7, మార్చి 2023, మంగళవారం

అంతపెద్దదా

 

 అంతపెద్దదా 

ఒకసారి వర్షాకాలంలో ఒకప్రాంతంలో వర్షాలు విపరీతంగా కురవటంతో ఒక చెరువులోని కప్ప ఆ వరదలలో కొట్టుకొని పోయి ఒక చిన్న బావిలో పడింది.  అక్కడ బావిలో వున్న కప్పు ఈ కప్పని చూసి నీవు ఇక్కడకు యెట్లా వచ్చావు అని అడిగింది. దానికి ఆ కప్పు నేను ఒక పెద్ద చెరువులో ఉండేదానినినిన్న కురిసిన వర్షపు వరదలో పడి ఇక్కడకు వచ్చాను అని అన్నది.  ఏమిటి పెద్ద చెరువులో వుంటావా చెరువు అంటే ఇంత ఉంటుందా అని ఒక నాలుగు సార్లు గెంతి చూపెట్టింది.  కాదు అన్నది ఆ కప్పు అప్పుడు బావిలోని కప్ప భావి ఒక అంచునుంచి ఇంకొక అంచువరకు గెంతి ఇంతదూరం ఉంటుందా అని అడిగింది.  దానికి ఆ కప్ప ఇది భావి చాలా చిన్నగా ఉంటుంది చెరువు అనేది చాలా విశాలంగా ఈ భావితో పోలిస్తే ఎన్నో వేలరెట్లు ఉంటుంది.  అక్కడ వేలకొద్దీ కప్పలు ఇతర జలచరాలు ఉంటాయి అని చెప్పింది.  దానికి ఆ బావిలోని కప్పనవ్వి నీవు నా తో పరాచకాలు ఆడుతున్నావా ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద నీటి వనరు ఉండదు.  నాకు తెలుసు అని చెప్పింది.  అప్పుడు చెరువులోని కప్పు చూడు మిత్రమా నీవు ఈ భావి తప్ప ఇంకొకటి చూసి ఉండకపోవచ్చు అందుకే ఇదే ప్రపంచం అని అనుకుంటున్నావు నిజానికి ప్రపంచం చాలా పెద్దది. నేను నా గ్రహచారం బాగాలేక ఈ బావిలో పడ్డాను కానీ నేను సువిశాల ప్రపంచంలో ఉండేదానిని అని అన్నది. దాని మాటలకు బావిలోని కప్పకు విస్మయం కలిగి జ్ఞ్యానోదయం అయ్యి తానూ యెంతటి చిన్న జాలంలో వుంటున్నదో అదే విధంగా తన భావాలు కూడా చిన్నగా ఉన్నాయని తెలుసుకున్నది. 

ఇది మనం చిన్నప్పటినుండి చదువు ఉన్న సాదారణ కధ.  దీనినే తెలుగులో బావిలోని కప్ప అని  సంస్కృతంలో కూపస్థ మండూకం అని హిందీలో కువేమే మెండాక్ అనే నానుడి మనకు తెలుసు.  మన మిత్రులలో ఎవరైనా సరైన జ్ఞ్యానం లేకుండా అన్ని నాకే తెలుసు అని విర్రవీగుతుంటే వాడు వట్టి బావిలో కప్ప అని మనం అనుకోటం సర్వ సాధారణము. 

నిజానికి మనమంతా ఆ బావిలోని కప్పలకన్నా ఏమాత్రం మెరుగు కాదని చెపితే కోపం రావచ్చు.  కానీ భగవంతుని విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్ళు నిజం. ప్రతి వారు వారికి తెలిసిన సామాన్యమైన సంకుచితమైన జ్ఞ్యానంతో భగవంతుని చూడాలని, చూశానని అనుకుంటారు.  కానీ వేదాంతం అనేది అంతసులువుగా అర్ధం కాదు. వేదాన్త జ్ఞ్యాననఁ కావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.జన్మాతరకృత వాసనలు తొలగిపోవాలి.  అదే విధంగా ఈ జన్మలోకూడా మనస్సు పరిశుద్ధంగా వుంది వాసనా రహితంగా ఉండాలి. 

సాధారణంగా చాలామంది విగ్రహారాధనే సర్వస్వము విగ్రహారాధనతోటి మోక్షాన్ని పొందవచ్చని అనుకుంటారు.  అంతేకాకుండా అనేకమంది తాము విగ్రహారాధన చేస్తూ వారి పబ్బం గడుపుకోవటానికి ఇతరులను విగ్రహారాధనకు పురిగొలుపుతారు. నిజానికి ప్రారంభంలో మనస్సుని ఒక క్రమశిక్షణలో ఉంచి ఉంచటానికి విగ్రహారాధన తోడ్పడుతుంది.  కానీ సాధకుని మనస్సు కేవలం విగ్రహారాధన వరకు మాత్రమే పరిమితం కాకూడదు. 

మన ధర్మంలో యజ్ఞ యాగాది క్రతువులను చేయటం కూడా వున్నది. అవి కూడా కొంతవరకే సాధనకు ఉపయోగ పడతాయి కేవలం ఐహిక వాంఛలను నెరవేర్చుకోవటానికి మాత్రం ఉపయోగ పడుతాయి. 

 జపతాపాలు చేయటం. జపం చేయటం కొంతవరకు అభివృద్ధి చెందిన ఆరాధనగా మనం అనుకోవచ్చు. ఎందుకంటె అక్కడ మంత్రం, జపమాల రెండే వున్నాయి. మంత్రం మనస్సులో ఆడుతుంటుంది, మాల చేతిలో తిరుగుతుంటుంది. కొంతవరకు మంత్రజపం ఆధ్యాత్మిక మార్గంలో చాలావరకు తీసుకొని వెళుతుంది.  

తపం అంటే తపస్సు అది ఒక్కటే మనిషిని మాధవుడిగా చేస్తుంది.  కేవలం సాధనవలనే భక్తుడు జ్ఞ్యానై మోక్షాన్ని పొందుతాడు. 

ఇవి తెలియని వారు వారు చేసే ఆరాధనే సర్వోత్తమమైనదని దానితోటె మోక్షం సిద్ధిస్తుందని  జీవితాన్ని గడుపుతారు. కాదని ఎవరైనా చెపితే అప్పుడు మోక్షం అంత పెద్దదా అని  బావిలోని కప్పలాగా ఆశ్చర్యపడతారు.

భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే భగవంతుడు బాహ్యంలో లేడు కేవలం హృదయంలోని వున్నడని మన మంత్రపుష్పంలోనే పేర్కొన్నారు. ఉపనిషత్తులు కూడా పవిత్రమైన మహావాక్యాలతో అదే విషయాన్నీ ఉటంకిస్తున్నాయి. అది తెలుసుకోవటమే మోక్షం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: