7, మార్చి 2023, మంగళవారం

ఆయుర్వేదంలో

 శ్లోకం:☝️oil pulling

*అసంచారీ ముఖే పూర్ణే*

  *గండూషః కవలస్చరః l*

*తత్ర ద్రవేణ గండూషః*

  *కల్కేన కవలః స్మృతః ll*

  - సుశ్రుత సంహిత


భావం: ఆయుర్వేదంలో రెండు విధానాలు చెప్పబడ్డాయి.

1. కవలము/ పుక్కిలించడం, నోటిలో ద్రవాన్ని ఊపడం/అటు ఇటు ఆడించడం (ఇది టాక్సిన్‌లను బయటకు లాగుతుంది)

2. గండూషము/ ఎలాంటి కదలిక లేకుండా నోటిని ద్రవంతో నింపి ఏ కదలిక లేకుండా ఉంచడం (ఇది నోటిని లూబ్రికేట్ చేస్తుంది).

నూనెతో పుక్కిలించడం (కవలము) వల్ల నోటిలో చెడు రుచి, చెడు వాసనలు, వాపు, మంట మరియు తిమ్మిరి అనుభూతిని తొలగిస్తుంది. మరియు ముఖ కండరాలకు వ్యాయామం జరిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. దంతాలను బలపరుస్తుంది మరియు ఆహారం పట్ల సహజమైన ఆసక్తిని, రుచిని పెంచుతుంది.

ఇంతవరకు నిజం. ఇంతకు మించి "సర్వరోగనివారిణి"గా ఎవరైనా చెబితే నమ్మక్కర్లేదు!🙏

కామెంట్‌లు లేవు: