌కాయ‌లు స్క్రీన్ మీద క‌నిపిస్తూ వుంటాయి.


అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించ‌డం చాలా క‌ష్టం. సంపాయించినా అది స‌వ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండ‌డం మ‌రీ క‌ష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వ‌చ్చిన‌ట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద ప‌డ‌క‌పోవ‌డం మ‌న అదృష్టం.


ఇక్క‌డితో మ‌న క‌ష్టాలు ఆగ‌వు. క‌రెంట్ వాళ్ల ద‌య ఉండాలి. ఎన్టీఆర్ బుల్లీ అని హీరోయిన్‌తో శృంగారం చేస్తున్న‌ప్పుడు వాళ్ల‌కి న‌చ్చ‌దు. ప‌వ‌ర్‌క‌ట్‌. జ‌న‌మంతా పిచ్చెక్కిన‌ట్టు ఈల‌లేస్తారు. జ‌న‌రేట‌ర్లు లేని కాలం కాబ‌ట్టి క‌రెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాక‌పోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూడాలి.


రిలీజైన ఏడాదికి ఆంధ్ర దేశ‌మంతా ఆడిన త‌ర్వాత మాకు వ‌చ్చేది. పాత ప్రింట్లు కావ‌డంతో సినిమా అంతా గీత‌లు గీత‌లు వ‌చ్చి క‌ట్ అయ్యేది. ఇన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.


ఇపుడు ఇన్ని సౌక‌ర్యాల మ‌ధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావ‌డం లేదు. అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం అదేనేమో!


తెలివి మీర‌డానికి మించిన శిక్ష ఇంకొక‌టి లేదు. - ఒక సినిమా ప్రేక్షకుడు

ప్రకృతి హితమే ప్రజాహితం

 హరిఃఓం   ,                           -                                               -                                                  -        ప్రకృతి హితమే ప్రజాహితం


సృష్టిలో మనిషి మాత్రమేకాక అతడి చుట్టూ విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతికి మనిషికి పరస్పరం సంబంధం ఉంది. 

         ఈ అనుబంధాన్ని విస్మరిస్తే మనిషికే ప్రమాదం.

         కాళిదాస మహాకవి 'అభిజ్ఞాన శాకున్తలమ్' నాటకంలో 'భరతవాక్యంగా' దుష్యంతునిచే పలికించిన వాక్యాలలో మొదటి వాక్యం. 

          "ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః" 'పాలకులు ప్రకృతి హితం కోసమే ప్రవర్తించాలి' అని ఈ వాక్యార్థం. ప్రపంచ దేశాలన్నీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాలించేవారు కేవలం ప్రజల హితాన్నే కాదు, ప్రకృతి హితాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రకృతి హితం పైనే ప్రజాహితం ఆధారపడి ఉంది.

           అంతేగానీ ప్రకృతిని క్షోభపెడితే క్రమంగా అది మనిషి మనుగడనే దెబ్బతీస్తుందని మహర్షులు పలువిధాల బోధించారు. ప్రకృతిలో మనం అంతర్భాగం. అంతేగానీ ఆధిపత్యం వహించేవారం కాదు. ప్రకృతిని (జగన్మాతగా) మాతృ భావనతో ఆరాధించే సంప్రదాయం మనది.

            ఉదయాన్నే నిద్రలేస్తూనే- భూమికి నమస్కరించి పక్క దిగమన్నారు పూర్వీకులు.

           సముద్రవసనే దేవి! పర్వతస్తన మండలే 

          విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||

          "అమ్మా! భూదేవి! సముద్రాన్నే వస్త్రంగా పర్వతాలను వక్షస్థలంగా కలిగిన తల్లీ! విశ్వవ్యాపకుడైన భగవంతుని శక్తివి నీవు! నా పాదాలతాకిడిని క్షమించుమమ్మా" అని ప్రార్థించి అడుగువేస్తాం. ప్రకృతితో ఇంత సున్నితమైన సంబంధాన్నీ ఆత్మీయతనీ అభివృద్ధి చేసుకున్న గొప్పనాగరికత మనది.

           ఉదయించే సూర్యతేజాన్ని జడపదార్థంగా కాక 'శక్తి ప్రదాత' అయిన భగవంతునిగా అర్చిస్తాం. ప్రవహించే నదులను దేవతామాతృకలుగా పూజించి, ఆ జలాలను పవిత్రంగా పానం చేస్తాం, అందులో స్నానం చేస్తాం.

          నలుగురూ వాడే తటాకాలను, నదులను బావులను ఏమాత్రమూ కలుషితం చేయవద్దని వేద మంత్రాలు శాసించాయి. 

           "న నిష్టీవనం కుర్యాత్ న మూత్రపురీషం కుర్యాత్" - నీటిలో ఉమ్మరాదు. మలమూత్రాలను విడువ రాదు... అది మహాపాతకం అని హెచ్చరించాయి. కానీ మనం పెడచెవిన పెడుతున్నాం. పవిత్రనదీ స్నానఘట్టాలలో అన్ని కాలుష్యాలనూ నింపుతున్నాం. దానికి తోడు పరిశ్రమలు విషతుల్యమైన నిలవల్ని వదులుతున్నాయి.

           వృక్షాలను కూడా దేవతలుగా ఆరాధించే పరంపర మనది. వృక్ష సూక్తాలు వేదవాఙ్మయంలో దర్శనమిస్తాయి. యజ్ఞానికి వాడే సమిధల్ని సైతం ఎండిన వాటినే వాడాలిగానీ, పచ్చిగా ఉన్న వాటిని ఖండించరాదని శాసించారు. పూజకి తులసీదళాలనీ, మారేడు దళాలనీ, పువ్వుల్నీ కోసేటపుడు కూడా కొన్ని నియమాలు చెప్పారు. ముందుగా వృక్షాన్ని నమస్కరించి, దేవతాప్రీతికై దళాలను, కుసుమాలను ప్రసాదించవలసిందిగా ప్రార్థించాలి. ఆపై గోరు తగలకుండా వేలి కొసలతో మాత్రమే వాటిని (కోయాలి) తీయాలి. 

          దళాలనైతే ఏకాదశి, పూర్ణిమ, శుక్రవారం, అమావాస్య వంటి తిథులలో దినాలలో కోయరాదు. ఆ కోసేటప్పుడు కూడా కొమ్మలు విరగకుండా ఏరు కోవాలి అంటూ చాలా పద్ధతుల్ని పెట్టారు. దీని ద్వారా కూడా ప్రకృతి పరిరక్షణలో ఎంతటి బాధ్యతను గుర్తుచేశారో గమనించాలి. మన అవసరార్థం ప్రకృతిని వినియోగించుకున్నా ఏమాత్రం నాశనం లేకుండా ఎంతో అనుబంధంతో వ్యవహరించడం ఈ సంస్కృతి ప్రత్యేకత.

          పంట పండించేముందు భూమినీ, పండిన తరువాత పంటనీ కూడా గౌరవిస్తాం. ప్రకృతిలో ప్రతి పదార్థాన్నీ ప్రాణవంతంగా చూసే దృష్టి ఇది. అంతేగానీ ప్రకృతిని జడపదార్థంగా భావించరాదు. అలాగే ప్రాణికోటిని ప్రేమించే స్వభావం.

        'శాకున్తలమ్'లో శకున్తల వృక్షాలను పెంచిన తీరు, కణ్వుడు అమ్మాయిని అత్తవారింటికి పంపుతూ వన దేవతలను నమస్కరించిన విధం గమనిస్తే అవి కేవలం కవితాకల్పనలుగా కాక, మనిషి బాధ్యతలను బోధిస్తాయి.

           రామాయణంలో శ్రీరాముడు, సీత జాడకోసం చెట్టునీ, పుట్టలనీ పలకరించడం, భాషించడం కనిపిస్తుంది. 

           సీతమ్మ గంగనీ, గోదావరినీ నమస్కరించి మొక్కులు సమర్పించుకుంటుంది. పురాణాల్లో వనదేవతల గురించి చెబుతారు. ఒక వృక్షాన్ని నరికితే వనదేవత ఆగ్రహిస్తుందని, అనవసరంగా వృక్షాలు నరకరాదని హెచ్చరించారు. తప్పనిసరై చెట్టుని నరకవలసివస్తే చాలా ప్రాయశ్చిత్తాలు చెప్పారు.

           వనదేవతలూ, జలదేవతలూ, భూదేవతలూ.... ఇలా ఆరాధించే మనవారి ఔన్నత్యాన్ని అర్థం చేసుకొంటే జోహరులర్పిస్తాం. ఆ ఈ లోతును గ్రహించకుండా వీటిని మూఢనమ్మకాల కింద జమకట్టడం ఒక మూఢత్వం. ప్రకృతితో కలిసి బతకడం, ఆత్మీయతాబంధం ఏర్పరచుకోవడం తద్వారా ప్రకృతికీ ఒక ఆత్మఉందనీ, ఆ ఆత్మ మన మనసును గమనించి ఒక తల్లిలా మనల్ని కాపాడుతుందని భావించడం అసలైన మానవత్వానికి నిదర్శనం.

           నేల పచ్చదనంలో, నీటి చల్లదనంలో భగవానుని కరుణని దర్శించిన ధర్మస్పృహలో ఎంత ఉదాత్తత ఉంది!

          ఈ వారసత్వాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే భారతీయ భావనావైభవం సాక్షాత్కరిస్తుంది. పాలకులు, ప్రజలు కూడా ప్రకృతి హితాన్ని పాటించినప్పుడు ఈ కరవు కాటకాలు అసలు తలెత్తుతాయా? ..........             🙏.....

గురివింద (గురిగింజ) లతో ప్రయోజనాలు

 *గురివింద (గురిగింజ) లతో ప్రయోజనాలు*


గురివింద గింజల(గురిగింజలు)తో బోలెడు ప్రయోజనాలున్నాయి. కానీ, వీటి గురించి చాలా మందికి తెలీదు. చేసేది ఏమీ లేకున్నా గొప్పలు చెప్పుకునే వాడిని గురివిందతో పోలుస్తారని మీకు తెలుసా.. వీటిని బంగారం కొలువడానికి కూడా ఉయోగిస్తారు. గురువిందను లక్ష్మీదేవీ స్వరూపంగా కూడా కొలుస్తారట. గురవిదంలో ఆకుపచ్చ, తెలుగు, పసుపు, నలుపు రకాల్లో దొరకుతాయి. ఇది సాధారణంగా బయట కనిపించదు. కానీ, ఈ తీగ ఆకులు, కాండంలో మంచి ఔషధ గుణాలున్నాయి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.


గురివింద ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..

ఆయుర్వేదంలో గురివింద గింజలను పూర్వం నుంచే వాడుతున్నారు. ఈ గింజల పై పొట్టు తీసి లోపల గుజ్జును నువ్వుల నూనె కలుపుకోవాలి. పేనుకొరుకుడు సమస్య ఉన్న వారు ఈ ఆయిల్ అక్కడ రాస్తే వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. ఈ గింజల పొడిని గంధంతో కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాసినా మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ గింజల పొడితో ఇంట్లో పొగ వేస్తే దోమల సమస్య ఉండదు.

గురువింద చెట్టు ఆకులను మెత్తగా నూరుకుని రసం తీయాలి. దీనిని చెవిపోటు ఉన్నవారు రెండు చుక్కలు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఆకుల నుంచి తీసిన రసానికి చక్కెర కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. గురివింద ఆకులను తింటే బొంగురు గొంతు ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చు.



 

అంతేకాకుండా, గురివింద ఆకుల రసాన్ని తీసి చర్మంపై తెల్ల మచ్చలు ఉన్న చోట రాయాలి. ఒక 15 నిమిషాలు ఎండలో ఉన్నాక స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే తెల్లమచ్చలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో కలుపుకుని బాగా మరిగించాలి.ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని క్రమంగా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా, ఒత్తుగా మారుతాయి.

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది

 జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.

❂ కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.

❂ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.

❂ ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.


కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

❂ కరివేపాకు హైపర్గ్లైసీమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.

❂ లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది.

❂ కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.



శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం ఈ కరివేపాకులో ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది. నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. దీంతో అధిక బరువు సమస్యలు ఉండవు.


కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

❂ పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు.

❂ కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి.

❂ నికోటినిక్ ఆమ్లంతోపాటు విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ ఉంటాయి.