7, మార్చి 2023, మంగళవారం

అంతపెద్దదా

 

 అంతపెద్దదా 

ఒకసారి వర్షాకాలంలో ఒకప్రాంతంలో వర్షాలు విపరీతంగా కురవటంతో ఒక చెరువులోని కప్ప ఆ వరదలలో కొట్టుకొని పోయి ఒక చిన్న బావిలో పడింది.  అక్కడ బావిలో వున్న కప్పు ఈ కప్పని చూసి నీవు ఇక్కడకు యెట్లా వచ్చావు అని అడిగింది. దానికి ఆ కప్పు నేను ఒక పెద్ద చెరువులో ఉండేదానినినిన్న కురిసిన వర్షపు వరదలో పడి ఇక్కడకు వచ్చాను అని అన్నది.  ఏమిటి పెద్ద చెరువులో వుంటావా చెరువు అంటే ఇంత ఉంటుందా అని ఒక నాలుగు సార్లు గెంతి చూపెట్టింది.  కాదు అన్నది ఆ కప్పు అప్పుడు బావిలోని కప్ప భావి ఒక అంచునుంచి ఇంకొక అంచువరకు గెంతి ఇంతదూరం ఉంటుందా అని అడిగింది.  దానికి ఆ కప్ప ఇది భావి చాలా చిన్నగా ఉంటుంది చెరువు అనేది చాలా విశాలంగా ఈ భావితో పోలిస్తే ఎన్నో వేలరెట్లు ఉంటుంది.  అక్కడ వేలకొద్దీ కప్పలు ఇతర జలచరాలు ఉంటాయి అని చెప్పింది.  దానికి ఆ బావిలోని కప్పనవ్వి నీవు నా తో పరాచకాలు ఆడుతున్నావా ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద నీటి వనరు ఉండదు.  నాకు తెలుసు అని చెప్పింది.  అప్పుడు చెరువులోని కప్పు చూడు మిత్రమా నీవు ఈ భావి తప్ప ఇంకొకటి చూసి ఉండకపోవచ్చు అందుకే ఇదే ప్రపంచం అని అనుకుంటున్నావు నిజానికి ప్రపంచం చాలా పెద్దది. నేను నా గ్రహచారం బాగాలేక ఈ బావిలో పడ్డాను కానీ నేను సువిశాల ప్రపంచంలో ఉండేదానిని అని అన్నది. దాని మాటలకు బావిలోని కప్పకు విస్మయం కలిగి జ్ఞ్యానోదయం అయ్యి తానూ యెంతటి చిన్న జాలంలో వుంటున్నదో అదే విధంగా తన భావాలు కూడా చిన్నగా ఉన్నాయని తెలుసుకున్నది. 

ఇది మనం చిన్నప్పటినుండి చదువు ఉన్న సాదారణ కధ.  దీనినే తెలుగులో బావిలోని కప్ప అని  సంస్కృతంలో కూపస్థ మండూకం అని హిందీలో కువేమే మెండాక్ అనే నానుడి మనకు తెలుసు.  మన మిత్రులలో ఎవరైనా సరైన జ్ఞ్యానం లేకుండా అన్ని నాకే తెలుసు అని విర్రవీగుతుంటే వాడు వట్టి బావిలో కప్ప అని మనం అనుకోటం సర్వ సాధారణము. 

నిజానికి మనమంతా ఆ బావిలోని కప్పలకన్నా ఏమాత్రం మెరుగు కాదని చెపితే కోపం రావచ్చు.  కానీ భగవంతుని విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్ళు నిజం. ప్రతి వారు వారికి తెలిసిన సామాన్యమైన సంకుచితమైన జ్ఞ్యానంతో భగవంతుని చూడాలని, చూశానని అనుకుంటారు.  కానీ వేదాంతం అనేది అంతసులువుగా అర్ధం కాదు. వేదాన్త జ్ఞ్యాననఁ కావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.జన్మాతరకృత వాసనలు తొలగిపోవాలి.  అదే విధంగా ఈ జన్మలోకూడా మనస్సు పరిశుద్ధంగా వుంది వాసనా రహితంగా ఉండాలి. 

సాధారణంగా చాలామంది విగ్రహారాధనే సర్వస్వము విగ్రహారాధనతోటి మోక్షాన్ని పొందవచ్చని అనుకుంటారు.  అంతేకాకుండా అనేకమంది తాము విగ్రహారాధన చేస్తూ వారి పబ్బం గడుపుకోవటానికి ఇతరులను విగ్రహారాధనకు పురిగొలుపుతారు. నిజానికి ప్రారంభంలో మనస్సుని ఒక క్రమశిక్షణలో ఉంచి ఉంచటానికి విగ్రహారాధన తోడ్పడుతుంది.  కానీ సాధకుని మనస్సు కేవలం విగ్రహారాధన వరకు మాత్రమే పరిమితం కాకూడదు. 

మన ధర్మంలో యజ్ఞ యాగాది క్రతువులను చేయటం కూడా వున్నది. అవి కూడా కొంతవరకే సాధనకు ఉపయోగ పడతాయి కేవలం ఐహిక వాంఛలను నెరవేర్చుకోవటానికి మాత్రం ఉపయోగ పడుతాయి. 

 జపతాపాలు చేయటం. జపం చేయటం కొంతవరకు అభివృద్ధి చెందిన ఆరాధనగా మనం అనుకోవచ్చు. ఎందుకంటె అక్కడ మంత్రం, జపమాల రెండే వున్నాయి. మంత్రం మనస్సులో ఆడుతుంటుంది, మాల చేతిలో తిరుగుతుంటుంది. కొంతవరకు మంత్రజపం ఆధ్యాత్మిక మార్గంలో చాలావరకు తీసుకొని వెళుతుంది.  

తపం అంటే తపస్సు అది ఒక్కటే మనిషిని మాధవుడిగా చేస్తుంది.  కేవలం సాధనవలనే భక్తుడు జ్ఞ్యానై మోక్షాన్ని పొందుతాడు. 

ఇవి తెలియని వారు వారు చేసే ఆరాధనే సర్వోత్తమమైనదని దానితోటె మోక్షం సిద్ధిస్తుందని  జీవితాన్ని గడుపుతారు. కాదని ఎవరైనా చెపితే అప్పుడు మోక్షం అంత పెద్దదా అని  బావిలోని కప్పలాగా ఆశ్చర్యపడతారు.

భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే భగవంతుడు బాహ్యంలో లేడు కేవలం హృదయంలోని వున్నడని మన మంత్రపుష్పంలోనే పేర్కొన్నారు. ఉపనిషత్తులు కూడా పవిత్రమైన మహావాక్యాలతో అదే విషయాన్నీ ఉటంకిస్తున్నాయి. అది తెలుసుకోవటమే మోక్షం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

ఆయుర్వేదంలో

 శ్లోకం:☝️oil pulling

*అసంచారీ ముఖే పూర్ణే*

  *గండూషః కవలస్చరః l*

*తత్ర ద్రవేణ గండూషః*

  *కల్కేన కవలః స్మృతః ll*

  - సుశ్రుత సంహిత


భావం: ఆయుర్వేదంలో రెండు విధానాలు చెప్పబడ్డాయి.

1. కవలము/ పుక్కిలించడం, నోటిలో ద్రవాన్ని ఊపడం/అటు ఇటు ఆడించడం (ఇది టాక్సిన్‌లను బయటకు లాగుతుంది)

2. గండూషము/ ఎలాంటి కదలిక లేకుండా నోటిని ద్రవంతో నింపి ఏ కదలిక లేకుండా ఉంచడం (ఇది నోటిని లూబ్రికేట్ చేస్తుంది).

నూనెతో పుక్కిలించడం (కవలము) వల్ల నోటిలో చెడు రుచి, చెడు వాసనలు, వాపు, మంట మరియు తిమ్మిరి అనుభూతిని తొలగిస్తుంది. మరియు ముఖ కండరాలకు వ్యాయామం జరిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. దంతాలను బలపరుస్తుంది మరియు ఆహారం పట్ల సహజమైన ఆసక్తిని, రుచిని పెంచుతుంది.

ఇంతవరకు నిజం. ఇంతకు మించి "సర్వరోగనివారిణి"గా ఎవరైనా చెబితే నమ్మక్కర్లేదు!🙏

తేళ్ల గురించి

 తేళ్ల గురించి సంపూర్ణ వివరణ  -  చికిత్సలు .


   తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.


              తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి 


  1 - మంద విషము కలిగినవి.


   2 - మధ్యవిషము కలిగినవి.


   3 - తీవ్రవిషము కలిగినవి.


 * మంద విషం కలిగిన తేళ్ల లక్షణాలు  -


        ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.


 *  మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు  -


           ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.


 *  తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు -


          ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .


           ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.


           పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.


 *  పత్ర వృశ్చిక లక్షణాలు  -


          ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.


 *  మండ్రగబ్బ లక్షణములు  -


           ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .


 *  తేలు యొక్క విషం వ్యాపించు విధం -


         తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును. 


 తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు  -


 *  ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .


 *  కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.


 *  గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .


 *  ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .


 *  గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.


 *  తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.


 *  జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .


 *  పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.


 *  రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.


 *  నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును . ఈ పద్ధతితో నేను చికిత్స చేశాను . ఇది నా అనుభవయోగం .


          ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.


         కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .


             మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

6, మార్చి 2023, సోమవారం

అనుగ్రహాన్ని

 వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది పార్ట్ 1


అది 1966, జూన్ ఒకటి. వారం రోజుల పాటు జరిగిన ఏథెన్స్ సమ్మేళనంలో నాలుగోరోజు.


అద్భుతమైన పడమటి సంధ్యారాగ నేపథ్యంలో ఫ్రేముకట్టినట్లున్న ఫింక్స్ పర్వతం. దానికెదురుగా తూర్పున అక్రోపోలిస్. దాని శిఖరాన కిరీటంలా సుప్రసిద్ధ పార్ధినన్ దేవాలయం. అందులో ఎథీనా.


ఎథీనా జ్ఞానదేవత. శాంతిప్రదాత్రి. పూర్వం ఈ కొండమీదే 'ఎక్లీషియా' జరిగేది. ఎక్లీషియా అంటే ఏథెన్స్ నగరవాసుల సభ. ఇక్కడే ఏథెన్స్ పౌరులనుద్దేశించి వారి ప్రతినిధులు మాట్లాడేవారు. 


ఏథెన్స్ సమ్మేళనానికి ఇంతకన్నా మనోజ్ఞమైన ప్రదేశం 'పార్థివ జాతీయ సంస్థ'కు దొరకదు. 


పార్థివ జాతీయ సంస్థను స్థాపించినవారు హెల్లెన్సేకు చెందిన 'పాల్' ప్రభువు. ప్రతి రెండేళ్ళకొకసారి గ్రీస్ దేశపు ముఖ్యపట్టణంలో ఒక అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించటం, పార్థివ జాతీయ సంస్థ చేపట్టిన ముఖ్యకార్యాల్లో ఒకటి. ఆ సమ్మేళనానికి 'ఏథెన్స్ సమ్మేళన'మని పేరు.


ఆ సమ్మేళనంలో మానవజాతి యింతవరకు సాధించిన పరిజ్ఞానాన్నీ, పొందిన అనుభవాలను దృష్టిలో వుంచుకొని ప్రసిద్ధులైన మేధావులు మానవుల ఆదర్శాలను, ఆకాంక్షలనూ ప్రవచించే అవకాశం కలుగుతుంది.


విచ్చేసిన ప్రతి విద్వాంసుడూ తనకిష్టమైన విషయం మీద ఏదో ఒక సాయంకాలం, ఆ సాంస్కృతికోత్సవాల్లో ఆరుబయట, ఫింక్స్ శిఖరం నుండి ప్రసంగించటం ఆనవాయితీ.


ప్రాసంగికులైన ఏడుగురు విద్వాంసుల్లో ఆరుగురిని విదేశాల నుండి ఆహ్వానించాలని పాల్ ప్రభువొక నియమం పెట్టిపోయారు. అలా వారు నియమం పెట్టడానికి కారణం ప్రాచీన గ్రీక్ తాత్వికుడైన "ఐసోక్రేట్స్". “మన సంస్కృతిలో పాలుపంచుకునే వారెవరైనా మనవారే. మన హెల్లెన్సె” అని ఆ తాత్త్వికుడొకపుడు ప్రవచించారు.


ఏథెన్స్ సమ్మేళనం మొట్టమొదట 1964లో జరిగింది. సమ్మేళనం జరగటానికి ముందే పాల్ చక్రవర్తి పరమపదించారు. వారి పుత్రులు కాన్ స్టెంటిన్ ప్రభువు ఆవారం రోజులూ అంతటా తానే అయి, అమితోత్సాహంతో ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాలు విజయవంతం కావటం చూచి 1966లో పార్థివజాతీయ సంస్థవారు రెండవ ఏథెన్స్ సమ్మేళనాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నారు.


అక్రోపోలిస్ పర్వతం మీద ఎథీనా దేవాలయంలో మే 29వ నాడు సమ్మేళనాన్ని ప్రభువులవారే స్వయంగా ప్రారంభించారు. ఆ తరువాత ఆరు రోజుల సమ్మేళనమూ ఫింక్స్ పర్వతం మీద జరిగింది. సమ్మేళనపు నాల్గవ నాడు అంటే, జూన్ ఒకటో తేదీన - నా వంతు వచ్చింది. “భారతీయవారసత్వం” అనేది నా ఉపన్యాస విషయం. నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఈమాటలన్నారు. 


"ప్రస్తుతం విజ్ఞానశాస్త్రమూ, టెక్నాలజీ సాధించిన పురోగతి దృష్ట్యా, భారతీయ వారసత్వం భవిష్యకాలంలో ఏమౌతుందోననే సందేహం, నా దేశంలోని ఆలోచనాపరులనే కాదు, విదేశీయులైన మేధావులను సైతం కలవరపరుస్తున్నది. భారతదేశాన్ని చూడటం కోసం యుగోస్లోవియా నుండి వచ్చిన విద్వాంసులొకరు కంచి కామకోటి పీఠాధిపతులైన శంకరాచార్య స్వామివారి దగ్గర ఈ సందేహం వెలిబుచ్చారు. సనాతన భారతీయ యతిజీవితాన్ని తూచా తప్పకుండా గడుపుతున్న ఆ ఋషి వెంటనే యిలా అన్నారు.


“భారతీయమైన ఆత్మకు చలనం లేదు. ఏమైనా చేస్తే ఆధునిక విజ్ఞానంగానీ, సాంకేతిక పరిజ్ఞానంగానీ అర్థం లేని పాత విశ్వాసాలనూ, గ్రుడ్డినమ్మకాలనూ పోగొట్టగలవేమో. అది మంచిపనే. భారతీయ సంస్కృతి యెన్ని సవాళ్ళనో ఎదుర్కొంది. ఎన్ని ఆఘాతాలనో తట్టుకుంది. అది నేటికీ చెక్కుచెదరలేదు. దానికి చావులేదు”.


శంకరాచార్యుల ప్రవచనంకన్నా దాని అమరత్వానికి మరొక నిదర్శనం అక్కరలేదు. భారతీయ వారసత్వం కేవలం భారతీయులది మాత్రం కాదు. ప్రపంచ జనులందరిదీను. 


నేను కంచి శంకరాచార్యులవారిని గురించి ప్రస్తావించిన సభలో గ్రీకు రాజ్ఞీమాత మాన్యశ్రీ ఫ్రెడరికా వారి తనయ మాన్యశ్రీ ప్రిన్సెస్ ఐరీన్ ఆసీనులైపున్నారు. వారు కొంత కాలంగా ధ్యానసాధన చేస్తున్నారు. వారికి భగవాన్ రమణముని బోధల మూలాన అద్వైతవేదాంతంతో పరిచయం కలిగింది. మృతులైన పాల చక్రవర్తితో బాటు వారిరువురూ భారతదేశంలో అధికారికంగా పర్యటించారు కూడా. కానీ పర్యటనలో భారతీయమైన అధ్యాత్మిక స్వరూపాన్ని అవగాహన చేసుకునే అవకాశంగానీ, తీరికగానీ వారికి లేకపోయాయి.


గ్రీస్ మహారాజ్జి, వారి పుత్రిక ఈసారి భారతదేశం వచ్చినప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులను దర్శించాలని కోరికగా వుందని నాతో అన్నారు. వారి కోరిక ప్రకారం 1966, నవంబరు, డిసెంబరు మాసాల్లో భారతదేశానికి వచ్చి కంచి స్వామివారు కలుసుకున్నారు. వారి సమావేశం కాళహస్తిలో 1966, డిసెంబరు నాలుగు, ఐదు తేదీల్లో జరిగింది.


రాజ్ఞి ఫ్రెడరికా, రాకుమారి ఐరీన్ ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయటం అలసట అనుకోలేదు. వారిరువురూ సత్యాన్వేషకులుగా భారతదేశానికి వచ్చారు. వచ్చినందుకు వారి శ్రమ వృథా కాలేదు. వారికీ, శంకరాచార్యులవారికీ జరిగిన సంభాషణ సంగ్రహం ఇదీ 


ప్రశ్న : స్వామీ, జాగ్రదవస్థలో నా ధ్యానం చాలావరకు క్రమబద్ధంగా సాగుతుంది. కాని స్వాప్నిక స్థితిలో ధ్యాననిష్ఠ నిలవటం లేదు. ఆ స్థితిలోనూ నిలవాలంటే యేం చెయ్యాలి? 


సమాధానం : వచ్చే స్వప్నాలెలాటివైనాసరే, ఆందోళన పడకండి. మేలుకున్న వేళల్లో ధ్యానమగ్నులై వున్నవారు నిద్రపోయాక కూడా ధ్యానమగ్నతలోనే వుండటం సాధ్యం కాకపోవచ్చు. నిద్రావస్థలో వచ్చే స్వప్నాలు ప్రాపంచికమైనవి కూడా కావచ్చు. అంతమాత్రంచేత అన్వేషకులు నిరుత్సాహపడరాదు. అలా నిరుత్సాహపడటం తమ అన్వేషణకు అంతరాయం అని గ్రహించాలి. 


జాగ్రదవస్థను స్వప్నాలు మలినపరచలేవు. కాని స్వాప్నిక స్థితిని జాగ్రదవస్థ మలినపరచగలదు. 


తెల్లవాడికి వచ్చే కలల్లో అతడు తెల్లవాడుగానే వుంటాడు. అలాగే నల్లవాడికి వచ్చే కలల్లో అతడు నల్లవాడుగానే వుంటాడు. జాగ్రదవస్థలో కలిగే అనుభవాలే కొంతవింతగా, అబ్బురంగా స్వప్నావస్థలోనూ కలుగుతాయి. అన్వేషకులు జాగ్రదవస్థలు ఆత్మ విచారం చేస్తూవుంటే, స్వప్నావస్థలోనూ ఆ చింతనమే కొంతవరకు ప్రతిబింబిస్తుంది. మేలుకుని వున్నప్పుడు తీవ్రమైన ఉద్రేకాలకు లోనుగాకుండా మనస్సును అదుపులో వుంచుకుంటే నిద్రలో కూడా మనస్సు నిశ్చలంగా వుంటుంది. 


ప్రశ్న : మనస్సును ఏకాగ్రంగా వుంచుకోవటానికి, స్థితప్రజ్ఞంగా నిలుపుకోటానికి ఉపకరించే ప్రక్రియ ఏదైనా వుంటే స్వామివారు సెలవివ్వాలి.


సమాధానం : సాధారణంగా ప్రతివారూ తమ ముక్కుపుటాల్లో ఒకదానితోనే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు జరుపుతారు. ఒకవైపు జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు రెండో వైపునకు మార్చటం కొంచెం శ్రమ. గాలిపీల్చి వదలటం కుడివైపున్న ముక్కురంధ్రం ద్వారా జరుగుతున్నదనుకోండి. దాన్ని ఎడమవైపునకు మార్చాలంటే కుడివైపు ఒత్తిడి తేవాలి. అంటే కుడిచేతి మీద ఒరిగి కూర్చోవాలి. కుడివైపునుండి ఎడమవైపునకు మార్చాలన్నా ఎడమవైపు ఒరిగి కూర్చోవాలి. ఈ మార్పు జరిగేటప్పుడు ఓ రెండు క్షణాలు రెండు రంధ్రాలు పనిచేస్తాయి. ఆ రెండు క్షణాల్లో “సమంగా” ఊపిరి పీల్చి వదులుతాయి. సాధన చేసినకొలదీ ఈ సమోచ్ఛ్వాస నిశ్శ్వాస స్థితి పెరుగుతుంది. అది పెరిగి పెరిగి మన స్వభావాన్నే మారుస్తుంది. క్రమంగా ఏకాగ్రత అలవడుతుంది. స్థితప్రజ్ఞత సిద్ధిస్తుంది.వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది పార్ట్ 2


ప్రశ్న : పరిసరాలు అనుకూలించనప్పుడు, మన జీవన విధానాన్ని ద్వేషించే వారే చుట్టూ చేరినప్పుడు, ఎటుచూచినా దుర్మార్గం, దౌర్జన్యం మాత్రమే కనబడుతున్నప్పుడు మనిషిగా ఏం చెయ్యాలి? 


సమాధానం : ద్రోహబుద్ధి కలవారూ, దుష్టులూ, దుర్మార్గులూ చుట్టూ వున్నంత మాత్రాన మనం సహనాన్ని కోల్పోరాదు. వారిని ద్వేషించరాదు. పెగా వారిని సానుభూతితో, దయతో చూడాలి. ఎవరూ పుట్టుకతో దుర్మార్గులు కారు. పరిస్థితుల వల్లా, పెంపకంవల్లా దుర్మార్తులుగా మారుతారు. అలా మారినవారిని ద్వేషించటం న్యాయమా చెప్పండి. అందువల్ల సాధకుడెవరినీ ద్వేషించరాదు. తనలో తాను ఇలా వితర్కించుకోవాలి. 


“పుట్టుకతో దుర్మార్గులెవరూ లేరు. పరిస్థితులవల్ల వారు దుర్మార్గులుగా మారారు. వారిని చూచి జాలిపడాలేగాని ద్వేషించడం తప్పు. నాకు ప్రియమైనవాడే, నాకొడుకే దుర్మార్గుడుగా మారితే నేనేం చేస్తాను? వాణ్ణి ద్వేషిస్తానా? వదులుకుంటానా? దగ్గరకు తీసి అనురాగంలో ముంచెత్తి వాణ్ణి క్రమంగా దారికి తెచ్చుకుంటాను. మంచివాడుగా మార్చుకుంటాను. 


"పరాయివాణ్ణయినా అంతే. సత్యాన్వేషకునికి నిజానికి పరాయి వారంటూ లేరు. అందరూ ఒకేరక్తం పంచుకు పుట్టినవారే. పరిస్థితులవల్లా, పెంపకంవల్లా నేనే దుర్మార్గుడుగా మారితే నాగతేమిటి? అందువల్ల ప్రతి దుర్మార్గుడిలో నన్నే చూచుకుంటాను. నా ఆత్మనే దర్శిస్తాను. అతణ్ణి ఎప్పుడూ ద్వేషించను”. 


ప్రశ్న : సవికల్ప సమాధి స్థితికీ, నిర్వికల్ప సమాధి స్థితికి వున్న భేదం ఏమిటి? సహజ సమాధి అంటారే, అదెలావుంటుంది? 


సమాధానం : ధ్యానమార్గంలో, ఏకాగ్రపథంలో సవికల్పమూ, నిర్వికల్పమూ అనేవి రెండుదశలు. సవికల్పసమాధిలో మనస్సు నిశ్చలంగా వుంటుంది, చెదరదు. ఒక విషయంమీద ఏకాగ్రమై నిలుస్తుంది. అందులో లీనమౌతుంది.


నిర్వికల్పసమాధిలో మనస్సు పనిచేయటం మానుతుంది. అదృశ్యమైపోతుంది. అప్పుడు ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది. యోగానికి లక్ష్యం నిర్వికల్ప సమాధే. 


అద్వైతంలో కూడా ధ్యానానికి అవసరముంది. కాని ధ్యానానికి గమ్యమైంది అద్వైతంలో అభేదబ్రహ్మం. 


ఇక సహజసమాధి అనేది బ్రహ్మ విచారంవల్ల కలుగుతుంది. అది ఆత్మ సాక్షాత్కార సహజస్థితి. క్షణక్షణం మారే అద్భుతాల కతీతమైన యోగదశ.


ప్రశ్న : సంప్రదాయాల విషయంలోనూ, ఆచార విషయంలోనూ నాయకుడైన వాడేం చేయాలి? అవి తనకు ఉపయోగపడవని తెలిసికూడా వాటినే పాటించక తప్పదా? 


సమాధానం: ఒక వర్గానికి, ఒక సమాజానికో, ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహించేవాడు సాంప్రదాయికంగా వచ్చే మతాచారాలనూ, కర్మకాండనూ నిరాదరించకూడదు. అవి తన కవసరం కాదని తెలిసినా, వాటిని పాటించి తీరాలి. ఉదాహరణకు చర్చిలో జరిగే ఆచారకాండ తన ఆధ్యాత్మిక పురోగతికి అనావశ్యకమని యెరిగి కూడా మతాచార్యుడు దాన్ని అనుసరించాలి. 


అలా అనుసరించకపోతే ఆ ఆచారకాండవల్ల లాభపడే వారుకూడా దాన్ననుసరించరు. అది అనుసరించతగని ఒరవడిలాంటిది. 


“కర్మపరతంత్రులైన అజ్ఞానుల మనస్సును జ్ఞానులైన వారు కర్మమార్గం నుండి తొలగనివ్వరు. తామూ ఆ కర్మలనే కుశలబుద్దితో చేస్తూ వారికీ మార్గదర్శకంగా వుంటారు” అని భగవద్గీతలో వుంది. నాయకులూ, ఉన్నతులూ అయినవారు ప్రజలే స్థితిలో వుంటే ఆస్థితినుండే వారిని ముందుకు నడిపించాలి. అంతేగాని సంప్రదాయంగా వస్తున్న పూజా విధానాలను మానకూడదు.


స్వామివారు తమకు దర్శన మనుగ్రహించటం ఒక భాగ్యంగా భావించి వారితో జరిపిన సంభాషణ తమ హృదయం మీద ఎంతటి చెరగని ముద్ర వేసిందో ఉగ్గడిస్తూ మహారాణి యిలా అన్నారు.


"స్వామి చరణసన్నిధిలో గడిపిన యీరెండు రోజులూ మరిచిపోలేము. ఈ రెండు రోజులూ స్వచ్ఛమైన ఆధ్యాత్మికత్వంలో జీవించాము. ఏ అదృశ్యశక్తో మమ్ము వారి చెంతకు చేర్చింది”. 


ఈ అనుభవాలే విపులీకరిస్తూ, ఆ మహనీయునితో తమ సమావేశాన్ని నెమరువేసుకుంటూ మహారాణివారింకా యిలా అన్నారు.


"కొంతకాలంగా అడగటానికి వివరణలే తప్ప కొత్త ప్రశ్నలేవీ లేని స్థితికి చేరుకున్నయను. అయినా నాకు ఆత్మానుసంధానం అస్థిరంగానే వుంది. సాధన చేసేకొలది అది సిరపడవచ్చు. అప్పుడు ఏ సమస్యావుండదు. దేనికైనా కాలం రావాలి. అప్పుడు అదృష్టం కూడా కలసివస్తుంది. అదృష్టం కాకపోతే అంతటి సర్వోత్తముని సందర్శించే భాగ్యం మాకెలా కలుగుతుంది చెప్పండి! విచలించి పోకుండా వారి అనుగ్రహాన్ని మనసులోనే యిమిడించుకోవటం సాధ్యం కాకుండా వుంది.


ఆధ్యాత్మికాన్వేషకులు అంతరంగంలో పొందే అతిలోకమైన అనుభవాన్నే వ్యోమగాములు బహిరంగంగా పొందుతారని స్వామివారన్నారు. వారి సాన్నిధ్యంలో మాకు అతిలోకమైన బహిరంతరానుభూతి కలిగింది. మేము ధన్యులం. ఆధిభౌతికానికి ఆధ్యాత్మికానికి వారు విస్పష్టమైన అనుబంధం. అన్వేషకులకు ఆధిభౌతికమూ ఆధ్యాత్మికమూ వేరు కావు. వేరుకావనటానికి స్వామివారే రుజువు. దుర్బలమైన శరీరంలో వారు అతిథి. బక్కచిక్కిన వారి శరీరం కంటికి కనబడుతూనే వుంది. ఏ బ్రహ్మపదార్థంతో ఆ అతిథికి అభేదం ఉందో బ్రహ్మపదార్థమూ ఆ దేహంగా దృశ్యమాన మవుతున్నది. దీనివల్ల భౌతికమూ, ఆధ్యాత్మికమూ వేరుకావని స్వామివారే నిరూపించటం లేదా!? ఆ తేజస్సులోని అందం మన గ్రుడ్డికళ్ల కెలా తెలుస్తుంది!?


“వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది. సంతత ధారాపాతంగా కన్నీరు కారింది. అది సామాన్యమైన కన్నీరు కాదు. తీరిన కోరికల కన్నీరు. తృప్తి, ఆనందం కార్చిన కన్నీరు. మనస్సును కడిగి శుభ్రపరచిన కన్నీరు. మనస్సును కరిగించిన కన్నీరు. వారు ప్రతీకగా నిలచిన పరమసత్యంతో మనస్సును ఏకం చేసిన కన్నీరు..”


సరిగ్గా రెండేళ్ళకు రాణి, రాకుమారి మళ్లీ స్వామివారిని దర్శించటం కోసం భారతదేశం వచ్చారు. ఈసారి మేనకోడలు డోరోథీ, మేనల్లుడు కార్ల్ కూడా వారి వెంట వున్నారు. స్వామివారు మచిలీపట్నంలో వుండగా 1968, డిసెంబరు 6, 7, 8 తేదీల్లో వారితో సమావేశాలు జరిగాయి. అతిథులు మొత్తం ఎనిమిది గంటలకు పైగానే స్వామివారితో సంభాషించారు. సంభాషించినంత సేపూ స్వామివారి వివేకంలో, అనుభూతిలో ఓలలాడారు. స్వామివారి ఆధ్యాత్మిక దీప్తిలో మునిగితేలారు. మూడవతేదీన వారు మద్రాసులో కాలుమోపినప్పటినుండి, మచిలీపట్నంలో మూడు రోజులు గడిపి పదకొండవ తేదీ మద్రాసు నుండి బాంబే మీదుగా యూరప్ చేరేవరకూ వారి మనస్సులో ఒకే ఒక ఆలోచన - స్వామి వారిని గురించి.


స్వామివారిని సందర్శించటం జీవితంలో తమకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం అనుకున్నారు వారు. వారికి స్వామి అనుగ్రహం కోకొల్లలుగా లభించిన మాట కూడా వాస్తవమే!


వారు స్వామివారితో వేరువేరుగానూ సంభాషించారు, అందరూ కలసి సంభాషించారు. వారడిగిన ప్రశ్నల్లో వారికున్న గాఢమైన చిత్తశుద్ధి, నిశితమైన పారమార్థికాన్వేషణా కనబడేవి. ఇక స్వామివారి సమాధానాల్లో ఎంతో విస్పష్టమైన ఆదేశం వుండేది. ఎంతో సులభమనోజ్ఞమైన వివరణం వుండేది. అంతరమైన అన్వేషణ సుగమం కావటానికి స్వామివారి మాటలు ఎంతగానో తోడ్పడతాయి. అసలు ఆ సంభాషణలు వినటమే ఓ అద్భుతమైన అనుభవం అనిపించింది నాకు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాశీ యాత్ర...

 పరమాచార్య వారి కాశీ యాత్ర...

భారత దేశం లో జన్మించిన ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర కాశీ యాత్ర అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మూడు పవిత్ర కార్యాలు చేసిన వారికీ యమ దర్శనం కాదంటారు.1. గంగలో స్నానం.2. భగవద్గీత లో ఒక్క శ్లోకమైన పారాయణ చేయడం 3.ఒకసారైనా శ్రీమన్నారాయణుని పూజించడం (భజ గోవిందం )

ఇక యాత్రా విశేషాలకొస్తే...

పరమాచార్య వారు క్రమ పద్దతిలో సంకల్పం, యాత్ర, దానం, లాంటివి పూర్తి చేసి ముందుగా రామనాధ పురం (రామేశ్వరం )వెళ్లారు.దారిలో వినాయకుని పూజించి నవ పాషాణం తో నవగ్రహా ప్రీతి కోసం పూజ చేసారు. రామేశ్వరం లోని అన్నీ బావులలో స్నానం ఆచరించి రామనాధ స్వామి ని సేవించుకొని అక్కడ మట్టిని సేకరించారు.అక్కడ నుంచి  అలహాబాద్ చేరుకొని త్రివేణి సంగమం లో స్నానం చేసి తాము తెచ్చిన మట్టిని కరిగించి అక్కడి నుండి పవిత్ర గంగా జలాన్ని తీసికొని కాశీ చేరుకున్నారు.అక్కడ విశాలాక్షి సమేత విశ్వనాధుణ్ణి, బిందు మాధవుడు, కాలభైరవుడు వంటి వారిని దర్శించుకొని గయకు చేరుకున్నారు. అక్కడ అక్షయ వటం, విష్ణు పాదం, చూసుకొని, మరల రామేశ్వరం వెళ్లారు. కాశీ తీర్ధం తో రామేశ్వరుని అభిషేకించి కంచి మఠం చేరుకొని సమారాధన చేసారు.

ఈ యాత్ర పూర్తి కావడానికి స్వామి వారికీ 21సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల గుండా ప్రయాణించారు. ఈ రాష్ట్రాలలో వారు దర్శించని దేవాలయాలు, స్నానమాచరించని నదులు లేవు. ఈ పాదయాత్ర ను కాశీ యాత్రనంతరం కూడా కొనసాగించారు.

*** గీతలో భగవంతుడు చెప్పినట్లు "యద్య దాచరతి శ్రేష్ఠః "... స్వామి వారికీ ఎలాంటి యాత్రలు అవసరం లేనప్పటికి మనవంటి వారలకొరకు వారు ఆచరించి చూపుతారు.

కృతజ్ఞత

 🪷 *జై శ్రీమన్నారాయణ* 🪷


🍁అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా?’’🍁



కోశంబి రాజు ఉదయనుడి దగ్గర భద్రావతి అనే ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, తెలివైనది. యుద్ధరంగంలోకి దూకిందంటే చాలు... శత్రు సేనల్ని తొక్కి మట్టి కరిపించేది. దాని శరీరంలో బాణాలు దిగినా వెనకడుగు వేసేది కాదు. ఉదయనుడు ఎన్నో యుద్ధాలు జయించడంలో భద్రావతిదే కీలక పాత్ర. ఆ సమయంలో దాని బాగోగులను రాజు చాలా జాగ్రత్తగా చూసేవాడు. మంచి ఆహారం పెట్టించేవాడు. బంగారు ఆభరణాలతో అలంకరింపజేసేవాడు.


కొన్నాళ్ళకు భద్రావతి ముసలిదైపోయింది. దానితో ఆ ఏనుగు మీద రాజుకు ఆదరణ తగ్గిపోయింది. దాని పోషణను కూడా మానేశాడు. దాన్ని వదిలేశాడు. అది తిరుగుతూ తిరుగుతూ అడవికి చేరింది. దొరికిన ఆకులూ, అలములూ తింటూ కాలం గడిపేది.


ఒకనాడు బుద్ధుడు తన పరివారంతో అడవి మార్గంలో కోశంబికి వస్తున్నాడు. భద్రావతి దారికి ఎదురు వచ్చి, మోకాళ్ళపై కూర్చొని, దీనంగా అరచింది. కన్నీరు పెట్టుకుంది. బుద్ధుడు దాని నుదుటి మీద తాకి సాంత్వన చేకూర్చాడు తొండాన్ని నిమిరాడు. దాని దీన స్థితి ఆయనకు అర్థమయింది. మౌనంగా ముందుకు కదిలాడు. ఆ రోజు ఉదయనుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘‘రాజా! అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా?’’ అని అడిగాడు.


‘‘భగవాన్‌! నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణే!’’ అన్నాడు రాజు నమస్కరిస్తూ.


‘‘నువ్వు ఈ రోజున మహారాజుగా నిలబడడానికి నీ పరివారం, సైనికులు, సేనాపతులు ఎంత కారణమో భద్రావతీ అంతే కారణం. భద్రావతి వల్లే నువ్వు ఈ రాజ్యాన్ని నిలుపుకోగలిగావు. నీకు నీ రాణి దక్కింది. దాని వీరోచిత కార్యం వల్లే మీకు ప్రాణాలు దక్కాయి. అలాంటి భధ్రావతిని ఒకసారి చూడాలని ఉంది. వెళ్దాం పదండి, మీ గజశాలకు!’’


ఆయన అలా అడగడంతో రాజు కలవరపడ్డాడు- ‘‘భగవాన్‌! భద్రావతి ఇప్పుడు మా గజశాలలో లేదు’’ అన్నాడు బిడియంగా.


‘‘ఎక్కడుంది? ఏమైంది’’


‘‘ముసలిదైపోయింది. మా పోషణలో లేదు. అడవుల్లో తిరుగుతోంది.’’


‘‘రాజా! నీకిది తగునా? మనం మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కూడా కృతజ్ఞతలు చూపాలి. 


👉నీ అధికారానికీ, ఐశ్వర్యానికీ, జీవితానికీ మూలమైన భధ్రావతి పట్ల నిరాదరణ కనబరచడం తగునా? 


👉మనకు ఉపయోగపడినప్పుడు ఆదరించడం, ఉపయోగపడలేనప్పుడు నిరాదరణ చూపడం కృతజ్ఞత కాదు. అలాంటి రాజు చిరకాలం సుస్థిరంగా పాలించలేడు. సుఖంగా జీవించలేడు. రాజా!  అని చెప్పాడు బుద్ధుడు. 


👉ఉదయనుడు తప్పు తెలుసుకున్నాడు. పరివారాన్ని పంపి, ఆరోజే అడవి నుంచి భద్రావతిని తిరిగి రప్పించాడు. పూర్వ ఆదరణ చూపాడు.


🌻 *జై శ్రీమన్నారాయణ* 🌻

ఉత్తమమైన ధ్యానం

 ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత


పూజకోటి సమం స్తోత్రం,   

 స్తోత్రకోటి సమో జపః

 జపకోటి సమం ధ్యానం ,         

 ధ్యానకోటి సమో లయః


భావం:


కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,

కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,

కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,

కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.


 నాస్తి ధ్యాన సమం తీర్థం;   

 నాస్తి ధ్యాన సమం తపః| 

 నాస్తి ధ్యాన సమో యజ్ఞః 

 తస్మాద్యానం సమాచరేత్


భావం:


ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి

సుభాషితమ్

 .


                 _*సుభాషితమ్*_


శ్లో.

*విప్రయోర్వి ప్రవహ్న్యోశ్చ*

*దమ్పత్యోః స్వామి భృత్యయోః|*

*అన్తరేణ న గన్తవ్యం* 

*హలస్య వృషభస్య చ ||,*

                      -చాణక్య నీతి


తా𝕝𝕝 *ఇద్దరు బ్రాహ్మణుల మధ్య నుండిగానీ, బ్రాహ్మణుడు అగ్ని ఈ రెంటి మధ్య నుండిగానీ, భార్యా భర్తల మధ్య నుండిగానీ, యజమాని మరియు సేవకుల మధ్య నుండి, నాగలి మరియు ఎద్దు మధ్య నుండి వెళ్లరాదు*....

మంచి పనులు చేయండి

 ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు

అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు


అది చూసి చాలా ముచ్చటపడేవాడు

మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని

చేయలేకపోయేవాడు

అతను అడవిలో కూరాకులు కోస్తుంటే  తులసి చెట్టు కనిపించింది

వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు


కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు

అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నింది


ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే 

ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు 

నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు


ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలనూతెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడిఉండడం  గమనించాడు


అతడితో నాయనా  నేను చెప్పేవరకు ఈ కట్టను  నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జాపించగానే రాహువు వచ్చాడు


రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా

రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి 

నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మొస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు


ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది 

ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో .

ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు


అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే 


బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు

ఆ పాము మాయమైంది


ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా 

ఒక దానం  ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా 

మన సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా  

దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా 


బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు

సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు


ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి


🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత 🌹

🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼

  🌿 *_శుభమస్తు_* 🌿

క్యాన్సర్‌ను


♦️ *క్యాన్సర్‌ను ఓడించింది* ♦️👇 :


  ♦️ *పైనాపిల్ వేడి నీరు* ♦️

(    దయచేసి ప్రచారం చేయండి!!  దయచేసి ప్రచారం చేయండి!!)


   ▪️ ICBS జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ.  ఈ బులెటిన్‌ను అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు తీసుకెళ్లగలిగితే, కనీసం ఒక ప్రాణమైనా రక్షించబడుతుందని క్వాక్ నొక్కి చెప్పాడు.


   ▪️ నా వంతుగా నేను కొన్ని చేశాను, మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను..

     ధన్యవాదాలు!


  ▪️  పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది

    ▪️వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

▪️    ఒక కప్పులో 2 నుండి 3 పైనాపిల్ ముక్కలను సన్నగా కోసి వేడి నీళ్ళు పోస్తే "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే అందరికీ మంచిది.

  ▪️  వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.

   ▪️ పైనాపిల్ యొక్క వెచ్చని పండు తిత్తులు మరియు కణితులను చంపే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  ఇది అన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తుందని నిరూపించబడింది.

   ▪️ పైనాపిల్ వేడి నీరు అలెర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని సూక్ష్మక్రిములు మరియు టాక్సిన్‌లను తొలగిస్తుంది.

   ▪️ పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *హింసాత్మక కణాలను* మాత్రమే నాశనం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.

  ▪️  అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు *మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి*, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.

  ▪️  చదివిన తరువాత, ఇతరులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

   


 ▪️ *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

  *కొందరు పంపరు*

  *అయితే మీరు తప్పకుండా పంపుతారని ఆశిస్తున్నాను*


🌻 *జై శ్రీమన్నారాయణ* 🌻

5, మార్చి 2023, ఆదివారం

నిత్య శ్రాద్ధం :

 1) నిత్య శ్రాద్ధం : 


ప్రతిరోజు అన్నం తినే ముందు ఆపోశన పట్టిన తరువాత ఒక ఐదు మెతుకులు ఒక్కొక్కటిగా కేవలం ఉత్తి అన్నం మెతుకులు

ఓం ప్రాణాయ స్వాహా 

ఓం అపానాయ స్వాహా 

ఓం వ్యానాయ స్వాహా 

ఓం ఉదానాయ స్వాహా 

ఓం సమానాయ స్వాహా 

అని నోటిలో వేసుకుంటే అది నిత్య శ్రాద్ధంతో సమానము లేదా అన్నం తినేముందు ఆకులో వేసిన అన్ని పదార్థములతో అన్నమును కలిపి ఒక బొటనవేలు పరిమాణమంత చిన్న ముద్దను చేసి దానిని ఆకులో కానీ, నేలమీద కానీ, కుడి వైపున పెట్టి, అన్నం తిన్న తరువాత ఆ ముద్దని కాకులకు లేదా వేరే పక్షులకు పెట్టినా అది కూడానిత్య  శ్రాద్ధంతో సమానము. దీనివలన పితృదేవతలు సంతోషిస్తారు.


2) తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఏదో ఒక క్షేత్రములో వారి పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తే అది ఏకధాటిగా సంవత్సరంపాటు శ్రాద్ధం పెట్టిన ఫలితమును ఇస్తుంది. 


3) పుట్టినరోజు నాడు వారి పేరు మీదుగా అన్నదానము కానీ ప్రసాద దానము కానీ చేస్తే అది 100 సంవత్సరముల పాటు అటు దేవతలకు నైవేద్యం పెట్టిన పుణ్యము ఇటు పితృదేవతలకు పిండం పెట్టిన పుణ్యం వస్తుంది. 


4) పితృదేవతలు యమధర్మరాజు రాజధాని నగరం అయిన సంయమని పురమునకు నైరుతి భాగంలో ఉంటారు. వీరు చాలా శక్తివంతులు, వీరందరికీ కలిపి దక్షుడి కూతురైన స్వధాదేవియే భార్య. 


5) మనము పితృ కార్యములలో తండ్రికి కానీ, తల్లికి కానీ, తాతల పేరు మీదుగా గాని పెట్టే పిండము పితృలోకంలో ఉన్న పితృదేవతలకు చెందుతుంది.

ఈ విధముగా మనము పెట్టిన పిండములను పితృదేవతలు స్వీకరించి, మనము ఎవరి పేరు మీదుగా పిండము పెట్టామో వారు ఒకవేళ యమలోకంలో ఉంటే ఆ నరక బాధల నుండి విముక్తి పొంది ఉత్తమ గతులకి వెళతారు. ఒకవేళ ఉత్తమ గతులకి వెళ్లి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా ఉత్తమగతులు కలుగుతాయి. ఒకవేళ పునర్జన్మ ఎత్తి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా వారికి ఉత్తమ జన్మలు లభిస్తాయి.

మన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు చెప్పి పెట్టే 3 పిండములు ఈ పితృదేవతలు స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. 


6) ఈ భూమి మీద కొడుకుగా పుట్టిన ప్రతి ఒక్కడు అయితే సంపూర్ణ శ్రాద్ధం కానీ లేదా స్వయంపాకం వంటివి కానీ ఇవ్వాలి. 


7) కొన్ని ఇళ్లల్లో పిల్లలు పుట్టడం లేదు అంటే కారణము ఈ పిండాలు పెట్టకపోవడమే. 


8) శ్రాద్ధ విశేషాల గురించి వినడం వలన, తెలుసుకోవడం వలన అకాల మరణాలు, దుర్మరణాలు ఉండవు. అటువంటి కుటుంబాలలో వాళ్ళు సంపూర్ణ ఆయువుతో జీవిస్తారు.


9) సూర్య, చంద్ర గ్రహణాల తరువాత యథాశక్తిగా (నువ్వులు,దర్భలతో కలిపి నీళ్లు తర్పణాలుగా వదలాలి, అన్నం ముద్దలు చేసి పెట్టాలి)

పిండం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.

గ్రహణానంతరం పితృదేవతలకు తర్పణాలు తండ్రి బ్రతికి ఉన్న వారు ఇవ్వకూడదు. వీరు కేవలం దేవతలకు మాత్రమే తర్పణాలు(కేవలం నీళ్లు మాత్రం) ఇవ్వాలి. 


10) ప్రతి సంక్రమణానికి, వ్యతీపాత తిథులలో,  విషువత్తులకు తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంతో సమానం. 


11) మొదటి సారి క్షేత్ర దర్శనం (కాశీ వంటి క్షేత్రము), దేవతా దర్శనం చేసుకున్న తరువాత నువ్వులు దర్భలు కలిపిన నీళ్ళతో మూడుసార్లు తర్పణం విడిచి పెడితే ఇది కూడా శ్రాద్ధంతో సమానము. ఇది ఆ వంశానికి అపార రక్షణ కలిగిస్తుంది. 


12) జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, గ్రహాల అనుగ్రహము లేకుండా జాతక దోషాలు ఉన్నప్పుడు, పీడకలలు వచ్చినప్పుడు, తండ్రి లేని వాడు నువ్వులు నీళ్లు తీసుకొని తర్పణాలు విడిచి పెడితే అది అపూర్వ శ్రాద్ధంతో సమానం.


13)భోక్తలుగా ఎవరిని పిలవాలి? 


యోగి అయిన వాడు భోక్తగా వస్తే చాలా ఉత్తమం. ఉత్తమ శ్రోత్రియుడు కానీ, ఇంటికి పెద్దవాడుగా పుట్టిన వాడు కానీ, వేదాలు బాగా చదువుకున్న వాడిని కానీ పిలవాలి.

శ్రాద్ధం  పెట్టేటప్పుడు చచ్చిపోయిన ఆయన మేనల్లుడు గాని లేదా కూతురు కొడుకు (మనుమడు) కానీ ఉంటే చాలా మంచిది. 


14) భోక్తలుగా ఎవరిని పిలవకూడదు? 


అవయవ లోపం ఉన్న వాళ్ళు, రోగిష్టి వాళ్ళు,

పునర్భవుడు (ఒక స్త్రీ ఒక భర్త పోయాక రెండవ భర్త ద్వారా పొందిన సంతానం), దొంగ ఉపాధ్యాయుడు, వేదాలను తిరస్కరించే నాస్తికులు, అగ్నిహోత్రానికి నమస్కారము చేయని వారిని, వైద్య వృత్తిలో ఉన్న వారిని, గురువులను పితృదేవతలను తిరస్కరించే వాడిని, సోమరసం అమ్ముకునే వాడిని, పిసినిగొట్టు వాడిని, దంతములు నల్లగా ఉన్న వాడిని, ఎక్కువ తక్కువ అవయవాలు కలిగిన వాడిని (6 వేళ్ళు లేక 4 వేళ్ళు ఉన్నటువంటి వారు), అంధులు, గోర్లు బాగా పుచ్చిపోయి ఉన్నవాళ్ళు భోక్తలుగా పనికిరారు. 


15) దైవ కార్యములో లోటు ఉంటే దేవతలు అంతగా ఆగ్రహించరు. కానీ పితృకార్యంలో ఏదైనా లోటు ఉంటే పితృ దేవతలు వెంటనే ఆగ్రహిస్తారు.


16) శ్రాద్ధములో భోక్తలుగా వచ్చిన వారు మరియు శ్రాద్ధము పెట్టిన వారు, ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ సాంగత్యము చేయకూడదు, రాత్రికి భోజనం చేయకూడదు (తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారైతే మధ్యాహ్నం పితృకార్యంలో మిగిలిన గారెలు కానీ అప్పాలు కాని తినవచ్చును). 


17) పితృదేవతలకు శుక్లపక్షము కంటే కృష్ణపక్షము అంటే ఇష్టము. 


18) శ్రాద్ధము ఎప్పుడూ మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత పెట్టాలి. విదేశీ ప్రయాణం ఉన్నప్పుడు కానీ, లేదా యాత్రలకు వెళుతున్నప్పుడు కానీ 12లోపు శ్రాద్ధం పెట్టుకోవచ్చు.

ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులలో 12 గంటల లోపు పిండప్రదానం చేస్తే, అప్పుడు వెండి దానము చేస్తే, ముందుగా పిండప్రదానం చేయడం వలన వచ్చే దోషం తొలగిపోతుంది. 


19) విశ్వేదేవతల స్థానంలో ఇద్దరు, పితృదేవతా స్థానంలో ఒకరు మొత్తం ముగ్గురు భోక్తలు ఉండాలి. కుదరని పక్షంలో కనీసం ఇద్దరయినా ఉండాలి. 


20) శ్రాద్ధ సమయంలో ఈ మూడు తప్పక ఉండి తీరాలి :

*మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత సమయము.

*నల్ల నువ్వులు 

*కూతురు కొడుకు (దౌహిత్రుడు). ఒకవేళ దౌహిత్రుడు లేకపోతే మిగతా రెండు ఉన్నా, ఆ శ్రాద్ధం కూడా సంపూర్ణం అవుతుంది. 


21) శ్రాద్ధం పెట్టేవాడు, భోక్తలుగా వచ్చినవారు ఆరోజు ప్రయాణం చేయకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ కోపం పొందకూడదు. తొందర పడకూడదు. 


22) శ్రాద్ధం పెట్టే వాళ్ళు ఒకవేళ నీరసంగా ఉంటే పాలు తాగ వచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోనూ మజ్జిగ, రాగిజావ, అంబలి వంటివి తీసుకొనరాదు. 


23) శ్రాద్ధము అత్యంత ఫలితమును ఇవ్వాలంటే వెండిని పదేపదే చూడడము, వెండి పాత్రలు వాడడము, వెండి పుట్టుకను తెలుసుకోవడం, వెండిని పొగడడం, వెండిని దానం చేయడం వంటివి చేయాలి.

24) శ్రాద్ధం పెట్టేవారు బంగారమును ఎట్టి పరిస్థితులలోనూ ధరించరాదు. వారి ఇంటిలో స్త్రీలు కేవలం బంగారం మంగళసూత్రం తప్ప వేరే ఏ ఇతర బంగారు ఆభరణములు ధరించకూడదు. 


25) శ్రాద్ధ సమయములో వీటితో చేసిన వంటలు శ్రేష్ఠము : 


నువ్వులు, యవలు, గోధుమలు, నల్ల ఆవాలు, కాంచన ధాన్యములు, పెసలు, కందులు, మినుము. 


26) శ్రాద్ధములో వాడకూడనివి, పనికిరానివి : 


పెండలం, దోసకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆనపకాయ, ఇంగువ, అలసందులు, ప్రత్యక్ష లవణము (విస్తరిలో ఉప్పు పెట్టడము), చిరు శనగలు. భార్య ధనముతో పితృకార్యము చేయకూడదు. 


రాత్రి తెచ్చి నిల్వ పెట్టిన నీరు, దుర్వాసన వస్తున్న నీరు శ్రాద్ధానికి పనికిరాదు. ఒకవేళ తాజా నీరు దొరకకపోతే ఆవుపాల చుక్క కానీ, దర్భలు కానీ లేదా గంగాజలం చుక్క కానీ ఆ నీటిలో వేస్తే అది స్వచ్ఛ జలం అయిపోతుంది. నీటిలో వేసే ఆవుపాలు ఆవు ఈనిన పది రోజుల తరువాత పాలు మాత్రమే వాడాలి, ఈనిన పది రోజుల ముందు పాలు వాడకూడదు. 


27) శ్రాద్ధం జరిగే చోటులోకి కోడి, కుక్క, ఊర పంది, నపుంసకుడు, రాక్షసులు, పతితులు, మైల ఉన్నవాళ్లు, బయట ఉన్న వాళ్ళు రాకూడదు. 


28) శ్రాద్ధ సమయములో ఇంటి చుట్టూ నల్ల నువ్వులను 

కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్ట.......

అనే శ్లోకం చదువుతూ చల్లితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు శ్రాద్ధంలో ఉన్న దోషాలు కూడా పోతాయి. 


29) శ్రాద్ధంలో భోక్తల ఎదురుగా పితృదేవతా స్తోత్రమును చదివితే శ్రాద్ధంలో తెలిసి కాని తెలియక గాని చేసిన ఎటువంటి దోషం అయినా పరిహారమై పోయి ఆ శ్రాద్ధం అఖండ ఫలితమును ఇస్తుంది.

భారత్ మాతాకి జై *

 భారతీయులకు అంకితం.🙏🙏🙏

బ్రిటన్ కంపనీ   (లీవర్)   హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.           అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..  


*భారత్ మాతాకి జై *

భగవంతుడి లీలలు

 *సంకల్ప బలం*


*దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అని ఒక అయన ప్రశ్న* 


*అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను* అని ఒక గురువు గారు చెప్పారు...


*ఆ కథ..._*


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ *తథాస్తు* అన్నాడు. గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. 


*ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను.*


"ఏమిటా కోరిక గురువు గారూ" 

*తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని*. 

*వచ్చే జన్మలోనా*

*కాదు ఈ జన్మలోనే*


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


*అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా*


*అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది.* ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత...


శిష్యుడు పరుగు పరుగున వస్తూ *గురువు గారూ.. ఈ వింత విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!*


గురువు గారు నవ్వి, *చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా..*


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో...ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. 

*ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది.* అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. 


*భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు*


అందుకే అంటారు సంకల్పం (కోరిక ) బలం గా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని... 🙏

కళ్లు చెదిరే నిజం

 *మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం, చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారా?*

భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలు.


భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ ఎంపీలకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే,భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేలకోట్ల 65 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం.వారి నివాసం, జీవనం,ఆహారం,ప్రయాణ భత్యం,చికిత్స,విదేశీ విహారయాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


7 పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధాన మంత్రుల భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు,పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


ఇప్పుడు ఆలోచించండి. మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇది ప్రజాస్వామ్యమా?


(ఈ 100 బిలియన్ రూపాయలు మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబడి ఉండేది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


→మొదటిది - ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (టీవీ) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి.


→ రెండవది - నాయకుల జీతాలు మరియు అలవెన్సులపై నిషేధం

అప్పుడు దేశభక్తి చూపండి.


ప్రతి భారతీయుడు ఈ వ్యర్థ వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


దయతో

గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి,

దయచేసి అన్ని *ప్లానింగ్* ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోయాయి.


*మీకు రూ.29కే ఫుల్ మీల్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం ముగిసింది.


సిలిండర్,రేషన్ తీసుకురావడం లేదు


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది.చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


*అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు 1 కిలోల గోధుమలు చెల్లించాల్సిన అవసరం లేదు.*


*మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.*


దీనిని పరిశీలించండి.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించడానికి ప్రయత్నించండి.


అది అహంకారమా లేక మోసమా....


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే.

టీ = 1.00

sup = 5.50

పప్పు = 1.50

ఆహారం = 2.00

చపాతీ = 1.00

చికెన్ = 24.50

దోస = 4.00

బిర్యానీ=8.00

చేప = 13.00

ఈ వస్తువులన్నీ పేదలకు మాత్రమే మరియు ఇవన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్నాయి.


మరియు ఆ *పేద ప్రజల జీతం నెలకు 1 లక్ష 80,000 రూపాయలు మరియు అది కూడా ఆదాయపు పన్ను లేకుండా.*


మీ మొబైల్‌లో సేవ్ చేయబడిన అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి,తద్వారా అందరికీ తెలుసు…

రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించేవాడు పేదవాడు కాదని వారు భావించడానికి కారణం అదే.


*జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి,ఈ రోజు కూడా ఫార్వార్డ్ చేయబడతాయి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*

కలియుగాన్ స్మరణన్ ముక్తిహి

 శుభదినం.

భక్తి కి పరాకాష్ఠ విశ్వాసం నమ్మకం..దానికే షిర్డీ బాబా గారు శ్రద్ధ మరియు శభురి అన్నారు

అంతే అచంచలమైన విశ్వాసం నకు ధ్రువుడు ప్రహ్లాదుడు అక్రూరుడు వాల్మీకి రామదాసు యిలా ఎందరో తరించారు.

అనన్యశ్చింతయోతోమా 

యేజన పర్యుపాసతే 

తేషాం నిత్యాభి యుక్తానాం

యోగక్షమము  వహాయమం.

    మీకు తెలియనిది కాదు.

నన్ను ఎవరైనా సరే తెలిసికానీ

తెలియక కానీ నా గూర్చి ఆలోచిస్తే  వారి యోగ క్షేమము ల న్నింటినీ నేనె చూసుకుంటాను అని ఆ భగవంతుడు చెప్పాడు.

  దీపపు వెలుగు అని భావించిన పురుగులు అగ్నికి ఆహుతైనట్లు వేరే చింతలు అలా మనస్సుల లో ఆ లోచిస్తున్న భగవత్ భక్తు ల దగ్గరికి చేరటానికి కూడా సాహసించవ్.

రాముల వారి తో  సరుయూ నదిలో దిగబోయిన ఆంజనేయ స్వామి వారికి కలియుగాంతం వరుకు నా భక్తులకు నీవే అండ దండ లు గా వుండి ఆ తరువాత బ్రహ్మ పదవి కి నీవే వుంటావు.అని వారము యిచ్చిన శ్రీ రామ చంద్రుల వారు ఆంజనేయ స్వామి వారు మనకు ఆదర్శం గా వున్నారు.

అలాగే అంబరీషుిల వారు మనకు చిరస్మరణీయుడు గదా .

సూక్ష్మము లో మోక్షము.

అందుకే కలియుగాన్ స్మరణన్ ముక్తిహి.యింత కన్నా ఏమి కావాలి. ఓం నమఃశివాయ.