శర్మ కాలక్షేపంకబుర్లు - కడవంతగుమ్మడి కాయ…….
ఛురికాకూష్మాండన్యాయం
”కడవంతగుమ్మడి కాయ కత్తిపీటకి లోకువ” అంటారు, అదే ఇది. ఛురిక అంటే చాకు కూష్మాండం అంటే బూడిద గుమ్మడి కాయ. చాకు చిన్నదే కాని చాలా పెద్దదయిన గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా నరకగలదు. దీనిబట్టి తెలిసేది ఆకారం, పరిమాణం కాదు ప్రధానం. మిరియపుగింజ, మిరపగింజ ఎంత ఉంటుంది? కొరికితే? అదనమాట సంగతి.ఏనుగు ఎంత పెద్దదయినా అంకుశానికి లొంగినట్లు మరోమాట చిన్న ఉదాహరణ ఆయనో పెద్ద రచయిత, గజారోహణం చేయించారు, కాని ఇంటి దగ్గర ఇల్లాలు మాత్రం కూరలో కరివేపాకులా తీసిపారేస్తుంది. ఆ( ఏనుగెక్కించి ఒక సారి ఊళ్ళో తిప్పి ఒక శాలువా కప్పేరు, అది కూటికా గుడ్డకా అని విదిలిస్తుంది, పాపం కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకి లోకువే కదా!
సేకరణ : సుధాకర్ కురువాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి