13, మే 2022, శుక్రవారం

మౌనం--వాక్ శుద్ధి**

 **మౌనం--వాక్ శుద్ధి**


                       ***


**మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి.*


*వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి.*


*కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం.*


*సాధన మీదే అది సాధ్యపడుతుంది.* *అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు.*


*మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు.* *మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు.* *ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం.* *ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.*


*ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు.*


*తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువు తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మనల్ని మనం సైలెంట్ గా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.*


*వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్నవాళ్లు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది. మంచి అయినా చెడు అయినా, వీరు అనగానే ఇట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజూ మాట్లాడుతూ, నోటికి చాలా పనికల్పిస్తుంటాం. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మన శరీర భాగాలకు కాస్త రెస్ట్ ఇవ్వడం కోసమే, పూర్వీకుల ఇలాంటి వ్రతాల్ని కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది.*


*వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమీ ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవడంతో పాటు, అనవరపు తగాదాల్ని అడ్డుకునే ఈ  మౌనవ్రతం, మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో అత్యవసరం.*


                      ***


*(వారానికి ఒకరోజైనా, పెద్దలు చెప్పిన మౌనవ్రతం పాటిస్తే మంచిది.)*


                       ***


          **ఇదం న మమ**


     **శుభప్రదమైన రోజు**


                     


 f


 

12, మే 2022, గురువారం

ఉపాధ్యాయ ఉవాచ'

 మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.


ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట. నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి? సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.

 

అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే. 


సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి 

వారిని గురించి ఆరా తీస్తాడు. ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని అనుకున్నాడు. 


ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.

 

ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు 

పడుతున్నారు కదా! స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకు తున్నాము కదా ! మరి !

 

తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా! వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం', "నిశ్చయం" అనడానికి "నిచ్ఛయం" అని పలుకుతున్నారు. మరి ఎలా ఒప్పుకుంటున్నారు? యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు. హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు. వినడానికి సొంపుగా వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.


పాఠశాలలో చదివేటప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి. ఇప్పుడు బుల్లితెరలో వార్తలు చదివేవారు ఆంగ్లములో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు. ఆచ్చర్యం, నిచ్ఛయం అంటూ తప్పుగా చదువుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.

 

ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠాలను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి. అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా ఉండాలో ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)

 

వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక చిత్తుడై యనుపమ భక్తితో చదువు నాతని వాచకుండండ్రు సద్బుధుల్


చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు. ఆ,ఈ వూ అని అనకూడదు. విసుగు చెందకూడదు. ఒక ప్రవాహం లాగా ఆవిరళంగా సాగాలి. అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందేమిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తి శ్రద్ధలతో చదివేవాడిని, మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు

 

ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది. ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా 

తెలియదు. చెప్పేవారు కూడా లేరు. ఉపాధ్యాయులు అలాగే వున్నారు, విద్యార్థులూ అలాగే వున్నారు. 

 

'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు, యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.


(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

మండోదరి

 రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుని మరణ వార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. 


రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన వాడు. అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. సత్యమైనా జీర్ణయించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది.


మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున వస్తుంది. మనసులో రాముని మీద కోపం. రాముని నిందించాలనే ఆత్రుత. రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై 

ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. 


రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుధ్ధ భూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. దూరం నుండి వస్తున్న మండోదరి 

యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించిందతనికి. 


ఎవరో తెలియదు కాని నీడను 

చూస్తే ఆ ఆకారం స్త్రీ మూర్తిదని అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీమూర్తి నీడ తన  నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు.  


ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీ పై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రాముని పై తనకున్న క్రోధం ఆమెలో మాయమయింది. 


యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. జయం అపజయం 

శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. 

డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. వ్యక్తుల నుండి 

విడదీసేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం 

అంటుంది రామాయణం. అలాంటి నాయక పాత్రకు ప్రతీక రాముడు.

 

అధమాః ధనమిచ్ఛంతి,

ధనం మానంచ మధ్యమాః

ఉత్తామాః మానమిచ్ఛంతి

మానోహి మహాతాం ధనం!

 

ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై , 

యత్నించే వారు, మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు 

సమాజంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు. మూడవ రకం ఉత్తములు అంటున్నారు, సుభాషిత కర్త.

 

ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం Result oriented attitude కాగా ధర్మ 

బధ్దమైన రీతిలో విజయం పొందాలనుకోవడం Process oriented attitude. గెలుపు 

ఇతరులపై సాధించేది కాగా విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది. గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. విజయంలో శాంతి ఉంటుంది. సౌమనస్యత  ఉంటుంది. ఇదే రామాయణం మనకు బోధించే నీతి.

పొడుపు పద్యము

 ……  పొడుపు పద్యము  …...

ఆ. అందమైన పలుకు కైదక్షరమ్ములు 

రెండు, నాల్గు, మూడు పండు గగును 

అరయచూడ సర్ప మాద్యంతములుగూడ 

పదము తెలుప వలయు పసిడి బాల..!

చేతితో భోజనం

 *🙏చేతితో భోజనం ఎంత ఉపయోగమో!?🙏*


*డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.*

*తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?*

*హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.*

*ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.*

*దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం..*

*చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.*

*అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం. ఇది చదివాక ఎక్కడున్నా…?*

*మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను*

*చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు......*


*1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.*


*2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.*


*3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.*


*4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.*


*6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.*


*7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.*


*8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.*


*9.చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది.*


*10.శుభ్ర౦చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు.*

*జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది.*

*ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది.*


*పురణాల పరంగా…*


*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.*


*బొటనవేలు:అగ్నితత్వం*


*చూపుడు వేలు:వాయుతత్వం*


*మధ్యవేలు:ఆకాశం*


*ఉంగరపు వేలు:భూమి*


*చిటికిన వేలు:జలతత్వం..*


*ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.*

*ఫ్యాషన్ కి ఇచ్చినంత విలువ ..సంస్కృతికి ఇస్తే ...మానవ జీవనం కొంత సరళమవుతుందనుకుంటా...*

మునివాహన సేవ’

 హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌.. ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన ‘మునివాహన సేవ’తో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించారాయన

నోబెల్‌ గ్రహీత దలైలామా ప్రశంసలూ అందుకున్నారు. ఆ సేవ వైపు తనని నడిపించిందేమిటో ఇలా చెబుతున్నారు....


"నా బాల్య జ్ఞాపకాలన్నింటా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలే పచ్చగా పరుచుకుని ఉంటాయి. 


తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే నాన్న సౌందర్‌రాజన్‌ ఉన్నత చదువులు చదివారు. కామర్స్‌ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగారు. 


మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. బడికి పెద్దగా నామాలు పెట్టుకునేవెళ్లేవాణ్ణి. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి. 


చిన్నప్పటి నుంచీ వైద్యరంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో నాకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. 


అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో ‘బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌’ తీసుకున్నా. చివరి ఏడాది థీసిస్‌ కోసం నేనూ నరేంద్రబాబూ అనే నా సహాధ్యాయీ కలిసి అతితక్కువ ఖర్చుతో తయారుచేయగల ‘సిరంజీ ఇన్‌ఫ్యూషన్‌ పంప్‌’ నమూనాని కనిపెట్టాం.


 డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీస్థాయిలో తయారుచేయాలనే కలతో నరేంద్రతో కలిసి ‘ఎన్‌ఆర్‌ బయోమెడికల్స్‌’ అనే కంపెనీ స్థాపించాను. 


మనస్పర్థలొచ్చాయి....


నరేంద్రతో నాకు చిన్నగా మనస్పర్థలు వచ్చాయి. తగవులు పడి విడిపోవడం ఇష్టం లేక ‘కంపెనీని నువ్వే చూసుకో’ అని చెప్పి నేను బయటకొచ్చేశా. అప్పుడే వైద్య పరికరాలు తయారుచేసే ‘మెడ్‌ ట్రానిక్స్‌’ సంస్థ నాకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది.


 చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. 


దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి పదిలక్షల రూపాయల జీతం! ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటుండగానే.. ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది. 


సర్కారు చట్టానికి నిరసనగా....


హైదరాబాద్‌ నగరానికి తాగునీళ్లిచ్చే ఉస్మాన్‌ సాగర్‌ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. 


ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవచేయడానికి తన శిష్యుణ్ణీ, అతని కుటుంబాన్నీ ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే మా పూర్వీకుడంటారు. తర్వాతికాలంలో ఔరంగజేబు ఆక్రమణకీ, రజాకార్ల దాడులకీ ఎదురొడ్డి ఈ ఆలయాన్ని కాపాడుకున్నాం. 


