ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
26, ఆగస్టు 2023, శనివారం
దసరా ఉత్సవం..*
*దసరా ఉత్సవం..*
కొన్ని సంవత్సరాల క్రితం దసరా రోజుల్లో జరిగిన సంఘటన ఇది..ప్రతి సంవత్సరము ఆశ్వీయుజ పాడ్యమి నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో భవానీ అమ్మవారి విగ్రహాన్నీ ప్రతిష్టించి..పది రోజులపాటు నిత్య నైవేద్యాలు సమర్పించి..పదకొండవరోజు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీగా జరుగుతున్నది..ఈ పదకొండురోజుల్లో సుమారు నూరు మంది భక్తులు మందిరం వద్ద భవానీ కంకణ దీక్ష స్వీకరించి నియమ నిష్ఠలతో వుంటారు..విజయదశమి రోజున పెద్దఎత్తున ఉత్సవం జరుగుతుంది..ఆరోజు రాత్రి దీక్షాధారులందరూ పండరిభజన చేసి, ఆపై అగ్నిగుండం త్రొక్కడం కూడా ఆచారంగా పాటిస్తున్నాము..ఈ కార్యక్రమం చూడటానికి సుమారు రెండు మూడు వేలమంది శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వస్తారు.
ఆ సంవత్సరం కూడా భవానీ కంకణ దీక్ష స్వీకరించిన భక్తులకు..ఆ దసరా రోజుల్లో శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించే ఇతర భక్తులకూ..మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందివ్వాలనే సంకల్పం కలిగింది..అలాగే విజయదశమి రోజు కూడా జరిగే ఉత్సవం చూడటానికి వచ్చే భక్తులందరికీ (దాదాపుగా రెండువేలమంది పై మాటే..) ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని అనుకున్నాము.. ముందుగా మా దంపతులము ఈ విషయమై చర్చించుకున్నాము..ఆ తరువాత మా సిబ్బందితో చర్చించాము..ఒక రోజుకు ఎంత వ్యయం అవుతుందో అంచనాకు వచ్చాము..దాతల సహకారం తీసుకోవాలని అందరమూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసాము..అప్పటికి దసరా పండుగ ప్రారంభం కావడానికి మరో వారం రోజుల గడువు ఉన్నది..ఏదైనా ఒక కార్యక్రమం అనుకొని..దానిని ఆచరణ లో పెట్టే ముందు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మా కోరిక అక్కడ విన్నవించుకొని..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని రావడం మా దంపతులకు ఒక అలవాటు..ఈసారి కూడా ఇద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద స్వామివారి పాదుకులకు తల ఆనించి..ఇలా "ఒక కార్యక్రమం అనుకున్నాము..నిర్విఘ్నంగా జరిగేటట్లు చూడు స్వామీ.." అని మనస్ఫూర్తిగా మొక్కుకొని వచ్చాము..
రెండురోజులు గడిచిపోయాయి..ఆరోజు శనివారం..సింగరాయకొండ లోని మా స్వగృహంలో పని ఉండటం చేత..నేను మధ్యాహ్నం కానీ మొగలిచెర్ల స్వామివారి మందిరానికి పోలేని పరిస్థితి వచ్చింది..సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను..హైదరాబాద్ లో అడ్వొకేట్ గా పని చేస్తున్నాను..స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాను..స్వామివారి సమాధిని దర్శించుకున్నాను..ఈరోజు శనివారం కాబట్టి స్వామివారి సమాధి దగ్గరకు వెళ్లే అవకాశం లేదని పూజారి గారు చెప్పారు.ఈరోజు రాత్రికి ఇక్కడ నిద్ర చేద్దామని అనుకున్నాను..కానీ హైదరాబాద్ కు వెంటనే రమ్మనమని మా వాళ్ళు ఫోన్ చేశారు..తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళుతున్నాను..నేను వెళ్ళేది సింగరాయకొండ మీదుగానే కనుక..అక్కడ మిమ్మల్ని ఒక్కసారి కలిసి వెళుతాను..మీకేమీ ఇబ్బంది లేదు కదా..?" అని ఫోన్ చేశారు.."ఏ ఇబ్బందీ లేదు..రండి.." అని చెప్పాను..మరో రెండుగంటల్లో వారు మా యింటికి వచ్చారు.."ప్రసాద్ గారూ ఏమీ అనుకోవద్దు..నాకు సమయం లేదు..స్వామివారికి ఏదైనా సేవ ఉంటే చెప్పండి..నా శక్తి మేరకు నేను చేస్తాను.." అన్నారు..భవానీ దీక్షాధారులకు ఉచిత ఆహారం గురించీ..విజయదశమి నాటి భోజన ఏర్పాట్ల గురించీ క్లుప్తంగా చెప్పి..మీ వీలును బట్టి చూడండి అన్నాను..సరే అని వెళ్లిపోయారు..ఆరోజు రాత్రికి వారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ వస్తురూపం లో కొంత ఇస్తాను..అన్నదానానికి ఏయే సరుకులు కావాలో ఒక లిస్ట్ పంపండి.." అన్నారు..భవానీ దీక్షాధారులకు పదకొండురోజులకు..అలాగే విజయదశమి నాటి అన్నదానానికి సంబంధించి ఎంత పరిమాణం లో సరుకులు కావాలో అన్నీ ఒక లిస్ట్ వ్రాసి..వాట్సాప్ లో పంపించాను..మరో గంటకు మళ్లీ ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ ఈ మొత్తం సరుకులు మరో రెండురోజుల్లో..స్వామివారి మందిరం వద్దకు చేరేవిధంగా మా వాళ్లతో మాట్లాడి ఏర్పాటు చేసాను.." అన్నారు..నాకు ఒక నిమిషం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి..ధన్యవాదాలండీ అని మాత్రం చెప్పాను..అన్నదానానికి అన్ని ఏర్పాట్లూ స్వామివారే చూసుకుంటున్నారని అర్థమైపోయింది..ఇక మాట్లాడేముంది..మా దంపతులము మనస్సులోనే స్వామివారికి నమస్కారం చేసుకున్నాము..
దసరా ఉత్సవాలు మొదలుపెట్టే నాటికి..ఇతర ఖర్చులు భరించడానికి దాతలు సమకూరారు..మాకు ఏ విధమైన ఇబ్బందీ కలుగలేదు సరికదా..భక్తులందరూ సంతోషించారు..ఆనాటి నుంచి ఈ నాటి వరకూ ఆ అడ్వొకేట్ గారు స్వామివారి మందిరం వద్ద ఒక్క భవానీదీక్ష సమయం లోనే కాకుండా దత్తదీక్ష సందర్భం లోనూ..తన శక్తిమేరకు అన్నదానానికి సహకారం అందిస్తున్నారు..ఈ సంవత్సరం కూడా.. దసరా సందర్భంగా దీక్ష స్వీకరించే భక్తుల అన్నదానానికి తన వంతు సహకారం ఇచ్చారు..
ఈ సంవత్సరం విజయదశమి నాటి అన్నదానానికి మాత్రం దాతలను సమకూర్చుకోవాలి..ఒక లక్ష రూపాయల వ్యయం అవుతుందని ఒక అంచనా..మా వంతు ప్రయత్నాలు మేము చేయాలి..మా ప్రయత్నలోపం లేకుండా..చేసే ప్రతిపనీ అందరికీ ఉపయోగపడేలా ఉంటేనే..స్వామివారి సహకారం మాకు వుంటుంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
------౦ ఆలోచనాలోచనాలు ౦------ దైనందిన జీవితంలో అందరికంటే దారుణంగా దివాలాతీసినవాడు ఎవరయ్యా, అంటే ఉత్సాహాన్ని కోల్పోయినవాడే; ఏదైన విషయం నేర్చుకొనేందుకు పెద్దాచిన్నా తేడా లేదు. ఎదగడానికి సత్వరమూ, ఆలస్యమూ లేదు. ***** నిత్యజీవితంలో ఏ ఆటాపాటా లేకుండా పని, పని అంటూ పనిలో విశ్రాంతి లేకుండా లీనమైపోతే మనం ఉదాసీనంగా తయారవుతాం. అసలు పని అంటూ లేకుండా ఎప్పుడూ ఆటపాటలతో, విందులు, వినోదాలలో మునిగితేలుతుంటే మనం కేవలం ఆటబొమ్మల్లా మారిపోతాం. కాబట్టి మనకు - - - పనీపాటా ఉండాలి. మధ్య, మధ్యలో ఆడుతూ, పాడుతూ ఉండాలి. అప్పుడే జీవితమకరందాన్ని తేనెటీగలాగ ఆస్వాదించగలుగుతాం. ***** నిత్య జీవితంలో మనం ప్రతిరోజును ఎట్లాగడపాలంటే , అదే ఈ భూమిపై మనకు చివరి రోజు అన్నట్లుగా! ( ఇది ఒక సామెత సుమా!) ఎందుకంటే ఎవరికీ తెలియదు, వారి ఎక్స్పయిరీ డేట్ ఏదో! అందుకని ఎవరికి హాని తలపెట్టకుండా, ఎవరినీ నిందించకుండా ఆ రోజును గడిపారనుకోండి, అది చివరి రోజు కాకపోయినా మీ విలువైన జీవితంలో ఒక అద్భుతమైన రోజు అయికూర్చుంటుంది. కాబట్టి ఈ క్షణం నుండే అదే ప్రయత్నంలో ఉందాం. ఏమంటారు? ***** జీవితంలో నేను ఒకసారి మోసపోయానంటే , అది నాకు కష్టము మరియు నష్టము. కానీ పలుమార్లు నష్టపోతుంటే అది నాకు తగిన శాస్తి. అవునంటారా? లేదా! తేది 26--8--2023, శనివారం, శుభోదయం.
దేవస్థానం పాలకమండలి
*_తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం._*
1 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్యే (సభ్యుడు)
2ఉదయభాను సామినేని ఎమ్మెల్యే (సభ్యుడు)
3 ఎం. తిప్పే స్వామి ఎమ్మెల్యే (సభ్యుడు)
4 సిద్ధవతం యానాదయ్య (సభ్యుడు)
5చందే అశ్వర్థ నాయక్ (సభ్యుడు)
6 మేకా శేషుబాబు (సభ్యుడు)
7ఆర్.వెంకట సుబ్బారెడ్డి (సభ్యుడు)
8 ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి (సభ్యుడు)
9 గాదిరాజు వెంకట సుబ్బరాజు (సభ్యుడు)
10 పెనక శరత్ చంద్ర రెడ్డి (సభ్యుడు)
11 రామ్ రెడ్డి సాముల (సభ్యుడు)
12 బాలసుబ్రమణియన్ పళనిసామి(సభ్యుడు)
13 S.R.విశ్వనాథ్ రెడ్డి (సభ్యుడు)
14 శ్రీమతి గడ్డం సీతారెడ్డి (సభ్యుడు)
15 కృష్ణమూర్తి వైతినాథన్ (సభ్యుడు)
16 సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్(సభ్యుడు)
17 సుదర్శన్ వేణు (సభ్యుడు)
18 నెరుసు నాగ సత్యం (సభ్యుడు)
19 ఆర్.వి.దేశపాండే (సభ్యుడు)
20 అమోల్ కాలే (సభ్యుడు)!
21 డా. ఎస్. శంకర్ (సభ్యుడు)
22 మిలింద్ కేశవ్ నార్వేకర్ (సభ్యుడు)
23 డాక్టర్ కేతన్ దేశాయ్ (సభ్యుడు)
24 బోరా సౌరభ్ (సభ్యుడు)
సొమ్మొకడిది సోకొకడిది!
రాజస్థాన్ లోని థార్ ఎడారి. చుక్కనీరు దొరకని ప్రదేశం. 1899-1900 సం: లో తీవ్రమైన కరవు వచ్చింది. అదిచూసి చలించిన బికనీర్ మహారాజు గంగా సింహ్ జీ రాథోడ్ , ప్రజల బాధలను తీర్చడానికి ఎడారి ప్రాంతంలో బికనీర్ వరకు ఒక కాలువను తవ్వించారు. అది ఆసియాలోనే అతిపెద్దకాలువ. దానికి గంగా నహర్ అని(గంగా కాలువ) పేరుపెట్టారు. ఆ కాలువ పనులు 5 డిసెంబర్ 1925 లోప్రారంభించారు. దాన్ని 26 అక్టోబర్ 1927 నుండి వాడటం ప్రారంభించారు. దానికి పంజాబ్ లోని సట్లెజ్ నది హరికే బారేజ్ నుండి నీరు తీసుకుని అక్కడనుండి బికనీర్ వరకూ కాలువ తవ్వారు. దానికోసం బ్రిటిష్ వారితో పోరాడి సాధించారు. గంగాసింగ్ రాథోడ్ గారికి మార్వాడా భగీరధుడని పేరు. ఆయన ఆకాలువకై తన సర్వాన్నీ సమర్పించి కాలువ తవ్వించారు. విశేషమేమంటే 650 కిలోమీటర్ల పొడవునా కాలువకింద రాగి ప్లేట్లను అమర్చి కాలువకిరువైపులా లైమ్ స్టోన్ రాళ్ళతో రివిటింగ్ చేయించారు. నీరు ఇసుకలో ఇంకి పోకుండా ఈఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదేకాలువ మొదటిదశ మరమ్మతులు చేయించడానికి వరల్డ్ బాంక్ అప్పుగా 500కోట్లు ఇచ్చింది. రెండవ దశ కింకెంతవుతుందో తెలియదు. అంటే అసలు కాలువ నిర్మించచానికి 100సం: లక్రితం ఎన్నివేలకోట్ల రూపాయలు మహారాజా గంగాసింగ్ గారు ఖర్చుచేశారో ఊహించండి.. ఈకాలువ వలన 11-12 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందుతుంది. ఈరోజు నవ్య బికనీర్ ఇలా ఉందీ అంటే అది గంగాసింహ్ జీ రాథోడ్ గారి చలవే!
కట్ చేస్తే!
కాణీ ఖర్చు చెయ్యకుండా శ్రమలేకుండా ఎవరో చేసిన దాతృత్వాన్ని దొంగిలించడం మనదేశంలోని ఒక కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. 1984 సం:లో ఆకస్మికంగా ఆకాలువ పేరును ఇందిరా గాంధీ కెనాల్ గా మార్చేశారు. కనీసం అడిగేవాడు లేడు ఈదేశంలో!!
తమ పేరు పెట్టుకోవడానికి వారికి సిగ్గులేదు. కనీసం ఇదేమన్యాయమని అడగకపోవడానికి ప్రజలకు కూడ సిగ్గులేదు.!
తెలుగు లిపికి
తెలుగు లిపికి మూలాధారం ఏమిటి?
1. భాషకు భౌతిక రూపమే లిపి.ప్రపంచంలో ఏ భాష అయినా ఏర్పడడం అనేది ఎంత ముఖ్యమో ఆ భాషకు లిపి ఏర్పడడం అనేది కూడా అంతే ముఖ్యం.ఎందుకంటే లిపి భాషకు ప్రత్యేక స్థితిని కల్పిస్తుంది.కాబట్టి భాషాధ్వనుల సంకేతాలే లిపి.
2. భారతదేశంలో లిపికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ లిపి బాణాల్లా ఉండడం వల్ల బాణలిపి అని,క్యూనిఫారం అని అన్నారు.అరబ్బులు ఈ లిపి ని కీల లిపి అన్నారు.
3. బ్రాహ్మీ లిపి అచ్చమైన స్వదేశీ లిపి.ఖరోష్టీ లిపి సెమ్ జాతి వారి తెగ అయిన అరమీన్ల లిపి నుంచి ఉద్భవించి బ్రాహ్మీ ప్రభావంతో సంస్కృత ప్రాకృతాలు వ్రాయగల వర్ణమాలగా రూపుదాల్చింది.
4. ఇగ పోతే భారతదేశంలోని లిపులన్నింటికి మూలం ఈ బ్రాహ్మీ లిపే.
5. అశోకుని కాలానికి ముందు నుంచే బ్రాహ్మీ లిపి రెండు శాఖలుగా చీలిపోయింది.1.ఉత్తర బ్రాహ్మీ లిపి,2.దక్షిణ బ్రాహ్మీ లిపి.
6. ఉత్తర భారతదేశంలోని లిపులన్నింటికి మూలం "ఉత్తర బ్రాహ్మీ లిపి" కాగా,, దక్షిణ భారత దేశంలోని లిపులన్నింటికి "దక్షిణ బ్రాహ్మీ లిపి" మూలాధారం.
7. ఈ పై విధంగా దక్షిణ భారతంలోని తమిళభాష,,మలయాళంభాష,, కన్నడ భాష,, తెలుగు భాష,, మొదలగు భాషల లిపులన్నింటికి దక్షిణ బ్రాహ్మీ లిపినే మూలాధారం.
బ్రాహ్మీ లిపి అక్షరాలు…
పద్యదశకము
--- శ్రీవరలక్ష్మీ మాత !నీకు వందనమమ్మా --
(పద్యదశకము)
హరికిన్ పట్టపు దేవివి
సిరిసంపద లిచ్చు మాత ! శ్రితజనవల్లీ !
కరుణను జూడుము నిరతము
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 01
నిరుపేదగు బ్రాహ్మణికిని
సిరిసంపద లీయ దలచి శ్రీశంకరులే
కరుణకు నిను ప్రార్థించెను
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 02
హరియురమును వీడియు నీ
నరులను కాపాడ నీవు నారాయణి వై
కరవీరపురము నుంటివి
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 03
నరపతి జనకుని యింటను
ధరణిని చీల్చంగ బుట్టి దశరథసూనున్
పరిణయ మాడిన సీతా!
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 04
నరపతి యాకాశ నృపతి
ధర కర్షణ చేయు వేళ తనయగ గల్గీ
సిరివాసుని పెండ్లాడిన
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 05
కరు లిరు వైపుల నిలచియు
విరులను వెదజల్లుచుండ వేడుక తోడన్
సిరులను నిచ్చెడు తల్లీ
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 06
సుర లసురులు సుధ కొఱకును
తరియించగ కడలి బుట్టి తరగల యందున్
హరి నురమున నిలచిన యో
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 07
హరి పద్మావతి పెండ్లిని
సుర నరులును ధరణియందు జూచుచు నుండన్
జరిపించియు మదిమురిసిన
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 08
హరి భక్తుడు పద్మాక్షుని
వరమును దీర్చ0గ నతని వరసుత వోలెన్
ధర మాతులుంగి వైతివి
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 09
కరవీరపురము నందున
ధర భక్తుల బ్రోచి మిగుల దాక్షిణ్యమునన్
సిరులీయగ నెల వుండిన
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 10
-- శుభము --
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 7*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 7*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*క్వణత్కాంచీదామా" కరి కలభ కుంభస్తననతా*
*పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా |*
*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*
*పురస్తా-దాస్తాం నః పురమథితు రాహోపురుషికా ||*
ఈ శ్లోకము, తరువాతి శ్లోకము రోజూ భక్తితో పారాయణము చేస్తే, ఇంటిలోని దోషాలు తొలగి, గృహస్థులు సుఖశాంతులు కలిగియుంటారని ప్రతీతి.
ఇక్కడ నుండి అమ్మవారి రూప వైభవాన్ని వర్ణిస్తున్నారు శంకరులు. భక్తులు దైవ స్వరూపాన్ని నాలుగు విధాలుగా స్మరించుకోగలితే ఉత్తమ ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇవి
స్థూల - విగ్రహము
సూక్ష్మ - దేవతకు సంబంధించిన మంత్రము సూక్ష్మతర - కుండలినీ ధ్యానము
సూక్ష్మతమ - ఉపనిషత్ ప్రతిపాదితమైన నిర్గుణ బ్రహ్మ తత్త్వము. ప్రతిదీ సూక్ష్మమైన కొలదీ మరింత శక్తి కలిగియుంటుంది పరమాణువు వలె. జీవుడికి కూడా ఈ నాలుగు అన్వయించవచ్చు. వరుసగా శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ.
ఇప్పుడు పై శ్లోకంలో శ్రీ కాంచీపుర కామాక్షీ అమ్మవారి స్థూలరూప వర్ణన చేస్తున్నారు శంకరులు.
క్వణత్కాంచీదామా = క్వణత్ అంటే కింకిణీ నాదములు చేస్తున్న, ధ్వనిస్తున్న
కాంచీ అంటే నడుము భాగము (మొల) దామా అంటే నూలు (త్రాడు) అంటే అమ్మవారు మువ్వల మొలనూలు/వడ్డాణము ధరించియున్నారు. అమ్మవారి ఆభరణములు మంత్రములైతే, మువ్వల ధ్వని మంత్ర నాదములు. ముందుగా వడ్డాణము గురించి చెప్పటంలో విశేషం ఇదే, అమ్మవారు మంత్రస్వరూపిణి అని.
భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు.పరమాత్మ సర్వవ్యాపియై వుండి ఏ విధంగా శరీరంలోకి ప్రవేశిస్తాడు అని. శ్రీ కృష్ణుడు చెప్తున్నారు పరమాత్మ తన ప్రకృతిని అధిష్ఠించి విశ్వరూపాన్ని ధరిస్తాడు. ఆ ప్రకృతి పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని రెండు విధాలు. జీవభూత సృష్టి అంతా పరా ప్రకృతి, జడ సృష్టి అంతా అపరా ప్రకృతి. పరమాత్మ ఈ సృష్టిలో ప్రాణరూపంగా, సూక్ష్మాతి సూక్ష్మమైన నాదంగా మూలాధార చక్రంలో ప్రవేశిస్తాడు. అక్కడ నుండి నాభి స్థానంలోని మణిపూర చక్రాన్ని చేరుతాడు. అక్కడ నాదము కొంత దిటవై 'పశ్యంతి' గా మారి క్రమంగా సాగుతూ వర్ణరూపంగా (అక్షర రూపం) మారుతుంది. వ్యక్తమైన నాదము మొదట నాభి స్థానము నుండి బయలుదేరుతుంది కనుక శంకరులు అమ్మవారి వర్ణన వడ్డాణము నుండి మొదలుపెట్టారు.
కరి కలభ కుంభస్తననతా పరిక్షీణా మధ్యే = సన్నని నడుముపై వున్న ఉత్తుంగమైన వక్షస్థలము, జగములను పోషించగల వక్షము.
పరిణత శరచ్చంద్రవదనా = పండిన శరత్కాలపు పూర్ణచంద్రుని వంటి ముఖము,
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః = క్రింది రెండు చేతులతో ధనుర్బాణములను, పై రెండు చేతులతో పాశమును, అంకుశమును (సృణి) ధరించినది,
పురమథితు: = త్రిపురాసుర సంహారియైన పరమేశ్వరుని యొక్క
అహో పురుషికా = ఆశ్చర్యకరమైన ఇచ్చాశక్తి అయిన అమ్మవారు,
పురస్తాత్ ఆస్తాం నః = ఈ రూపం కల తల్లి నా కన్నులకు సాక్షాత్కరించుగాక!
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
*_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌౹*
*మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే౹*
*అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌౹౹*
𝕝𝕝తా𝕝𝕝
ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది.... శ్రద్ధతో మంచి నీళ్ళు ఇచ్చినా అది అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది. (శ్రద్దలేక చేసేదానికి ఏ ఫలం లేదు) తల్లికి ప్రేమతో ఏదైనా ఇచ్చినదానికి నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయ రెట్లు ఫలం ఉండును. పుత్రికలకు ఇచ్చినందుకు అనంత ఫలం, అక్కా చెల్లెండ్లకు ఇచ్చినందుకు అక్షయ ఫలం ఉంటుంది.