15, జనవరి 2023, ఆదివారం

సంక్రాంతి

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

             *సంక్రాంతి పర్వము*

శా.

దుష్కర్మౌఘము భోగిమంటఁ బడుచున్ తోడ్తోడ నిఱ్ఱింకగా 

నిష్కామంబె మనోవిలాసమవగా నిత్యానందమయ్యెం దగన్ 

శుష్కాచారవిదూరధీరమతులై శోభించ భూవాసులున్ 

నిష్కర్షం జనె భోగి త్రోవ నిడుచున్ నేస్తమ్ము సంక్రాంతికిన్ 

సీ.

రంగవల్లులలోన లలన పేర్చిన గొబ్బి 

         రక్షణై నిలువ సంక్రాంతి వచ్చె 

హరిదాసుసంకీర్త నాలాపముల మ్రోల 

         గమకమ్ము నిండ సంక్రాంతి వచ్చె 

ఆలకొమ్ముల నిండ నలదు రంగులతోడ 

          లలితమై వెలుగు సంక్రాంతి వచ్చె

పొంగళ్ళు పొంగించ నంగనామణులెల్ల 

          కమనీయమైన సంక్రాంతి వచ్చె

తే.గీ. 

కూతురల్లుళ్ళు సంతుతో కోరి రాగ 

క్రొత్తజంటల వేడ్కలు కొసరి వచ్చె 

తెలుగు లోగిళ్ళ సంక్రాంతి తీర్చవచ్చె 

సంబరములెన్నొ గుమిగూడి సందడించ 

సీ.

ఆవుదూడల పిల్పు లార్తినిండిన మార్పు 

          రైతుబంధువె వేల్పు ప్రగతితాల్పు 

ఏడాది కృషి వెంట ఇంట జేరిన పంట 

          ఆరుగాలము కంట నంటి యుంట 

నందిరాజులబృంద మందెవేసి చంద 

          మందగించగ వంద వందనములు 

అన్నదాతలు వార లన్ని కాలములందు 

          నెన్న నౌనే చిన్న వెన్ని యైన 

తే.గీ.

మకరసంక్రాంతి వేళలో నికరమైన 

యుత్తరాయణ పర్వాన నుత్తముండు 

రైతు మారాజు రసరాజు రాజరాజు 

నతని కృపయె పర్వమ్ము గతియు మనకు 

*~శ్రీశర్మద*

మీరొస్తారని

 మీరొస్తారని...


నీ తల్లికి దూరమాయే

నీ ఊరుకి దూరమాయే

నీ తల్లి కన్నీరాయే

నీ ఊరు సిన్న బోయే.


నినుగన్న తల్లి పెంచేలే

పుట్టిన ఊరు బలమునిచ్చేలే

అమ్మను మరిచి

ఊరమ్మను వదిలావా.


పల్లెలోని ఇళ్లు బోసిపోయాయి.

ముసలి కాళ్ళు ఈడుస్తుంటే

రచ్చబండ రాయిలా

కనిపిస్తుంటే... 

ఏమయ్యి పోయావు

నీవు మరిచిపోయావా...


బాల్యమంత ఆడి పాడావా

చెరువులు మావే అన్నావా

కుంటలు మావే అన్నావా

పొలంగట్ల పైన ఆటలాడావా

పల్లెతల్లి ఒడిలో బిడ్డలయ్యారా.


పండగ రోజున అందంగా దిద్దావా

సంకురాతిరి సంబరం జేశావా

మట్టి బొమ్మలను పూజించావా

ఊయల పండగ ఊరేగేవా


వరసలు పెట్టి పలికి

అక్కాబావంటు

అత్తమామంటు

కూతురా కోడాల అంటూ

పిలుచు కున్నారా.


పొలాన ఏరువాక పండగ చేసావా

పంటకు కోతలు నూర్పులు జేసావా

పండిన పంటలు ఇంటముందు 

ధాన్యపు సిరులు జేసి

పల్లె పండగ జరిపారా.


పట్నం మోజులో

పల్లె విడిచి పరుగులు పెట్టి

వెళ్ళి పోయావా

బ్రతుకే భారమైయిందా...

నన్ను మరచి పోయావా.


బస్తీలో బందీ ఆయ్యావా

ఒంటరి బతుకు బ్రతికేవా

నీవు దూరంగా ఉంటేను

అమ్మ అల్లాడి పోతుందో.


కొడుకా కొమరయ్య

బిడ్డా లచ్చమ్మ 

పల్లెమ్మను నేనున్నా

సేద తీర రారండో...

నా చెంతన చేరండో...


అమ్మను మరువకు

ఊరమ్మను మరచకు

ఎదురు చూపులు

చూస్తున్నాము..



మీరొస్తారని....!


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

నేనే బాలాజి

 నేనే బాలాజి 


పరమాచార్య స్వామి వారు అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం. ఒక జమీందారు(సంపన్నుడైన భూస్వామి), స్వామి వారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమి లోపం రాకుండా స్వామివారి నిత్య అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు.