ఇప్పటికీ ఆ దేవుణ్ణి మా ఇంటి పెద్ద కొడుకుగానే మేమంతా భావిస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంది! 


నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీం కోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.


 మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది! అప్పుడు నాన్న మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. 


అప్పుడే ఓ అధికారి.. 

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా.. నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని! 


అల్లకల్లోలమే....


నాకప్పుడు 35 ఏళ్లు. ‘మెడ్‌ట్రానిక్స్‌’ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికీ హెడ్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అంత భవిష్యత్తున్న నేను ఇలా అర్చకవృత్తిలోకి రావాలనుకోవడం నాన్నకి అస్సలు ఇష్టంలేదు! కుటుంబంలో అల్లకల్లోలమే రేగింది. 


ఎవ్వరూ ఒప్పుకోలేదు. నేనూ నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు! రెండునెలల తర్వాత వాళ్లనెలాగోలా ఒప్పించాను. ఇక ఆఫీసులో అయితే నన్నెవరూ నమ్మలేకపోయారు. 


‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను! 


కొత్తదారిలో.. 

అర్చకుడిగా మారిన తొలిరోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం. 


ఏ ఆదాయమూ లేదుకాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేశాను. దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు 

ఎంతో నష్టపోయాయి.


 అందుకే ఆ చట్టంపై అన్నిరకాలా పోరాడుతున్నాను. 1990లకి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభైవేలమందిదాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నా.


 ఇవన్నీ కూడా నేను నమ్మే సనాతన ధర్మమనే చట్రంలోనే ఉండాలనుకున్నాను. సనాతన ధర్మమంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే. 


వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాల సారం అదేనని నేను నమ్ముతా! అందుకే నా వంతుగా ఇక్కడున్న సమస్యలూ, రుగ్మతలూ తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నా. 


‘ఇదంతా నటన’ 


ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని ‘కన్యావందనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టాను.


 ప్రతి ఏటా ఫిబ్రవరిలో మేం ఇది చేస్తున్నాం! అమ్మాయిల గొప్పతనం చాటేలా ‘మహలక్ష్మీ’ పూజ అనీ చేస్తున్నాం. ఆరోజు పెళ్లికాని అమ్మాయిలకి కొత్తబట్టలుపెట్టి కాళ్లకి పారాణి రాస్తాం. వీటన్నింటి ద్వారా గుర్తింపుపెరిగి టీవీలో ఏ చర్చాకార్యక్రమాలు చేస్తున్నా నన్ను పిలవడం మొదలుపెట్టారు. 


నా మాటలు టీవీల్లో ప్రసారం కాగానే ‘మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు. అవినీతిపరులు. మీవల్లే దళితులపైన వివక్ష’ అంటూ కుప్పలుతెప్పలుగా లేఖలు వచ్చేవి. ‘ఎవరో కొందరివల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా?’ ఈ మథనం నాలో చాలారోజులుగా ఉండేది. 


అంత అంటరానితనమా? 


గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజకని పిలిస్తే వెళ్లా. కార్యక్రమం తర్వాత నా దగ్గరకి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి ‘స్వామీ! ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి!’ అన్నాడు. 


నేను కోపంతో వణికిపోయా. గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశాను. అప్పుడే ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. నేను దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను. 


అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. అలా ఏప్రిల్‌ 17న ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లాను. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. 


దలైలామా మెచ్చారు....

 

నోబెల్‌ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన రోజుని మరచిపోలేను! నేను మాట్లాడిన కొద్దిసేపటికే ఆయనో పెద్ద సందేశం పంపారు. ‘మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు’ అంటూ సాగిందా లేఖ! 


ఇది నాకెంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లోకంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నాం. 


ఇది జరిగాక ప్రముఖ రచయిత కొలకలూరు ఇనాక్‌, కవి గోరటి వెంకన్న వంటివారు ఫోన్‌ చేసి అభినందనల్లో ముంచెత్తారు. ఆ మధ్య తిరుమలకి వెళ్లాను. నా గురించి అప్పటికే టీవీల్లో చూశారు కాబట్టి ఎంతోమంది జనం చుట్టుముట్టారు. 


అప్పుడో ముసలాయన తచ్చాడుతూ వచ్చి ‘మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబూ..!’ అంటూ వచ్చి ముద్దుపెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు! బొటబొటా కన్నీళ్లొచ్చేశాయ్‌!!


ఆ విలాసాలు వదులుకుంది...


"సుధని.. నేను ఇంటర్‌ చదివేటప్పుడు అహోబిల మఠంలో మొదటిసారి చూశాను. ఆమె అక్కడ ‘నృసింహప్రియ’ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. చూడగానే ప్రేమలో పడ్డానుకానీ మనసులో దాచుకున్నాను.


ఆ పత్రికకి ‘ఫల్గుణ’ పేరుతో కథలూ, వ్యాసాలు రాయడం మొదలుపెట్టా. 

ఇంజినీరింగ్‌ ముగించాక ఇంట్లో విషయం చెప్పాను. వ్యతిరేకత లేదుకానీ.. పూర్తిగా అంగీకరించినట్టూ కాదు. ఎట్టకేలకు పెళ్ళైంది.


మాకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి ఏడేళ్లున్నప్పుడు అర్చకవృత్తిలోకి వెళ్లిపోతున్నానని చెప్పాను.  ‘బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నావా..!’ అని పదేపదే అడిగింది. 


అర్చకుడిగా నా ఆహార్యం, రోజూ దేవుడికిచ్చిన నైవేద్యం మాత్రమే తినడం.. నన్ను చూసి వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. 


ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. మా పెద్దోడు సీఏ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. 


వీటన్నింటి వెనక నా భార్య ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం ఇచ్చే విలాసాలు వదులుకుని భర్తవెంట నడవాలంటే ఎంత కృతనిశ్చయం ఉండాలో కదా! తన అంగీకారంతోనే, ఆ మధ్య నా ఇద్దరి పిల్లల్లో ఒకర్ని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం కూడా తీసుకున్నా!".....

రక్తదోషము

 రక్తదోషము నివారించి రక్తశుద్దిని కలిగించు దేశివాళి  టీపొడి తయారీ విధానం  - 


    నీడలో ఎండించిన పుదీనా ఆకు 200 గ్రాములు , మంజిష్ట చూర్ణం 50 గ్రాములు , మిరియాల చూర్ణం 10 గ్రాములు మోతాదులో సేకరించి వీటన్నింటిని కచ్చాపచ్చాగా చూర్ణం చేసుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకుని ఈ చూర్ణమును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు 5 గ్రాముల మోతాదులో తీసుకుని పావులీటరు నీటిలో మరిగించి వడపోసి దానియందు తగుమాత్రము పాలు , పంచదార కలిపి టీకి బదులుగా ఈ పానీయం సేవించుచుండిన రక్తము శుభ్రపడి దుష్టరక్తము వలన కలుగు వ్యాధులు సమూలంగా అంతరించును. ముఖ్యముగా చర్మవ్యాధుల వారికి బాగా ఉపయోగపడును. 


           పైన చెప్పిన దేశివాళి టీపొడి తయారుచేసుకొని మామూలు టీ పొడి బదులు వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


   

          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాలక్షేపంకబుర్లు

 శర్మ కాలక్షేపంకబుర్లు - కడవంతగుమ్మడి కాయ…….


ఛురికాకూష్మాండన్యాయం


”కడవంతగుమ్మడి కాయ కత్తిపీటకి లోకువ” అంటారు, అదే ఇది. ఛురిక అంటే చాకు కూష్మాండం అంటే బూడిద గుమ్మడి కాయ. చాకు చిన్నదే కాని చాలా పెద్దదయిన గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా నరకగలదు. దీనిబట్టి తెలిసేది ఆకారం, పరిమాణం కాదు ప్రధానం. మిరియపుగింజ, మిరపగింజ ఎంత ఉంటుంది? కొరికితే? అదనమాట సంగతి.ఏనుగు ఎంత పెద్దదయినా అంకుశానికి లొంగినట్లు మరోమాట చిన్న ఉదాహరణ ఆయనో పెద్ద రచయిత, గజారోహణం చేయించారు, కాని ఇంటి దగ్గర ఇల్లాలు మాత్రం కూరలో కరివేపాకులా తీసిపారేస్తుంది. ఆ( ఏనుగెక్కించి ఒక సారి ఊళ్ళో తిప్పి ఒక శాలువా కప్పేరు, అది కూటికా గుడ్డకా అని విదిలిస్తుంది, పాపం కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకి లోకువే కదా! 


 సేకరణ : సుధాకర్ కురువాడ

11, మే 2022, బుధవారం

*రైల్వే సమాచారం

 *రైల్వే సమాచారం*

 🚂🚂🚂🚂🚂🚂🚂

 =====================

 *జూలై 1 నుండి* రైల్వే యొక్క ఈ 10 నియమాలు మార్చబడ్డాయి ....

 =====================

 *1*) వెయిటింగ్ లిస్ట్ యొక్క ఇబ్బంది ముగుస్తుంది.  *రైల్వే నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణీకులకు ధృవీకరించబడిన టికెట్ల సౌకర్యం ఇవ్వబడుతుంది.*

 ...................................

 *2*) జూలై 1 నుండి *తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.*

 ...................................

 *3*) జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో మార్పు ఉంది. *ఎసి కోచ్ కోసం ఉదయం 10 నుండి 11 వరకు టికెట్ బుకింగ్ చేయగా, స్లీపర్ కోచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు బుక్ చేయబడుతుంది.*

 ...................................

 *4*) జూలై 1 నుండి రాజధాని మరియు శతాబ్ది రైళ్లలో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యం ప్రారంభించబడుతోంది. ఈ సౌకర్యం తరువాత, శతాబ్ది మరియు రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, *బదులుగా టికెట్ మీ మొబైల్‌లో పంపబడుతుంది.*

 ........................

 *5*) త్వరలో రైల్వే టికెటింగ్ సౌకర్యం వివిధ భాషలలో ప్రారంభం కానుంది.  ఇప్పటివరకు, రైల్వేలలో హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి, *కానీ కొత్త వెబ్‌సైట్ తరువాత, ఇప్పుడు టికెట్లను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.*

 ......................

 *6*) రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ పోరాటం ఉంటుంది.  ఇలాంటి పరిస్థితుల్లో *జూలై 1 నుంచి శాతాబ్ది, రాజధాని రైళ్లలో బోగీల సంఖ్య పెరుగుతుంది.*

 ......................

 *7*) ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు *ముఖ్యమైన రైళ్ల రద్దీ సమయంలో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రణాళిక చేయబడ్డాయి.*

 ......................

 *8*) జూలై 1 నుంచి *రాజధాని, శాతాబ్ది, దురోంటో, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాల్లో సువిధ రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతుంది.*

 ........................

 *9*) జూలై 1 నుండి రైల్వే ప్రీమియం రైళ్లను పూర్తిగా ఆపబోతోంది.

 ......................

 *10*) సువిధ రైళ్లలో *టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీలు తిరిగి ఇవ్వబడతాయి.*  ఇది కాకుండా, ఎసి -2 లో రూ .100, ఎసి -3 పై రూ .90 /, స్లీపర్‌లో ప్రయాణీకుడికి రూ .60 / - తగ్గించబడుతుంది.

 ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేస్తారు

 ........................................

 *రైలులో నిర్లక్ష్యంగా నిద్రించండి*, మీ గమ్యం స్టేషన్ వద్దకు వచ్చే కొద్ది సమయంలోనే రైలు యాప్  మేల్కొపుతుంది ....

 =====================

 మీరు 139 కు కాల్ చేసి మీ పిఎన్‌ఆర్‌లో *వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని సక్రియం చేయాలి.*

 ...................................

 గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునే ముందు రాత్రి రైలులో ప్రయాణించే *ప్రయాణికుల కోసం రైల్వే వేకప్ కాల్-డెస్టినేషన్ హెచ్చరిక సౌకర్యాన్ని ప్రారంభించింది.*

 .........................

 *గమ్యం హెచ్చరిక అంటే ఏమిటి*

 =====================

 > ఈ సదుపాయాన్ని *గమ్యం హెచ్చరిక* అని పేరు పెట్టారు.

 =====================

 సౌకర్యాన్ని సక్రియం చేసినప్పుడు, *గమ్యం స్టేషన్ రాకముందే మొబైల్‌లో అలారం వినిపిస్తుంది.*

 ........................

 > ఈ సదుపాయం పొందటానికి,

 ...................

 *హెచ్చరిక* అని టైప్ చేసిన తరువాత

 ...................

  *పిఎన్‌ఆర్ నంబర్* టైప్ చేసి

  139 కు పంపండి.

 ...................

 > 139  కాల్ చేయాలి *.

 *కాల్ చేసిన తరువాత, భాషను ఎంచుకుని, ఆపై 7 డయల్ చేయండి.*

 ...................

 *7 డయల్ చేసిన తరువాత, పిఎన్ఆర్ నంబర్ డయల్ చేయాలి *ఆ తరువాత ఈ సేవ మొదలు అవుతుంది.

 ...................................

 > ఈ సదుపాయానికి *వేక్-అప్ కాల్* అని పేరు పెట్టారు.

 ......................

 అది మీరు మొబైల్ లిఫ్ట్ చేసే వరకు *మొబైల్ బెల్ మోగుతుంది.*

 ......................

 ఈ సదుపాయం మీరు ఉపయోగించితే, స్టేషన్ రాకముందే మొబైల్ గంట మోగుతుంది.  మీరు ఫోన్‌ను స్వీకరించే వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది.  ఫోన్ అందిన తరువాత, స్టేషన్ రాబోతున్నట్లు ప్రయాణికుడికి సమాచారం ఇవ్వబడుతుంది.

 ........................................

 🙏🏻 *దయచేసి ఈ సందేశాన్ని అందరికీ పంపండి.*

రతి దుఃఖము - దేవతల ఊరడింపు

 వైశాఖ పురాణం - 11

11వ అధ్యాయము - రతి దుఃఖము - దేవతల ఊరడింపు


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్ర్హస్పతి యింద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి యిట్లనిరి.


కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువునర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!


ఓం నమః శివాయ

శివాష్టకం

 *శ్రీ ఆదిశంకరాచార్య కృతం శివాష్టకం*



*1) తస్మై నమః పరమకారణకారణాయ!దీప్తోజ్జ్వలజ్వలితపిఙ్గలలోచనాయ!!*


*నాగేన్ద్రహారకృతకుణ్డలభూషణాయ!బ్రహ్మేన్ద్రవిష్ణువరదాయ నమః శివాయ!!*



*2) శ్రీమత్ప్రసన్నశశిపన్నగభూషణాయ! శైలేన్ద్రజా వదన చుమ్బితలోచనాయ!!*


*కైలాసమన్దిరమహేన్ద్రనికేతనాయ!లోకత్రయార్తిహరణాయ నమః శివాయ!!*



*3) పద్మావదాత మణికుణ్డల గోవృషాయ! కృష్ణాగరుప్రచుర చన్దనచర్చితాయ!!*


*భస్మానుషక్తవికచోత్పలమల్లికాయ!*

*నీలాబ్జకణ్ఠసదృశాయ నమః శివాయ!!*



*4) లమ్బత్సపిఙ్గల జటాముకుటోత్కటాయ!దంష్ట్రాకరాలవికటోత్కటభైరవాయ!!*


*వ్యాఘ్రాజినామ్బరధరాయ మనోహరాయ!త్రైలోక్యనాథ నమితాయ నమః శివాయ!!*



*5) దక్షప్రజాపతి మహామఖ నాశనాయ*

*క్షిప్రం మహాత్రిపుర దానవఘాతనాయ!!*


*బ్రహ్మోర్జితోర్ధ్వగకరోటినికృన్తనాయ! యోగాయ యోగనమితాయ నమః శివాయ!!*



*6) సంసారసృష్టి ఘటనా పరివర్తనాయ! రక్షః పిశాచగణసిద్ధసమాకులాయ!!*


*సిద్ధోరగగ్రహ గణేన్ద్రనిషేవితాయ!శార్దూల చర్మ వసనాయ నమః శివాయ!!*



*7) భస్మాఙ్గరాగ కృతరూప మనోహరాయ! సౌమ్యావదాతవనమాశ్రితమాశ్రితాయ!!*


*గౌరీకటాక్ష నయనార్ధ నిరీక్షణాయ!*

*గోక్షీరధారధవలాయ నమః శివాయ!!*



*8) ఆదిత్య సోమవరుణా నిలసేవితాయ!యజ్ఞాగ్నిహోత్రవరధూమనికేతనాయ!!*


*ఋక్సామవేద మునిభిః స్తుతి సంయుతాయ!గోపాయ గోపనమితాయ నమః శివాయ!!*



*శివాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ! శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥*



*ఇతి శ్రీ ఆది శంకరాచార్య కృతం శివాష్టకం సమ్పూర్ణమ్!!*

తిరుమల దర్శనం RTC ప్రకటన :

 తిరుమల దర్శనం RTC ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.

తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.

కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

నాకెక్కడ దాపురించావురా

 నాకెక్కడ దాపురించావురా, కాలుమడిచేందుకు కూడా వెళ్ళనివ్వవు.

........................................................


ఈ క్రింది పదాలకు అర్థాలు ప్రయత్నించగలరు.


(౧) పర్ణశాల =  


(౨) నిటలాక్షుడు =  


(౩) దిమ్మరి =  


(౪) కూరిమి =  


(౫) ఆగరా బాబూ కాల్మడిచి వస్తా -  కాల్మడిచి అంటే   


(౬) అంతలంపటెందుకు లో  లంపటము =  


(౭) రక్తసిక్తమైన రహదారులు లో  సిక్తము =  


(౮) పాండవబీడు =  


(౯) కరదీపిక -  


(౧O) ఉత్థానపతనాలు =


(౧౧) ఆటపట్టు =  


(౧౨) అనుశ్రుతి =  


 (౧౩) అజగరము =  


 (౧౪) క్షణభంగురము =


( ౧౫ ) బేవారసు= 


 (౧౬) బావురుపిల్లి= 


 (౧౭) కౌపీనము =  


( ౧౮) పుట్టచెండు =


 (౧౯) దాపరించు =  


(౨O) నీ కిటుకు తెలిసిందిలే. కిటుకు =  


........................................... జిబి విశ్వనాథ, 9441245857, అనంతపురము.

ధర్మో రక్షతి రక్షితః

 శ్లోకం:☝️ధర్మో రక్షతి రక్షితః

*ధర్మ ఏవ హతో హంతి*

   *ధర్మో రక్షతి రక్షితః l*

*తస్మాద్ధర్మో న హంతవ్యో*

   *మానో ధర్మాహతో వధీత ll*


భావం: చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది.

రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది.

కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి!🙏

నన్ను కన్నరోజు

 🕉️ *నన్ను కన్నరోజు (ఓ కథ)*

 

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది.*


 *ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 


 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 


 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడు గారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 


 *“అమ్మా! పది రోజుల* *మందునుండి చెప్తున్నా. ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 


 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది.*


*పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..*


*ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు. కాని తన ధోరణిలో మార్పు రాలేదు.*


*“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”*


*“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం.*


 *అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.*


 *వాళ్లను నేనేమీ అనడం లేదు, కాని ఈ ఒంటరితనాన్ని కాదు గాని, ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను.*


 *మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.*


*“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.*


*“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది.*

*****


*సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది.* *అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు.* 

*వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి, అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు.*


 *తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది.*


 *“అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు.*

*కదా నాన్నగారు?” అని అడిగింది.*


*అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.*


*మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు, ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు.*


 *ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా..*


*భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.* 

*****

*మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు.*


 *వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు.*


 *అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు.*


 *సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.*

*పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.*


*కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.*


*మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని..*


 *అయోమయంగా కూతురివైపు చూసింది.*

*భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది..*


 *“అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ, నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి?*

*అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..*


*అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.*

*అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్...* *మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..*


*సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..*

*సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది.*


*భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.*

  

*కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు*.


*అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే..*


 *అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ*.


 *కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి...*


 *ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.*


*సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.*


*“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు..*

 

*“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని.*


*“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..*


*భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.*


*“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను.*


 *కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.*

*పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి.*


*కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు.*


 *తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే..*


*మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది.*

 

*కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.*

*భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని.*


 *ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.*


*ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది.*


 *సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.*


*తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు..*


*“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.*


*“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది.*


*పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.*


*సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.*


*అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.!


*************************************************


నా స్పందన:


అద్భుత ఆలోచన … ఊహించని జన్మదినం … 

ఎంత గొప్పగా అనిపించిందో, మిత్రమా!


నిజంగా … ఇదో గొప్ప టర్నింగ్ పాయింట్!


జన్మదినమంటూ పుట్టినవారే చేసుకోవడం తప్ప … 

కన్నవారు ఏం సంబంధమన్నట్టు చేసుకున్న ఇన్నాళ్ళ పుట్టినరోజుల్నీ మరిపింపజేశారుగా?


సూపర్భ్ థాట్!


రచయిత ఎవరో తెలీదు … 

చాలా గొప్ప క్రియేటివ్ థాట్!


హ్యాట్సాఫ్ ఫర్ హిజ్/హర్ రైటప్!