ఆ యువకుని పేరు పవార్. ఆ యువకుడు స్వామివారు అక్కడున్నన్ని రోజులు స్వామి వారికి అనన్యమైన సేవ చేసాడు. పరమాచార్య స్వామి వారు ఆ యువకుని భక్తికి, సేవానిరతికి ఎంతో ఎంతో ప్రీతి చెందారు. అక్కడి విడిది ముగియ బోతుండగా, స్వామి వారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో, “ఈ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళనా?” అని అడిగారు. ఆ భూస్వామి చాలా సంతోషించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గర పనిచేసే సేవకుడు, మహాస్వామి వారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు. పరమాచార్య స్వామి వారిని సేవించబోతున్నాడు. 


వెంటనే ఆ భూస్వామి, “సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి. అతని కుంటుంబాన్ని నేను చూసుకుంటాను. వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను. కాబట్టి అతను తన కుంటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు” అని అన్నాడు. ఆనాటినుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు.


శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యములు లేని చోట చేసారు. అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు. అన్న పానాదులు ఎవరికి లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మమాస్వామి వారి ఆజ్ఞ. మఠంలో పనిచేసేవారికి ఎవరికి భోజనం తక్కువ కాకూడదు.


అందరూ భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు వచ్చి, ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు. అందరూ తిన్నామని చెప్పారు. చివరగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు.


అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామి వారు సైగలతో అడిగారు. కాని అతను దీనంగా లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. మహాస్వామి వారు వెంటనే మఠం మేనేజరును పిలిచి, “ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు? అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు. కనీసం తిన్నావా? అని అయినా అడిగావా? మీరందరూ తినేసి, వంట వార్పు ఆపేసారు. ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏమి దొరుకుతుంది?” అని అడిగారు. 


స్వామి వారు చాలా కోపంగా మేనేజరుని మందలించారు . తరువాత మేనేజరు మహాస్వామి వారితో పవార్ కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. 


కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్ లో ఒక క్యారేజితో అక్కడికి వచ్చాడు. ఇంకా ఇక్కడ గుడారాలలో వెలుగు కనపడడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వారు అతన్ని వివరములు అడుగగా, అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తిసుకుని వెళ్తున్నానని, దార్లో వెళ్తూ స్వామి వారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు. వెంటనే పరమాచార్య స్వామి వారు ఆ వ్యక్తితో పవార్ ను చూపిస్తూ, “నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికివ్వగలవా?” అని అడిగారు. అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామి వారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాతవ్యక్తిని అర్థిస్తున్నారు. 


వెంటనే ఆ వ్యక్తి, “ఈ క్యారేజిలో ఆహారం ఉంది. అతన్ని తినమనండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను” అని క్యారేజిని ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు దాన్ని తెరవగా అందులో ఉత్తరభారతీయుల అహారమైన వేడి వేడి చపాతీలు, కూరగాయల సబ్జి ఉన్నది. స్వామి వారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు. తన కోసం ఇలా ఎవరినో మహాస్వామి వారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఎప్పుడూ మళ్ళా ఆ క్యాంపు వైపు కాని రాలేదు. కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజి తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు. 


పవార్ కు మహాస్వామి వారే ప్రపంచంలా మారిపోయింది. మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు. పరమాచార్య స్వామి వారు మేనాలోనికి(అందులోనే స్వామివారు నిద్రపోయేవారు) వెళ్ళేవరకు అన్నీ తానై సేవించేవాడు. అన్ని అవసరాలని తీర్చేవాడు. 


కొన్ని సంవత్సరాల తరువాత పవార్ కుటుంబం స్వామి వారి దర్శనానికి కాంచీపురం వచ్చింది. కొన్ని రోజులు ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళి శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు. పవార్ వచ్చి స్వామి వారికి వారి కోరిక తెలుపగా “సంతోషంగా వెళ్ళి రమ్మను” అని చెప్పారు. 


మనసులో పవార్ కు కూడా తన కుటుంబంతో వెళ్ళాలని ఉంది. దానికి మహాస్వామి వారి ఆశీస్సులు, అనుమతి కావాలి. అదీకాకుండా తను వాళ్ళతో వెళ్తే స్వామివారి అవసరాలని ఎవరు చూసుకుంటారు. కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్ళి వద్దామని స్వామి వారిని అనుమతి అడిగాడు. 


స్వామివారు అతనితో, “నీకు బాలాజిని చూడాలని ఉందా? సరే వాళ్ళతో కూడా వెళ్ళు” అని సెలవిచ్చారు. పవార్ చాలా సంతోషించాడు. 


స్వామివారు మేనాలొనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూయడం, ఉదయాన్నే స్వామి వారికంటే ముందే మేల్కొని మేనా తలుపులు తీయడం పవార్ కి దినచర్య. ఆరోజు ఉదయం పవార్ మరియు అతని కుటుంబం తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. 


రోజూలాగే అరోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చెయ్యవలసిన పనులన్ని చేసి తిరుమలకు వెళ్దాము అనుకున్నాడు. తెల్లవారగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి స్థాణువై భక్తితో కన్నుల నీరు కరుతుండగా స్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. అతనికి మేనాలో స్వామి వారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసునిగా దర్శనమిచ్చారు. 


మహాస్వామి వారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా, ఆ చూపులలో “నీకు తెలియదా నీ బాలాజి ఇక్కడే ఉన్నాడు అని” అన్నట్టు తోచింది పవార్ కు. కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు. చిన్నగా స్వామివారిని చూస్తూ, ”నేను వారితో తిరుమల వెళ్ళడం లేదు” అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు.


పవార్ తన మనసులో “అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవునికోసం వేరేచోట వెదకడం ఎందుకు?” స్వామివారికి ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు. వారు త్రికాలవేదులు, కాలాతీతులు.


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

సమాజం లో మనిషి

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

*Man is a social animal అన్నారు*...


*సమాజం లో మనిషి అంతర్భాగం.*

*సమాజం లేకపోతే మనిషి లేడు.*

*మనుషులు లేకుండా సమాజం లేదు*...


*ఎప్పుడూ సమాజాన్ని విమర్శించుకుంటూ పొతే*

*నీ మంచిని గుర్తించేవారు ఎవ్వరూ ఉండరు*...


*ఇతరులతో సంబంధం లేకుండా,*

*నేనొక్కడినే ఏదయినా సాధిస్తాను.*

*నేనొక్కడినే బతుకగలను అనుకుంటే అది భ్రమ.*...


*అందరితో కలిసిమెలిసి జీవించాల్సిన బాధ్యత మన అందరిదీ.*


*ఎవరో మారాలి అనుకునే ముందు,*

*మనం అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి*...


*మారదు లోకం అనుకునే ముందు,*

*మనం మారి ప్రయత్నం మొదలుపెడదాం*....


మన అభివృద్ధికి తల్లితండ్రులు,

తోడబుట్టిన వారు, తోడువచ్చిన వారు,

సమాజం అందరూ త్యాగాలు, ప్రోత్సాహం ఇస్తేనే ఈ స్థాయికి వచ్చాము...


*వారందరికీ కృతజ్నులమై ఉందాము*...


*అభివృద్ధికి అందరూ కారణమయితే*,

*నీ పతనానకి కారణం నువ్వే అవుతావు* ...


" #ఏంటో జనాలు వున్న time🕰️ వేస్ట్ చేసుకుంట... దేనికైనా time రావాలి అంటారు".ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి time ఎవ్వరి వెనకాలరాదూ time ఎవ్వరికోసం రాదూ మనమే time తో పాటు వెళ్ళాలి time పని time చేస్తుంది మనమే time వస్తుంది ani ఏమి చెయ్యకుండా time కోసం చూస్తున్నాం  time నమ్ముకోవద్దు మిమల్ని మీరు న్నముకోండి time 🕰️కన్నా ముందుకు వెళ్తారు🏃‍♂️

సంక్రాంతి వెనుక

 _*సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... 


- పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! 


- సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


- కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


- సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది._*సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... 


- పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! 


- సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


- కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


- సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.      *సేకరణ : - నిమ్మగడ్డ శ్రీధర్*

ఈ శ్వేత పత్రంపై

 ఈ శ్వేత పత్రంపై!....


పౌష్య మాసాన!

మకర రాశిలో!

భానుడి ప్రవేశకాలాన!

సంరంభంతో!

ఆరంభంగా!

విచ్చేసిందీ!

ఉత్తరాయణ పుణ్య కాలం!

పితృ దేవతలను స్మరించు కాలమై!

దేవతలకు అత్యంత ప్రీతి పాత్రమై!

విప్రులకు సైతం!

విరివిగా కూష్మాండముల దానమిడు కాలమై!

ముష్కురులంతా కుక్కుటముల కదనరంగములకంపు కాలమై!

గోవుల, వృషభములకు!

పూజ లిడు కాలమై!

పతంగుల ఎగరేసే కాలమై!

ముదితలు ముంగిట 

ముగ్గులిడి గొబ్బెమ్మల పెట్టు వేళ!

పుడమి లోని చెడు నంతా!

భోగి మంటల రూపంలో!

చలి కాచు కొను వేళ!

బసవడు గంగిరెద్దై!

మంచిని ఆహ్వానిస్తూ!

పండుగ పరమార్థాన్ని చాటుతూ!

ప్రతీ ముంగిటా నర్తించే వేళ!

దాసు హరి నామ కీర్తనలతో!

జగతిని రంజింప చేయు వేళ!

ఇల్లిల్లూ మామిడి తోరణాలతో!

ముస్తాబైన వేళ!

రైతన్న ఇంటికీ సస్య లక్ష్మి!

వేంచేసిన వేళ!

కొత్త బెల్లం,కొత్త బియ్యం, ముర్రు పాలతో!

కాసింత మురిపాలనూ రంగరించి పొంగలిని సేయు వేళ!

రాజన్న,రైతన్న, కార్మికులకే కాక!

దేశ ప్రజలందరికీ!

మూర్తి త్రయ సంకేతమై!

భోగి,సంక్రాంతి,కనుమల రూపంలో!

ఇమ్మహి సుభిక్షం చేయగ!

ముదమ్ కూరుస్తూ!

అంబరాన్నంటేలా!

ఈ సంబరాన్ని జరుపు కోండంటూ!

నా మది ముంగిట నిలిచి!

రస హృదయులైన!

మిమ్మందరి నీ!

మురిపించాలని!

ఈ శ్వేత పత్రంపై కవితై!

విచ్చే సిందీ! పౌష్య హేమంత!

మకర సంక్రాంతి లక్ష్మి!


ఎస్.ఎన్.మూర్తి. దోసపాటి.

సామర్లకోట.

9866631877

దేశ భక్తురాలు

 ’నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-


 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని గునుపూడి లో 30-9-1860 న వేలూరి లక్ష్మీ నారాయణ ,వెంకమ్మ దంపతులకు 14వ చివరి సంతానంగా కనక మహాలక్ష్మమ్మ పుట్టింది .తండ్రి సంస్కృత,ఆంధ్రాలలో మహా పండితుడైన శ్రోత్రియుడు ,పరమ చా౦దసుడు .యజ్ఞం చేసి సోమయాజి అయినవాడు .ఆయిదవ ఏటనే కూతుర్ని40ఏళ్ళ కోటమర్తి సూర్యనారాయణకు ఇచ్చి వివాహం చేశాడు .లోకజ్ఞానం లేని ఆ అమాయక పిల్ల పెళ్ళిలో పేచీలు పెడితే మొగుడే ఎత్తుకొని ఆడించి లాలించాడు .అగ్రహారీకుడు సిరి సంపదలతో తులతూగుతున్న భర్త, మామగార్ని మించిన పరమ ఛాందసుడు .కానీ మహా పండితుడు. ఆఇంట నిత్యం పురాణపఠనాలు,సత్కాలక్షేపాలు జరిగేవి .ఇవన్నీ వింటూ ఆమెకు రామాయణ భాగవత భారతాలు కొట్టిన పిండి అయ్యాయి. అన్నీ వాచో విధేయాలయ్యాయి .ధారణా శక్తి అమోఘం కనుక ఆమెకు రానిశ్లోకం పద్యం ఉండేవికావు .పుట్టింటి లోని సంగీతం వంటబట్టిపద్యాలు శ్లోకాలు రాగయుక్తంగా ,ఇంపుగా ,అనర్గళంగా పాడుతూ వినే వారిని మైమరపించేది .స్వయం గా పద్యాలు ,పాటలూ రాసి౦ది కూడా ..తనకు తెలిసిన విషయాలను సులభంగా అర్ధమయేట్లు కధలు గా చెబుతూ తగినట్లు పద్య శ్లోకాలుభావ గర్భితంగా పాడుతూ శ్రోతలను రంజింపజేసేది .30ఏళ్ళ వయసులో అయిదుగురు బిడ్డల తల్లి అయింది ,ఆరవ బిడ్డ పుట్టటానికి నెల రోజుల ముందే భర్త మరణించటం వలన వైధవ్యం ప్రాప్తించింది . పుట్టింటికి భీమవరం చేరింది .కాని పుట్టింట్లో ఆదరణ లభించకపోవటం వలన ఆమె అహం దెబ్బతిని ,తనమనసులోని అభ్యుదయభావాల వ్యాప్తికోసం భీమవరంలో దూరంగా ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే నివాసమున్నది .పరమ ఛా౦దసులైన తన అత్తగారింట తన పిల్లలు పెరిగితే, వారికి అభి వృద్ధి ఉండదు అని గ్రహించి పిల్లలతో సహా కుటీరంలోనే ఉన్నది .ఆమెకున్న వివేచనా శక్తి ,పాండిత్య ప్రకర్ష ,పురాణ ఇతిహాసాలపై ఉన్న అద్భుతమైన పట్టు ,ధర్మ బోధనా పటిమ ,ధైర్యం నిస్సంకోచంగా చెప్పి ఒప్పించగల నేర్పు గమనించిన ఆవూరి క్షత్రియ స్త్రీలు ఆమెకు పరమ ఆత్మీయులయ్యారు .ఆమెను గురుభావంతో అత్య౦త గౌరవంగా చూస్తూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందించి ఆదరించారు .కనకమ్మ గారికి అక్కడ ఏ లోటూ లేదు .


  సంఘ సంస్కరణ పట్ల ,రాజకీయాలపట్ల ఆసక్తి చూపి అంకితభావంతో పని చేసింది .క్షణం తీరికలేకుండా మాట్లాడుతున్నా ,నడుస్తున్నా తకిలీతో నూలు తీస్తూనే ఉండేది.తాను ఖద్దరు ధరించి అందరి చేతాధరి౦పజేస్తూ ,ఇంటింటికీ తిరిగి ఖద్దరు వస్త్రాలు అమ్మి ఖద్దరు వ్యాప్తికి విశేష కృషి చేసింది .స్వదేశీయ వస్తువులనే వాడింది .పిల్లలకూ అవే అలవాట్లు నేర్పించి ,జాతీయభావాలతో పెంచి ఉత్తమ పౌరులుగా బాధ్యతగల వ్యక్తులుగా తీర్చి దిద్దింది .తన తండ్రి యజ్ఞం చేసిన భీమవరం లోనే ఆమె కాంగ్రెస్ పెద్దలను ,హరిజనులను ఆహ్వానించి కొడుకు ,కోడలు చేత సత్యనారాయణ వ్రతం జరిపించి౦ది.హరిజన వాడలకు వెళ్లి అక్కడిపిల్లలకు స్నానాలు చేయించి , వాళ్ళ ఇళ్ళను శుభ్రపరచి ఆరోగ్యానికి శుభ్రత ఎంత అవసరమో నేర్పించేది .ఒకసారి ఆమెరైలులో ప్రయాణం చేస్తుంటే ఒక నిండు చూలాలైన హరిజన స్త్రీకి పురుటి నొప్పులు రావటం చూసి ,పక్క స్టేషన్ లో ఆమెను దింపి ,తాను కట్టుకొన్న బట్టనే ఆవరణగా చేసి ఆమెకు పురుడు పోసింది .నిజమైన సాంఘిక సేవకు ఇంతకంటే ఉత్తమ ఆచరణ ఎక్కడ ఉంది ?.


  కనకమహాలక్ష్మి సేవానిరతి ,నిర్మాణ కార్యక్రమాలపట్ల ఆపేక్ష ,స్వాతంత్రేచ్చ ,నిరర్గళ అమోఘ వాగ్దోరణి గమనించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఉద్యమ ,ప్రచార బాధ్యతలను ఆమెకు అప్పగించారు .ముఖ్య ప్రబోధకురాలిగా ప్రచారకురాలిగా చేశారు .ప్రచార కార్యక్రమం లో ఆమె రాత్రనక పగలనక తిరిగింది తాను స్త్రీ అనే విషయమే మర్చిపోయింది .ఆమె ప్రసంగాలకు ప్రజలు ఉత్తేజితులయే వారు.’’రెండవ బార్డోలి ‘’గా ప్రసిద్ధి చెందిన భీమవరం లో ,వేలాది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొనటానికి ,కాంగ్రెస్ కు ఆర్ధిక బలం చేకూరటానికి ఆమె ప్రచార ప్రబోదాలే ముఖ్యకారణం .అందుకే పోలీసు వ్యవస్థ ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు .కానీ వాళ్ళు అనుకొన్న సమయం లో వారికి కనిపించేదికాదు అవాక్కయ్యేవారు .కనిపించినట్లే కనిపింఛి మాయమయ్యేది. ఒక సారి నిండు చూలాలైన తన కూతుర్ని పురిటికి మేనాలో అక్కగారింటికి తీసుకు వెడుతుంటే పోలీసులు ఆమెను అటకాయించారు .అప్పుడు ఆమె తాను కనకమ్మ కాదని ,కూతురు పురిటికి కనకమ్మ తప్పక వస్తుందని చెప్పగా ,పోలీసులు నమ్మి ఇంటిముందు కాపలా కాశారు .లోపల పురుడురావటం బిడ్డపుట్టటం జరిగిపోయాయి కాని కనకమ్మ వాళ్లకు కనిపించనే లేదు .ఆమె తమ చెవిలో పెద్ద కాబేజీ పువ్వే పెట్టిందని ఆలస్యంగా గ్రహించారు .ఎన్నో సార్లు ఇలా పోలీసుల కళ్ళు కప్పి తిరిగింది .కాంగ్రెస్ నాయకులే ఆమె ప్రతిభకు ఆశ్చర్య పోయేవారు ..1930జూన్ 10న ,1931 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి రాయవెల్లూరు రెండవసారి జైలుకు పంపారు .రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో ప్రజలు ఐచ్చికంగా నిరసన ప్రదర్శనలు,సత్యాగ్రహాలు చేశారు .అప్పుడు మూడవ సారి ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు .నాల్గవసారి 1941వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని జైలుపాలయ్యారు .సుమారు అయిదేళ్ళు ఆమె రాయవెల్లూరు, బళ్ళారి కర్నూలు జిల్లాలో కారాగార వాస శిక్ష అనుభవించిన వీర ,ధీర దేశ భక్తురాలు .అపక్వ ఆహారమే తినేది .నానబోసిన పెసలు సెనగలు ,ఇంటినుంచి వచ్చిన పళ్ళుమాత్రమే ఆహారం .గోవి౦దనామాలు హుషారుగా పాడుతూ పాడిస్తూ జైలు అంతాతిరిగేది .పురాణకాలక్షేపలు హరికథలతో అందర్నీ అలరించి హాయి కూర్చేది .కరడుగట్టిన పగ ద్వేషం కోపం తాపం ,అసూయ ఉన్న జైలును నవ్వులతో చతురోక్తులతో భక్తిభావ ,ఆధ్యాత్మిక బోధనలతో చిరునవ్వుల పందిరిగా చేసి ఖైదీలలో నిస్తేజం నిరాశా నిస్పృహ లను పోగొట్టేది .జైలు అధికారులకూ ఆమె అంటే మహా పవిత్రభావం ఉండేది .వారితో మాట్లాడుతూ చకచకా పచారులు చేస్తూ తకిలీపై నూలు వడుకుతూ ఒక్క క్షణం కూడా వృధా చేసేదికాదు.


  1928నుంచి 1942వరకు కనకమ్మ ఉద్ధృతంగా రాజకీయంలో పాల్గొన్నది .ఒకసారి 1930 జూన్ 10న సాయంత్రం 7 గం.లకు భీమవరం తాలూకా శృంగ వృక్షం లో కలిదిండి వెంకటరామరాజు గారింటి ముందున్న పెద్ద ఖాళీ స్థలం లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు .స్థానికులేకాక చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలూ కనకమ్మ గారి ఉపన్యాసం వినటానికి తండోప తండాలుగా వచ్చేశారు .అప్పటికి ఆమె వయస్సు .50.వితంతువు .తెల్లని ఖాదీ వస్త్రం ధరించి బోడిగుండుపై ముసుగుకప్పుకొని ఉపన్యాసం ఇవ్వటానికి వేదిక ఎక్కింది .ఆమె మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా శ్లోకాలు ,పద్యాలు పాడుతున్నా ఒక సంగీత కచేరీ లా ఉండేది .శ్రోతలుమైమరచి తన్మయులై వింటున్నారు .అక్కడ చేరిన అసంఖ్యాక జనాన్ని చూసి ఉత్తేజితురాలై పొంగిపోయింది .పోలీసులు జీపు లతో వచ్చి మోహరించారు .ఇద్దరుముగ్గురు పోలీసు జవాన్లతో,ఒక పోలీసు అధికారి ,వేదిక దగ్గరకు రాగా ,అక్కడే ముందు వరుసలో కూర్చున్న సుప్రసిద్ధ జాతీయవాదీ ,ప్రముఖ లాయరు శ్రీ ముష్టి లక్ష్మీ నారాయణ గౌరవంగా లేచినిలబడి ‘’అయ్యా నమస్కారం కనకమ్మ గారి ఉపన్యాసంమహా రసవత్తరంగా సాగుతోంది .ఇలాసభలు ఏర్పాటు చేసుకొని భావాలు వెలిలిబుచ్చుకొనే ఒక్కటేఇప్పుదు ఈప్రభుత్వం లో ఉన్న ప్రజా స్వేచ్చ .మీరు ఆస్వేచ్ఛ ను అరికట్టకండి .ఉపన్యాసమవగానే మీ విధి నిర్వహణ మీరు చేయండి ‘’అని చెప్పి ఒక కుర్చీ తెప్పించి ఆఫీసర్ ను కూర్చోబెట్టారు .కనకమహాలక్ష్మి స్వరాన్ని మరింతపె౦చి ‘’అయ్యా !మీరంతా భారత మాతను దాస్యం నుంచి తప్పించటానికి కంకణం కట్టుకొన్న భారత వీరులు .ఈ పోలీసుల్ని చూసి బెదిరి పోకండి .వాళ్ళూ మన సోదరులే .పొట్టకూటికోసం పిరికిగా పరులకు దాస్యం చేస్తున్నారు .అలాంటి వారి పిస్తోలు గుండ్లకు పిసరంతకూడా పస ఉండదు .ఏమయ్యా ఇన్స్పెక్టర్ బాబూ ! నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో చూస్తావా “’అని సవాలు విసిరి ,నెత్తిమీది ముసుగు తీసి, తలకాయ వంచి నిలబడింది .క్షణాలలో జనం భారత మాతాకు జై గాంధీ మహాత్మునికీ జై ,కోటమర్తి కనకమ్మ గారికీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లుగా అంటూ మైదానం అంతా మారుమోగేట్లు స్పందించారు .ఉపన్యాసం అవగానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు ఇలాంటి సంఘటనలు ఆమె జీవితకాలం లో చాలా జరిగాయి .


  ఎట్టకేలకు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది .స్వాతంత్ర సమరభావనానికి రాళ్ళు ఎత్తిన కూలీలను కాంగ్రెస్ పాలకులు మర్చిపోయారు .అలాగే కనకమ్మగారినీ పక్కన పెట్టేశారు .అయినా ఆమె ఊరుకోలేదు ఆంధ్రరాష్ట్ర ఉ ద్యమం లో చురుకుగా పాల్గొన్నది .స్వామి సీతారాం 1952లో భీమవరం లో 7రోజులు సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే ,పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఏడు రోజులు కఠిన ఉపవాసం చేసింది .ఆంధ్రరాష్ట్రం విషయం అధిష్టాన వర్గం నాయకులతో మాట్లాడటానికి ఆ వృద్ధ నారి ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపింది .


 జీవితాన్ని పరమ శాంతంగా తన కుటీరంలోనే సాధారణంగా గడిపింది ఆ అసాధారణ దేశ భక్తురాలు .12-1-1962న ఆ ధీరోదాత్త దేశభక్తురాలు శ్రీమతి కోటమర్తి కనకమహా లక్ష్మమ్మశతాధిక ఆయుస్సుతో జీవించి 102 ఏట పరమ పదించింది . .


 గబ్బిట దుర్గా ప్రసాద్-7-1-23-ఉయ్యూరు  


 


--


గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabharati.wordpress.com

http://sarasabharativuyyuru.wordpress.com

ఉత్తరాయణ పుణ్యకాలం

 శ్లోకం:☝️

*అగ్నిజ్యోతిరహః శుక్లః*

  *షణ్మాస ఉత్తరాయణం l*

*తత్ర ప్రయాతా గచ్ఛంతి*

  *బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ll*


భావం: ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు శుక్ల మార్గంలో పయనిస్తాడు. శుక్ల మార్గం అంటే సూర్యకాంతి సమృద్ధిగా ఉన్న మార్గం. సూర్యుని తేజస్సు ఉత్తరాయణంలో క్రమంగా వృద్ధి చెందుతుంది. మానవులు ఎప్పుడూ సులభమైన మార్గంలో ప్రయాణించాలనుకుంటారు. దానికి శుభప్రదమైన ఉత్తరాయణం శ్రేయస్కరం.


*అందరికీ భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!*🪁🎋🌾

14, జనవరి 2023, శనివారం

కొడుకులు బిడ్డలు

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు.*


ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...


భక్తి గురించి దేవుని గురించి...


జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. 


అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది.


వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. 


గురువు అప్పుడు అడిగాడు, 


నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని. 

తన బార్య గర్భవతి అని చెప్పాడు. 


గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు?


అని అడిగాడు. గురువు. 


మీరు ఏది అడిగితే అదే ఇస్తాను. అన్నాడు. 


సరే...నీ భార్యను అడిగి రా...

తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? 


అలా చేస్తే నీకు మంత్రోప దేశం చేస్తాను. 

వెళ్లి నీ భార్యను అడిగి రా, 


పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి. 

అన్నాడు గురువు. 


అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? 


అని అడిగాడు. 


అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.

మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, 

అంటూ ఒప్పు కుంది.


ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రస వించింది. 

మగ పిల్లవాడు పుట్టాడు. 


ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు.

భార్య భర్తలు. 


గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు. 


తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, 

చేసేది. 


ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. 


ఈ విదంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు. 


మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. 


ఇదేం గురువయ్యా ? 


నాకు నచ్చలేదు.

నా కొడుకును ఇవ్వను. 

కాక ఇవ్వను.

అనీ మొండి కేసింది. 


అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. 


గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. 


అమ్మ నీ బిడ్డను ఇవ్వ నన్నావు కదా, 


ఇప్పుడు నీ బిడ్డను నే,నేమి చేయను.


కాని ఒక్క సారి బిడ్డను...

నా చేతి కిచ్చి 

నా వెంట రండి.

మీ బిడ్డను నే,నేమి చేయను.


మళ్లి మీ బిడ్డను 

మీకు ఇచ్చేస్తాను.

అని అన్నాడు. 


సరే ననీ బిడ్డను తీసు కొనీ గురువు వెంట బయలు దేరారు వారిరువురు.ను..


గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి  తీసుకు కెళ్లాడు. 


ఆ రెండు గొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి...

ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొనీ మంత్రించి...

ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. 


తల్లీ దండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...

ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. 


గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగు తున్నాడు. 


ఒరేయ్ వీళ్ళకు కొడుకుగ పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. 


వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. 


రెండో వాడు ఇలా చెబుతున్నాడు. 


గత జన్మలో వీడు బాకి పడ్డాడు.

నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. 


అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అంది నంత లాగేసు కుందామని వచ్చాను. 


మరీ నువ్వేందు కొచ్చావు. 

అని అడిగాడు. 


వీడు నాకు కూడా ఇవ్వాలిరా...

నేను కూడా అందుకే వచ్చాను.

వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచు కొని వదిలేసి వెళ దామని వచ్చాను .


కానీ వీడు మనల్ని గురువు చేతి లో పడ వేసాడు. 

ఇంకే ముంది? 

వాడు.

మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు. 


ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది.

అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. 


ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. 


ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? 


అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, 


గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టీ ఆద రించాడు. 


నేను పోయే వరకు నన్ను పోషించాడు. 


అందుకే...

ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రు లిద్దరినీ వాళ్ళు బ్రతికి నంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంత మైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. 


మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. 


గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత ిపెట్టాడు. 


నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను. 

అని చెప్పాడు. 


ఈ ముగ్గురు మాట్లాడు కున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. 


గురువు పాదాల మీద పడి క్షమించ మని వేడు కున్నారు...


కాబట్టీ ...

గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్దం. 


_ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణాను బంధాలే కాదు,= 

_జన్మ రాహిత్యమే జరుగు తుంది._


_ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది..._


_మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు._


_కాని అది కాదు._


_మోక్షం అంటే బ్రతి కుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం..._


_దైవం ఏ,ఏ,రూపాలలో ఉన్నాడు._ 


_ఎక్కడ ఉన్నాడు._ 


_ఏం చేస్తున్నాడు._


_ఈ సృష్టి ఏమిటి._ 


_ఎలా తయారైంది. నే,నె'వరిని._ 


_ఎక్కడ నుండి వచ్చాను._ 


_మళ్లి ఎక్కడికి వెళతాను._ 


_అసలు మాయ అంటే ఏమిటి???_

జననం, విద్య

 సిస్టర్ నివేదిత (అక్టోబర్ 28, 1867 - అక్టోబర్ 13, 1911) వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ (ఐర్లండ్) మహిళ.


   జననం, విద్య

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఇస‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు (1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 123 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరించారు. ఇతరులపై దయా గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.


     భారతదేశంలో

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబరులో కలకత్తా లోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.


       చివరి రోజులలో

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికథైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.


ఆమెను కడుపులో మోస్తుండగా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం, తృప్తితో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని, తన తండ్రి, తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయంలో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్‌కి పెద్దషాక్ తగిలింది .


టీచర్‌గా పనిచేస్తూ తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరంగా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యం హరించని, ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయంలో మార్గరెట్‌కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారు. అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.


అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశము వెళుతూ లండన్‌లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామకృష్ణ మిషన్‌లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సిస్టర్ నివేదితగా వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది. కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది ఆమెలో. ఆ రోజుల్లో వైద్యవిధానాలు, చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణముగా తన అనారోగ్యానికి కారణం తెలియ పర్చలేదు.

అల్లం ముక్క

 వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ


దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ


మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ


పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ


పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ


మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ


పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ


దిబ్బరొట్టె మొత్తం - 

నేనే తినేసినట్టూ


వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 

చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ


చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ


పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు


రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ


కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ


చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ


నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ


పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ


చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ


సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ


దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ


తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ


పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ


పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ


టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ


మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ


బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు


వేడి వేడి బెల్లం జిలేబీ , 

రోడ్ మీద కొనీ కొనగానే - 

కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు


బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ


లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ


బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ


అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ


సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ


చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ


కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ


బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ


కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ


మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ


కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ


దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ


సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ


వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ


తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ


పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ


పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ


దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ


పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ


చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ


ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ


వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ


కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ


మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ


సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ


ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ


గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ


వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ


విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 


బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ


వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 


వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ


భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ


ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ


పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ


ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ


గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు


పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ


దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ


ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ


కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!


ఇదంతా ఎందుకంటే .....


ఈ రోజుల్లో ఇవిదొరకటం,దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!😍😍

నిజమైతే బాగుంటుందనిపించే కల😇😍

*కాశి ఆలయ చరిత్ర*

 *కాశి ఆలయ చరిత్ర*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి, కారణజన్ముడు, యుగపురుషుడు, మన హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*


*శ్రీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం అయిన తరువాత రోజూ 60 వేల మంది పైగా భక్తులు దర్శనానికి వస్తున్నారు.*


🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*🙏

మాతృ భాష

 38వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

38వ దినము (14-01-2023):

శిఖరము: అధిక్యత, కొప్పరము, కొమ్మ, గుబ్బ, ఘటము, దంతకము, ముకుటము, మోదు, శేఖరము, శృంగము, సిగరము. 

ఆంగ్లము: Hill top

*భోగి - కనుమ - సంక్రాంతి*

 *భోగి - కనుమ - సంక్రాంతి*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


🕉 *భోగి రోజున అగ్నిదేవుడిని పూజిస్తాము*


🕉 *సంక్రాంతి రోజు  -  సూర్యనారాయణ మూర్తిని పూజిస్తాము.*


🕉 *కనుమ రోజున పశుపతిని పూజిస్తాము..*


🕉 *మొదటి రెండు రోజులూ మానవాళికి సంబంధించినవి.  మూడవ రోజు కనుమ... మన మనుగడకు కీలకమైన, పశుపక్ష్యాదులకు సంబంధించినది.*


🕉 *ఆ రోజు పశువులకు పూజలు చేసి, మంచి ఆహారము సమర్పించి,  విశ్రాంతి కల్పించి, కృతజ్ఞతలు ప్రకటించే రోజు.*


🕉 *పశుపతికి ప్రీతి కలిగించే రోజు. అలాగే, శ్రీకృష్ణ పరమాత్మ  గోవర్ధనగిరినెత్తి , పశుపక్ష్యాదులనూ, మానవాళిని రక్షించిన రోజు కనుమ రోజే.*


🕉 రైతుల కష్టాలను గట్టెక్కించే ప్రత్యక్ష దేవతలే ఈ పశుజాతి..

పక్ష్యాదుల వల్లే వృక్ష జాతి, వీటివల్ల ఆక్సిజను, వానలు,

సస్యశ్యామలంగా, పాడిపంటలూ లభించటం, మానవాళి సుకృతం..


🕉 అందుకే కనుమకు సంబంధించిన మూగ ప్రాణులకు, మానవత్వ కృతజ్ఞతలు సమర్పణ చేస్తే, పశుపతి తప్పక కరుణిస్తాడు..


*సర్వే జనా సుఖినోభవంతు* 

*లోకా సమస్తా సుఖినోభవంతు* 



🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏


🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

కంచి కామకోటి

 కంచి కామకోటి... రాంచి రామకోటి..

పరమాచార్య వారు కాశి యాత్ర సందర్భంగా టాటా నగర్ (ఇప్పుడు ఝార్ఖండ్ లో ) లో జరిగిన ధనుర్మాస సభలలో పాల్గొన్నారు. బీహార్ లోని పత్రికలు స్వామి వారు పాల్గొన్న కార్యక్రమం వివరాలు ప్రజలకు అందించే క్రమం లో "కంచి కామకోటి స్వామి " వారు అనే బదులు "రాంచి రామకోటి స్వామి "వారు అని వ్రాసాయి. ఈ విషయం స్వామి వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళినప్పుడు స్వామి చమత్కారం గా ఇలా వివరించారు.

" ఆంగ్ల భాషలో  (k)  "క "కారానికి "ర"(R) కారానికి దగ్గరి పోలిక ఉంది.


ఆ పదాల అర్ధం తెలియక అలా వ్రాసి ఉంటారు. నిజానికి రాముని (విష్ణువు )కుమారుడే కాముడు (మన్మధుడు )కానీ రాముడున్న చోట కాముడుండడు . తులసి దాస్ తన రామచరిత మానస్ లో "జహ రామ హో  వహ కామ్ నహి "అన్నారు.కానీ రామకోటి ఉన్న చోట కామకోటి ఉండడానికి అభ్యంతరం లేదు.ఎందువల్ల అంటే రామకోటి వ్రాసిన పుస్తకాలను ఊరేగింపుగా తెచ్చి నాకు స్వాగతం చెప్పారు. (బందరు లో )అంటే రామకోటి ఉన్న చోట మేము కామకోటి వారం ఉంటాము."అని చమత్కరించారు.